గ్రామస్తులపైకి దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ | man arrested due attempted attack on villagers | Sakshi
Sakshi News home page

గ్రామస్తులపైకి దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

Published Fri, Mar 11 2016 1:06 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

man arrested due attempted attack on villagers

విడవలూరు: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకుచర్ల గ్రామంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. 30 మంది రౌడీలను తెచ్చి గ్రామస్తులపై దాడి చేయబోయాడు. నెల్లూరు నగరం మూలాపేటకు చెందిన ఓ వ్యక్తికి చౌకుచర్ల గ్రామంలో 22 ఎకరాల పొలం ఉంది. గ్రామస్తుల దగ్గర కొంత మేర అప్పు తీసుకున్నాడు. పంట చేతికి రావడంతో కోత కోయించేందుకు వచ్చాడు. అప్పు తీర్చిన తర్వాతే పంట కోయాలని గ్రామస్తులు సదరు వ్యక్తికి చెప్పారు. దీంతో తన అనుచరులు 30 మందిని మూడు ఆటోల్లో గ్రామానికి తీసుకు వచ్చాడు. వాళ్ల దగ్గర నాటు తుపాకులు, కత్తులు ఉండటం చూసి గ్రామస్తులు పోలీసులకు ఈ విషయం తెలిపారు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement