సల్మాన్‌కి రహమాన్ లాయర్ నోటీస్..! | AR Rahman sends legal notice to Salman Khan's 'Jai Ho' | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కి రహమాన్ లాయర్ నోటీస్..!

Published Fri, Dec 20 2013 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

ఎ.ఆర్. రహమాన్‌ ,సల్మాన్‌ఖాన్

ఎ.ఆర్. రహమాన్‌ ,సల్మాన్‌ఖాన్

 భారతీయ సంగీత సంచలనం ఎ.ఆర్. రహమాన్‌ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసిన పాట ‘జయహో...’. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ఈ పాటకుగాను రహమాన్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరి.. ఆస్కార్ తెచ్చిపెట్టిందనే కారణంగానో ఏమో ‘జయహో’ టైటిల్‌తో ఓ సినిమా నిర్మించాలని రహమాన్‌కి ఉందట. ఈ టైటిల్‌కి సంబంధించిన సర్వహక్కులు ఆయన దగ్గరే ఉన్నాయని సమాచారం. అందుకే సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘జయహో’ అని టైటిల్ పెట్టడం రహమాన్‌ని ఆగ్రహానికి గురి చేసి ఉంటుంది. ఈ టైటిల్ పెట్టే హక్కు ఎవరికీ లేదంటూ సల్మాన్‌కి లాయర్ నోటీసు పంపించారట రహమాన్.
 
  సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ముందు ‘మెంటల్’ అనే టైటిల్‌ని పెట్టారు. కానీ, ఇది సామాజిక స్పృహ ఉన్న నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, ‘జయహో’ అయితే బాగుంటుందని ఆ టైటిల్‌ని ఖరారు చేశారు. ఇప్పుడీ టైటిల్‌కి రహమాన్ నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ మార్చక తప్పదని చెప్పొచ్చు. మరి.. ఈ వివాదానికి ఎలా తెరపడుతుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement