విక్రమ సింహపూరి యూనివర్సిటీపై విద్యార్ధుల దాడి! | ABVP Students attacked on Vikram Simhapuri University | Sakshi
Sakshi News home page

విక్రమ సింహపూరి యూనివర్సిటీపై విద్యార్ధుల దాడి!

Published Fri, Jul 4 2014 8:22 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిపాలన భవనంపై ఏబీవీపీ విద్యార్థులు శుక్రవారం దాడి చేశారు.

నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిపాలన భవనంపై ఏబీవీపీ విద్యార్థులు శుక్రవారం దాడి చేశారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో చోటు చేసుకున్న అక్రమాలపై విద్యార్థుల ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన నేపథ్యంలో ఎలాంటి స్పందన రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులతో విద్యార్ధులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్ధులు కార్యాలయంపై దాడి చేశారు. 
 
ఈ దాడిలో ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. పరిపాలన కార్యాలయంపై విద్యార్థుల దాడిని నిరసిస్తూ యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దాడి చేసిన విద్యార్ధులపై చర్య తీసుకోవాలని యూనివర్సిటీ సిబ్బంది డిమాండ్ చేశారు. కార్యాలయంపై దాడి సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement