భారతీయ సినిమా వందకోట్ల మార్కెట్ రేంజ్‌ను దాటి చాలా కాలం అవుతోంది. కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు రీజినల్ సినిమాలు కూడా వందకోట్ల మార్క్‌ను ఈజీగా అందుకుంటున్నాయి. అయితే ఈ రికార్డ్ ను వరుసగా సాధించిన స్టార్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ లిస్ట్ అందరికంటే టాప్ ప్లేస్ లో ఉన్న కండలవీరుడు సల్మాన్ ఖాన్.
వరుసగా 13 సినిమాలను వందకోట్ల మార్క్ దాటించిన సల్మాన్, ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేని అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాయాడు. దంబాగ్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సల్లూభాయ్ ఆ సినిమాతోనే వందకోట్ల మార్క్‌కు గేట్లు ఎత్తేశాడు. అప్పటి నుంచి వరుసగా తాను హీరోగా నటించిన ప్రతీ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటాడం విశేషం.
అంతేకాదు ప్రేమ్ రతన్ ధన్ పాయో, జైహో, ట్యూబ్‌లైట్ లాంటి ఫ్లాప్ సినిమాలలో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించిన సల్మాన్ మాస్ ఆడియన్స్‌లో తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రేస్ 3 విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా దారుణమైన రివ్యూస్ వచ్చిన కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా జెట్ స్పీడుతో దూసుకెళుతుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment