మండపేట(డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. జననేతకు అడుగడుగునా జనం నీరాజనాలు పడుతూ మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. భానుడు భగభగమని మండిపోతున్నా జననేతను చూసి తమ మద్దతు తెలిపేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రలో ప్రతీ జంక్షన్ సైతం భారీ బహిరంగ సభల్ని తలపిస్తుండటం విశేషం.
నేటి(గురువారం) మేమంతా సిద్ధం బస్సుయాత్ర 17వ రోజులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. బస్సుయాత్ర చేపట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికే ఎంతో అనారోగ్య బాధితులికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన సీఎం జగన్.. ఈరోజు అంబులెన్స్‌లో వచ్చిన ఓ పేషెంట్‌కి సైతం తాను ఉన్నానంటూ మంచి మనసును చాటుకున్నారు.
మండపేట నియోజకవర్గం మడికి గ్రామంలోకి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రవేశించగా, ఓ అంబులెన్స్ ఆ యాత్ర మధ్యలోకి వచ్చి ఆగింది విషయం తెలుసుకున్న సీఎం జగన్.. అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్‌ను కలిశారు. అతని బంధువులతో మాట్లాడగా, సహాయం కావాలని వారు సీఎం జగన్‌ను కోరారు. ప్రమాదంలో గాయపడి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న పేషెంట్‌కు మరింత సహాయం కావాలని సీఎం జగన్‌కు వారు విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆ పేషెంట్ బంధువులకు తానున్నాననే భరోసా ఇచ్చారు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment