మాట్లాడుతున్న కేయూ రిజిస్ట్రార్ పురుషోత్తం
కేయూ క్యాంపస్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే విజయం సాధ్యమవుతుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో టెక్నికల్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం సంయుక్తంగా కొన్ని రోజులుగా క్యాంపస్‌లోని ఫిజిక్స్ విభాగం సెమినార్ హాల్‌లో వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం ఈ శిక్షణ తరగతులకు పురుషోత్తం హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కేరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంగ్ల భాష విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా న్యూస్‌పేపర్లు చదువుకోవాలని సూచించారు. కేయు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ జీవితంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామని అవకాశాలు అందరికీ వస్తాయని కొందరు మాత్రమే ఉపయోగించుకుంటారన్నారు.ప్రణాళికతో చదివితే విజయం సా«ధించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ యాదవరెడ్డి, మేకల ప్రవీణ్, రాము, బాబు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment