సాక్షి, వరంగల్ : చారిత్రక కాకతీయ యూనివర్సిటీలో మరో వివాదం చోటుచేసుకుంది. సౌత్ జోన్, ఆల్ ఇండియా, ఇంటర్ యూనివర్సిటీ పోటీల సందర్భంగా రాజుకున్న గొడవ.. కొట్లాట వరకు వెళ్లింది. స్థానిక విద్యార్థులు, అధికారుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. గద్వాల్ జిల్లాకు చెందిన గల్లా వెంకటేష్ ఆయన సోదరి కాకతీయ యూనివర్సిటీలో విద్యానభ్యసిస్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్న వెంకటేష్ సోదరి పట్ల కొందరు సహా విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్‌కి పిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే గురువారం రోజున స్పోర్ట్స్ విభాగంలో మహిళా విద్యార్థులకు ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు.
ఈ సమయంలో తన సోదరిపై వేధింపులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ సురేష్ లాల్‌ను వెంకటేష్ గట్టిగా నిలదేశాడు. దీంతో అప్పటికే డైరెక్టర్ ఛాంబర్ లో ఉన్న కొందరు నాన్ బోర్డర్స్ వెంకటేష్పై మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై బాధితుడు కేయూ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. మరోవైపు డైరెక్టర్ సురేష్ లాల్పై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఆందోళనలుకు సిద్ధమవుతుండడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యాజమాన్యం సైతం తగిన చర్యలను సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment