తగ్గిన బ్యాంకింగ్ ముందస్తు పన్ను చెల్లింపులు | Reduced Banking Pre-tax payments | Sakshi
Sakshi News home page

తగ్గిన బ్యాంకింగ్ ముందస్తు పన్ను చెల్లింపులు

Published Wed, Sep 16 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

తగ్గిన బ్యాంకింగ్ ముందస్తు పన్ను చెల్లింపులు

తగ్గిన బ్యాంకింగ్ ముందస్తు పన్ను చెల్లింపులు

ముంబై : ఒకవైపు టాప్ 45 కార్పొరేట్లు కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ 8 శాతం పెరగ్గా మరోవైపు బ్యాంకింగ్, ఉక్కు, సాధారణ బీమా రంగ సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు మాత్రం తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా మిగతా బ్యాంకుల నుంచి పన్ను చెల్లింపులు తగ్గినట్లు ఆదాయ పన్ను విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, ముంబై జోన్ హెడ్ డీఎస్ సక్సేనా తెలిపారు. అడ్వాన్స్ ట్యా క్స్ చెల్లింపులకు సెప్టెం బర్ 15 ఆఖరు తేదీ. ఈలోగా టాప్ 45 కార్పొరేట్ సంస్థలు కట్టిన ముం దస్తు పన్నుల మొత్తం 8.09 శాతం పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి.. హెచ్‌డీఎఫ్‌సీ 10 శాతం పెరుగుదలతో రూ. 810 కోట్లు కట్టింది. యస్ బ్యాంక్ 30 శాతం పెరుగుదలతో రూ. 310 కోట్లు కట్టింది. మరోవైపు, న్యూ ఇండియా అష్యూరెన్స్ బీమా సంస్థ రూ. 41 కోట్లు కట్టింది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో కంపెనీ రూ. 47 కోట్లు చెల్లించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement