jai ho
-
‘మెంటల్’ వారిదేనట....
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఉండే వారెవరైనా ఈ మధ్యకాలంలో వచ్చిన కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ల ‘మెంటల్ హై క్యా’ సినిమా పోస్టర్లను చూడకుండా ఉండరు. పోస్టర్లతోనే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటే... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అతని సోదరుడు సోహాలి ఖాన్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. విషయమేంటంటే ‘మెంటల్’ టైటిల్‌ను ఈ బాలీవుడ్ బ్రదర్స్ చాలా కాలం క్రితమే తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఏక్తాకపూర్ ఈ పేరుకు దగ్గరగా ఉండేలా ‘మెంటల్ హై క్యా’ టైటిల్‌ను పెట్టడం వీరి అసంతృప్తికి కారణమైంది. గతంలో సోహాలి తీసిన ‘జయ హో’(2014)కు, కబీర్ ఖాన్ తీసిన ‘ట్యూబ్‌లైట్’కు ముందుగా ‘మెంటల్’ టైటిల్‌నే అనుకున్నారు. ఖాన్ బ్రదర్స్ ఈ టైటిల్‌ను వాడుకునే లోపే ఏక్తా తన సినిమా పేరు ‘మెంటల్ హై క్యా’ అని ప్రకటించింది. అంటే ఆమె వీరి టైటిల్‌ను దొంగిలించిందనే చెప్పవచ్చు. అందుకే వారు ఏక్తాపై అసహనంగా ఉన్నారని, కనీసం ఏక్తా వారిని అడిగి వుంటే ఆమెకు ఇచ్చేవారు అని ఖాన్ కుంటుంబ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇదే విషయం గురించి సోహాలి ఖాన్‌ను అడగ్గా ‘మేము ‘మెంటల్’ టైటిల్‌ను ఏక్తాకు ఇవ్వలేదు, ఆమె కనీసం మమ్మల్ని అడగలేదు’ అన్నారు. ‘క్విన్’(2014) సినిమా తర్వాత కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్న చిత్రం ‘మెంటల్ హై క్యా’. మానసిక అనారోగ్యం, భ్రమల చూట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ చిత్రానికి జాతీయ అవార్డు విజేత ప్రకాశ్ రావ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. -
రెహమాన్ జీవితకథతో 'జయహో'
భారతీయ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన ఏఆర్ రెహమాన్ జీవితకథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. 90 నిమిషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ అక్టోబర్ 26న డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది. తన జీవితకథను తెరకెక్కించడానికి రెహమాన్ ఒప్పుకోకపోయినా ప్రముఖ ఫిలిం మేకర్ ఉమేష్ అగర్వాల్ ఒత్తిడితో అంగీకరించాడు. అంతర్జాతీ స్ధాయిలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఫిలింలో రెహమాన్ ఇంటర్వ్యూతో పాటు, అమీర్ ఖాన్, డానీ బోయల్, మణిరత్నం, గుల్జార్, అశుతోష్ గోవరీకర్, శేఖర్ కపూర్ లాంటి సెలబ్రిటీలు రెహమాన్ గురించి చెప్పిన మాటలను టెలికాస్ట్ చేయనున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో రెహమాన్ ఎదుర్కొన్న కష్టాలు, ఆ తరువాత దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అతి కొద్ది కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకోవటం, బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్, అంతర్జాతీయ సినిమాలకు సంగీతం అందించటం లాంటి అంశాలతో పాటు ఆస్కార్ వేదికపై రెహమాన్ చెప్పిన మాటలను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. -
జయహో.. తెలంగాణ..
జయహో.. తెలంగాణ.. ఎన్నాళ్లో వేచిన సమయం.. ఇన్నాళ్లకు సాకారమవుతోంది.. మంగళవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదంతో సంబరం అంబరమంటింది.. సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.. జేఏసీలు, రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఆడిపాడాయి.. టపాసులు పేల్చారు.. నృత్యాలు చేశారు.. సంతోషాలు పంచుకున్నారు.. మిఠాయిలు తినిపించుకున్నారు.. తెలంగాణవాదులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.. ఆనందడోలికల్లో మునిగితేలారు.. నియోజకవర్గమంతా సంబరాల్లో తేలియాడింది.. అడుగడుగునా జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. జయహో తెలంగాణ.. అంటూ ప్రతిఒక్కరూ నినదించారు.. వీధులు, వాడవాడలు నినాదాలతో మార్మోగాయి.. తెలంగాణ తల్లి విగ్రహానికి హారాలు వేసి హారతులు పట్టారు.. డప్పువాయిద్యాలతో ఉద్వేగ భరిత నృత్యాలు చేశారు.. తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.. కార్మికులు, కర్షకులు సంబరాలు చేశారు. - బోధన్/బోధన్ టౌన్/బోధన్ రూరల్/రెంజల్/నవీపేట/ఎడపల్లి. -
ఎట్టకేలకు100 కోట్ల క్లబ్ లో 'జై హో'
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జై హో' చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సల్మాన్ చిత్రాలన్ని ఆరంభంలోనే అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొట్టేవి. కాని జై హో చిత్రం మాత్రం భారీ వసూళ్లను రాబట్టడంలో వెనకబడింది. గతంలో దబాంగ్ 2, ఏక్ థా టైగర్ చిత్రాలు కేవలం ఆరు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరాయి. సల్మాన్ తాజా చిత్రం జైహో పది రోజుల్లో వంద కోట్లను రాబట్టింది. ఆదివారం నాటికి జై హో 101.25 కోట్లు వసూళు చేసింది. మున్నందు ఈ చిత్రం 150 కోట్లు కూడా దాటేది కష్టమేనని ట్రేడ్ అనలిస్టులు అంచనాలు వేస్తున్నారు. తెలుగులో ఓ మోస్తారు విజయం సాధించిన 'స్టాలిన్' చిత్ర ఆధారంగా రూపొందిన 'జై హో' కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి సానుకూల స్పందన సొంతం చేసుకోవడంలో విఫలం కావడంతో ఈ చిత్రాన్ని ఇప్పటికే సల్మాన్ ఫ్లాఫ్ క్లబ్ చేర్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం విడుదలైన ధూమ్-3 చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్లను వసూలు చేసి బాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. -
'ఓవైసీ వర్సెస్ సల్లూభాయ్'
రాజకీయ పార్టీల నిర్ణయాలు ఒక్కోసారి ప్రజలను విస్మయానికి గురిచేయడమే కాకుండా అనేక వివాదాలకు దారి తీస్తుంటాయి. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు గతంలో పెద్ద దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే తెరమరుగవుతున్నాయని అనుకుంటున్న సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరతీసాయి. ఈసారి ఓవైసీ చేసిన వ్యాఖ్యలు హిందువులను ఉద్దేశించి చేసినవి కాకపోవడం కొంత ఊరట కలిగించే అంశం. అయితే ఎంఐఎం అధినేత టార్గెట్ చేసుకుంది ఆయన వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆసక్తిని కలిగించేదైతే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను లక్ష్యం చేసుకోవడం వివాదానికి మరింత గ్లామర్ ను తెచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ పై ఓవైసీలు 'గుస్సా'కు కారణం ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో కలిసి పతంగులు ఎగురవేయడం.. ఆతర్వాత విందు ఆరగించడం. అక్కడికే సల్మాన్ ఖాన్ పరిమితమైతే వివాదంగా మారకపోయి ఉండేది కాదేమో. సల్మాన్ తన తాజా చిత్రం 'జై హో' చిత్ర ప్రమోషన్ కోసం గుజరాత్ వెళ్లడం.. ఆసమయానికే మోడీ పతంగులు ఎగురవేస్తుండటం.. తప్పని పరిస్థితుల్లో ఆయనతో కలిసి పతంగులు గాలిలోకి వదలడం జరిగింది. అక్కడే ఉన్న మీడియా సల్మాన్ ను కదిలించే సరికి ... మోడీని మంచి వ్యక్తి అని.. మంచి వ్యక్తే ప్రధాని పదవికి అర్హుడని సల్లూభాయ్ వ్యాఖ్యానించడం ఓవైసీ పార్టీకి పుండు మీద కారం చల్లినంత పనైంది. గుజరాత్ అల్లర్లకు కారణమైన మోడీని కీర్తించినందుకు సల్మాన్ క్షమాపణలు చెప్పాలని.. లేనిచో 'జై హో'ను బహిష్కరించాలని, ఆ చిత్రాన్ని చూడకూడదు అంటూ కార్యకర్తలకు, అభిమానులకు ఎంఐఏం పార్టీతోపాటు ఇతర మత పెద్దలు హుకుం జారీ చేయడం వివాదస్పదమైంది. అయితే అదే వర్గానికి చెందిన అభిమానులు, కార్యకర్తల నుంచి ఓవైసీకి సరియైన స్పందన లభించలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఎంఐఎం పార్టీ ఇచ్చిన పిలుపును సల్మాన్ ఖాన్ లైట్ గానే తీసుకున్నట్టు కనిపించింది. 'నేను సగం హిందువును, సగం ముస్లింను' అని బహిరంగంగా చెప్పుకునే సల్మాన్.. ఓవైసీ స్పందనను లెక్కలోకి తీసుకోకపోవడం గమనార్హం. 'నా తల్లి హిందువు, తండ్రి ముస్లిం. నాకు రెండు కమ్యూనిటీలతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. హిందు, ముస్లింల మధ్య మంచి సంబంధాలు ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. అయితే ఎవరికి మద్దతివ్వాలో ప్రజలకు సంబంధించిన అంశం. నా నిర్ణయం ఎవ్వరి మీద కూడా ప్రభావం చూపదు' అని స్పష్టం చేశాడు సల్మాన్. జై హో ప్రమోషన్ లో మోడీతో కలిసి పతంగులు ఎగురవేయడం నేరమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారాయన. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ను అడ్డుకునేంత శక్తి అసదుద్దీన్ ఓవైసీకి లేదు అని వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై స్పందించిన తీరు బట్టి చూస్తే రాజకీయ నేతలకు, మత గురువుల ఆదేశాలకు తలవొగ్గే రకం తాను కాదని సల్మాన్ స్పష్టం చేశారనిపిస్తోంది. అయితే అభిమానులు, సినీ ప్రేక్షకుల అంచనాలకు దూరంగా ఉన్న కారణంగా 'జై హో' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఓవైసీ పిలుపు పాకిస్థాన్ లో కొంత ప్రభావమే చూపినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 'జై హో' చిత్రం తన ఇమేజ్ దూరంగా ఉంది. తన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ చిత్రం ఫ్లాప్ అంటూ సల్మాన్ బహిరంగంగా వెల్లడించారు. జనవరి 24న విడుదలైన ఈ చిత్రం వారాంతానికి కేవలం 60 కోట్లు వసూలు చేయగలిగింది. అయితే కళాకారులు, సినీ తారలు కుల, మత, ప్రాంతాలకు అతీతం అనేది కాదనలేని వాస్తవం. ప్రజాస్వామ్య (ముఖ్యంగా లౌకికం అని చెప్పుకునే) వ్యవస్థలో వారు ఎవరినైనా కలువవచ్చు. సొంత అభిప్రాయాలను వెల్లడించే హక్కు రాజ్యాంగం కల్పించింది. కళాకారులను ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంచాల్సిందే. -
కలవరపడిన సల్మాన్
జైహో చిత్రం తనను కలవరపాటుకు గురి చేసిందని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వెల్లడించారు. ఆ చిత్రం విడుదలైయ్యాక ప్రేక్షకుల స్పందన చాలా బాగుందన్నారు. అయితే ఆ చిత్రానికి వచ్చిన వసూళ్లు మాత్రం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు. సగటు ప్రేక్షకుడు వైవిద్యాన్ని కోరుకుంటాడని సల్లూబాయ్ తెలిపారు. గతంలో తాను నటించిన దబాంగ్, రెడీ చిత్రాలు బాక్స్ అఫీస్ వద్ద కనకవర్షం కురిసిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ప్రేక్షకులు కోరుకున్న వైవిధ్యం జైహు చిత్రంలో లేదేమో అని ఆయన వ్యాఖ్యానించారు. జైహూ చిత్రం సీరియస్ కథనంతో నడిచి, సమాజానికి ఓ మంచి సందేశాన్ని అందిస్తుందన్నారు. అయితే చిత్ర పరాజయం పాలైతే ఒక్కరిని నిందించడం తగదని సల్మాన్ అభిప్రాయపడ్డారు. జైహూ చిత్రం విడుదలైన వారం రోజులలో రూ. 61 కోట్లు వసూల్ చేసింది. సోమవారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ జైహై చిత్రం గురించి పైవిధంగా వ్యాఖ్యానించారు. -
వసూళ్లలో వెనుకబడ్డ ‘జైహో’
సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం ‘జైహో’ వసూళ్లు ఆ చిత్ర నిర్మాతలకు నిరాశ కలిగిస్తున్నాయి. సల్లూభాయ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా వసూళ్లూ చాలా తగ్గాయి. దీంతో ఆశించినస్థాయిలో ఈ చిత్రం విజయం సాధించకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమాత్రం కథ, కథనం బాగున్నా, కాసింత నవ్వించే సత్తా ఆ సినిమాకున్నా, ఫరవాలేదనిపించిన చిత్రాలు కూడా వందకోట్ల రూపాయల మార్కును దాటడం బాలీవుడ్లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే సినీవిశ్లేషకులు మాత్రం ‘జైహో’ రూ.75 కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అందుకు ఉదాహరణగా తొలిరోజు వసూళ్లను చూపుతున్నారు. తొలిరోజు ‘జైహో’ కేవలం రూ. 17.55 కోట్లే రాబట్టింది. ఈపాటి వసూళ్లు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు కూడా వసూలు చేస్తున్నాయి. మరి దేశవ్యాప్తంగా 4,500 థియేటర్లలో విడుదలైన సల్లూభాయ్ చిత్రం ఇంత తక్కువగా వసూలు చేయడంతో వందకోట్ల క్లబ్లో ఈ చిత్రం చేరలేకపోవచ్చని చెబుతున్నారు. ‘ప్రస్తుతం బాలీవుడ్లో బడా హీరోల సినిమాలు కూడా పోటీకి లేవు. ఈ పరిస్థితుల్లో సల్లూభాయ్ సినిమా రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టాలి. కాని తొలిరోజు వసూళ్లు చూస్తే అందుకు విరుద్ధంగా ఉంది. భారీ పోటీ ఉన్నప్పుడే ‘ఏక్ థా టైగర్’ సినిమా తొలిరోజు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ‘జైహో’ అంచనాలను అందుకోలేకపోవచ్చని చెప్పకతప్పద’ని ప్రముఖ విశ్లేషకులు రాజేశ్ థడానీ అన్నారు. సల్మాన్ సోదరుడు సోహైల్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో డైసీ షా బాలీవుడ్‌కు పరిచయమైంది. రాజకీయాలే నేపథ్యంగా సాగే చిత్రంలో యాక్షన్‌కు కూడా అధికంగా ప్రాధాన్యతనిచ్చారు. కథ, సంభాషణలు బాగున్నా కామెడీ లోపించడమే ఈ చిత్రంలో ప్రధానమైన లోటుగా కనిపిస్తుందని సినీపండితులు చెబుతున్నారు. వాంటెడ్, దబంగ్, దబంగ్-2, ఏక్ థా టైగర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్‌కు ఈ సినిమాతో కాస్త బ్రేక్ పడినట్లేనని కూడా చెబుతున్నారు. -
'రాజకీయాల్లో రాణించే సత్తా సల్మాన్ లో ఉంది'
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రాజకీయాల్లో మంచి నేతగా రాణించడానికి అవకాశం ఉందని నిర్మాత ఏక్తా కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలీవుడ్ తెరపై విభిన్న పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్న సల్లూభాయ్ కి రాజకీయాల్లో కూడా నిజాయితో కూడిన స్టార్ గా ఎదిగే సత్తా ఉందని ఆమె జోస్యం చెప్పారు. మై తేరా హీరో అనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ పేరును ఏక్తా వెల్లడించింది. అంతేకాకుండా సల్మాన్ ఆమ్ ఆద్మీ అని.. ప్రజల మనిషి అని కితాబిచ్చారు. జై హో చిత్రంలో సల్మాన్ పోషించిన పాత్ర కామన్ మ్యాన్ లో ఉండే పవర్ చూపిస్తుందన్నారు. అవినీతి రాజకీయనేతకు వ్యతిరేకంగా పోరాడిన ఓ సాధారణ పౌరుడి పాత్రను సల్మాన్ పోషించారని ఏక్తా తెలిపింది. -
సినిమా రివ్యూ: సల్మాన్ ఖాన్ ‘జై హో’
పాజిటివ్ పాయింట్స్: సల్మాన్ ఖాన్ నటన యాక్షన్ ఎపిసోడ్స్ సంతోష్ తుండియిల్ ఫోటోగ్రఫీ మైనస్ పాయింట్స్: హీరోయిన్ డైసీ షా మ్యూజిక్ తారాగణం: సల్మాన్ ఖాన్, డౌసీ షా, టబు, సునీల్ శెట్టి, డానీ, మెహనీష్ బెహల్, మహేశ్ మంజ్రేకర్, జెనిలీయా తదితరులు బాలీవుడ్లో ఘన విజయాలతో దూసుకుపోతున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన ఇమేజ్‌కు భిన్నంగా సామాజిక అంశాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు. తెలుగులో ఓ మోస్తారుగా విజయం సాధించిన ‘స్టాలిన్’ చిత్రం ఆధారంగా సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. భారీ అంచనాలతో జనవరి 24 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జై హో’ చిత్రం కథేంటో ఓసారి పరిశీలిద్దాం. జై(సల్మాన్ ఖాన్) ఓ మాజీ మిలటరీ ఆఫీసర్. ఓ కారణంగా మిలిటరీ నుంచి సస్పెండైన జై సమాజంలోని చెడును ఎదిరిస్తూ.. సాధారణ జీవితం గడుపుతుంటాడు. అపదలో ఉన్నవారిని ఆదుకుంటూ.. అన్యాయాల్ని ఎదురించే క్రమంలో హోం మంత్రి(డానీ)తో గొడవ మొదలవుతుంది. హోం మంత్రి అక్రమాలను ఎదుర్కోనే నేపథ్యంలో ముఖ్యమంత్రి పై హత్యాయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు ప్రయత్నించారనే అపవాదు జై పై పడుతుంది. అయితే హోం మంత్రి ఆగడాలకు ఎలా అంతం పలికాడు? ముఖ్యమంత్రిని ఎలా రక్షించుకున్నాడు? తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘జై హో’ చిత్ర కథ. జై పాత్రలో సల్మాన్ ఖాన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపిస్తాడు. మూస పాత్రలకు పరిమితం కాకుండా సామాజిక అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని.. కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. జై పాత్రలో సల్మాన్ ఖాన్‌ను అభిమానులను ఊపించుకోవడం కొంత కష్టమైనా.. పాత్ర పరిధి మేరకు సల్లూభాయ్ పరిణతిని ప్రదర్శించాడు. సల్మాన్ సరసన నటించే అవకాశం చేజిక్కించుకుని.. తొలిసారి బాలీవుడ్ తెరపై కనిపించిన డైసీ షా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో సల్మాన్‌కు సరియైన జోడి అని ఒక్క సన్నివేశంలో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది డైసీ. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో పాటలకే పరిమితమైంది. చాలాకాలం తర్వాత టబు మళ్లీ బాలీవుడ్ తెరపై దర్శనమిచ్చింది. సల్మాన్ సోదరి పాత్రలో పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది.అంగవైకల్యంతో బాధపడే అమ్మాయిగా గెస్ట్ పాత్రలో కనిపించిన జెనిలీయా దేశ్‌ముఖ్ మంచి మార్కులే సంపాదించుకుంది. డానీ విలనిజం ఓకే. సునీల్ శెట్టి, మెహనీష్ బెహల్, మేహ శ్ మంజ్రేకర్, సనా ఖాన్ తదితర పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణ. విశ్లేషణ: వాంటెడ్, దబాంగ్, రెడీ, బాడీగార్డ్, ఏక్తా టైగర్, దబాంగ్-2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా సల్మాన్ నిలిచాడు. అయితే తన రూట్ మార్చుకుని.. సామాజిక నేపథ్యమున్న 'జై హో’ చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త సల్మాన్‌ను చూపించాడు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కొత్త తరహా లుక్ తో సల్మాన్ ఆకట్టుకున్నాడు. సల్మాన్‌లో మాస్ ఎలిమెంట్స్‌ను ఎక్కువగా ఆశించే అభిమానులకు ఈ చిత్రంలో అలాంటి మార్కు ఎక్కడ కనిపించకపోవడం నిరాశ కలిగించే అంశం. గత చిత్రాల్లో కత్రినా, సోనాక్షి, కరీనాలతో జత కట్టిన సల్మాన్.. ఈ చిత్రంలో డైసీ షాను హీరోయిన్ గా ఎంచుకున్నాడు. అయితే గతంలో సల్మాన్ సరసన నటించిన హీరోయిన్లకు ధీటుగా డైసీ గ్లామర్ పరంగా, అభినయంలోనూ మెప్పించలేకపోయింది. ఇక సల్మాన్ దీటుగా విలనిజం ఎలివేట్ కాకపోవడం ఈ చిత్రంలో ఓ మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సల్మాన్ అభిమానులను మెప్పించేందుకు దర్శకుడు సోహైల్ ఖాన్ తన శక్తిమేరకు ప్రయత్నించాడు. సాజిద్-వాజిద్, దేవి శ్రీప్రసాద్, అమల్ మాలిక్‌లు పాటలకు సంగీతాన్ని అందించారు. అయితే ‘బాకీ సబ్ ఫస్ట్ క్లాస్’, ‘తేరే నైనా’, ‘ఫోటో కాపీ’ పాటలు మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. సందీప్ శిరోద్కర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్యూ చెప్పకుండా.. మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పే థీమ్ కు కథలో బలమైన పాయింట్. అయితే అంతగా తీవ్రత లేని పాయింట్ ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. సెకండాఫ్ స్లోగా ఉండటం, ఉపన్యాసాలు ఎక్కువ కావడం ప్రేక్షకుడ్ని విసిగించేలా ఉంటాయి. కొన్ని ఎపిసోడ్స్ సినిమాకు తక్కువ టెలివిజన్ సీరియల్స్ ఎక్కువలా అనిపిస్తాయి. కమర్షియల్ హంగులకు దూరంగా ఉన్న ఈ చిత్ర విజయం పూర్తిగా సల్లూభాయ్పైనే ఆధారపడి ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటే కొద్దిరోజులాగాల్సిందే. -
సల్మాన్ 'జై హో' అంటాడా?
బాలీవుడ్ లో 'ఖాన్'ల ఆధిపత్య పోరాటం కొనసాగుతోంది. గత కొద్దికాలంగా హిందీ చిత్ర పరిశ్రమలో షారుక్, అమీర్, సల్మాన్ ఖాన్ ల మధ్య రికార్డుల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో చాలా తక్కువ సమయంలో ఒకరి రికార్డులను మరొకరు తిరగరాస్తున్నారు. గత సంవత్సరం 'చెన్నై ఎక్స్ ప్రెస్'తో షారుక్ (226 కోట్లు), క్రిష్-3 చిత్రంతో హృతిక్ (280 కోట్లు) అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి ఓ రికార్డును నెలకొల్పారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం షారుక్, హృతిక్ లకు నిలువలేదు. గత సంవత్సరం చివర్లో డిసెంబర్ 20 తేదిన విడుదలైన 'ధూమ్-3' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించింది. 'ధూమ్-3' చిత్రం విశ్వవ్యాప్తంగా 533 కోట్ల గ్రాస్, బాలీవుడ్ లో 280 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు అమీర్ ఖాన్ అతి పెద్ద లక్ష్యాన్నే ముందుంచాడు. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం 'జై హో' భారీ లక్ష్యాన్ని చేధించేందుకు సిద్దమవుతున్నారు. జనవరి 24 తేదిన 'జై హో' విశ్వవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. 'ధూమ్-3' చిత్ర విజయంతో అమీర్ సృష్టించిన ప్రభంజనాన్ని సల్లూభాయ్ అధిగమిస్తారా అనే అంశంపై బాలీవుడ్ లో చర్చ మొదలైంది. గతంలో దబాంగ్ 2 (2012) చిత్రంతో 211 కోట్లు, ఏక్తా టైగర్(2012) తో 263 కోట్ల వసూళ్లను తన ఖాతాలో వేసుకున్న రికార్డులను తన పేరిట సల్మాన్ నమోదు చేసుకున్నారు. -రాజబాబు అనుముల ఇదిలా వుండగా, ధూమ్-3 చిత్రం ఓవారం రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. విడుదలైన తొలి రోజునే 33 కోట్లు, రెండవ రోజు 30 కోట్లు, మూడవ రోజు 35 కోట్లను, నాలుగవ రోజు 17, ఐదవ రోజు 16 కోట్లను, ఏడవ రోజు 12 కోట్ల వసూళ్లను రాబట్టింది. గతంలో మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కే సల్మాన్ సినిమాలు పరిమితమయ్యాయి. కాని తాజా చిత్రం తెలుగులో విజయవంతమైన స్టాలిన్ చిత్రం ఆధారంగా తెరకెక్కిన 'జై హో' చిత్రంలో కమర్షియల్ హంగులతోపాటు, సామాజిక అంశాలు కూడా తోడయ్యాయి. ఈ చిత్రం భారత్ లో 4500 థియేటర్లలో, విదేశాల్లో 650 థియేటర్లలో విడుదలవుతోంది. తొలిసారి సామాజిక అంశంతో సల్మాన్ ఓ ప్రయోగానికి సిద్ధమయ్యారు. సామాజిక అంశంతో సల్మాన్ చేసే ప్రయోగం అభిమానులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుందా అనే అంశం సల్మాన్ ను గందరగోళానికి గురిచేస్తోందట. ఏది ఏమైనా తన ట్రెండ్ మార్చుకుని సల్మాన్ చేస్తున్న ఓ ప్రయోగం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకునే సత్తా 'జై హో'కు ఉందా అనే ప్రశ్నలకు కొద్ది రోజులాగితే సమాధానాలు దొరకవచ్చు. -
'జై హో' చిత్ర ఫలితంపై సల్మాన్ ఆందోళన!
'జైహో' చిత్ర ఫలితంపై కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఆందోళన చెందుతున్నారు. తాను ఇష్టపడి నటించిన 'జై హో' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన వస్తుందోననే బెంగతో సల్మాన్ లో మొదలైంది. తాను జైహో చిత్రంలో ఇష్టపడి నటించానని సల్మాన్ తెలిపారు. గతంలో సల్మాన్ ఇష్టపడి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో 'జై హో' ఫలితం ఎలా ఉంటుందోననే ఆందోళనను సల్మాన్ వ్యక్తం చేస్తున్నారు. అయితే జై హో చిత్రం మిగితా చిత్రాల్లాగా చేదు అనుభవాన్ని మిగల్చదనే ఆశతో సల్మాన్ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం వాంటెడ్ లా యాక్షన్ చిత్రం కాదని, ఎక్కువ మోతాదులో ఎమోషనల్ అంశాలుంటాయని సల్మాన్ తెలిపారు. సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో సల్మాన్ సరసన డైసీ షా, ఇతర ముఖ్యప్రాత్రల్లో టబు, డానీ, సనా ఖాన్, సునీల్ శెట్టిలు నటిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన స్టాలిన్ చిత్ర ఆధారంగా 'జై హో' రూపొందింది. ఈ చిత్రం విశ్వవ్యాప్తంగా జనవరి 24 తేదిన విడుదలవుతోంది. -
ఒకరిని ప్రధాని పదవికి ప్రమోట్ చేసే శక్తి లేదు: సల్మాన్
2002లో గుజరాత్ జరిగిన మత ఘర్షణలకు నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పనవసరం లేదు అని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. మత ఘర్షణలకు సంబంధం లేనప్పుడు మోడీ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ఓ ప్రైవేట్ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఒకవేళ ఆయనకు మత ఘర్షణలకు సంబంధం ఉంటే ఎందుకు కోర్టు క్లీన్ చిట్ ఎందుకు ఇస్తుందని అన్నారు. ప్రధాని పదవికి ఒకరిని ప్రమోట్ చేసేంత శక్తి తనకు లేదని సల్మాన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 'ప్రధాని పదవికి తగిన వ్యక్తి పేరును చెప్పను. లక్షలాది మంది అభిమానులపై తన నిర్ణయాన్ని రుద్దే ఉద్దేశం లేదని సల్మాన్ అన్నారు. తాను నటించిన జయహో చిత్రాన్ని ప్రమోట్ చేయడానికే గుజరాత్ వెళ్లానని.. మోడీని ప్రమోట్ చేయడానికి కాదు అని సల్మాన్ స్పష్టం చేశారు. మోడీ సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనతో భేటి అద్బుతం అని గుజరాత్ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ అభివృద్ది తనను ఎంతో ఆకట్టుకుందని.. మా జట్టులోని మహిళలకు మోడీ ఇచ్చిన గౌరవం తనను ఆకట్టుకుంది. ముఖ్యంగా తన సోదరికి ఇచ్చిన గౌరవంతో ఆయనపై మరింత గౌరవం పెరిగిందన్నారు. జైహో చిత్ర ప్రమోషన్ కోసం గుజరాత్ వెళ్లిన సల్మాన్ .. మోడీతో కలిసి పతంగుల ఉత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. -
‘స్టార్’లకు సమయం లేకే..
బాలీవుడ్లో పెద్ద స్టార్లుగా మారిపోయినవారికి సమయం లేకపోవడంతోనే తన చిత్రాలతో కొత్తవారిని పరిచయం చేస్తున్నానని కండలవీరుడు సల్మాన్‌ఖాన్ అన్నాడు. కత్రినాకైఫ్, సోనాక్షి సిన్హా, జరైన్‌ఖాన్ వంటి తారాలను బాలీవుడ్‌కు పరిచయం చేయడం మాత్రమే కాకుండా దక్షిణాది తారలను కూడా కొంతమందిని హిందీ తెరకు పరిచయం చేశాడు. దీనిపై సల్లూభాయ్ మాట్లాడుతూ... కొత్తవారిని హిందీ చిత్రసీమకు పరిచయం చేస్తున్నప్పుడు టాలెంట్ ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తున్నా. అంతేకాని వారికి నేను గాడ్ ఫాదర్‌ను కావాలని లేదు. అంతేకాదు నేనెవరిపైనా ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వారిని ఈ పరిశ్రమకు తీసుకురావడంలేదు. ఎవరితోనైనా నాకు సంబంధముందంటే వారిని నేను ఇష్టపడుతున్నాననే అర్థం. వారితో కలిసి పనిచేయడానికి కూడా వెనుకాడను. ఇదంతా పెద్ద స్టార్లకు తేదీలు కుదరకపోవడంతోనే. ఎవరో నాకు అవకాశం ఇచ్చారు. నేనెందుకు ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు? ఎవరిపట్లయినా నాకు నమ్మకం కలిగి, వారిలో టాలెంట్ ఉందని గుర్తిస్తే వారిని పరిశ్రమకు పరిచయం చేయడానికి ఏమాత్రం వెనుకాడను. ఇక పరిచయం చేశాక వచ్చే ఆరోపణలు, విమర్శల గురించి నేను పెద్దగా పట్టించుకోన’ని అన్నారు. సల్మాన్ హీరోగా తాజాగా తెరకెక్కిన ‘జై హో’ చిత్రంతో కూడా డైసీ షాను పరిచయం చేశాడు. ఆమెకు జూనియర్ ఆర్టిస్టుగా అనుభవం కూడా ఉంది. అంతేకాక కొరియోగ్రాఫర్‌గా కూడా కొంత అనుభవముంది. దీంతో ఆమెను సల్లూభాయ్ తన చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సల్మాన్ పైవిధంగా చెప్పుకొచ్చాడు. -
సల్లూభాయ్.. సినిమా చూపించు!
షారుక్ ఖాన్‌కు దూరమైన తర్వాత ఆమిర్‌తో సల్మాన్ అనుబంధం మరింత దృఢంగా మారింది. ఒకరి చిత్రానికి మరొకరు ప్రమోషన్ చేసే స్థాయికి వీరి స్నేహం చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమిర్ ‘ధూమ్-3’ చిత్రానికి బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా సల్మాన్ ఫ్రీ పబ్లిసిటి ఇచ్చిన సంగతి తెలిసిందే. సల్లూభాయ్ చేసిన సహాయానికి ప్రతిగా... త్వరలో విడుదల కాబోతున్న సల్మాన్ ‘జైహో’ చిత్రం ప్రమోషన్లో భాగం అయ్యేందుకు ఆమిర్ కూడా సమాయత్తం అవుతున్నారు. తాజాగా ట్విటర్లో ఆమిర్ పోస్టింగ్ ఆసక్తిని కలిగించింది. ‘సల్లూభాయ్.. నీ సినిమాను విడుదలకు ముందే చూపించు. నాకోసం ఓ ప్రీమియర్ షోను ఏర్పాటు చేయవచ్చుగా’ అని అని ట్వీట్ చేశారు ఆమిర్. దానికి సల్లూభాయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. సల్మాన్, డైసీ షాలు నటించిన ‘జైహో’ చిత్రం జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందిన ‘స్టాలిన్’ చిత్రం ఆధారంగా తెరకెక్కింది. -
నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తిన సల్మాన్!
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడితో కలిసి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పతంగులను ఎగురవేయడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకేత్తించింది. ఈ సందర్భంగా తన పక్కన ఉన్న నరేంద్ర మోడీ ఓ మంచి వ్యక్తి అని ప్రశంసలతో సల్మాన్ ముంచెత్తాడు. ఉత్తమ గుణాలున్న వ్యక్తి దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని సల్మాన్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాయన్ పండుగ సందర్భంగా తాను సల్మాన్ తో కలిసి లంచ్ చేశాను అని మోడీ ట్విటర్ లో ఫోటోను పోస్ట్ చేశారు. గుజరాత్ లో ఉత్తరాయన్ పండగ నేపథ్యంలో మోడి పతంగుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో సల్లూభాయ్ పాల్గొన్నారు. త్వరలో విడుదల కానున్న 'జై హొ' తన చిత్ర ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ ఖాన్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. -
సల్మాన్@కామెడీ నైట్ విత్ కపిల్
-
ఇక్కడ నేనున్నది...రికార్డులు బ్రేక్ చేయడానికి కాదు
బాలీవుడ్ రికార్డులు ఖాన్‌త్రయం చుట్టే తిరుగుతున్నాయి. ఆమిర్‌ఖాన్ ‘గజిని’తో మొదలైన ఈ బాక్సాఫీస్ వసూళ్ల రేసు ‘ధూమ్-3’తో ఊపందుకుంది. గత కొన్నేళ్లుగా ఆమిర్, సల్మాన్, షారుక్‌లు ఒకరి రికార్డులను మరొకరు తిరగరాస్తున్నారు. మధ్యలో హృతిక్ రోషన్ కూడా ఈ రేసులో ఉన్నానంటూ ‘క్రిష్-3’తో ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా బాలీవుడ్ వసూళ్ల రేసులో ఆమిర్ ముందున్నారు. తాజాగా 500 కోట్ల గ్రాస్ వసూళ్లతో తన సత్తాను మరోసారి ఆమిర్ చాటారు. ఆమిర్ సృష్టిస్తున్న వసూళ్ల ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు సల్మాన్.. తన తాజా చిత్రం ‘జైహో’తో సిద్ధమవుతున్నారు. కానీ బాక్సాఫీస్ వసూళ్ల రేసుని తాను పట్టించుకోనని, తన చిత్రం బాగా అడితే చాలని సల్మాన్ చెబుతున్నారు. నిర్మాతలు, పంపిణీదారులు తన చిత్రం ద్వారా నష్టపోవడం తనకు ఇష్టం ఉండదని సల్లూభాయ్ అన్నారు. బాలీవుడ్లో అందరి కళ్లూ బాక్సాఫీస్ వసూళ్లపైనే ఉన్నాయన్నారాయన. అయితే 200, 300 కోట్ల క్లబ్ లాంటి అంశాలన్నీ తన దృష్టిలో డోంట్ కేర్ అన్నారు. ‘‘నంబర్ గేమ్‌లో పాలుపంచుకోవ డం ఇష్టం లేదు. రికార్డులను బ్రేక్ చేయడానికి ఇక్కడ నేను లేను’’ అని ఘాటుగా సల్మాన్ స్పందించారు. ఆమిర్ తాజా చిత్రం 500 కోట్ల భారీ లక్ష్యాన్ని ఉంచడమే... సల్మాన్ ఆచితూచి స్పందించడానికి కారణమని బాలీవుడ్లో కొందరు అనుకుంటున్నారు. చిరంజీవి ‘స్టాలిన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ‘జైహో’ చిత్రానికి సల్మాన్ సోదరుడు సోహైల్‌ఖాన్ దర్శకుడు. డైసీ షా కథానాయిక. టబు, సునీల్ శె ట్టి, డానీలు ముఖ్య పాత్రలు షోషించారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. -
