కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం.. 78 మంది సస్పెండ్‌ | Ragging At Kakatiya University, 78 Senior Students Suspended | Sakshi
Sakshi News home page

కాకతీయ యూనివర్సిటీలో అమ్మాయిల ర్యాగింగ్.. 78 మంది సస్పెండ్‌

Published Sat, Dec 23 2023 5:11 PM | Last Updated on Sat, Dec 23 2023 5:42 PM

Ragging At Kakatiya University, 78 Senior Students Suspended - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై వారం రోజులపాటు సస్పెండ్‌ చేశారు అధికారులు. ఈ విషయంపై యూనివర్సిటీ వైఎస్‌ ఛాన్సలర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ర్యాగింగ్‌ జరగలేదని తెలిపారు.

పరిచయ వేదిక పేరుతో జూనియర్లను సీనియర్లు పిలిచి మాట్లాడారని హాస్టల్‌లోనూ మరోసారి ఇంట్రడక్షన్‌ తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో జూనియర్లను వేధించిన ఆరోపణలపై 78 మంది సీనియర్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. సస్పెన్సన్‌కు గురైన వారిలో పీజీ చదువుతున్న 28, కామర్స్ 28, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఉన్నారు. వారం రోజులపాటు సస్పెన్డ్‌ చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ధృవీకరించారు. 

అయితే అర్ధరాత్రి హాస్టల్‌ రూమ్‌కు పిలిచి సీనియర్లు వేధించారని జూనియర్లు చెబుతున్నారు. దీనిపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం వేధింపులు నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను ర్సిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
చదవండి: HYD: మూసారాంబాగ్‌ బ్రిడ్జి మూసివేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement