సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాల తాడేపల్లిగూడెం నిట్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం రేగింది. బిహార్‌కు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదారు. ఈ ఘటనపై జూనియర్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేసిన కళాశాల అధికారులు ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. మరో 15 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment