
నేడు ముందస్తు పన్ను చెల్లింపులకు తుది గడువు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు తమ అడ్వాన్స్ ట్యాక్స్‌ను సెప్టెంబర్ 15వ తేదీలోపు చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది. తద్వారా దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరింది. టీవీ, రేడియో ఇతర ప్రసార సాధనాల ద్వారా కేంద్రం ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పన్ను చెల్లింపుల భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించిందే ‘అడ్వాన్స్ ట్యాక్స్’ విధానం.