హృతిక్, సల్మాన్, అమీర్ పై కన్నేసిన దీపికా పదుకోనె!
హృతిక్, సల్మాన్, అమీర్ పై కన్నేసిన దీపికా పదుకోనె!
Published Mon, Dec 23 2013 2:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
వరుస హిట్లతో బాలీవుడ్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న దీపికా పదుకోనె.. ప్రస్తుతం హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లపై కన్నేసింది. ఇప్పటికే అక్షయ్ కుమార్, సైఫ్ ఆలీ ఖాన్, రణబీర్ కపూర్, షారుక్ ఖాన్ లతో జత కట్టిన దీపికా, ఇక హృతిక్, సల్మాన్, అమీర్ లతో నటించేందుకు సిద్ధమైంది. 2013లో బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ లను అందించిన ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖులకు విందును ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలో హృతిక్, సల్మాన్, అమీర్ లతో నటిస్తాను అని తెలిపింది. ఇంకా ఆ ముగ్గురితో నటించలేదనే బాధ వెంటాడుతోంది అని బాలీవుడ్ ముద్దుగుమ్మ వెల్లడించింది. అయితే సల్మాన్ తో సూరజ్ బర్జాత్యా నిర్మించే చిత్రంలో దీపికా పేరును ఖారారు చేసినట్టు తెలుస్తోంది. అయితే సూరజ్ ను కలువలేదు.. అధికారికంగా సల్మాన్ తో నటించే విషయాన్ని ఇప్పుడే ధృవీకరించలేనని తెలిపింది.
తనతో నటించాలని పలు సందర్భాల్లో సల్మాన్ ఖాన్ కూడా తన ఇష్టాన్ని వెల్లడించడం తనకు ఆనందంగా ఉంది అని దీపికా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. తనలో ప్రతిభను మొదటగా గుర్తించింది సల్లూభాయ్ అని తెలిపారు. ఓం శాంతి ఓం చిత్రానికి ముందు రాజస్థాన్ లో ఓ యాడ్ లో నటిస్తుండగా మొట్టమొదటిగా తనకు సినిమాను ఆఫర్ చేసింది సల్మాన్ అని,ఆయనతో నటించడం చాలా ఇష్టమని అని దీపికా మీడియాతో అన్నారు. ప్రస్తుతం షారుక్ తో 'హ్యపీ న్యూ ఇయర్', 'ఫైండింగ్ ఫ్యానీ ఫెర్నాండేజ్', ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో మరో చిత్రంలో దీపికా పదుకోనె నటిస్తోంది.
Advertisement
Advertisement