సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్‌గా స్పందించారు.
శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్‌గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్‌రావు.
Comments
Please login to add a commentAdd a comment