80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్గా కట్టిన హీరో
80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్గా కట్టిన హీరో
Published Thu, Dec 22 2016 1:23 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
గత ఏడాది మొహెంజోదారో సినిమాతో భారీ డిజాస్టర్ను ఎదుర్కొన్న బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ ఆదాయం విషయంలో మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం కాబిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ మ్యాన్లీ స్టార్ 80 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్(ముందస్తు పన్నుల రూపంలో) చెల్లించాడు. సినిమాలతో పాటు యాడ్స్లో నటించటం, హెచ్ఆర్ఎక్స్ ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయానికి గాను ఈ మొత్తాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించినట్టు తెలిసింది.
గత ఏడాది 50 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన హృతిక్, ఈ ఏడాది మరో 30 కోట్లు అధికంగా చెల్లించాడు. హృతిక్ తరువాతి స్థానంలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఉన్నాడు. దంగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఆమిర్ 72 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. 37 కోట్లను చెల్లించి రణబీర్ కపూర్, 14 కోట్లను కట్టి సల్మాన్ ఖాన్, 10 కోట్లను కట్టి అక్షయ్ కుమార్లు ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. అయితే బాలీవుడ్ టాప్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారనే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించలేదు.
Advertisement
Advertisement