get together party
-
రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం: చిరంజీవి
సాక్షి, ఖైరతాబాద్(హైదరాబాద్): ‘‘రాజకీయాల్లో అనడం, అనిపించుకోవడం ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. ఒకదశలో నాకు రాజకీయాలు అవసరమా అనిపించిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన వైఎన్ఎం కళాశాల (పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్‌లోని కాలేజీ) పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చిరంజీవి పాల్గొన్నారు. తనతో కలిసి చదివినవారు, నాటి అధ్యాపకులను కలిసి గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. తాను ఏది తీసుకున్నా ఆ విషయంలో రాణించకుండా ఉండనని.. అయితే తన మనసును అంతగా ఆకట్టుకోలేకపోయిన దూరంగా ఉన్నానని చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోందని.. దానితో ఈ కార్యక్రమానికి రావడం కుదురుతుందో లేదో అనుకున్నానని చెప్పారు. మొత్తానికి ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ‘రాజీనామా’ నాటకంతో.. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మన లక్ష్యాలకు విత్తనం పడుతుందని, తన విషయంలోనూ అదే జరిగిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనకు నటన పట్ల మక్కువ ఉండటం, ఆ సరదాతో కాలేజీలో ‘రాజీనామా’ అనే నాటకంలో నటించడం, దానికి ఉత్తమ నటుడి అవార్డు రావడం.. తన ప్రస్థానానికి పునాదులని వివరించారు. తనకు అప్పుడే అభిమానులు మొదలయ్యారని చెప్పారు. ఎన్సీసీలో సీనియర్ కెప్టెన్ పొజిషన్ వరకు వెళ్లానని, 1976 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తరఫున రాజ్‌పథ్‌లో మార్చింగ్ చేశానని గుర్తు చేసుకున్నారు. అలా తనకు మంచి క్రమశిక్షణ అలవడిందని చెప్పారు. కేవలం పుస్తకాల నుంచే కాకుండా మన చుట్టూ ఉండే వారి నుంచి నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. -
సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా..
మండపేట(కోనసీమ జిల్లా): ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోటకు చేరారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మైమరచిపోయారు. విద్య నేర్పిన గురువులను సత్కరించడంతో పాటు ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సినీనటుడు ఆలీ తళుక్కున మెరిసి సందడి చేశారు. మండపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 1991–92 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక సూర్య ఫంక్షన్ హాలులో జరిగింది. చదవండి: సీక్రెట్ స్మోకింగ్‌పై స్పందించిన బిందుమాధవి తాము 10వ తరగతి పూర్తిచేసుకుని 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయించుకున్నారు. అప్పట్లోనే తమ బ్యాచ్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయడం ద్వారా ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరిని ఒక తాటిమీదకు తెచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ క్షేమ సమాచారాలను పంచుకున్నారు. అదే బ్యాచ్‌కు చెందిన ఆలీ సతీమణి జుబేదా వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్న సమయంలో అనుకోని అతిథిలా ఆలీ వేడుకకు విచ్చేసి అందరినీ ఆనందంలో ముంచెత్తారు. అప్పట్లో తమకు విద్య నేర్పిన గురువులు ప్రమీలా జూలియట్, సుబ్బయ్యశాస్త్రి, తలుపులమ్మ, షబాబా, వీరన్న, సత్యవతి, ఈశ్వరిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా జ్ఞాపికలు అందజేశారు. సహపంక్తి భోజనాలు అనంతరం పూర్వ విద్యార్థులందరూ తమతమ కుటుంబ సభ్యులతో కలిసి తాము చదువుకున్న పాఠశాలను సందర్శించి సందడి చేశారు. కార్యక్రమం నిర్వహణకు కృషిచేసిన మెహర్జ్యోతి, విజయవాణిలను సహచర విద్యార్థులు సత్కరించారు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనే తన సతీమణికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా ఉదయం ఫ్లైట్‌కు బయలుదేరి వచ్చినట్టు ఆలీ తెలిపారు. పూర్వపు విద్యార్థులంతా ఇలా కలుసుకుని విద్యాబుద్ధులు నేరి్పన గురువులను సత్కరించుకోవడం అభినందనీయమన్నారు. ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ ఉండాలన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆలీతో సెల్ఫీలు తీసుకునేందుకు చిన్నారులు, వేడుకకు హాజరైన వారు ఉత్సాహం చూపించారు. కొద్దిసేపటి తర్వాత ఆలీ వేడుక నుంచి వెనుతిరిగారు. -
అక్కా.. బా.. అంటూ.. గోదారోళ్ల కితకితలు.. మామూలుగా లేదుగా మరి..
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జీపీఆర్ కొండపై ఆదివారం గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ మిత్రుల ఐదవ ఆత్మీయ సమ్మేళనంలో నవ్వులు విరబూశాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని అక్కా..బా.. అంటూ గోదావరి యాసతో పలకరించుకున్నారు. గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ క్రియేటర్ ఈవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. చదవండి: కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు చిన్నారులు ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులతో పాటు, ఫేస్బుక్ మిత్రులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్ర స్నాక్స్ వరకు సుమారు 40రకాల తెలుగు వంటకాలను ఫేస్బుక్ మిత్రులకు రుచి చూపించారు. చిన్నారులు, పెద్దలు వేసిన స్టెప్పులు అలరించాయి. డూప్ నాగార్జున, ఇతర డాన్సర్లు చేసిన డ్యాన్స్‌లకు ప్రాంగణం కేరింతలతో హోరెత్తింది. రేడియో జాకీ శీను మామ వ్యాఖ్యానం..చిన్నచిన్న పొడుపు కథలు..ఆటపాటలతో ఉత్సాహంగా సాగింది. గ్రూప్ క్రియేటర్ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదారోళ్ల సంప్రదాయాలు ఎప్పటికీ కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ఫేస్బుక్ మిత్రుల గ్రూపు ప్రారంభించామని అన్నారు. వివిధ లక్కీడిప్‌లు నిర్వహించి బహుమతులను అందించారు. అడ్మిన్ పేపకాయల లలిత, మోడరేటర్లు సరిత ఎం.బొల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి, బండారు ఆదివిష్ణు, చిలుకూరి విజయ్, కోపల్లె శేషగిరిరావు, నిభనుపూడి వాసుప్రసాద్, కేఎస్ఎన్ మూర్తి పర్యవేక్షించారు. సుమారు నాలుగువేల మంది గ్రూపు సభ్యులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఆర్లో సందడే సందడి!
సాక్షి, విజయవాడ : నగరంలోని ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ (1975-1978) బి.కాం (ఇంగ్లీష్ మీడియం) బ్యాచ్ మేట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం (డిసెంబరు 21) ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సుమారు 40 మంది రోజంతా కాలేజీ నాటి సంగతులతో సరదా సరదాగా గడిపారు. కాలేజీ నేర్పిన జీవిత సత్యాలు తమ ఎదుగుదలకు ఎలా సోపానంగా మారాయో అంతా అనుభవాలను పంచుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో "నాటి స్నేహితుల నేటి కలయిక" విజయవంతంగా జరిగింది. కళాశాల ఆవరణ అంతా కలియతిరిగి.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వాట్సాప్ సంధాన సందేశాల సాయంతో ఒక్కో బ్యాచ్ మేట్ వివరాలను ఒకచోట చేర్చిన మిత్ర బృందం కెజిఎన్ గుప్తా, యనమండ్ర రమేష్, వైవి కృష్ణయ్య అభినందనలు అందుకున్నారు. గెట్ టుగెదర్ నిర్వహించుకోవడానికి కళాశాల ఏసి కాన్ఫరెన్స్ హాలు ఇచ్చి, పూర్తి సహాయ సహకారాలు అందించి, కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపాల్ జోషి కి పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేసేరు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ పరిమి శ్రీధర్ మోడరేటర్ గా వ్యవహరించారు. -
కాలమా ఆగిపో.. కానుకై కరిగిపో..
సాక్షి, బంజారాహిల్స్: ఆనాటి హృదయాల ఆనంద గీతం..ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం.. అంటూ గత స్మృతుల వెల్లువలో తడిసిముద్దవుతున్నారు. విందులు, వినోదాలతోఅపురూప క్షణాలను ఆస్వాదిస్తున్నారు.రీ యూనియన్ పారీ్టల పేరుతో ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా హంగామాసృష్టిస్తున్నారు. ఆనంద సంద్రంలోఓలలాడుతున్నారు. జ్ఞాపకాల దొంతరలో దోబూచులాడుతున్నారు. కాలమా ఆగిపో.. కానుకై కరిగిపో అంటూ ఒకప్పటిముచ్చట్లను యాది చేసుకుంటున్నారు. గుర్తుకొస్తున్నాయి.. అంటూ గుండె గూటిని తడిమి చూసుకుంటున్నారు. సినీ నటులతో పాటు బుల్లితెర నటులు, సిటీ యూత్ సైతం తమదైన శైలిలో నయా ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. చిరంజీవి ఇంట్లో సందడి.. నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ రోడ్ నెం– 25లోని తన నివాసంలో జరిపిన రీ యూనియన్ పార్టీ అందరినీ ఆకర్షించింది. 1980 ప్రాంతంలో తనతో కలిసి నటించిన నటీనటులను నగరానికి రప్పించి ఈ వేడుకను అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఈ నటులంతా ఒక్కొక్కరి ఆతిథ్యంలో రీ యూనియన్ పార్టీలు జరుపుకుంటుండగా ఈసారి చిరంజీవి ఆతిథ్యం ఇచ్చారు. ఆయనతో నటించిన సుహాసిని, రాధ, సుమలత, రాధిక, కుష్బూ, నాగార్జున, జయసుధ, సుమన్, మోహన్‌లాల్, వెంకటేశ్, జగపతిబాబు, నరేశ్, శోభన, జయప్రద, రేవతి, అమల తదితరులు హాజరయ్యారు. సినీ సందడి నెలకొంది. ఇక బిగ్‌బాస్ సీజన్– 3లో పాల్గొన్న హౌస్మేట్స్ అంతా ఇటీవల శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో సందడి చేశారు. పునర్నవి, మహేశ్, అలీ రెజా, వితికా, వరుణ్ సందేశ్ తదితరులు ఆటా పాటలతో ఆకట్టుకున్నారు. సరికొత్తగా కనిపించేందుకు వీరి వేషధారణ అలరించింది. ఇక హౌస్‌ఫుల్ అనే సినిమా చిత్ర నిర్మాణ సమయంలో తనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఇటీవలనే హైదరాబాద్‌లో రీ యూనియన్ పార్టీ ఘనంగా నిర్వహించారు. రీయూనియన్ పార్టీలో హీరో రామ్‌చరణ్‌తేజ్, రాధిక, శరత్‌కుమార్ (ఫైల్) ఒకే పాఠశాలలో.. ఒకే కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఆ బ్యాచ్‌ను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకుని కొన్నేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో ఒకే వేదికపై కలిసి మధుర స్మృతులను నెమరు వేసుకోవడం విదితమే. తరచూ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కూడా జరుగుతూనే ఉంటాయి. విందులు, వినోదాలతో ఈ కార్యక్రమాలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటూ తమ స్నేహాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఐతే ఒకే చోట పనిచేసిన వారంతా ఇప్పుడు ‘రీ యూనియన్ పార్టీ’ పేరుతో కలుసుకుంటూ కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. నాలుగైదేళ్లుగా నగరంలో ఈ సంస్కృతి విస్తరిస్తోంది. ఒకేచోట పనిచేసిన ఉద్యోగులైనా, సాంకేతిక నిపుణులైనా, సినీ నటులు ఇలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కేవలం సంపన్న వర్గాలకు, సినీ పరిశ్రమకు పరిమితమైన రీ యూనియన్ పారీ్టలు ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ఉద్యోగులు కూడా నిర్వహించుకుంటున్నారు. బంధుమిత్రులు కూడా తరచూ రీయూనియన్ పారీ్టల పేరుతో సందడి చేస్తున్నారు. ఆటపాటలతో.. అందరూ కలుసుకోగానే కేవలం ముచ్చట్లతోనో, భోజనాలు చేస్తునో గడిపేస్తుంటారు. రీ యూనియన్ పారీ్టలో మాత్రం ఆటపాటలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. జోక్‌లతో పాటు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలనాటి పాటలపై డ్యాన్స్ చేస్తారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ పారీ్టలు జరుగుతాయి. ఆనాటి ముచ్చట్లను నెమరువేసుకుంటూ అప్పటి హిట్ పాటలపై డాన్సులు చేస్తూ చక్కని ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంటారు. సహచర నటులు, సినీ సాంకేతిక నిపుణులతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఐటీ ఉద్యోగులు.. యువ పారిశ్రామికవేత్తలు కేవలం సినీతారలే కాకుండా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, యువ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కిట్టీ పారీ్టలు నిర్వహించుకునే మహిళలు కూడా ఇటీవల రీ యూనియన్ పారీ్టలు నిర్వహించుకుంటున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలీ, మణికొండ, మాదాపూర్, కొత్తగూడ, కూకట్పల్లి, హిమాయత్‌నగర్, బేగంపేట, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు రీ యూనియన్ పార్టీలకు ఇటీవల వేదికగా నిలుస్తున్నాయి. ఇక శివార్లలోని రిసార్ట్స్‌లో, ఫామ్‌హౌస్‌లలో ఈ పారీ్టలు జోరుగా సాగుతున్నాయి. ఒకే చోట పనిచేసిన ఉద్యోగులు లేదా ఒకే చోట శిక్షణ తీసుకున్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు సైతం ఇలా కలుసుకుంటూ జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. డ్రెస్‌కోడ్ ప్రత్యేక ఆకర్షణ.. రీ యూనియన్ పారీ్టకి డ్రెస్‌కోడ్‌ను ముందుగానే సభ్యులకు తెలియజేస్తారు. చిరంజీవి ఇంట్లో జరిగిన పారీ్టకి నలుపు రంగు డ్రెస్‌కోడ్‌తో వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ రోజు నలుపు రంగు దుస్తులతో పాటు ఆభరణాలు కూడా అదే రంగువి వేసుకుంటారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా రకరకాల టోపీలు, గొలుసులు, ఇతర ఆభరణాలు ధరిస్తారు. బిగ్‌బాస్– 3 రీ యూనియన్ పారీ్టకి పింక్ కలర్ దుస్తులను ధరించారు. రీ యూనియన్ పార్టీలో సందడి చేస్తున్న బిగ్‌బాస్– 3 హౌస్మేట్స్ యువ నటులు సైతం.. కేవలం చిరంజీవి, జగపతిబాబు, సుమన్, కమల్‌హాసన్ తదితర హీరోల నాటి రోజులే కాకుండా నేటితరం యువ హీరో హీరోయిన్లు కూడా తరచూ ఏదో ఒక పబ్‌లోనో, రిసార్ట్‌లోనో, స్టార్హోటల్లోనో కలుసుకుంటున్నారు. రీ యూనియన్ పార్టీ పేరుతో హీరో హీరోయిన్లంతా ఆయా చిత్రాల నిర్మాణ సమయంలో తమ అనుభూతులను పంచుకుంటున్నారు. జూనియర్ ఎనీ్టఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మంచు మనోజ్, రానా తదితరులు తరచూ సమావేశమవుతుంటారు. -
ఈ క్షణాలు తీపి గుర్తులు: రతన్ టాటా
సాక్షి, విశాఖపట్నం : విశ్వవిద్యాలయాలకు పరిశ్రమలతో ఇంటరాక్షన్ పెరగాలని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అభిలాషించారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో పరిశోధనలు విస్త్రతంగా జరగాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఈ క్షణాలు తీపిగుర్తులుగా మిగిలిపోతాయన్నారు. విశాఖపట్నం క్లీన్ సిటీగా అభివర్ణించారు. ఈ నగరంపైపై ఇప్పటివరకూ దృష్టి సారించలేదని.. ఇకపై పెడతామన్నారు. విశాఖలో టాటా గ్రూప్ ఏ రంగంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశంపై ముంబైలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇక ఇదే సమ్మేళనంలో పూర్వ విద్యార్థిగా పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థిగా రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. -
గెట్ టు గేదర్‌కు వచ్చి..
వంగర : ఎం.సీతారాంపురం గ్రామంలో 1994–95 పదోతరగతి బ్యాచ్ పూర్వపు విద్యార్థులు ఈ నెల 20న జరుపుకున్న గెట్‌టుగేదర్ కార్యక్రమానికి వచ్చిన మహిళ మద్దూరి కాశీరత్నం(38) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. తోటి స్నేహితుల సమాచారం మేరకు ఎం.సీతారాంపురం పాఠశాలకు వచ్చిన ఆమె పూర్వపు విద్యార్థులు(స్నేహితులు) అందరితో కలిసి సరదాగా గడిపారు. అనంతరం తన కన్నవారి గ్రామం మద్దివలసకు చెందిన తల్లి బెజ్జిపురం నరసమ్మ వద్దకు చేరింది. సోమవారం ఉదయం స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా శంకవరానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా ఆరోగ్యంలో తేడా అనిపించడంతో భర్త ఉదయ్‌భాస్కరనాయుడు సపర్యలు చేశారు. ఫలితం లేకపోయింది. ఆమె గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలే ఉన్న ఆమె స్నేహితులు(పూర్వ విద్యార్థులు) కుప్పకూలిపోయారు. అంతా కలిసి మద్దివలస గ్రామానికి చేరుకొని కాశీరత్నం మృతదేహం వద్ద రోదించారు. తన స్నేహితురాలు ముందు రోజు తమతో సరదాగా ఉందని, ఒక్కసారి మృత్యువు కబళించడంతో వారంతా విషన్నవదనంలోకి వెళ్లిపోయారు. -
అపూర్వ సమ్మేళనం
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : జిల్లాకేంద్రంలోని మోడ్రన్ పబ్లిక్ స్కూల్లో 1996–97 బ్యాచ్‌కు చెందిన పదోతరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఒకరినొకరు కలుసుకుని జ్ఞాపకలను గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. పూర్వ ఉపాధ్యాయులు మురళీ, సురేందర్, సాయిబాబా, సాయిప్రసాద్, నర్సింగ్‌రెడ్డి, వేణు, మహేష్, శ్రీనివాస్, ఎంవీ రమణ, బల్వంత్‌రావు, నర్సింగ్‌రావు, విజయలక్ష్మీ, అన్నపూర్ణ, పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, రాకేష్, లక్ష్మీనారాయణ, కిరణ్, నిరీల్, ప్రసాద్, కృష్ణ, మధుతోపాటు 100మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఓ కంపెనీలో గెట్ టు గెదర్ పార్టీ..యువతిపై అత్యాచారం
గుర్గావ్: కామాంధులకు ఓవైపు ఉరిశిక్షలు పడుతున్నా అత్యాచారాల ఆగడాలు ఏమాత్రం ఆగడంలేదు. ఎనిమిదో నంబర్ జాతీయ రహదారిపైగల మనేసర్ ప్రాంతంలోని ఓ క్లబ్లో యువతిపై అత్యాచారం జరిగింది. నిందితుడిని భీవని ప్రాంతానికి చెందిన సుమిత్‌గా గుర్తించారు. స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో దాదాపు 50 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరంతా కలిసి గెట్ టు గెదర్ పేరుతో పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అందరితో కలిసే శీతల పానీయాన్ని తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. దీనిని అదనుగా చేసుకొన్న సుమిత్ ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. తనపట్ల జరిగిన దారుణాన్ని గుర్తించిన బాధితురాలు విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆయన ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులేకాదు తాను పనిచేస్తున్న కంపెనీ కూడా యువకుడిపై చర్య తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. అయితే కంపెనీ అధికారులు మాత్రం దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు. బాధితురాలు గుర్గావ్లోని సంజయ్‌గ్రామ్ కాలనీలో నివసిస్తోందని, ఆమె తండ్రి ఫిర్యాదుతో యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు రుజువైందని దక్షిణ ఢిల్లీ డీసీపీ రాహుల్ శర్మ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని, విచారిస్తున్నామన్నారు.