advance tax
-
అడ్వాన్స్ ట్యాక్స్‌లో ‘కింగ్’ ఖాన్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిల్చారు. ఆయన రూ. 92 కోట్లు చెల్లించారు. తమిళ నటుడు విజయ్ రూ. 80 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2023–24లో భారీ స్థాయిలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీలతో ఫార్చూన్ ఇండియా రూపొందించిన ’ది స్టార్ కాస్ట్’ లిస్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 71 కోట్లు) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యధికంగా రూ. 66 కోట్లు చెల్లించగా, ఎంఎస్ ధోని రూ. 38 కోట్లు, సచిన్ టెండూల్కర్..సౌరవ్ గంగూలీ వరుసగా రూ.28 కోట్లు, రూ. 23 కోట్లు చెల్లించారు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన సినీ ప్రముఖుల్లో అల్లు అర్జున్, మోహన్‌లాల్ చెరో రూ. 14 కోట్లు కట్టగా ఆమిర్ ఖాన్ రూ. 10 కోట్లు చెల్లించారు. -
పాన్-ఆధార్ లింకుకు ఇంకా పదిహేను రోజులే
ఇవాళ మార్చి 15.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు తేది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మీ నికర ఆదాయాన్ని లెక్కించుకుని, వర్తించే పన్ను భారంలో నుంచి టీడీఎస్ తగ్గించి .. మిగతా మొత్తాన్ని జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో నిర్దేశించిన వాయిదాల ప్రకారం చెల్లించాలి. ఈ చెల్లింపులకు మార్చి పదిహేనే ఆఖరు తేదీ. వెంటనే చెల్లించేయండి. లేని పక్షంలో వడ్డీ భారం పడుతుంది. ఒకవేళ మార్చి 15న కుదరకపోతే కనీసం నెలాఖరు లోగానైనా చెల్లించేయాలి. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్న్ వేయలేకపోయిన వారు మార్చి నెలాఖరు లోపల వేయవచ్చు. 2019-20కి వేసిన రిటర్నులను సవరించుకోవడానికి కూడా మార్చి 31 ఆఖరు తేదీ. చెల్లించాల్సినవి ఉంటే.. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, మెడిక్లెయిమ్, పీఎఫ్, జీవిత బీమా, పిల్లల ట్యూషన్ ఫీజులు, మున్సిపల్ పన్నులు, విరాళాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపలే చెల్లించాలి. ఏదైనా మర్చిపోతే వెంటనే చెల్లించేయండి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో డిపాజిట్ చేసిన వారికి అదనంగా రూ. 50,000 దాకా మినహాయింపు ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను సంబంధ అంశాలన్నింటికీ మార్చి 31 గడువు తేదీ. ఆదాయ పన్ను ప్లానింగ్ గురించి మీరు ముందుగానే ఆలోచిస్తే.. మీ కుటుంబంతో పాటు మీ ఆర్థిక కార్యకలాపాల గురించి మంచి ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. తద్వారా బండి సాఫీగా ముందుకు సాగిపోతుంది. వివరాలన్నీ పోల్చి చూసుకోవాలి.. కొత్త అపార్ట్మెంట్లు కొనే వాళ్లు వాటి నిర్మాణం చివరి దశలో ఉంటే ఈ సంవత్సరంలోనే తీసుకోవడమో లేదా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోవడమో ఆలోచించుకోవచ్చు. అలాగే స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి సమయం ఉంటుంది కాబట్టి వీలైతే ఏప్రిల్‌లో చేపట్టవచ్చు. అప్పుడు ప్లానింగ్ చేసుకోవడానికి, పన్నుల భారం చెల్లించడానికి తగినంత సమయం లభిస్తుంది. వ్యాపారస్తుల విషయంలో వారి వార్షిక టర్నోవరు వివరాలను అసెసీకి సంబంధించిన ఫారం 26ఏఎస్‌లో పొందుపరుస్తున్నారు. ఇందులోని వివరాలను మీ ఆర్థిక వ్యవహారాల చిట్టాగా .. మీ ఫైనాన్షియల్ రికార్డు .. మీ జాతకంగా అనుకోవచ్చు. ఎక్కడ తేడా వచ్చిన ఆరా తీస్తారు. సరైన వివరణ ఇవ్వకపోతే ఏ అధికారులూ ఊరుకోరు. కాబట్టి ఏ తప్పులు లేకుండా అన్ని వివరాల రికార్డులు, రిటర్నులు మొదలైన వాటిని ఒకదానితో మరొకటి పోల్చి చూసుకుని, తప్పులు లేకుండా వేసుకోండి. ఇక చివరిగా రెసిడెంట్ల విషయానికొస్తే.. మీ పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. దీనికి 2021 మార్చి 31 ఆఖరు తేది. కనుక త్వరపడండి. అనుసంధానం చేయకపోతే పెనాల్టీలు వడ్డిస్తారు. అన్నీ సక్రమంగా చేసుకుంటే, చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రశాంతంగా గడిచిపోతుంది. చదవండి: ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా! దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ -
ప్రతి లావాదేవీని పరిశీలిస్తున్నాం
సాక్షి, అమరావతి: భారీ స్థిరచరాస్తులు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన వారు దాఖలు చేస్తున్న రిటర్నులను నిశితంగా గమనిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నోటీసులు వచ్చే వరకు కాకుండా ముందుగానే పూర్తి వివరాలతో రిటర్నులు దాఖలు చేయాల్సిందిగా విజయవాడ రీజియన్ చీఫ్ కమిషనర్ పీసీ మహంతి అసెస్సీలను కోరారు. డిసెంబర్ 15 లోపు చెల్లించాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్‌పై అవగాహన కల్పించేందుకు అమరావతిలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది విజయవాడ రీజియన్ ఆదాయపన్ను వసూళ్లలో దూసుకుపోతోందన్నారు. ఈ ఏడాది ఆదాయపన్ను వసూళ్లలో 48 శాతం వృద్ధి నమోదయ్యిందన్నారు. గతేడాది ఇదే కాలానికి ఈ వృద్ధిరేటు కేవలం 20 శాతం మాత్రమేనని చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,423 కోట్లు లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు రూ. 1,248.5 కోట్లు వసూలయినట్లు తెలిపారు. టీడీఎస్ వసూళ్లలో వృద్ధి ఆశించినంతగా లేదని దీనిపై మరింత దృష్టి సారించాలన్నారు. -
80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్‌గా కట్టిన హీరో
-
80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్‌గా కట్టిన హీరో
గత ఏడాది మొహెంజోదారో సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్న బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ ఆదాయం విషయంలో మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం కాబిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ మ్యాన్లీ స్టార్ 80 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్(ముందస్తు పన్నుల రూపంలో) చెల్లించాడు. సినిమాలతో పాటు యాడ్స్‌లో నటించటం, హెచ్ఆర్ఎక్స్ ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయానికి గాను ఈ మొత్తాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించినట్టు తెలిసింది. గత ఏడాది 50 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన హృతిక్, ఈ ఏడాది మరో 30 కోట్లు అధికంగా చెల్లించాడు. హృతిక్ తరువాతి స్థానంలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఉన్నాడు. దంగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఆమిర్ 72 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. 37 కోట్లను చెల్లించి రణబీర్ కపూర్, 14 కోట్లను కట్టి సల్మాన్ ఖాన్, 10 కోట్లను కట్టి అక్షయ్ కుమార్‌లు ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. అయితే బాలీవుడ్ టాప్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారనే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించలేదు. -
పెనాల్టీలను తప్పించుకోవచ్చు..
రిటర్నుల దాఖలుకు ఈ నెల 5తో గడువు తేదీ అయిపోయింది. కాకపోతే ఏదైనా కారణం వల్ల రిటర్న్ దాఖలు చేయనివారు చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేసినా పర్వాలేదు. టీడీ ఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా మొత్తం పన్ను భారం మార్చి 2016లో చెల్లించిన ట్లయితే... ఈ రోజు/రేపు అంటే గడువు తేది తర్వాత రిటర్న్ దాఖలు చేయవచ్చు. అదనంగా వడ్డీ చె ల్లించాల్సిన పనిలేదు. ఎటువంటి ప్రమాదం లేదు. గాబరా పడనక్కర్లేదు. వెంటనే వేయండి. ఒకవేళ రిఫండ్ క్లెయిమ్ చేయ్యాలనుకోండి. ఈ రోజు వేసినా మీ రిఫండ్ మీకు వస్తుంది. మీ రిఫండ్‌కి ఏ ఢోకా లేదు. అయితే డిపార్ట్మెంట్ వారు మీకు రిఫండ్ మీదిచ్చే నామమాత్రపు వడ్డీ మాత్రం ఇవ్వరు. ఇది స్వల్పంగా ఉంటుంది.గడువు తేది దాటిపోయింది. రిటర్నులు వేయలేదు. పన్ను భారం పూర్తిగా కాకుండా కొంత భాగమే చెల్లించారు. ఈ సందర్భాల్లో మీకు అదనంగా వడ్డీ వడ్డిస్తారు. చెల్లించవలసిన ప్రతి వంద కి.. నెలకి 25 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. బయటి నుంచి ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి పన్నులు చెల్లించడం కన్నా.. ఒకటి లేదా రెండు నెలల జాప్యం జరిగి రిటర్నులు ఆలస్యంగా వేయడంతో వడ్డీ మినహా ఎలాంటి నష్టం లేదు. కానీ ఎక్కువ మొత్తం బకాయి ఉన్నప్పుడు ఈ వడ్డీలు తడి సి మోపెడవుతాయి. వడ్డీ చెల్లించడం వలన ఆదాయం పెరగదు. వడ్డీని ఖర్చుగా పరిగణించరు. వ్యాపారం, స్టాక్ మార్కెట్ వ్యవహారాలు, ఇంటి రుణ వడ్డీ, క్యాపిటల్ గెయిన్ వంటి అంశాల్లో నష్టం వాటిల్లిన సందర్భాల్లో గడువు తేదిలోపు రిటర్నులు వేయకపోతే ఈ నష్టాన్ని బదిలీ చేయరు. సకాలంలో వేయడం వలన ఇలాంటి నష్టాల్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేస్తారు. ఇలా చేయడంతో ఈ నష్టం మేరకు వచ్చే సంవత్సరంలో ఆదాయం తగ్గుతుంది. ఫలితంగా పన్ను భారమూ తగ్గుతుంది. ఇది ఎంతో ప్రయోజనకరం. దీనిని దృష్టిలో ఉంచుకొని రిటర్నులు సకాలంలో వేయాలి. 2015-16 ఆర్థిక సంవత్సరం రిటర్నును 31.03.2017లోగా దాఖలు చేయకపోతే పెనాల్టీలు వేస్తారు. అలాగే సెల్ఫ్ అసెస్మెంట్ పన్ను కట్టకపోయినా.. అసెస్మెంట్ జరిపిన తర్వాత డిమాండ్ చెల్లించకపోయినా పెనాల్టీలు పడతాయి. ఇంచుమించు ప్రతి తప్పుకి పెనాల్టీలు ఉన్నాయి. వీటి వలన మీ ట్రాక్ రికార్డ్ పాడవుతుందన్న విషయం. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి & కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
వ్యాపారులూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి!
ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి న్యూఢిల్లీ: మరింత మందిని పన్ను పరిధిలోనికి తెచ్చే వ్యూహాంలో భాగంగా ఆదాయపు పన్ను విభాగం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోనిరి కొత్తగా కోటిమందిని తీసుకురావాలని ఐటీ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం ట్రేడర్లు, వ్యాపారులు వార్షిక రిటర్న్‌లు కాకుండా ముందస్తుగా పన్నులు చెల్లించాలని, ఇలా చేయడం వల్ల వారిని అసెస్సీలుగా పరిగణిస్తామని, తమ లక్ష్యం కూడా నెరవేరే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదాయపు పన్ను సంబంధిత అపోహలను తొలగించడానికి పరిశ్రమ, వాణిజ్యవేత్తలతో సీదా సంవాద్(నేరుగా సంభాషణ) కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కు మించి పన్ను బాధ్యత ఉండే ప్రతీ వ్యక్తి మందస్తుగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. -
తగ్గిన బ్యాంకింగ్ ముందస్తు పన్ను చెల్లింపులు
ముంబై : ఒకవైపు టాప్ 45 కార్పొరేట్లు కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ 8 శాతం పెరగ్గా మరోవైపు బ్యాంకింగ్, ఉక్కు, సాధారణ బీమా రంగ సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు మాత్రం తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా మిగతా బ్యాంకుల నుంచి పన్ను చెల్లింపులు తగ్గినట్లు ఆదాయ పన్ను విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, ముంబై జోన్ హెడ్ డీఎస్ సక్సేనా తెలిపారు. అడ్వాన్స్ ట్యా క్స్ చెల్లింపులకు సెప్టెం బర్ 15 ఆఖరు తేదీ. ఈలోగా టాప్ 45 కార్పొరేట్ సంస్థలు కట్టిన ముం దస్తు పన్నుల మొత్తం 8.09 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి.. హెచ్డీఎఫ్సీ 10 శాతం పెరుగుదలతో రూ. 810 కోట్లు కట్టింది. యస్ బ్యాంక్ 30 శాతం పెరుగుదలతో రూ. 310 కోట్లు కట్టింది. మరోవైపు, న్యూ ఇండియా అష్యూరెన్స్ బీమా సంస్థ రూ. 41 కోట్లు కట్టింది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో కంపెనీ రూ. 47 కోట్లు చెల్లించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
నేడు ముందస్తు పన్ను చెల్లింపులకు తుది గడువు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు తమ అడ్వాన్స్ ట్యాక్స్‌ను సెప్టెంబర్ 15వ తేదీలోపు చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది. తద్వారా దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరింది. టీవీ, రేడియో ఇతర ప్రసార సాధనాల ద్వారా కేంద్రం ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పన్ను చెల్లింపుల భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించిందే ‘అడ్వాన్స్ ట్యాక్స్’ విధానం. -
రూపాయి, ద్రవ్యోల్బణంపై దృష్టి
ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ⇒ అడ్వాన్సు ట్యాక్స్ చెల్లింపులు ⇒ పార్లమెంటు సమావేశాల్లో పరిణామాలు ⇒ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం న్యూఢిల్లీ: ఫిబ్రవరి నెల టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, పార్లమెంటు సమావేశాల్లో జరగబోయే పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయంటూ విశ్లేషకులు అంచనాల్ని వెల్లడించారు. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రూపాయి మారకపు విలువ కదలికలు కూడా మార్కెట్‌కు కీలకమని వారు వ్యాఖ్యానించారు. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 3.21 శాతం పడిపోయింది. ఒకవారంలో సూచీ ఇంతగా క్షీణించడం ఈ ఏడాది ఇదే ప్రధమం.రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకంటే అధికంగా నమోదుకావడంతో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల కోత ప్రక్రియకు బ్రేక్వేస్తుందన్న భయాలతో క్రితం వారం మార్కెట్ పడిపోయింది. ఇక ఈ సోమవారం వెల్లడయ్యే ఫిబ్రవరి టోకు ద్రవ్యోల్బణం డేటా కోసం ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. కార్పొరేట్ల అడ్వాన్సు ట్యాక్స్ చెల్లింపుల డేటా కూడా ఈ వారం తెలుస్తుంది. అడ్వాన్సు పన్ను చెల్లింపుల్ని బట్టి మార్చి త్రైమాసికంలో ఆయా కంపెనీలు సాధించబోయే లాభనష్టాలపట్ల ఇన్వెస్టర్లకు అంచనాలు ఏర్పడతాయి. తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మార్చి 20తో ముగియనున్నందున, ఈ సభల్లో జరిగే పరిణామాల పట్ల మార్కెట్ ఆసక్తి కనపరుస్తోందని మాంగ్లిక్ వివరించారు. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి మార్చి 17-18 తేదీల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ జరిపే సమావేశం కీలకమైనదని ఆయన వివరించారు. ఫెడ్ వడ్డీ రేట్లను ఎప్పట్నించి పెంచవచ్చన్న సంకేతాల కోసం ఈ సమావేశంపై దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. సమీప భవిష్యత్తులో దేశీ మార్కెట్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మరికొంతమంది విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ వారం మార్కెట్ అటూఇటూ కదిలినా, బుల్లిష్‌గానే వుండవచ్చని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు. రూ. 72,000 కోట్లకు విదేశీ పెట్టుబడులు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్లో ఈ ఏడాది ఇప్పటివరకూ చేసిన పెట్టుబడుల మొత్తం రూ. 72,000 కోట్లకు చేరింది. ఈ మార్చి నెల తొలి రెండు వారాల్లో వారు ఈక్విటీ మార్కెట్లో రూ. 9,134 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 4,567 కోట్లు పెట్టుబడి చేయడంతో ఈ పక్షంరోజుల్లో వారి పెట్టుబడుల మొత్తం రూ.13,706 కోట్లకు పెరిగినట్లు సెంట్రల్ డిపాజిటరీ డేటా వెల్లడిస్తున్నది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ.71,958 కోట్లకు చేరాయి. -
ముందస్తు పన్ను వసూళ్లలో 17 శాతం వృద్ధి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముందస్తు పన్ను వసూళ్లకు సంబంధించి సెప్టెంబర్ త్రైమాసికంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు దాదాపు చేరువగా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారి వెల్లడించింది. సుమారు 17 శాతం వృద్ధి నిర్దేశించుకోగా, వసూళ్లు లక్ష్యానికి దగ్గరగా ఉన్నట్లు వివరించారు. అయితే, ఎంత వసూలైనదీ వెల్లడించలేదు. సాధారణంగా ట్రెండ్స్ తెలియజేసేలా ప్రతిసారీ టాప్ 100 కంపెనీల చెల్లింపుల వివరాలను ప్రకటించే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. గత రెండు త్రైమాసికాల తరహాలోనే ఈసారి కూడా వెల్లడించలేదు. దేశం మొత్తంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ముంబై సర్కిల్‌దే సింహభాగం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 7.36 లక్షల కోట్లు ఆదాయ పన్ను శాఖ నిర్దేశించుకోగా.. ఇందులో రూ. 2.3 లక్షల కోట్లు ముంబై సర్కిల్ నుంచి రాబట్టాలని భావిస్తోంది. మరోవైపు, యస్ బ్యాంక్ తాము రెండో త్రైమాసికంలో రూ. 238 కోట్లు (20 శాతం వృద్ధి) అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు పేర్కొంది. అటు హెచ్డీఎఫ్సీ 13 శాతం అధికంగా రూ. 735 కోట్లు చెల్లించినట్లు వివరించింది. -
12.5% పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (2013-14, ఏప్రిల్-సెప్టెంబర్ 17 వరకూ) 12.5 శాతం పెరిగాయి. రూ.2,38,325 కోట్లుగా నమోదయ్యాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ధి దీనికి ప్రధాన కారణం. వేర్వేరుగా చూస్తే- కార్పొరేట్ పన్ను వసూళ్లు 7.97% వృద్ధితో రూ.1,46,610 కోట్లుగా నమోదయ్యాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 21.08 శాతం ఎగసి రూ.89,006 కోట్లుగా నమోదయ్యాయి. ఇక సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వసూళ్లు రూ.2,210 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్ను వసూళ్లు రూ. 309 కోట్లు. సెప్టెంబర్ క్వార్టర్లో నికర ముందస్తు పన్ను వసూళ్లు 9.14% వృద్ధితో రూ.1,14,320 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు (7.97 శాతం వృద్ధి) రూ.1,03,374 కోట్లుకాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (24% వృద్ధి) రూ. 10,946 కోట్లు. -
40% తగ్గిన ఎస్బీఐ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌కు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ ముందస్తు పన్ను చెల్లింపులు(అడ్వాన్స్ ట్యాక్స్) 40% తగ్గి రూ. 1,120 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి రూ.1,820 కోట్లను చెల్లించింది. కాగా, ఈ కాలంలో బ్యాంకు విదేశీ కార్యాలయాలు మాత్రం రూ. 192 కోట్ల పన్నును అదనంగా చెల్లించాయి. ఈ విషయాన్ని ఎస్బీఐ తెలిపింది. ముంబై ప్రాంతానికి సంబంధించి పన్ను చెల్లింపులు తగ్గే అవకాశమున్నట్లు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చె ప్పారు.