‘స్వచ్ఛందం’గా ప్రచారం
కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీల్ జీవితంలోనే కాకుండా రియల్ జీవితంలో కూడా హీరోనని నిరూపించుకుంటున్నాడు. జయ్ హో ప్రచార ం కోసం కేటాయించిన సొమ్ములో సుమారు 60 శాతానికి పైగా స్వచ్ఛంద సంస్థలకు కేటాయించాలని సల్మాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం బాలీవుడ్‌ను విస్మయపరిచింది. ‘రెడీ’ సినిమా చేసిన దగ్గర నుంచి సల్మాన్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ‘ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా లు తప్పనిసరిగా హిట్ అవుతాయని అనుకోవడం భ్రమ..’ అని అంటాడు ఈ కండలవీరుడు. ఇదిలా ఉండగా, అతడి రాబోయే సినిమా ‘జయ్ హో’ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్న ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు ప్రచార ఖర్చును తగ్గించుకోవాలని సల్మాన్ కోరాడు. ‘నిజానికి ఈ సినిమా ప్రచార ఖర్చులకు సంస్థ రూ.16 కోట్లు కేటాయించింది. అయితే ఈ ఖర్చును రూ. 6 కోట్లకు తగ్గించుకోవాలని సంస్థ యజమాని సునీల్ లుల్లాను సల్లూభాయ్ కోరాడు. మిగిలిన రూ.10 కోట్లను పర్యటన సమయంలో స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని కోరాడు..’ అని సంస్థ బాధ్యుడు ఒకరు తెలిపారు. అలాగే ఈ సినిమా టికెట్ల రేట్లను సైతం అమాంతం పెంచేయవద్దని నిర్మాతను సల్మాన్ కోరాడు. ‘టికెట్ ధర సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటేనే సాధ్యమైనంత ఎక్కువ మంది సినిమాను ఆదరిస్తారు..’ అని సల్మాన్ సదరు నిర్మాతకు వివరించాడు. ఈ సందర్భంగా లుల్లా మాట్లాడుతూ..‘మా హీరో చేసినవి చాలా సమంజసమైన సూచనలు.. ఆయన కోరినట్లే ప్రచార ఖర్చులో రూ.10 కోట్లు వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని, టికెట్ ధరను ఇటీవల విడుదలైన ‘ధూమ్ 3’ కి వసూలు చేసినంతే తీసుకోవాలని నిర్ణయించామ’ని పేర్కొన్నారు. -
సల్మాన్ కు నోటీస్ ఇచిన AR రహ్మాన్
-
సల్మాన్‌కి రహమాన్ లాయర్ నోటీస్..!
భారతీయ సంగీత సంచలనం ఎ.ఆర్. రహమాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసిన పాట ‘జయహో...’. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ఈ పాటకుగాను రహమాన్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరి.. ఆస్కార్ తెచ్చిపెట్టిందనే కారణంగానో ఏమో ‘జయహో’ టైటిల్‌తో ఓ సినిమా నిర్మించాలని రహమాన్‌కి ఉందట. ఈ టైటిల్‌కి సంబంధించిన సర్వహక్కులు ఆయన దగ్గరే ఉన్నాయని సమాచారం. అందుకే సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘జయహో’ అని టైటిల్ పెట్టడం రహమాన్ని ఆగ్రహానికి గురి చేసి ఉంటుంది. ఈ టైటిల్ పెట్టే హక్కు ఎవరికీ లేదంటూ సల్మాన్‌కి లాయర్ నోటీసు పంపించారట రహమాన్. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ముందు ‘మెంటల్’ అనే టైటిల్‌ని పెట్టారు. కానీ, ఇది సామాజిక స్పృహ ఉన్న నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, ‘జయహో’ అయితే బాగుంటుందని ఆ టైటిల్‌ని ఖరారు చేశారు. ఇప్పుడీ టైటిల్‌కి రహమాన్ నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ మార్చక తప్పదని చెప్పొచ్చు. మరి.. ఈ వివాదానికి ఎలా తెరపడుతుందో చూడాలి. -
జయహో ట్రైలర్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్