'జై హో' చిత్ర ఫలితంపై సల్మాన్ ఆందోళన! | Salman Khan worried about fate of 'Jai Ho' | Sakshi
Sakshi News home page

'జై హో' చిత్ర ఫలితంపై సల్మాన్ ఆందోళన!

Published Wed, Jan 22 2014 4:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'జై హో' చిత్ర ఫలితంపై సల్మాన్ ఆందోళన! - Sakshi

'జై హో' చిత్ర ఫలితంపై సల్మాన్ ఆందోళన!

'జైహో' చిత్ర ఫలితంపై కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఆందోళన చెందుతున్నారు. తాను ఇష్టపడి నటించిన 'జై హో' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన వస్తుందోననే బెంగతో సల్మాన్ లో మొదలైంది. తాను జైహో చిత్రంలో ఇష్టపడి నటించానని సల్మాన్ తెలిపారు. గతంలో సల్మాన్ ఇష్టపడి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో 'జై హో' ఫలితం ఎలా ఉంటుందోననే ఆందోళనను సల్మాన్ వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే జై హో చిత్రం మిగితా చిత్రాల్లాగా చేదు అనుభవాన్ని మిగల్చదనే ఆశతో సల్మాన్ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం వాంటెడ్ లా యాక్షన్ చిత్రం కాదని, ఎక్కువ మోతాదులో ఎమోషనల్ అంశాలుంటాయని సల్మాన్ తెలిపారు. 
 
సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో సల్మాన్ సరసన డైసీ షా, ఇతర ముఖ్యప్రాత్రల్లో టబు, డానీ, సనా ఖాన్, సునీల్ శెట్టిలు నటిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన స్టాలిన్ చిత్ర ఆధారంగా 'జై హో' రూపొందింది. ఈ చిత్రం విశ్వవ్యాప్తంగా జనవరి 24 తేదిన విడుదలవుతోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement