
చట్టంపై పట్టుకోసం న్యాయ విద్య..
విప్లవ ప్రజాపోరాటాల చరిత్ర అక్షరీకరణ
పలు విప్లవ పత్రికలకు సంపాదకత్వం
దేవరుప్పుల: ప్రజా చైతన్యానికి ఊపిరిలూదిన జనగామ జిల్లా కడవెండిలో పుట్టిన గుమ్ముడవెల్లి రేణుక అదే పోరాట పంథాను ఎంచుకుని అడవిబాట పట్టింది. చిన్నతనంలోనే వివాహం, తదితర ఘటనలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. ఈనేపథ్యంలో చట్టంపై అవగాహన కోసం న్యాయ విద్యను అభ్యసించింది. ఆమె సోదరుడు ప్రసాద్ అలియాస్ ఉసెండి దండకారణ్యంలో పనిచేసేవాడు. ఈక్రమంలో పోలీసుల అత్యంత నిర్బంధాలను చవిచూసిన తండ్రి సోమయ్య.. కూతురు రేణుకకు యుక్త వయసు రాగానే ఉన్నత చదువులకు అవకాశం ఇవ్వకుండా ఓ వ్యక్తితో వివాహం చేశారు. దీంతో వారి దాంపత్య జీవితంలో పురుషాధిక్యత వంటి అంశాలతో కలహాలు వచ్చాయి. అనివార్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. యుక్తవయస్సు రాగానే తన ఆలోచనలకు విరుద్ధంగా పితృస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు, అజమాయిషీపై ఆమె తీవ్రంగా ఆ లోచించింది. ఈనేపథ్యంలోనే ఓయూలో దూరవిద్యలో డిగ్రీ చేసి చట్టంపై పట్టు కోసం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదివింది.
ఎల్‌ఎల్‌బీ చదువుతున్న క్రమంలోనే..
రేణుక లా చదువుతున్న సమయంలో అప్పటికే ఉ ద్యమంలో ఉన్న పద్మక్క, సూర్యం పరిచ య మ య్యారు. దీంతో ఆమె ఆలోచనాత్మక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాసంఘాల్లో భాగస్వామ్యమవుతూ దండకారణ్యం బాట పట్టింది. వరుస ఎన్‌కౌంటర్లు,నిర్బంధ పరిస్థితుల్లో మావోయిస్టు పా ర్టీ నిర్ణయంతో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాక్షేత్రంలో చోటుచేసుకున్న అనేక కీలక ఘటనలు, ఘ ట్టాలపై విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి పార్టీకి మా ర్గదర్శకాలు చేసింది. అజ్ఞాత జీవితాన్ని ఎదుర్కొంటూనే విప్లవ ప్రజాపోరాటాల చరిత్రను అక్షరీకరించింది. నక్సల్స్ తరఫున ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోటియారో ఫోల్లో, సంఘర్షణ్, భూమ్కల్ సందేశ్, పితురీ వంటి విప్లవ పత్రికలకు సంపాదకత్వం వహించింది. తొలుత భాషాధార(బీడీ) ప్రాంతంలో పని చేసే క్రమంలో బీడీ దమయంతి పేరుతో రచనలు చేసింది.