ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఆలీ
మండపేట(కోనసీమ జిల్లా): ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోటకు చేరారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మైమరచిపోయారు. విద్య నేర్పిన గురువులను సత్కరించడంతో పాటు ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సినీనటుడు ఆలీ తళుక్కున మెరిసి సందడి చేశారు. మండపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 1991–92 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక సూర్య ఫంక్షన్ హాలులో జరిగింది.
చదవండి: సీక్రెట్ స్మోకింగ్‌పై స్పందించిన బిందుమాధవి
తాము 10వ తరగతి పూర్తిచేసుకుని 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయించుకున్నారు. అప్పట్లోనే తమ బ్యాచ్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయడం ద్వారా ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరిని ఒక తాటిమీదకు తెచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ క్షేమ సమాచారాలను పంచుకున్నారు.
అదే బ్యాచ్‌కు చెందిన ఆలీ సతీమణి జుబేదా వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్న సమయంలో అనుకోని అతిథిలా ఆలీ వేడుకకు విచ్చేసి అందరినీ ఆనందంలో ముంచెత్తారు. అప్పట్లో తమకు విద్య నేర్పిన గురువులు ప్రమీలా జూలియట్, సుబ్బయ్యశాస్త్రి, తలుపులమ్మ, షబాబా, వీరన్న, సత్యవతి, ఈశ్వరిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా జ్ఞాపికలు అందజేశారు. సహపంక్తి భోజనాలు అనంతరం పూర్వ విద్యార్థులందరూ తమతమ కుటుంబ సభ్యులతో కలిసి తాము చదువుకున్న పాఠశాలను సందర్శించి సందడి చేశారు. కార్యక్రమం నిర్వహణకు కృషిచేసిన మెహర్‌జ్యోతి, విజయవాణిలను సహచర విద్యార్థులు సత్కరించారు.
సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వాలనే
తన సతీమణికి సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా ఉదయం ఫ్లైట్‌కు బయలుదేరి వచ్చినట్టు ఆలీ తెలిపారు. పూర్వపు విద్యార్థులంతా ఇలా కలుసుకుని విద్యాబుద్ధులు నేరి్పన గురువులను సత్కరించుకోవడం అభినందనీయమన్నారు. ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ ఉండాలన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆలీతో సెల్ఫీలు తీసుకునేందుకు చిన్నారులు, వేడుకకు హాజరైన వారు ఉత్సాహం చూపించారు. కొద్దిసేపటి తర్వాత ఆలీ వేడుక నుంచి వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment