ఎట్టకేలకు100 కోట్ల క్లబ్ లో 'జై హో'
ఎట్టకేలకు100 కోట్ల క్లబ్ లో 'జై హో'
Published Tue, Feb 4 2014 1:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జై హో' చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సల్మాన్ చిత్రాలన్ని ఆరంభంలోనే అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొట్టేవి. కాని జై హో చిత్రం మాత్రం భారీ వసూళ్లను రాబట్టడంలో వెనకబడింది. గతంలో దబాంగ్ 2, ఏక్ థా టైగర్ చిత్రాలు కేవలం ఆరు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరాయి. సల్మాన్ తాజా చిత్రం జైహో పది రోజుల్లో వంద కోట్లను రాబట్టింది.
ఆదివారం నాటికి జై హో 101.25 కోట్లు వసూళు చేసింది. మున్నందు ఈ చిత్రం 150 కోట్లు కూడా దాటేది కష్టమేనని ట్రేడ్ అనలిస్టులు అంచనాలు వేస్తున్నారు. తెలుగులో ఓ మోస్తారు విజయం సాధించిన 'స్టాలిన్' చిత్ర ఆధారంగా రూపొందిన 'జై హో' కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి సానుకూల స్పందన సొంతం చేసుకోవడంలో విఫలం కావడంతో ఈ చిత్రాన్ని ఇప్పటికే సల్మాన్ ఫ్లాఫ్ క్లబ్ చేర్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం విడుదలైన ధూమ్-3 చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్లను వసూలు చేసి బాలీవుడ్ చరిత్రను తిరగరాసింది.
Advertisement
Advertisement