ఆ ముగ్గురితో నటించే చాన్స్ కావాలి
ఆ ముగ్గురితో నటించే చాన్స్ కావాలి
Published Mon, Dec 23 2013 10:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ బాసులు షారుఖ్‌ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్‌అలీఖాన్, రణ్‌బీర్ కపూర్‌తో దీపికా పదుకొణే ఇది వరకే జోడీ కట్టింది. అయితే ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్‌తోనూ కలసి పనిచేయాలన్న కోరిక మిగిలిపోయింది. ‘వీళ్లతో ఎప్పుడు నటిస్తావంటూ చాలా మంది అడుగుతుంటారు. వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో ఆమిర్, సల్మాన్, హృతిక్‌తో అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను’ అని వివరించింది. విశేషమేమిటంటే ఈ ఏడాది దీపిక ఏకంగా నాలుగు హిట్ సినిమాల్లో నటించింది. సూరజ్ బర్జాత్యా తాజా సినిమాలో సల్మాన్‌తో నటిస్తోందంటూ వచ్చిన వార్తలను ఈ కన్నడ కస్తూరి కొట్టిపారేసింది. బర్జాత్యాను ఇంత వరకు కలవనే లేదని చెప్పింది. దీపికే కాదు.. సల్లూభాయ్ కూడా ఈమెతో నటించాలన్న కోరికను బయటపెట్టాడు. ఆమె నటనను చాలాసార్లు మెచ్చుకున్నాడు కూడా. ‘సల్మాన్ నన్ను ప్రశంసించాడని విన్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది.
ఒక వాణిజ్య ప్రకటన కోసం రాజస్థాన్‌లో ఆయన స్నేహితులతో కలిసి నటిస్తున్నప్పుడే మా ఇద్దరికి పరిచయమయింది. అప్పుడే తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి సల్మాన్‌ఖాన్ అంగీకరించాడు’ అని వివరించింది. అయితే అప్పుడు మోడలింగ్‌లో తీరిక లేకుండా ఉండడంతో ఈ బ్యూటీ సల్మాన్ ఆఫర్‌ను వదులుకుంది. 2007లో షారుఖ్ హీరోగా నటించిన ఓం శాంతి ఓం ద్వారా దీపిక బాలీవుడ్‌లో ప్రవేశించడం తెలిసిందే. ఆ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను సాధించింది. ప్రస్తుతం ఈమె హ్యాపీ న్యూఇయర్, ఫైండింగ్ ఫ్యానీ ఫెర్నాండెజ్‌తోపాటు ఇంతియాజ్ అలీ కొత్త సినిమాలోనూ నటిస్తోంది. అంటే దీపిక కొత్త సంవత్సరంలోనూ సల్మాన్, ఆమిర్, హృతిక్‌తో నటించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.
Advertisement
Advertisement