hard working
-
ప్రాణాలకు తెగించిన లైన్ మెన్
-
కష్టపడి చదివితే...
కేయూ క్యాంపస్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే విజయం సాధ్యమవుతుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో టెక్నికల్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం సంయుక్తంగా కొన్ని రోజులుగా క్యాంపస్‌లోని ఫిజిక్స్ విభాగం సెమినార్ హాల్లో వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం ఈ శిక్షణ తరగతులకు పురుషోత్తం హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కేరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంగ్ల భాష విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా న్యూస్‌పేపర్లు చదువుకోవాలని సూచించారు. కేయు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ జీవితంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామని అవకాశాలు అందరికీ వస్తాయని కొందరు మాత్రమే ఉపయోగించుకుంటారన్నారు.ప్రణాళికతో చదివితే విజయం సా«ధించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ యాదవరెడ్డి, మేకల ప్రవీణ్, రాము, బాబు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లక్ష్యసాధనకు మరింత కష్టపడాలి’
అనంతపురం: లక్ష్యసాధనకు మరింత కష్టపడి పని చేయాలని మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.సుధాకర్ కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం స్థానిక మార్కెటింగ్‌శాఖ ఏడీ కార్యాలయంలో 13 మార్కెట్‌యార్డుల కార్యదర్శులు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్ ఫీజు వసూళ్లలో వెనుకబడిన మార్కెట్‌యార్డుల్లో లక్ష్యసాధన చర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుత 2016-17లో వివిధ రూపాల్లో రూ.16.74 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని యార్డుల వారీగా లక్ష్యం నిర్ధేశించుకోగా మొదటి రెండు నెలలకు సంబంధించి రూ.1.71 కోట్లు వసూలైందన్నారు. అందులో గుంతకల్లు, తనకల్లు, హిందూపురం, పెనుకొండ యార్డుల పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా తాడిపత్రి బాగా వెనుకబడిందన్నారు. యార్డులు, చెక్‌పోస్టుల పటిష్టతకు ఎప్పటికపుడు చర్యలు తీసుకోవాలన్నారు. యార్డుల్లో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు మెరుగు పరచ్చాలన్నారు. పండ్లను మాగబెట్టడానికి నిషేధిత కాల్షియం కార్బైడ్ వాడకుండా రైపనింగ్ ఛాంబర్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీడీఎం వెంకటసుబ్బన్న, ఏడీఎం బి.హిమశైల తదితరులు పాల్గొన్నారు. -
ఐ మూవీ ప్రమోషన్ కోసం అమీ త్యాగం