అభిమాని సంతాప సభకు మెగా హీరోలు
వోల్వో బస్సు ప్రమాదంలో మరణించిన కర్నాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్ యాదవ్ సంతాప సభ బెంగళూరులోని రవీంద్ర భారతిలో డిసెంబర్ 6 తేదిన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు నిర్వహించనున్నారు. తన చెల్లెలు పెళ్లి సందర్భంగా శుభలేఖలు ఇవ్వడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఎస్ వెంకటేశ్ వోల్వో బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన సంగతి తెలిసిందే.
అకాల మరణం చెందిన వెంకటేశ్ కుటుంబానికి ఇటీవల మెగా హీరోలు ఆర్ధిక సహాయం అందించారు. వెంకటేశ్ సంతాప సభకు మెగా హీరోలు హాజరవుతున్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.