నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తిన సల్మాన్!
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడితో కలిసి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పతంగులను ఎగురవేయడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకేత్తించింది. ఈ సందర్భంగా తన పక్కన ఉన్న నరేంద్ర మోడీ ఓ మంచి వ్యక్తి అని ప్రశంసలతో సల్మాన్ ముంచెత్తాడు. ఉత్తమ గుణాలున్న వ్యక్తి దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని సల్మాన్ అభిప్రాయపడ్డారు.
ఉత్తరాయన్ పండుగ సందర్భంగా తాను సల్మాన్ తో కలిసి లంచ్ చేశాను అని మోడీ ట్విటర్ లో ఫోటోను పోస్ట్ చేశారు. గుజరాత్ లో ఉత్తరాయన్ పండగ నేపథ్యంలో మోడి పతంగుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో సల్లూభాయ్ పాల్గొన్నారు. త్వరలో విడుదల కానున్న 'జై హొ' తన చిత్ర ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ ఖాన్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు.