అభిమాని కుటుంబాన్ని సత్కరించిన చిరంజీవి | Actor Chiranjeevi Felicitates Fan Eswarayya Family | Sakshi
Sakshi News home page

Chiranjeevi: కొండపైకి పొర్లు దండాలు.. అభిమానికి ఊహించని గిఫ్ట్

Published Mon, Aug 26 2024 6:29 PM | Last Updated on Mon, Aug 26 2024 6:56 PM

Actor Chiranjeevi Felicitates Fan Eswarayya Family

ఆగ‌స్ట్ 22న చిరంజీవి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య అనే అభిమాని.. తిరుమ‌ల కొండ పైవ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే చిరంజీవి.. ఈశ్వ‌రయ్యతో పాటు ఆయ‌న కుటుంబాన్ని హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. పట్టుబ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించారు. ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ హామీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన టీనేజీ ప్రేమకథ సినిమా)

అలానే సోమవారం.. చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ ధరించారు. ప్ర‌తి ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే చిరు.. ఈ ఏడాది కూడా అదే ఫాలో అయిపోయారు. మాల‌ధార‌ణ‌లోనే ఈశ్వ‌ర‌య్య కుటుంబంతో క‌లిసి మాట్లాడారు. గతంలో ఇదే ఈశ్వ‌ర‌య్య.. తిరుప‌తి నుంచి హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్‌ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement