సాక్షి, విజయవాడ : నగరంలోని ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ (1975-1978) బి.కాం (ఇంగ్లీష్ మీడియం) బ్యాచ్ మేట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం (డిసెంబరు 21) ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సుమారు 40 మంది రోజంతా కాలేజీ నాటి సంగతులతో సరదా సరదాగా గడిపారు. కాలేజీ నేర్పిన జీవిత సత్యాలు తమ ఎదుగుదలకు ఎలా సోపానంగా మారాయో అంతా అనుభవాలను పంచుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో "నాటి స్నేహితుల నేటి కలయిక" విజయవంతంగా జరిగింది.
కళాశాల ఆవరణ అంతా కలియతిరిగి.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వాట్సాప్ సంధాన సందేశాల సాయంతో ఒక్కో బ్యాచ్ మేట్ వివరాలను ఒకచోట చేర్చిన మిత్ర బృందం కెజిఎన్ గుప్తా, యనమండ్ర రమేష్, వైవి కృష్ణయ్య అభినందనలు అందుకున్నారు. గెట్ టుగెదర్ నిర్వహించుకోవడానికి కళాశాల ఏసి కాన్ఫరెన్స్ హాలు ఇచ్చి, పూర్తి సహాయ సహకారాలు అందించి, కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపాల్ జోషి కి పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేసేరు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ పరిమి శ్రీధర్ మోడరేటర్ గా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment