ku campus
-
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్చేసి టాస్క్పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
వరంగల్కు చెందిన కిరణ్మయికి డాక్టరేట్
సాక్షి, వరంగల్: చెన్నైలోని ప్రతిష్టాత్మక బీఎస్ అబ్దుల్ రహమాన్ క్రీసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో చేసిన పరిశోధనకు గాను వరంగల్ నగరానికి చెందిన ఠంయ్యాల కిరణ్మయికి డాక్టరేట్ లభించింది. ఎకోఫ్రెండ్లీ ఫర్ది సింథసిస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ బెస్ట్ హిటిరోసైకిల్స్ అనే అంశంపై డాక్టర్ కార్తికేయన్ పర్యవేక్షణలో ఆమె పీహెచ్డీ పూర్తి చేశారు. కిరణ్మయి గతంలో వరంగల్ ఎల్బీ, సీకేఎం, హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యను అభ్యసించారు. -
కేయూ క్యాంపస్.. కామన్మెస్లో ఏం జరుగుతోంది?
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్): కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో క్యాజువల్ ఉద్యోగి (సూపర్వైజర్) నిరంజన్రెడ్డిపై హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ మంజుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 16న కామన్మెస్కు వచ్చిన మంజుల ‘నిన్ను లా కళాశాల హాస్టల్కు ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ్నుంచి వెళ్లు గెటవుట్’ అంటూ నిరంజన్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఏం తప్పుచేశానో చెప్పాలి, నిరూపించాలి’ అని సూపర్వైజర్ నిరంజన్రెడ్డి హాస్టళ్ల డైరెక్టర్తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో క్యాజువల్ ఉద్యోగి కామన్మెస్ సూపర్వైజర్గా నిరంజన్రెడ్డి కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కామన్మెస్కు సంబంధించిన పలు విషయాలను హాస్టళ్ల సూపరింటెండెంట్, హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేయూలోని ఓ నాన్బోర్డర్కు నిరంజన్రెడ్డికి మధ్య గతంలో కొన్ని విబేధాలున్నాయి. నాన్బోర్డర్లను కామన్ మెస్లోకి రాకుండా నిరంజన్రెడ్డి అడ్డుకుంటున్నట్లు, దీంతో ఓ నాన్బోర్డర్ కామన్మెస్ విధుల నుంచి నిరంజన్రెడ్డిని తొలగించాలని డైరెక్టర్తో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆ నాన్బోర్డర్ ఆగకుండా.. నీతో కామన్మెస్ విధుల నుంచి తొలగించి చిప్పలు కడిగిస్తానని అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే డైరెక్టర్ మంజుల కామన్ మెస్కు వచ్చి నిరంజన్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, లా కళాశాల హాస్టల్కు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడం, ఆ తర్వాత నిరంజన్రెడ్డి విధులకు హాజరవకపోవడం ప్రస్తుతం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
ఐసెట్లో 90.09% ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ బి.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.. నేను ఐఏఎస్ కావాలనే లక్ష్యంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. టీఎస్ఐసెట్ను సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ ఈసీఈ పూర్తిచేశాను. – ఆర్.లోకేష్, మొదటి ర్యాంకర్. బ్యాంకు మేనేజర్ కావాలనేది లక్ష్యం.. నేను బీటెక్ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్ఐసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా. – పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేరుతా.. నేను గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతాను. – నవీనాక్షంత, మూడో ర్యాంకర్. -
కేయూలో వివాదం.. నాన్బోర్డర్స్ వీరంగం
సాక్షి, వరంగల్ : చారిత్రక కాకతీయ యూనివర్సిటీలో మరో వివాదం చోటుచేసుకుంది. సౌత్ జోన్, ఆల్ ఇండియా, ఇంటర్ యూనివర్సిటీ పోటీల సందర్భంగా రాజుకున్న గొడవ.. కొట్లాట వరకు వెళ్లింది. స్థానిక విద్యార్థులు, అధికారుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. గద్వాల్ జిల్లాకు చెందిన గల్లా వెంకటేష్ ఆయన సోదరి కాకతీయ యూనివర్సిటీలో విద్యానభ్యసిస్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్న వెంకటేష్ సోదరి పట్ల కొందరు సహా విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్కి పిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే గురువారం రోజున స్పోర్ట్స్ విభాగంలో మహిళా విద్యార్థులకు ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు. ఈ సమయంలో తన సోదరిపై వేధింపులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ సురేష్ లాల్ను వెంకటేష్ గట్టిగా నిలదేశాడు. దీంతో అప్పటికే డైరెక్టర్ ఛాంబర్ లో ఉన్న కొందరు నాన్ బోర్డర్స్ వెంకటేష్పై మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై బాధితుడు కేయూ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. మరోవైపు డైరెక్టర్ సురేష్ లాల్పై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఆందోళనలుకు సిద్ధమవుతుండడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యాజమాన్యం సైతం తగిన చర్యలను సిద్ధమవుతోంది. -
కేయూ బోటనీ విభాగానికి త్వరలో 50 వసంతాలు పూర్తి
కేయూ క్యాంపస్‌ : కేయూ బోటనీ విభాగం స్వర్ణోత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 9వతేదీతో ఆ విభాగం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆ విభాగం ఆచార్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. ఎమ్మెస్సీ బాటనీ రెండు సంవత్సరాల కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ పరి«ధిలో హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌కళాశాల పీజీసెంటర్‌లో 1968లో ఏర్పాటుచేశారు. ఆ విభాగం ఇన్‌చార్జిగా అప్పట్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యావతి వ్యవహరించారు. అప్పట్లో 12 మంది విద్యార్థులతో ఆరంభమైన ఈ విభాగంను 1970లో న్యూ క్యాంపస్‌కు తరలించారు. కాకతీయ యూనివర్సిటీ 1976 అగస్టు 19న ఆవిర్భవించిన విషయం విధితమే. కేయూ ఆవిర్భావం తర్వాత క్యాంపస్‌లోనూ అదే బాటనీ విభాగం కొనసాగుతోంది. 1986లో ఈ విభాగాన్ని కొత్త భవనంలోకి మార్చారు. అన్నిరకాల మౌళిక సదుపాయాలు... సరిపడా క్లాస్‌రూమ్‌లు , ల్యాబరేటరీ వసతి, పచ్చదనంతో బోటనీ బ్లాక్‌ కళకళాడుతోంది. ఈ విభాగంలో మొదటి బ్యాచ్‌ విద్యార్థులు డాక్టర్‌ కె.సుభాష్, డాక్టర్‌ ఎన్‌.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ సిసువర్తా లాంటి వారు ఇక్కడే అదే విభాగంలో ఆచార్యులుగా విద్యా, పరిశోధనాపరమైన సేవలను అందించారు. ఇదేవిభాగంలో పనిచేసిన ఆచార్య విద్యావతి, డాక్టర్‌ జాఫర్‌ నిజాం కాకతీయ యూనివర్సిటీ వీసీలు గా కూడా పనిచేసి యూనివర్సిటీ అభివృద్ధితోపాటు బాటనీ విభాగం అభివృద్ధికి ఎంతో కృషిచేశారనడంలో అతిశయోక్తిలేదు. 40 బ్యాచ్‌లు, 1500 మంది విద్యార్థులు ఎమ్మెస్సీ బోటనీ విభాగంలో 50 సంవత్సరాల్లో ఇప్పటివరకు 40 బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 1500ల మంది విద్యార్థులు ఈ విభాగంలో పట్టాలు పొందారు. 268మంది వివిధ అంశాలపై పరిశోధనలు చేసి డాక్టరేట్‌లు పొందారు. 20మంది ఎంఫిల్‌ డిగ్రీ పొందారు. మిగతా విభాగాల కంటే బోటనీలోనే ఎక్కువమంది డాక్టరేట్‌లు పొందడం విశేషం. ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు.. ఈ విభాగంలో చదువుకున్న పూర్వవిద్యార్థులలో ఎక్కువ శాతం మంది ఇంటర్, డిగ్రీ , పీజీ కళాశాలల్లో లెక్చరర్లుగా నూ.. మరి కొందరు ఇతర దేశాల్లోనూ స్ధిరపడ్డారు. ఇంకొంతమంది ప్రభుత్వ రంగ సర్వీస్‌లలో.. (ఐఏఎస్, ఐఎఫ్‌ ఎస్, బోటనీ సర్వే ఆఫ్‌ ఇండియా) ఉద్యోగాలు చేస్తున్నారు. పరిశోధనలపరంగా ముందంజ.. బోటనీ విభాగం పరిశోధనపరంగా ముందంజలో ఉంది. రీసెర్చ్‌ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1500 రీసెర్చ్‌ పబ్లికేషన్స్‌ను వివిధ జర్నల్స్‌లోనూ ప్రచురించారు. సీనియర్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ బీరహుదూర్, ప్రొఫెసర్‌ ఎస్‌ఎం రెడ్డి పలు టెక్స్స్టబుక్స్‌ కూడా రాశారు. మరికొందరు అధ్యాపకుల రచనలను ప్లస్‌ 2, డిగ్రీ స్టూడెంట్స్‌ ఇన్‌ వెర్నాక్యులర్‌ లాంగ్వెజెస్‌లో తెలుగు అకాడమీ ప్రచురించింది. యూజీసీ, ఏఐసీటీఈ, డీబీటీ, ఐసీఎంఆర్, డీఓఎఫ్‌ఈ తదితర సంస్థల సహకారంతో ఈ విభాగంలో పలు మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు కూడా పూర్తయ్యాయి. యూజీసీ సహకారంతో సాప్‌ (స్పెషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాం)కింద డీఆర్‌ఎస్‌–1,2,3 దశల్లోనూ కేవలం బోటనీ విభాగంలోనే పరిశోధనలు కొనసాగటం గమనార్హం. ఈ విభాగంలో సాప్‌ కింద పరిశోధనల కోసం మొత్తంగా రూ.2.43కోట్లు మంజూరుకాగా.. డీఎస్‌టీ కింద రూ.1.05 కోట్లు నిధులు ఫిస్ట్‌ ప్రోగ్రాంకు మంజూరయ్యాయి. అంతే కాకుండా బోటనీ విభాగం పలు జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్స్‌లకు కూడా వేదికైంది. సంవత్సరమంతా స్వర్ణోత్సవాలు యూనివర్సిటీలోని బోటనీ విభాగం ఆ«ధ్వర్యంలో గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు సంవత్సరం పొడవునా నిర్వహించనున్నారు. అందుకోసం తొలుత ఈ నెల 9న ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఢిల్లీ), డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ డాక్టర్‌ టి మహాపాత్ర , తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి పాపిరెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ ఏఆర్‌ రెడ్డి, తెలంగాణ ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ప్రవీణ్‌కుమార్, కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న, బోటనీ విభాగం పూర్వ విద్యార్థి మహబూబాబాద్‌ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్‌ సైతం పాల్గొంటారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 10న బోటనీ విభాగం పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.అంతేగాకుండా పూర్వవిద్యార్థులలో అత్యున్నతస్థాయి వ్యక్తులను, గురువులను సన్మానించనున్నారు. విభాగం సెమినార్‌ హాల్‌లో రెండు సెషన్లలో పూర్వ విద్యార్థులు, వివిధసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు ఎంవీ రాజమ్, ప్రొఫెసర్‌ లీలా సెహజిరాన్, ప్రొఫెసర్‌ శ్రీనాథ్, డాక్టర్‌జీవీఎస్‌ మూర్తి, డాక్టర్‌ పి గిరి«ధర్‌ , డాక్టర్‌ కేఆర్‌కే రెడ్డి పాల్గొని పలు అంశాలపై ప్రసంగిస్తారు. ఎంపీ సీతారాంనాయక్‌ కూడా పూర్వ విద్యార్థే.. బోటనీ విభాగం పూర్వ విద్యార్థి, అంతేగాకుండా ఇక్కడే ఈ విభాగంలోనే అచార్యులుగా పనిచేసిన ఆజ్మీరా సీతారాంనాయక్‌ మహబూబాబాద్‌ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. ఇదే విభాగంలో అచార్యులుగా పనిచేసిన జాఫర్‌ నిజాం రెండు సార్లు కేయూకు వీసీగా పనిచేశారు. అలాగే ఆచార్యులుగా పనిచేసిన విద్యావతి కూడా కేయూకు వీసీగా పనిచేశారు. మరికొందరు అధ్యాపకులుగా పనిచేస్తూనే రిజిస్ట్రార్, డీన్స్, పరీక్షల నియంత్రణా«ధికారులుగా తదితర బాధ్యతలను నిర్వహించారు. బోటనీ విభాగాన్ని విస్తరించి బీఎస్సీ ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బీఎస్సీ బఝెటెక్నాలజీ, అలాగే సుబేదా రిలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌కళాశాలలో ఎమ్మెస్సీ బాటనీ విభా గం ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. ఎస్‌డీఎల్‌సీఈ పరి« దిలో ఎన్విరాన్‌మెంట్‌ సైన్సెస్‌ను కూడా కొనసాగిస్తున్నారు. అతిథులతో పైలాన్‌ ఆవిష్కరణ గోల్డెన్‌ జుబ్లి ఉత్సవాల సందర్భంగా రూ. 1.25లక్షలతో పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని అతిథులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా 200 పేజీలతో పూర్వవిద్యార్థులు, పీహెచ్‌డీ, ఎంఫిల్, రీసెర్చ్‌ప్రాజెక్టులు తదితర వివరాలతో కూడిన వాల్యూమ్‌ను కూడా ఆవిష్కరించనున్నారు.పూర్తికావొస్తున్న ఏర్పాట్లుకాకతీయ యూనివర్సిటీలో బోటనీ విభాగం గోల్డెన్‌జూబ్లీ వేడుకలు ఈనెల 9న ప్రారంభమవుతాయి ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈ ఉత్సవాలను పూర్వ విద్యార్థులు అధ్యాపకులు, పరిశోధకులు విజయవంతం చేయాలి. విభాగంలో పైలాన్‌ను ఆవిష్కరించనున్నాం. తొలిరోజు 9న ఉదయం క్యాంపస్‌లో ప్రొసిషన్‌ కూడా ఉంటుంది. ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. పూర్వవిద్యార్థుల సమావేశం కూడా ఉంటుంది.. సంవత్సరం పొడుగునా ఉత్సవాలు ఉంటాయి. ఈనెల 10న పలు కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల పర్యవేక్షకులుగా రిటైర్డ్‌ ఆచార్యులు, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులు ప్రొఫెసర్‌ ఎస్‌ రాంరెడ్డి, ఆజ్మీరా రాగన్, డాక్టర్‌ వి కృష్ణారెడ్డి, డాక్టర్‌ టి క్రిష్టోఫర్, డాక్టర్‌ ఎండీ ముస్తాఫా, డాక్టర్‌ ప్రొలారామ్, ప్రొఫెసర్‌ ఏ సదానందం తదితరులు వ్యవహరిస్తున్నారు. – డాక్టర్‌ ఎం సురేఖ, కేయూ బోటనీ విభాగం అధిపతి -
కామన్ మెస్ తెరుచుకునేదెప్పుడో
కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయంలో వేసవి సెలవుల అనంతరం పీజీ కోర్సులు మూడో సెమిస్టర్ తరగతులు ప్రారంభమై 20 రోజులైనా నేటికి కామన్ మెస్ తెరుచుకోలేదు. జూన్ 26 నుంచి తరగతులు ప్రారంభమైనా విద్యార్థులు ఇప్పటికీ మెస్కార్డులు రెన్యూవల్ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. గత విద్యా సంవత్సరం మెస్ బకాయిలు చెల్లించిన తర్వాతే మెస్ కార్డులు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి స్కాలర్షిప్లు పోను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు బకాయిలు చెల్లించాల్సింటుంది. 60 బకాయిలు చెల్లించినా మెస్ కార్డు రెన్యూవల్ చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే రెన్యూవల్ చేసుకున్నారు. కనీసం వంద మంది విద్యార్థులైనా కార్డులు రెన్యూవల్ చేసుకుంటే తప్ప మెస్ ఓపెన్ చేయరు. గత నెల 26 నుంచే ఇంజినీరింగ్ విద్యార్థులకు మెస్ ప్రారంభమైంది. లేడీస్ హాస్టల్ సైతం ఓపెన్ చేశారు. కామన్ మెస్లో వేయి మందికిపైగా మెస్కార్డులు తీసుకునే వీలున్నా 40 మంది వరకే రెన్యూవల్ చేసుకున్నారు. మూడో సెమిస్టర్ తరగతులు ప్రారంభమైనా విద్యార్థులు హాజరు కావడం లేదు. విద్యార్థులకు 75 శాతం మేర హాజరు శాతం తప్పని సరి అనే నిబంధన ఉన్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో విద్యార్థులు తరగతులు కూడా హాజరు కావడంలేదు. తెరుచుకోని పోతన హాస్టల్ విద్యార్థులు మెస్కార్డులు రెన్యూవల్ చేసుకుంటే వారికి మొదటగా పోతన హాస్టల్ను కేటాయిస్తారు. విద్యార్థులు రాకపోవటంతో పోతన హాస్టల్ను సైతం ఇప్పటవరకు ఓపెన్ చేయలేదు. ఈ సారి హాస్టళ్లో నాన్బోర్డర్లు లేకుండా చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. మెస్కార్డులు రెన్యూవల్ చేసుకున్న వారికే రూమ్లు కేటాయించే యోచనలో ఉన్నారు. పోతన హాస్టల్ పూర్తయిన తర్వాతే జగ్జీవన్, అంబేద్కర్, ఓల్డ్ ఫార్మసీ, జీడి 2, జీడీ 3లలో హాస్టల్ వసతి కల్పిస్తారు. పీజీ కోర్సుల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అడ్మిషన్లు పూర్తి కాగానే హాస్టల్ వసతి మెస్ సౌకర్యం కల్పించాలనే యోచనలో హాస్టల్ అధికారులు ఉన్నారు. త్వరగా మెస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు -
కష్టపడి చదివితే...
కేయూ క్యాంపస్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే విజయం సాధ్యమవుతుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో టెక్నికల్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం సంయుక్తంగా కొన్ని రోజులుగా క్యాంపస్లోని ఫిజిక్స్ విభాగం సెమినార్ హాల్లో వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం ఈ శిక్షణ తరగతులకు పురుషోత్తం హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కేరీర్పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంగ్ల భాష విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా న్యూస్పేపర్లు చదువుకోవాలని సూచించారు. కేయు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ జీవితంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామని అవకాశాలు అందరికీ వస్తాయని కొందరు మాత్రమే ఉపయోగించుకుంటారన్నారు.ప్రణాళికతో చదివితే విజయం సా«ధించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ యాదవరెడ్డి, మేకల ప్రవీణ్, రాము, బాబు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
33 ఏళ్ల తర్వాత
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో 1982-1983 సంవత్సరంలో ఎంకాం చదివిన విద్యార్థులు 33ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుని సందడిగా గడిపారు. కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలోని సెమినార్ హాల్లో శనివారం రాత్రి పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. అప్పటి గురువులు రిటైర్డ్ ప్రొఫెసర్లు ఎ.శంకరయ్య, జీవీ.భవానీప్రసాద్, జి.కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు హాజరై మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి పూర్వవిద్యారులు సహకారం అందించాలని కోరారు. రిటైర్డ్ ప్రొఫెసర్ శంకరయ్య మాట్లాడుతూ తాను ఇక్కడ ఆచార్యుడిగా పనిచేసినపుడు ప్రతి విద్యార్థి సహనం, పట్టుదలతో చదువుకున్నారని తెలిపారు. కామర్స్ విభాగం ప్రొఫెసర్ సీహెచ్ రాజేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.సత్యవతి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
రేపు ఐసెట్ ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్ (వరంగల్) : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19న నిర్వహించిన ఐసెట్-2016 ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ వెల్లడించారు. హైదరాబాద్లోని కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 72,474 మంది అభ్యర్థులకు 66,701 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష అనంతరం అదే రోజు ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించామని తెలిపారు. మంగళవారం ఫలితాలతో పాటు ఫైనల్ కీ విడుదల చేస్తామన్నారు. అనంతరం అభ్యర్థులు www.tsicet-2016.org వెబ్సైట్ ద్వారా మార్కుల వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. -
హైటెక్ కాపీయింగ్ను నిరోధించాలి
కేయూ క్యాంపస్, న్యూస్లైన్ : ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 22న జరగనున్న ఎంసెట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, హైటెక్ కాపీయింగ్ జరగకుండా చూడాలని ఎంసెట్ రాష్ట్ర కోకన్వీనర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ కూరపాటి ఈశ్వర్ప్రసాద్ సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మ సీ సెమినార్ హాల్లో ఆదివారం జరిగిన చీఫ్ సూపరిం టెండెంట్లు, పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందే అభ్యర్థులను అనుమతించాలని, నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా రానివ్వొద్దని సూచించారు. ఇటీవల జరిగిన పలు పరీక్షల్లో హైటెక్ పద్ధతుల్లో కాపీ జరుగుతున్నట్లు తేలిందని. ఈ మేరకు ఎలాంటి అవకతవకలకు తావివ్వొద్దని ఆయన సూచించారు. విద్యార్థులను పరీక్ష మధ్యలో టాయిలెట్కు సైతం పంపించొద్దని, తప్పనిసరైతే సిబ్బందిని వెంట పంపించాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్ల నియామకంలో కూడా జాగ్రత్తలు పాటిం చాలని, పరీక్ష రాసే వారిలో బంధువులు ఉన్న పక్షంలో వారిని ఇన్విజిలేటర్లుగా నియమించొద్దని ఈశ్వర్ప్రసాద్ ఈ సందర్భంగా సూచించారు. వరంగల్ రీజియన్లో 33 కేంద్రాలు.. ఈనెల 22న జరగనున్న ఎంసెట్ కోసం వరంగల్ రీజి యన్లో 33 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఈశ్వర్ప్రసాద్ వివరించారు. ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష 14,400 మంది రాయనుండగా.. 23 కేంద్రాలు, మెడిసిన్ పరీ క్షకు 6,800 మంది రాయనుండగా పది కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక పరిశీల కులను నియమించగా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వారికి సహకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎస్లు, పరిశీలకుల సందేహాలను నివృత్తి చేశారు. జనగామలో.. జనగామ రూరల్ : జనగామ కేంద్రంగా ఎంసెట్ రెండోసారి నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంసెట్ రాష్ట్ర కోకన్వీనర్ ఈశ్వర్ప్రసాద్ సూచించారు. స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ శాఖల ఉద్యోగులకు ఎంసెట్పై సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఈశ్వర్ప్రసాద్ మాట్లాడుతూ జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏకశిల డిగ్రీ కళాశాల, ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఏ సందేహమున్నా కన్వీనర్ దృష్టికి తీసుకువెళ్లాలని.. ఎలాంటి పొరపాట్లు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం రీజి నల్ కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేయగా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.రవిచందర్, ఎస్సై ఎం.కరుణాకర్, ట్రాన్స్కో ఏఈ ఎల్ల య్య, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
తెలంగాణ వచ్చే వరకూ అప్రమత్తంగా ఉండాలి
కేయూ క్యాంపస్, నూస్లైన్ : తెలంగాణ వనరులను వదులుకునేందుకు సిద్ధంగా లేని సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ పార్టీల నేతలు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఈ నేపథ్యంలో సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. దివంగత ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్రావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ప్రాసెస్ - ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్’ అంశంపై కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో శుక్రవారం సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సు ముగింపు సభలో కోదండరాం ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం విభిన్నమైనది.. 1956వ సంవత్సరం తరువాత భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటు జరిగినా.. తెలంగాణ ఉద్యమం మాత్రం దోపిడీ, ఆధిపత్యానికి వ్యతి రేకంగా జరుగుతున్న.. అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటమని కోదండరాం అభివర్ణించారు. ఎ న్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడుతున్న తరుణంలో అడ్డుకునేందుకు యత్నిస్తున్న కొందరు.. అది సాధ్యం కాని పక్షంలో హైదరాబాద్లో ప్రత్యేక రక్షణ కావాలనే అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకు పాల్గొన్న వారిపై వేల సంఖ్యలో కేసులు ఉండగా, సీమాంధ్రులపై మాత్రం కేసులు లేవన్నారు. అలాంటప్పుడు వారికి ఇంకా ఏం రక్షణ కావాలని ఆయన ప్రశ్నిం చారు. ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగబద్దంగా రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని, ఆ స్ఫూర్తికి భి న్నంగా శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలంటూ సీమాంధ్రు లు చేస్తున్న డిమాండ్లో అర్థం లేదన్నారు. అధికారం అనేది సమష్టి ప్రయోజనాలను నెరవేర్చేదిగా ఉండాలే తప్ప ప్రత్యేకంగా రక్షణ కావాలని కోరడం సరికాదని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. అన్యాయం జరిగింది తెలంగాణ ప్రజలకే... ఇప్పటివరకు తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దోపిడీ చేసిన సీమాంధ్రులు.. ప్రస్తుతం సమన్యాయం లేకుండా విభజన జరుగుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. గతంలో అన్ని పార్టీల వారు తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కాగా, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడంలో భాగంగా సందర్భానుసారంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్ట్రిసిటీ జేఏసీ చైర్మన్ రఘు మా ట్లాడుతూ తెలంంగాణ ప్రాంతానికి న్యాయం గా రావాల్సిన విద్యుత్ వాటా 56 శాతం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి తాము నివేదించినట్లుగా వాటా రాని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నా రు. ఈ మేరకు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సదస్సులో తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ ప్రొఫెసర్ సీతారామారావు, టీవీ వీ అధ్యక్షుడు శ్రీధర్దేశ్ పాండే, నల్సార్ యూ నివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, టీవీవీ జనరల్ సెక్రటరీ పిట్టల రవీందర్, ప్రొఫెసర్ రేవతి, ప్రొఫెసర్ హరినాథబాబు, అరుణ్కుమార్, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కొ టే, ప్రొఫెసర్ హరినాథ్బాబు, సంతోష్కుమా ర్, తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, ప్రొఫెసర్ నరేంద్రబాబు, ప్రొఫెసర్ రాంనాథ్కిషన్, ప్రొఫెసర్ సీతారాంనాయక్, డాక్టర్ జి.వీరన్న పాల్గొన్నారు.