'రాజకీయాల్లో రాణించే సత్తా సల్మాన్ లో ఉంది' | Salman Khan too honest to be a politician: Ekta Kapoor | Sakshi
Sakshi News home page

'రాజకీయాల్లో రాణించే సత్తా సల్మాన్ లో ఉంది'

Published Fri, Jan 24 2014 5:08 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

'రాజకీయాల్లో రాణించే సత్తా సల్మాన్ లో ఉంది'

'రాజకీయాల్లో రాణించే సత్తా సల్మాన్ లో ఉంది'

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రాజకీయాల్లో మంచి నేతగా రాణించడానికి అవకాశం ఉందని నిర్మాత ఏక్తా కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలీవుడ్ తెరపై విభిన్న పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్న సల్లూభాయ్ కి రాజకీయాల్లో కూడా నిజాయితో కూడిన స్టార్ గా ఎదిగే సత్తా ఉందని ఆమె జోస్యం చెప్పారు.
 
మై తేరా హీరో అనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ పేరును ఏక్తా వెల్లడించింది. అంతేకాకుండా సల్మాన్ ఆమ్ ఆద్మీ అని.. ప్రజల మనిషి అని కితాబిచ్చారు. 
 
జై హో చిత్రంలో సల్మాన్ పోషించిన పాత్ర కామన్ మ్యాన్ లో ఉండే పవర్ చూపిస్తుందన్నారు. అవినీతి రాజకీయనేతకు వ్యతిరేకంగా పోరాడిన ఓ సాధారణ పౌరుడి పాత్రను సల్మాన్ పోషించారని ఏక్తా తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement