కలవరపడిన సల్మాన్ | Salman confused by 'Jai Ho' response, business | Sakshi
Sakshi News home page

కలవరపడిన సల్మాన్

Published Tue, Jan 28 2014 1:21 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

కలవరపడిన సల్మాన్

కలవరపడిన సల్మాన్

జైహో చిత్రం తనను కలవరపాటుకు గురి చేసిందని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వెల్లడించారు. ఆ చిత్రం విడుదలైయ్యాక ప్రేక్షకుల స్పందన చాలా బాగుందన్నారు. అయితే ఆ చిత్రానికి వచ్చిన వసూళ్లు మాత్రం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు. సగటు ప్రేక్షకుడు వైవిద్యాన్ని కోరుకుంటాడని సల్లూబాయ్ తెలిపారు. గతంలో తాను నటించిన దబాంగ్, రెడీ చిత్రాలు బాక్స్ అఫీస్ వద్ద కనకవర్షం కురిసిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

అయితే ప్రేక్షకులు కోరుకున్న వైవిధ్యం  జైహు చిత్రంలో లేదేమో అని ఆయన వ్యాఖ్యానించారు. జైహూ చిత్రం సీరియస్ కథనంతో నడిచి, సమాజానికి ఓ మంచి సందేశాన్ని అందిస్తుందన్నారు. అయితే చిత్ర పరాజయం పాలైతే ఒక్కరిని నిందించడం తగదని సల్మాన్ అభిప్రాయపడ్డారు. జైహూ చిత్రం విడుదలైన వారం రోజులలో రూ. 61 కోట్లు వసూల్ చేసింది. సోమవారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ జైహై చిత్రం గురించి పైవిధంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement