ఇక్కడ నేనున్నది...రికార్డులు బ్రేక్ చేయడానికి కాదు | Not in the race of breaking box-office records: Salman Khan | Sakshi
Sakshi News home page

ఇక్కడ నేనున్నది...రికార్డులు బ్రేక్ చేయడానికి కాదు

Published Wed, Jan 8 2014 11:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఇక్కడ నేనున్నది...రికార్డులు బ్రేక్ చేయడానికి కాదు - Sakshi

ఇక్కడ నేనున్నది...రికార్డులు బ్రేక్ చేయడానికి కాదు

బాలీవుడ్ రికార్డులు ఖాన్‌త్రయం చుట్టే తిరుగుతున్నాయి. ఆమిర్‌ఖాన్ ‘గజిని’తో మొదలైన ఈ బాక్సాఫీస్ వసూళ్ల రేసు ‘ధూమ్-3’తో ఊపందుకుంది. గత కొన్నేళ్లుగా ఆమిర్, సల్మాన్, షారుక్‌లు ఒకరి రికార్డులను మరొకరు తిరగరాస్తున్నారు. మధ్యలో హృతిక్ రోషన్ కూడా ఈ రేసులో ఉన్నానంటూ ‘క్రిష్-3’తో ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా బాలీవుడ్ వసూళ్ల రేసులో ఆమిర్ ముందున్నారు. తాజాగా 500 కోట్ల గ్రాస్ వసూళ్లతో తన సత్తాను మరోసారి ఆమిర్ చాటారు. ఆమిర్ సృష్టిస్తున్న వసూళ్ల ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు సల్మాన్.. తన తాజా చిత్రం ‘జైహో’తో సిద్ధమవుతున్నారు.
 
 కానీ బాక్సాఫీస్ వసూళ్ల రేసుని తాను పట్టించుకోనని, తన చిత్రం బాగా అడితే చాలని సల్మాన్ చెబుతున్నారు. నిర్మాతలు, పంపిణీదారులు తన చిత్రం ద్వారా నష్టపోవడం తనకు ఇష్టం ఉండదని సల్లూభాయ్ అన్నారు. బాలీవుడ్‌లో అందరి కళ్లూ బాక్సాఫీస్ వసూళ్లపైనే ఉన్నాయన్నారాయన. అయితే 200, 300 కోట్ల క్లబ్  లాంటి అంశాలన్నీ తన దృష్టిలో డోంట్ కేర్ అన్నారు. ‘‘నంబర్ గేమ్‌లో పాలుపంచుకోవ డం ఇష్టం లేదు.
 
 రికార్డులను బ్రేక్ చేయడానికి ఇక్కడ నేను లేను’’ అని ఘాటుగా సల్మాన్ స్పందించారు.  ఆమిర్ తాజా చిత్రం 500 కోట్ల భారీ లక్ష్యాన్ని ఉంచడమే... సల్మాన్ ఆచితూచి స్పందించడానికి కారణమని బాలీవుడ్‌లో కొందరు అనుకుంటున్నారు. చిరంజీవి ‘స్టాలిన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ‘జైహో’ చిత్రానికి సల్మాన్ సోదరుడు సోహైల్‌ఖాన్ దర్శకుడు. డైసీ షా కథానాయిక. టబు, సునీల్ శె ట్టి, డానీలు ముఖ్య పాత్రలు షోషించారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement