కొడుకు కోసం ఒక్కటైన హృతిక్, సుజానే | sussanne and hrithik together for their son | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం ఒక్కటైన హృతిక్, సుజానే

May 3 2014 11:37 AM | Updated on Sep 2 2017 6:53 AM

కొడుకు కోసం ఒక్కటైన హృతిక్, సుజానే

కొడుకు కోసం ఒక్కటైన హృతిక్, సుజానే

బాలీవుడ్ జంట హృతిక్ రోషన్, సుజానే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నా తమ పిల్లాడి కోసం మాత్రం వాళ్లు మళ్లీ ఒక్కటయ్యారు.

బాలీవుడ్ జంట హృతిక్ రోషన్, సుజానే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లకు ఇంకా విడాకులు మంజూరుకాలేదు గానీ విడివిడిగానే ఉంటున్నారు. కానీ.. తమ పిల్లాడి కోసం మాత్రం వాళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. తమ చిన్న కొడుకు హృదాన్ పుట్టినరోజు కోసం హృతిక్ రోషన్ షూటింగులకు సెలవుపెట్టి, లోనావాలా వెళ్లాడు.

ఆ పుట్టినరోజు పార్టీలో సుజానే కూడా ఉంది. లోనావాలలో పార్టీ చేసుకున్న తర్వాత అందరూ కలిసి ముంబై వచ్చారు. ఆ రోజు రాత్రి జుహూ లోని ఓ మల్టీప్లెక్సులో ఓ సినిమాకు హృతిక్, సుజానే, పిల్లలు అంతా కలిసి వెళ్లారు. వాళ్లతో పాటు కొంతమంది స్నేహితులు, వాళ్ల పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలంటే దంపతులిద్దరికీ చాలా అభిమానమని, అందుకే వాళ్ల సంతోషం కోసం ఇలా కలిసి వచ్చారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement