33 ఏళ్ల తర్వాత | get together after 33 years | Sakshi
Sakshi News home page

33 ఏళ్ల తర్వాత

Published Mon, Mar 13 2017 4:38 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

get together after 33 years

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో 1982-1983 సంవత్సరంలో ఎంకాం చదివిన విద్యార్థులు 33ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుని సందడిగా గడిపారు. కేయూ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలోని సెమినార్‌ హాల్‌లో శనివారం రాత్రి పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. అప్పటి గురువులు రిటైర్డ్‌ ప్రొఫెసర్లు ఎ.శంకరయ్య, జీవీ.భవానీప్రసాద్, జి.కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎంవీ.రంగారావు హాజరై మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి పూర్వవిద్యారులు సహకారం అందించాలని కోరారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ శంకరయ్య మాట్లాడుతూ తాను ఇక్కడ ఆచార్యుడిగా పనిచేసినపుడు ప్రతి విద్యార్థి సహనం, పట్టుదలతో చదువుకున్నారని తెలిపారు. కామర్స్‌ విభాగం ప్రొఫెసర్‌ సీహెచ్‌ రాజేశం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.సత్యవతి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement