‘స్వచ్ఛందం’గా ప్రచారం
‘స్వచ్ఛందం’గా ప్రచారం
Published Mon, Jan 6 2014 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీల్ జీవితంలోనే కాకుండా రియల్ జీవితంలో కూడా హీరోనని నిరూపించుకుంటున్నాడు. జయ్ హో ప్రచార ం కోసం కేటాయించిన సొమ్ములో సుమారు 60 శాతానికి పైగా స్వచ్ఛంద సంస్థలకు కేటాయించాలని సల్మాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం బాలీవుడ్‌ను విస్మయపరిచింది. ‘రెడీ’ సినిమా చేసిన దగ్గర నుంచి సల్మాన్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ‘ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా లు తప్పనిసరిగా హిట్ అవుతాయని అనుకోవడం భ్రమ..’ అని అంటాడు ఈ కండలవీరుడు.
ఇదిలా ఉండగా, అతడి రాబోయే సినిమా ‘జయ్ హో’ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్న ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు ప్రచార ఖర్చును తగ్గించుకోవాలని సల్మాన్ కోరాడు. ‘నిజానికి ఈ సినిమా ప్రచార ఖర్చులకు సంస్థ రూ.16 కోట్లు కేటాయించింది. అయితే ఈ ఖర్చును రూ. 6 కోట్లకు తగ్గించుకోవాలని సంస్థ యజమాని సునీల్ లుల్లాను సల్లూభాయ్ కోరాడు. మిగిలిన రూ.10 కోట్లను పర్యటన సమయంలో స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని కోరాడు..’ అని సంస్థ బాధ్యుడు ఒకరు తెలిపారు.
అలాగే ఈ సినిమా టికెట్ల రేట్లను సైతం అమాంతం పెంచేయవద్దని నిర్మాతను సల్మాన్ కోరాడు. ‘టికెట్ ధర సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటేనే సాధ్యమైనంత ఎక్కువ మంది సినిమాను ఆదరిస్తారు..’ అని సల్మాన్ సదరు నిర్మాతకు వివరించాడు. ఈ సందర్భంగా లుల్లా మాట్లాడుతూ..‘మా హీరో చేసినవి చాలా సమంజసమైన సూచనలు.. ఆయన కోరినట్లే ప్రచార ఖర్చులో రూ.10 కోట్లు వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని, టికెట్ ధరను ఇటీవల విడుదలైన ‘ధూమ్ 3’ కి వసూలు చేసినంతే తీసుకోవాలని నిర్ణయించామ’ని పేర్కొన్నారు.
Advertisement
Advertisement