
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎస్సీ నిర్వహించాలని టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ గేటువైపు వెళ్లేందుకు టీఆర్టీ అభ్యర్థులు యత్నించారు. అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు.
కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం గేట్లు ఎక్కేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. పలువురిని అరెస్ట్ చేశారు.
సూర్యాపేట జిల్లా: మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. క్యాంపు కార్యాలయంలోకి కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. అడ్డుకునేందుకు పోలీసుల యత్నంచగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.
చదవండి: రోజుకో ప్రచారం.. కేసీఆర్-చెన్నమనేని భేటీపై ఉత్కంఠ
Comments
Please login to add a commentAdd a comment