సల్మాన్‌ఖాన్‌ను కలిసిన రంభ | Rambha Meet Salman At Da Bangg Show | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ఖాన్‌ను కలిసిన రంభ

Published Tue, Jul 10 2018 7:02 PM | Last Updated on Tue, Jul 10 2018 8:02 PM

Rambha Meet Salman At Da Bangg Show - Sakshi

సల్మాన్‌ ఖాన్‌, రంభ

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం అమెరికాలో ‘ద - బాంగ్‌’ షోతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్లూ భాయ్‌ షోకు ఓ అనుకోని అతిథి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకు ఏవరా అతిథి అనుకుంటున్నారా..? 1997 నాటి సల్మాన్‌ ‘జుడ్వా’లో అతనితో జత కట్టిన ముద్దుగుమ్మ.. ఇంకా గుర్తుకు రాలేదా..? ఆమె మరెవరో కాదు మన ‘హిట్లర్‌’ భామ రంభ.

ప్రస్తుతం ఆమె​ తన భర్త, పిల్లలతో కలిసి అమెరికా విహారయాత్రలో ఉన్నారు. తన భర్త, పిల్లలతో కలిసి సల్మాన్‌ నిర్వహిస్తున్న ‘ద - బాంగ్‌’ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ సందర్భంగా రంభ ఒకప్పటి తన ‘జుడ్వా’ హీరోతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. సల్మాన్‌ను మాత్రమే కాక 2017 ‘జుడ్వా 2’ హీరోయిన్‌ జాక్వెలిన్‌, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా, ప్రభుదేవా వంటి బాలీవుడ్‌ ప్రముఖులందరిని కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘జుడ్వా 1’, ‘జుడ్వా 2’ అనే కాప్షన్‌ ఇచ్చారు.

1997లో వచ్చిన ‘జుడ్వా 1’ లో కరిష్మా కపూర్‌తో పాటు రంభ కూడా నటించారు. ఆ తర్వాత 1998లో వచ్చిన ‘బంధన్‌’ చిత్రంలోనూ సల్మాన్‌ఖాన్‌తో జత కట్టారు. రంభ - సల్మాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో ‘బంధన్‌’ ఆఖరుది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement