get together
-
కలసి తింటే.. కలదు సుఖం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలతో పాటు నగర విందు వైవిధ్యభరితంగా ఉంటుంది. అమెరికన్, మెక్సికన్, ఇటాలియన్ సహా పాశ్చాత్య వంటకాలు, క్లాసిక్ చైనీస్ వంటకాలు ఇక్కడ డిమాండ్‌లో ఉన్నాయి. మరోవైపు సుసంపన్నమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది మన నగరం. దీంతో రెస్టారెంట్ల సంఖ్యలో వృద్ధితో పాటే సిటీ జనుల ఆహారపు అలవాట్లలో వేగవంతమైన మార్పును చవిచూస్తోంది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఇండియా ఫుడ్ సరీ్వసెస్ రిపోర్ట్ (ఐఎఫ్ఎస్ఆర్) 2024 ప్రకారం, సిటీజనులు నెలకు సగటున ఏడు సార్లు బయటే భోజనం చేస్తారు లేదా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఇది జాతీయ సగటు 8కి అతి దగ్గరగా ఉంది. ఇంకా ఈ ఐఎఫ్ఎస్ఆర్ నివేదిక తెలిపిన అంశాల్లో మరికొన్ని ఇలా.. సరికొత్త వంటకాలు.. రెస్టారెంట్ల అన్వేషణ.. సామాజిక సమూహాలు, కుటుంబాలు, స్నేహితులతో సమావేశాలు సిటీలో డైనింగ్ కల్చర్‌ను ప్రభావితం చేస్తున్న ముఖ్యాంశాలు. హైదరాబాదీలు కూడా విహారయాత్రలతో పాటు సినిమాలను చూడటం దాకా రెస్టారెంట్ల సందర్శనను కూడా జత చేస్తారు. అంతేకాక కొత్త వంటకాలు సరికొత్త రెస్టారెంట్లను అన్వేషించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటారు. అవుట్‌సైడ్ ఫుడ్.. రీజన్స్ ఇవే.. బయటి ఆహారం తినడానికి కుటుంబం, స్నేహితులతో గెట్– టుగెదర్ 28.9 శాతం మందికి ప్రధాన కారణంగా ఉంది. అదే విధంగా థియేటర్లో సినిమా చూడడానికి ముందు, ఆ తర్వాత 19.3 శాతం మంది బయటే తింటున్నారు. అలాగే పండగ లేదా నేషనల్ హాలిడేస్ వచి్చనప్పుడు 19.3 శాతం మంది, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రమోషన్లు వంటి ఆనందకరమైన సందర్భాలను సెలబ్రేట్ చేసుకోవడానికి 19.3 శాతం మంది, కొత్త అవుట్‌లెట్స్, రెస్టారెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఉందో చూడడానికి అని13.3 శాతం మంది బయటి ఫుడ్‌కి ఓటేస్తున్నారు. దేశంలోనే 5వ స్థానంలో... నగరంలో అన్ని సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్నవి కలిపితే 74,000 పైగా ఆహార విక్రయశాలలు ఉన్నాయి. నగరం వ్యవస్థీకృత రంగాన్నే తీసుకుంటే రూ. 10,161 కోట్ల విలువ చేస్తుందని అంచనా. మన భాగ్యనగరానిది దేశంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్. నగరం 40 వేలకుపైగా రెస్టారెంట్లు కలిగి ఉంది. వీటిలో క్లౌడ్ కిచెన్‌లూ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవి మొత్తం మార్కెట్లో 40 శాతం వాటా కలిగి ఉండడం క్లౌడ్ కిచెన్ల వృద్ధికి అద్దం పడుతోంది. అనారోగ్యాలకూ ఆహ్వానం.. సిటీలో అవుట్‌సైడ్ ఫుడ్ తినడం అనేది పెరగడం ఆరోగ్యపరమైన సవాళ్లను తెచి్చపెడుతోంది. కొన్నిచోట్ల అపరిశుభ్ర నిల్వ పద్ధతులు, నాసిరకం వంట పద్ధతులు ప్రమాణాలు పాటించని విధానాలు సిటీజనులకు రోగాలను కొని తెచ్చిపెట్టుకున్నట్టుగా చేస్తున్నాయి. అంతేకాకుండా.. కేలరీలు అధికంగా ఉండే రెస్టారెంట్ ఫుడ్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, స్థూలకాయం సంబంధిత ఆరోగ్య సమస్యలకు దోహదపడవచ్చు. వీటిని గుర్తించి అవగాహనతో మాత్రమే అవుట్‌సైడ్ డైనింగ్‌ను ఆస్వాదించాల్సి ఉంది. -
అర్ధ శతాబ్దపు స్నేహగీతం
ప్రకాశం, చీమకుర్తి: ‘‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’’ అని కలిసిమెలిసి తిరిగిన ఇద్దరు ప్రాణ స్నేహితులు 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకున్న క్షణం ఉద్వేగంతో వారి కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆ ఇద్దరు మిత్రుల్లో ఒకరు మిలిటరీ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ కాగా మరొకరు టైలర్ వృత్తిలో కొనసాగి విరామం తీసుకున్నారు. వీరిద్దరూ సోమవారం చీమకుర్తిలో కలుసుకుని అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ ధనుంజయ్, చీమకుర్తికి చెందిన తాటికొండ వెంకటేశ్వర్లు ప్రాణస్నేహితులు. వెంకటేశ్వర్లు టైలరింగ్ పని నేర్చుకోవడానికి 1970లో నాసిక్ వెళ్లారు. ధనుంజయ్ తండ్రి వద్ద టైలరింగ్ వర్క్ నేర్చుకున్నారు. ఆలింగనం చేసుకుంటున్న స్నేహితులు ఆ సమయంలో ధనుంజయ్‌కు ప్రాణమిత్రుడిగా ఉండేవారు. కాలక్రమంలో ధనుంజయ్ మిలిటరీలో స్థిరపడగా, వెంకటేశ్వర్లు చీమకుర్తిలో బాంబే టైలర్‌గా గుర్తింపు పొంది టైలరింగ్‌లో స్థిరపడ్డారు. తర్వాత ఆయన టైలరింగ్ నుంచి విరమించుకుని రాజకీయ నాయకుల అనుచరుడిగా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ధనుంజయ్ కుమారుడు సూరజ్ ధనుంజయ్ గనోర్ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రకాశం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. కుమారుడిని చూసేందుకు ఒంగోలు వచ్చిన ధనుంజయ్ 50 ఏళ్ల క్రితం నాటి స్నేహం గురించి కుమారుడికి చెప్పారు. దీంతో ట్రైనీ ఐఏఎస్ సూరజ్ ధనుంజయ్ తన సిబ్బందితో కలిసి చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఆరా తీసి తాటికొండ వెంకటేశ్వర్లు వివరాలు సేకరించారు. సోమవారం ఇద్దరు మిత్రులు కలిశారు. వారి స్నేహానికి గుర్తుగా చీమకుర్తిలోని ఎస్కేఆర్ మానసిక వికాస కేంద్రంలో విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఇద్దరు స్నేహితులను కలపడంలో చీమకుర్తికి చెందిన గుండా శ్రీనివాసరావు, పరాంకుశం శ్రీనివాసమూర్తి సహకారం అందించి మధురానుభూతి పొందారు. ఇద్దరు మిత్రుల స్నేహబంధాన్ని పలువురు స్థానికులు అభినందించారు. -
ఎస్ఆర్ఆర్లో సందడే సందడి!
సాక్షి, విజయవాడ : నగరంలోని ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ (1975-1978) బి.కాం (ఇంగ్లీష్ మీడియం) బ్యాచ్ మేట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం (డిసెంబరు 21) ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సుమారు 40 మంది రోజంతా కాలేజీ నాటి సంగతులతో సరదా సరదాగా గడిపారు. కాలేజీ నేర్పిన జీవిత సత్యాలు తమ ఎదుగుదలకు ఎలా సోపానంగా మారాయో అంతా అనుభవాలను పంచుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో "నాటి స్నేహితుల నేటి కలయిక" విజయవంతంగా జరిగింది. కళాశాల ఆవరణ అంతా కలియతిరిగి.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వాట్సాప్ సంధాన సందేశాల సాయంతో ఒక్కో బ్యాచ్ మేట్ వివరాలను ఒకచోట చేర్చిన మిత్ర బృందం కెజిఎన్ గుప్తా, యనమండ్ర రమేష్, వైవి కృష్ణయ్య అభినందనలు అందుకున్నారు. గెట్ టుగెదర్ నిర్వహించుకోవడానికి కళాశాల ఏసి కాన్ఫరెన్స్ హాలు ఇచ్చి, పూర్తి సహాయ సహకారాలు అందించి, కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపాల్ జోషి కి పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేసేరు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ పరిమి శ్రీధర్ మోడరేటర్ గా వ్యవహరించారు. -
అది నా అదృష్టం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తనకు మంచి అనుభవంగల ఉన్నతాధికారుల బృందం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. విజయవాడలోని బెరంపార్కులో ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన గెట్ టు గెదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన ఐఏఎస్‌ల మార్గదర్శకత్వం, సహకారంతో ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దగలననే నమ్మకం తనకు కలిగిందన్నారు. కలెక్టర్ల సదస్సులో తన మదిలో ఉన్న ఆలోచనలు అందరితో పంచుకున్నానన్న సీఎం వైఎస్ జగన్.. ఐఏఎస్ అధికారుల ప్రేమను, అభిమానాన్ని చూరగొనడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. సంఘం అధ్యక్షుడు మన్మోహన్సింగ్ ముఖ్యమంత్రికి మెమెంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ ఉదయలక్ష్మి ఈ కార్యక్రమంలో మాట్లాడారు. (చదవండి: పాలకులం కాదు.. సేవకులం) -
నాలుగు దశాబ్దాల నాటి ముచ్చట్లు!
సాక్షి, కృష్ణా: విజయవాడలోని ఎస్ఆర్ఆర్ సీవీఆర్ గవర్నమెంట్ కాలేజీలో బీ.కాం (1975-1978) చదువుకున్న క్లాస్ మేట్స్ నాలుగు దశాబ్దాల తర్వాత ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అంతా ఒక్కసారిగా యంగ్ తరంగ్గా మారిపోయారు. వారంత కలిసిన తరువాత టీనేజ్ ముచ్చట్లు, కాలేజీ రోజులు నెమరు వేసుకున్నారు. అంతా 60 పైబడిన వాళ్లే వయసులో మాత్రమే.. జ్ఞాపకాలకు వయసుతో ఏం సంబంధం? నాటి కబుర్లు నెమరువేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కలుసుకున్న క్లాస్ మేట్స్ అందరి కళ్లలో ఆ నాటి యంగ్ మెరుపులు మళ్లీ మెరిశాయి. ఉత్సాహం ఉరకలు వేసింది. అందరిలో ఎంతో తృప్తి, ఇన్నాళ్లకు కలుసుకున్నామన్న ఆనందం ప్రతి ఒక్కరిలో పెల్లుబికింది. కాలేజీనాటి కబుర్లే కాదు, డిగ్రీ తరువాత ఎవరి ప్రయాణం ఎలా జరిగింది, ఉన్నత చదువులు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, సంసారం, కాలచక్ర భ్రమణం ఎవరెవరిని ఏ తీరానికి తీసుకువెళ్లిందీ చెబుతున్నపుడు ఒక్కోరు ఒక్కో కథకులే. -
ఇంకేం ఇంకేం కావాలే...
క్లాప్‌బోర్డులు, ఆర్క్ లైట్లు, స్టార్ట్ కెమెరా, షాట్ ఓకే... వీటితో బిజీగా ఉండే స్టార్స్ ఫర్ ఎ చేంజ్ అప్పుడప్పుడూ వీటికి దూరంగా ఉండాలని అనుకుంటారు. 1980లలో వెండితెరను ఏలిన స్టార్స్‌లో కొందరు ఇలానే అనుకుని, ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో చోట. కొన్నిసార్లు ప్రైవేట్ ప్లేసెస్ ఇందుకు వేదిక అయితే కొన్నిసార్లు ఒక్కో సెలబ్రిటీ మిగతా అందరికోసం తమ ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి ‘1980స్ రీ–యూనియన్’ జరిగింది. ఇప్పుడు చెన్నైలో కలుసుకున్నారు. జనరల్‌గా రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్స్ కూడా కనిపిస్తుంటారు. ఈసారి వీళ్లు మిస్సింగ్. వైట్ అండ్ బ్లూ కలర్‌ని డ్రెస్‌కోడ్‌గా ఫిక్స్ చేసుకున్నట్లున్నారు. అందరూ తెలుపు, నీలం రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. మోహన్‌లాల్, సీనియర్ నరేశ్, జాకీ ష్రాఫ్, అర్జున్, సుమన్, శరత్‌కుమార్, భాగ్యరాజ్, సత్యరాజ్, సుహాసిని, ఖుష్బూ, శోభన, నదియా, రాధ తదితరులు పాల్గొన్నారు. లేడీ యాక్టర్స్ అందరూ ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాటకు డ్యాన్స్ చేశారట. మోహన్‌లాల్ కేరళలోని సంప్రదాయపు బోట్ నడుపుతున్నట్టు యాక్ట్ చేశారట. ఇలాంటి సరదా ఆటలతో సందడి చేశారని సమాచారం. -
33 ఏళ్ల తర్వాత
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో 1982-1983 సంవత్సరంలో ఎంకాం చదివిన విద్యార్థులు 33ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుని సందడిగా గడిపారు. కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలోని సెమినార్ హాల్లో శనివారం రాత్రి పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. అప్పటి గురువులు రిటైర్డ్ ప్రొఫెసర్లు ఎ.శంకరయ్య, జీవీ.భవానీప్రసాద్, జి.కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు హాజరై మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి పూర్వవిద్యారులు సహకారం అందించాలని కోరారు. రిటైర్డ్ ప్రొఫెసర్ శంకరయ్య మాట్లాడుతూ తాను ఇక్కడ ఆచార్యుడిగా పనిచేసినపుడు ప్రతి విద్యార్థి సహనం, పట్టుదలతో చదువుకున్నారని తెలిపారు. కామర్స్ విభాగం ప్రొఫెసర్ సీహెచ్ రాజేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.సత్యవతి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’సమ్మేళనం
- నవోదయ పూర్వ విద్యార్థుల కలయిక - గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వైనం లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం ఉదయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా డిసెంబరు 4న అన్ని నవోదయ విద్యాలయాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. అందులో భాగంగా లేపాక్షి నవోదయ విద్యాలయంలో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దేశ, విదేశాల్లో వివిధ ఉద్యోగాల్లో పని చేస్తున్న పూర్వ విద్యార్థులు హాజరై వారి నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. సుమారు 28 ఏళ్ల నాటి స్నేహితులు కలిసి వారు విద్యార్థి దశలో చేసిన చేష్టలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ లేపాక్షి జవహర నవోదయ విద్యాలయం అభివృద్ధికి తమ వంతు సాయం అందజేస్తామన్నారు. అనంతరం ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మాట్లాడుతూ లేపాక్షి విద్యాలయంలో చదవుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎలా బతకవచ్చో నేర్చుకున్నాం – వనజ, శాస్త్రవేత్త, లండన్ ఈ విద్యాలయంలో చదువుతో పాటు ఎలా బతకాలో నేర్చుకున్నాను. ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా బతకవచ్చనే విషయాన్ని గ్రహించాను. 1989 నుంచి 1996 వరకు ఈ విద్యాలయంలో చదివాను. ప్రస్తుతం లండన్‌లో రీసెర్చిగా పని చేస్తున్నా. క్రమశిక్షణకు నిలయం – బాలాజీ, ఎస్డీఈ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఈ విద్యాలయం క్రమశిక్షణకు నిలయం. ఏ సమయానికి ఏం చేయాలనే విషయాలు నేర్చుకున్నాం. విద్యాలయంలో 1990 నుంచి 97 వరకు చదువుకున్నాను. అయితే చిన్న వయస్సులోనే క్రమశిక్షణ నేర్చుకోవడంతో ఉన్నత స్థానంలో స్థిరపడ్డాను. ఉన్నత విలువలు నేర్చుకున్నా – కేకే రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, హైదరాబాద్ నవోదయ విద్యాలయంలో చదువుకుని ఉన్నత విలువలు నేర్చుకున్నాను. ఫలితంగా క్రీడల్లో బాగా రాణించాను. 1991 నుంచి 98 వరకు ఈ విద్యాలయంలో చదివాను. -
ఫౌండేషన్ కోర్సుతో ఉత్తమ ఫలితాలు
విజయవాడ (భవానీపురం): మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కెరీర్ ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టిందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. కెరీర్ ఫౌండేషన్ కోర్సు అమలు విధానంపై మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 1997 వరకు రాష్ట్రం నుంచి ఐఐటికి ఏటా 100 మంది మాత్రమే ఎంపికయ్యేవారని, ప్రస్తుతం 100 ర్యాంకులలో 50 ర్యాంకులు మన రాష్ట్రం విద్యార్థులు సాధిస్తున్నారని తెలిపారు. 2018 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఎక్కువ ర్యాంకులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం రానున్న రోజుల్లో మున్సిపల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ అభిప్రాయాలను తెలిపేందుకు వేదికపైకి వచ్చిన ప్రతి విద్యార్థితో మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్, పురపాలక పాలన సంచాలకుడు కన్నబాబు, మేయర్ కోనేరు శ్రీధర్, మెప్మా ఎండీ చినతాతయ్య, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కృష్ణ కపర్ధి, తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరులో మెగా పండగ!
ఇంట్లో ఐదారుగురు ఉంటేనే వాతావరణం సందడిగా ఉంటుంది. పదీ, ఇరవై మంది ఉంటే ఆ సందడి డబుల్... త్రిబుల్. ఓ యాభై మంది ఉన్నారనుకోండి.. అప్పుడు అక్కడ ఒక వేడుక జరుగుతున్నట్లే ఉంటుంది. పండగ వాతావరణం కనిపిస్తుంది. అందుకే, సంక్రాంతి పండగకు చిరంజీవి కుటుంబం భారీ గెట్ టు గెదర్‌ని ప్లాన్ చేసి ఉంటుంది. చిరంజీవికి బెంగళూరులో ఫామ్‌హౌస్ ఉంది. సంక్రాంతిని తన కుటుంబ సభ్యులందరితో కలిసి చిరంజీవి అక్కడే చేసుకోబోతున్నారట. మొత్తం 50 మంది కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లనున్నారు. ఎవరెవరు వెళతారన్నది స్పష్టంగా బయటకు రాలేదు కానీ... తెలిసిన సమాచారం ప్రకారం చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్ మాత్రం కంపల్సరీగా పండగ సంబరంలో ఉంటారట. ఇక, ఆ ఇంటి ఆడపడుచులు ఎలానూ ఉంటారనుకోండి. మొత్తానికి మెగా ఫ్యామిలీ సందడి సందడిగా సంక్రాంతి పండగ చేసుకోబోతున్నారన్న మాట. -
ఓ పార్కు కావాలి!
పెట్‌డాగ్స్ కూ ఓ పార్కు ఉంటే ఎంత బాగుంటుంది! బెంగళూరులో ఇలాంటి సౌకర్యం ఉందట. పెంపుడు కుక్కలన్నింటినీ తెచ్చి వాటి యజమానులు అక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారట. ఎంచక్కా నెలకోసారి అవి ఇదిగో ఇలా ఆడేసి పాడేసి ఎంజాయ్ చేసేసి వెళ్లిపోతాయి. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య ‘భౌభౌ’ మంటూ బోరుమనకుండా.. ఇలాంటివి వాటిని రీఫ్రెష్ చేస్తాయనేది పెట్ లవర్స్ మాట. ఆదివారం నెక్లెస్ రోడ్డులో తమ పెంపుడు శునకాలతో సహా వచ్చిన వాటి యజమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కొడుకు కోసం ఒక్కటైన హృతిక్, సుజానే
బాలీవుడ్ జంట హృతిక్ రోషన్, సుజానే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లకు ఇంకా విడాకులు మంజూరుకాలేదు గానీ విడివిడిగానే ఉంటున్నారు. కానీ.. తమ పిల్లాడి కోసం మాత్రం వాళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. తమ చిన్న కొడుకు హృదాన్ పుట్టినరోజు కోసం హృతిక్ రోషన్ షూటింగులకు సెలవుపెట్టి, లోనావాలా వెళ్లాడు. ఆ పుట్టినరోజు పార్టీలో సుజానే కూడా ఉంది. లోనావాలలో పార్టీ చేసుకున్న తర్వాత అందరూ కలిసి ముంబై వచ్చారు. ఆ రోజు రాత్రి జుహూ లోని ఓ మల్టీప్లెక్సులో ఓ సినిమాకు హృతిక్, సుజానే, పిల్లలు అంతా కలిసి వెళ్లారు. వాళ్లతో పాటు కొంతమంది స్నేహితులు, వాళ్ల పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలంటే దంపతులిద్దరికీ చాలా అభిమానమని, అందుకే వాళ్ల సంతోషం కోసం ఇలా కలిసి వచ్చారని అంటున్నారు.