ABVP Students
-
రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్‌గా స్పందించారు. శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్‌గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్‌రావు. -
హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎస్సీ నిర్వహించాలని టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ గేటువైపు వెళ్లేందుకు టీఆర్టీ అభ్యర్థులు యత్నించారు. అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం గేట్లు ఎక్కేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. పలువురిని అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా: మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. క్యాంపు కార్యాలయంలోకి కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. అడ్డుకునేందుకు పోలీసుల యత్నంచగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. చదవండి: రోజుకో ప్రచారం.. కేసీఆర్-చెన్నమనేని భేటీపై ఉత్కంఠ -
టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్
-
ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ
న్యూఢిల్లీ: రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఆదివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దాంతో రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. కానీ, దాదాపు 60 మందికి గాయాలయ్యాయని జేఎన్‌యూఎస్‌యూ నేతలు పేర్కొన్నారు. తమ కార్యకర్తలు 10 మంది గాయపడ్డారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. -
‘కేసీఆర్ సూచనతోనే విద్యార్థులపై లాఠీచార్జ్’
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం పరాయి పాలనలో ఉన్నట్టు ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సూచన మేరకే పోలీసులు లాఠీచార్జ్ చేశారన్నారు. విద్యార్థులను బూట్లతో తన్నారని.. జంతువుల మీద కూడా ఇంత కఠినంగా వ్యవహరించరని మండిపడ్డారు. విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చిందని.. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పదవులు వారి వల్లేనని వ్యాఖ్యానించారు. (సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా?) ప్రగతిభవన్ గేటు కూడా దాటలేరు తొమ్మిది యూనివర్సిటీల్లో అసలు వీసీలే లేరని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. డిమాండ్ల సాధన కోసం వాళ్లు ధర్నా చేశారని తెలిపారు. విద్యార్థులను తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలు రూపొందించారని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు వారిపైనే లాఠీచార్జ్ చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన పోలీసులపై హత్యాయత్న కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తలుచుకుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ గేట్ కూడా దాటలేరని విమర్శించారు. (అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం) చదవండి: బీజేపీ అధ్యక్ష పదవికి నేనంటే నేనే.. -
అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం
-
తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వెనక్కు నెట్టారు.అయినప్పటికీ ఏబీవీపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 యూనివర్సీటీలకు వెంటనే వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న 50వేల టీచర్ల పోస్టులను, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని దాని వల్ల తమకు స్కాలర్ షిప్‌లు రావడం లేదని విద్యార్థులు మీడియాకు చెప్పారు. ఈ డిమాండ్ తీర్చడం కోసమే అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
అయిషీని విచారించిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: ఈనెల 5వ తేదీన జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ(జేఎన్‌యూ)లో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సోమవారం విద్యార్థి సంఘం నేత అయిషీ ఘోష్ సహా ముగ్గురిని ప్రశ్నించారు. పోలీసులు గుర్తించిన 9 మంది నిందితుల్లో ఏబీవీపీకి చెందిన ఇద్దరితోపాటు ఆయిషీ ఘోష్ ఉన్నారు. అయితే, సోమవారం నుంచి ప్రారంభమైన సెమిస్టర్‌ను విద్యార్థులు బహిష్కరించారు. వర్సిటీలో ఫీజుల పెంపును ఉప సంహరించుకునే దాకా సెమిస్టర్ రిజిస్ట్రేషన్‌ను సాగనీయబోమని తెలిపారు. ఇలా ఉండగా, వర్సిటీలో పరీక్షల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని, చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌కు భయంతో రాలేదని జేఎన్‌యూ ప్రొఫెసర్ల బృందం మానవ వనరుల మంత్రిత్వ శాఖకు వివరించింది. విద్యార్థులపై బలప్రయోగం ఏమిటి? నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడంపై పార్లమెంటరీ సంఘం ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ఆనంద్ శర్మ నేతృత్వంలోని హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట కేంద్ర హోం శాఖతోపాటు, ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా హింసాత్మక ఘటనలను నేరుగా ప్రస్తావించకుండా.. విద్యార్థులతో పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశ్నించింది. ఆందోళనల సమయంలో 144వ సెక్షన్ కింద విధించే నిషేధాజ్ఞల కారణంగా సామాన్యులు ఇక్కట్లకు గురవుతున్నారని పేర్కొంది. విద్యార్థులపై బలప్రయోగం చేసిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులతో పరిణతితో వ్యవహరించాల్సి ఉందని తెలిపింది. ‘జేఎన్‌యూ’ ఆధారాలపై స్పందించండి ఈ నెల 5వ తేదీనాటి జేఎన్‌యూ హింసాత్మక ఘటనలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ తదితర ఆధారాలను భద్రపరచాలంటూ దాఖలైన పిటిషన్‌పై అభిప్రాయాలను తెలపాలని వాట్సాప్, గూగుల్, యాపిల్ కంపెనీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జేఎన్యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ బ్రిజేశ్ సేథి సోమవారం విచారణ చేపట్టారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం, పోలీస్ శాఖలకు నోటీసులు జారీ చేసి, విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్ పై స్టే
హైదరాబాద్: హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో ముగ్గురు ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్ పై సోమవారం హైకోర్టు స్టే విధించింది. సుశీల్, దివాకర్, కృష్ణ చైతన్యలను అరెస్ట్ చేయకుండా స్టే ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. దర్యాప్తు సహకరించాలని విద్యార్థులకు సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. హెచ్ సీయూ నుంచి సస్పెండ్ చేయడంతో రోహిత్ జనవరి 18న ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
నల్గొండలో ఎబివిపి విద్యార్థుల ఆందోళన
-
మంత్రి ఈటెల ఇల్లు ముట్టడి
* ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన * ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్ హుజూరాబాద్ టౌన్ : విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇంటిని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతేడాది విద్యార్థులకు స్కాలర్షిప్లు రూ.1400 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, ఈ ఏడాది ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించినా మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధింపులకు పాల్పడుతున్నాయని తెలిపారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. నాయకులు సంతోష్, నాగసమన్, రాకేష్, మానస, వనజ, కార్తీకానంద్, నటరాజ్‌రెడ్డి, అజయ్, మమత, విజయ్, కృష్ణ, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
వేములవాడలోని ఓ కళాశాలపై ఏబీవీపీ దాడి
- మాధ్యమం మార్పులో నిర్లక్ష్య వైఖరంటూ ఆరోపణ - పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన వైనం వేములవాడ : ఇంగ్లిష్ మీడియం విద్యనభ్యసించిన తమను తెలుగు మీడియంగా పరిగణించడాన్ని నిరసిస్తూ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలోని కె.వి డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు మద్దతిచ్చిన ఏబీవీపీ విద్యార్థుల తరఫున యాజమాన్యాన్ని నిలదీసింది. మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. 2013-14 విద్యాసంవత్సరం ఓ గ్రూప్‌లో డిగ్రీ ఫస్టియర్‌లో 43 మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమంలో అభ్యసించారు. పరీక్షల సమయంలో వీరికి తెలుగు మాధ్యమంలో ప్రశ్నపత్రాలు రావడంతో ఖంగుతిన్నారు. ఈ విషయమై యాజమాన్యాన్ని నిలదీయగా యూనివర్సిటీ అధికారుల తప్పిదంతో ప్రశ్నపత్రాలు తెలుగులో వచ్చాయని మెమోల్లో ఇంగ్లిష్ మీడియంగా వస్తుందని విద్యార్థులకు నచ్చజెప్పడంతో పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లోనూ తెలుగు మీడియంగా రావడంతో ఏబీవీపీ నాయకులను ఆశ్రయించారు. అంతా కలిసి కళాశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ విషయమై కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా జవాబివ్వడంతో మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. ఈ దాడిలో కళాశాల కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసమైంది. సమాచారమందుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. అనంతరం దాడికి కారణమైన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంతో విద్యార్థినులంతా పోలీసు జీపును అడ్డగించారు. యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. -
విక్రమ సింహపూరి యూనివర్సిటీపై విద్యార్ధుల దాడి!
నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిపాలన భవనంపై ఏబీవీపీ విద్యార్థులు శుక్రవారం దాడి చేశారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో చోటు చేసుకున్న అక్రమాలపై విద్యార్థుల ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన నేపథ్యంలో ఎలాంటి స్పందన రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులతో విద్యార్ధులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్ధులు కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. పరిపాలన కార్యాలయంపై విద్యార్థుల దాడిని నిరసిస్తూ యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దాడి చేసిన విద్యార్ధులపై చర్య తీసుకోవాలని యూనివర్సిటీ సిబ్బంది డిమాండ్ చేశారు. కార్యాలయంపై దాడి సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.