బెంగళూరులో మెగా పండగ! | Chiranjeevi Plans to Get to Gether in Bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరులో మెగా పండగ!

Published Mon, Jan 11 2016 11:19 PM | Last Updated on Wed, Jul 25 2018 3:13 PM

బెంగళూరులో మెగా పండగ! - Sakshi

బెంగళూరులో మెగా పండగ!

ఇంట్లో ఐదారుగురు ఉంటేనే వాతావరణం సందడిగా ఉంటుంది. పదీ, ఇరవై మంది ఉంటే ఆ సందడి డబుల్... త్రిబుల్. ఓ యాభై మంది ఉన్నారనుకోండి.. అప్పుడు అక్కడ ఒక వేడుక జరుగుతున్నట్లే ఉంటుంది. పండగ వాతావరణం కనిపిస్తుంది. అందుకే, సంక్రాంతి పండగకు చిరంజీవి కుటుంబం భారీ గెట్ టు గెదర్‌ని ప్లాన్ చేసి ఉంటుంది. చిరంజీవికి బెంగళూరులో ఫామ్‌హౌస్ ఉంది. సంక్రాంతిని తన కుటుంబ సభ్యులందరితో కలిసి చిరంజీవి అక్కడే చేసుకోబోతున్నారట. మొత్తం 50 మంది కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లనున్నారు. ఎవరెవరు వెళతారన్నది స్పష్టంగా బయటకు రాలేదు కానీ...

తెలిసిన సమాచారం ప్రకారం చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్ మాత్రం కంపల్సరీగా పండగ సంబరంలో ఉంటారట. ఇక, ఆ ఇంటి ఆడపడుచులు ఎలానూ ఉంటారనుకోండి. మొత్తానికి మెగా ఫ్యామిలీ సందడి సందడిగా సంక్రాంతి పండగ చేసుకోబోతున్నారన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement