Mandapeta
-
నేనున్నాను.. అంబులెన్స్‌లో పేషెంట్‌కు సీఎం జగన్ భరోసా
మండపేట(డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. జననేతకు అడుగడుగునా జనం నీరాజనాలు పడుతూ మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. భానుడు భగభగమని మండిపోతున్నా జననేతను చూసి తమ మద్దతు తెలిపేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రలో ప్రతీ జంక్షన్ సైతం భారీ బహిరంగ సభల్ని తలపిస్తుండటం విశేషం. నేటి(గురువారం) మేమంతా సిద్ధం బస్సుయాత్ర 17వ రోజులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. బస్సుయాత్ర చేపట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికే ఎంతో అనారోగ్య బాధితులికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన సీఎం జగన్.. ఈరోజు అంబులెన్స్‌లో వచ్చిన ఓ పేషెంట్‌కి సైతం తాను ఉన్నానంటూ మంచి మనసును చాటుకున్నారు. మండపేట నియోజకవర్గం మడికి గ్రామంలోకి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రవేశించగా, ఓ అంబులెన్స్ ఆ యాత్ర మధ్యలోకి వచ్చి ఆగింది విషయం తెలుసుకున్న సీఎం జగన్.. అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్‌ను కలిశారు. అతని బంధువులతో మాట్లాడగా, సహాయం కావాలని వారు సీఎం జగన్‌ను కోరారు. ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్‌కు మరింత సహాయం కావాలని సీఎం జగన్‌కు వారు విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆ పేషెంట్ బంధువులకు తానున్నాననే భరోసా ఇచ్చారు సీఎం జగన్. -
మండపేటలో అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ ల విగ్రహావిష్కరణలు
-
అంబేడ్కర్ జిల్లా మండపేట టీడీపీలో ముసలం
-
చంద్రబాబు ఝలక్.. జనసేన కౌంటర్!
సాక్షి అమలాపురం: ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు..మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు..ఇదీ బాబు మార్కు మిత్ర ధర్మం. రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలూ ప్రకటించారు. కానీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు. అయినప్పటికీ టీడీపీ చేపట్టిన ‘రా.. కదలి రా’ సభల్లో మాత్రం తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం జనసేన నేతలకు, ఆశావహులకు మింగుడుపడడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా... కదలిరా..’ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంటరీ జనసేన ఇన్చార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. వాస్తవానికి సభలో టీడీపీ కార్యకర్తలకన్నా జన సైనికుల సందడే అధికంగా ఉంది. ఇంతమంది ఉన్న సభలో చంద్రబాబు.. మండపేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో జనసేన మండపేట ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ అక్కడే ఉన్నారు. సభలో తమ అభ్యర్థి జోగేశ్వరరావు అని బాబు ప్రకటించడంతో లీలాకృష్ణతో పాటు జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. బాబు పక్కనే ఉన్న గంటి హరీష్‌ను మాత్రం పార్లమెంట్‌కు పంపాలని బాబు పిలుపునివ్వకపోవడం గమనార్హం. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? సీట్ల సర్దుబాటు ఖరారు కాకున్నా.. చంద్రబాబు ఏకపక్షంగా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించడం చూసి, జనసేన ఆశావహులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఇలా ఏకపక్షంగా జోగేశ్వరరావును మళ్లీ గెలిపించండంటూ చంద్రబాబే పిలుపునివ్వడంపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా బాబు ప్రవర్తించడంతో టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలెవ్వరూ వెళ్లవద్దంటూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి లీలాకృష్ణ ఆదేశించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లీలాకృష్ణ తానలా చెప్పలేదన్నా.. జనసేన అనుకూల సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తమదే సీటు అంటూ ప్రచారం చేస్తుండడం కూడా జనసేన ఇన్చార్జిలకు మింగుడు పడడంలేదు. ‘మా పార్టీ అధినేత పొత్తుకు వెళ్లినట్టు లేదు.. కాళ్ల బేరానికి వెళ్లినట్టుంది’ అంటూ సగటు జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మండపేటలో మార్మోగిన సాధికార నినాదం
సాక్షి, అమలాపురం: మండపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారతను శుక్రవారం నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రతిబింబించింది. మండపేటతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఈ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో మండపేట వీధులన్నీ జనసంద్రాలే అయ్యాయి. రెండు వేల ద్విచక్ర వాహనాలతో యువత ర్యాలీ చేశారు. తాపేశ్వరంలో ప్రారంభమైన యాత్ర మండపేటలోని కలువపువ్వు సెంటర్లోని సభా ప్రాంగణం వరకు దిగ్విజయంగా సాగింది. యాత్ర పొడవునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారికి సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ సాగారు. ప్రజలు వారికి పూలు, హారతులతో స్వాగతం పలికారు. వేలాదిగా ప్రజలు పాల్గొన్న సభలో నేతలు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, ప్రజలకు చేస్తున్న మేలును వివరించారు. సీఎం జగన్ పేరు వచ్చిన ప్రతిసారీ సభలోని ప్రజలు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యమైంది: మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని మంత్రి జోగి రమేష్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ చేసినంత మేలు చేయలేదని తెలిపారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని తిరగగలుగుతున్నారంటే, అది సీఎం జగన్ అందించిన చేయూత ఫలితమేనని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు నిజమైన రాజ్యాధికారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అందించారు. 25 మంది మంత్రులు ఉంటే వారిలో 15 మంది బీసీలేనని, 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలకే ఇచ్చారని వివరించారు. చరిత్ర సృష్టించిన జగన్: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీలో పేదలకు, బడుగు, బలహీన, దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ ప్రారంభించారని, ఇప్పటివరకు ఇచ్చింది 20 లక్షల మందికి మాత్రమేనని తెలిపారు. అణగారిన వర్గాలకు గౌరవం అనేది విద్యతో వస్తుందని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. పేదలకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనందరం మరోసారి సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పేదల ఆత్మబంధువు సీఎం జగన్: జూపూడి ప్రభాకరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఆత్మబంధువు అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. పేదలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ, బడుగుల కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అంటే భూస్వామి కాదు.. పెట్టుబడిదారు కాదు.. ప్రభుత్వం అంటే ప్రజలదే అని నిరూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. రాష్ట్రంలో 72 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 52 శాతం మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవులు ఇచ్చారని తెలిపారు. ఓటు వేయనివారికి సైతం పథకాలు అందించిన ఘనత జగన్‌కు దక్కుతోందన్నారు. మహిళా సాధికారిత జగన్‌తోనే: ఎంపీ చింతా అనూరాధ సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో మహిళా సాధికారత సాధ్యమైందని ఎంపీ చింతా అనూరాధ చెప్పారు. చట్ట సభలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెచ్చిందని, సీఎం జగన్ స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి మించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా లబ్ధిపొందారని తెలిపారు. -
మండపేటలో ‘సామాజిక’ హోరు
మండపేట: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. మండపేట కలువ పువ్వు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు అశేష జనవాహిని హాజరై సామాజిక సాధికార యాత్రకు సంఘీభావం తెలిపింది. మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘2019లో మండపేట నియోజకవర్గం ప్రజలు చేసిన తప్పు మళ్ళీ చేయరు. జగనన్న పాలను చూసి 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో వైఎస్సార్సీపీని గెలిపించారు. చంద్రబాబు ఇచ్చే భరోసా ఆయన తనయుడికి మాత్రమే.. ప్రజలకు కాదు. మరోసారి చంద్రబాబు ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ చేసింది పాదయాత్ర.. లోకేష్ చేసింది జాగింగ్ మాత్రమే. రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ పాలన రావాలి’ అని పేర్కొన్నారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఏడాదికి 16 వేల కోట్ల లోటు ఆదాయం ఉన్న రాష్ట్రం మనది. ముఖ్యమంత్రి మారే సమయంలో తక్షణం తీర్చాల్సిన అప్పులు నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయి. మన రాష్ట్రంలో టిడిపి తక్షణం తీర్చాల్సిన 80 వేల కోట్ల రూపాయలు అప్పు మిగిల్చింది.కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకున్నది సీఎం జగన్ కాదా?, రాష్ట్రంలో నూటికి 78 మంది పేదవాళ్లే ....వాళ్లని ఆదుకునే ప్రయత్నమే సీఎం జగన్ చేస్తున్నారు. సరైన న్యాయం మీరే చెప్పండి.ఒకే కులం అనేక సంవత్సరాలు పాటు మండపేటను పాలిస్తోంది. గతంలో ఒకసారి మార్చమని అడిగాం... ప్రజలు మార్చారు.22 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 20 లక్షల మందికి ఇళ్ళ పటాలిస్తే... ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాల సీఎం జగన్ ఇవ్వటం దేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఇచ్చిన ప్రతి హామీ నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారిని జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అనేక రాజ్యాంగబద్ధ పదవుల్లో నిలిపిన ఘనత వైఎస్ఆర్ సీపీదే’ అని స్పష్టం చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం.జగనన్న కటౌట్ చూసే జనం వస్తున్నారు. చంద్రబాబుకు లోకేష్‌కి కూడా పనిలేదు.చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ ,రాధాకృష్ణ, హైదరాబాదులో ఉండి ఆంధ్రాలో విషం చిమ్ముతారు.అధికారంలోకి వస్తే చంద్రబాబు మొత్తం ప్రభుత్వ పథకాలను తీసేస్తారంట.బాబుకి గ్యారెంటీ ఉందా?, లోకేష్ పాదయాత్ర చేశాడా.... ఎవరైనా చూశారా...?, పాదయాత్ర అంటే వైఎస్ఆర్ చేయాలి... లేదంటే వైఎస్ జగన్ చేయాలి. యువగళం సభలో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థిని లోకేష్ చెప్పినా.... పవన్ కళ్యాణ్ సిగ్గులేకుండా స్టేజ్‌పైన కూర్చున్నాడు.నేను వంగవీటి మోహనరంగా అభిమానిని.టిడిపికి ఓటు వేస్తే వంగవీటికి ద్రోహం చేసినట్టే.25 మంది మంత్రులుంటే 17మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు ఉన్నారు ఇదీ సామాజిక సాధికారత. సామాజిక సాధికారత పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. మండపేటలో జరిగే యుద్ధం పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగుతుంది.చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అక్కచెల్లెలను మోసం చేశారు.. రైతులు మోసం చేశారు’ అని ప్రజలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ..‘ప్రభుత్వం అంటే భూస్వామి కాదు... పెట్టుబడిదారుడు కాదు... ప్రభుత్వం అంటే ప్రజలదే... అని నిరూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్. రాష్ట్రంలో 72% బీసీలకు, 52 శాతం మహిళలకు సీఎం జగన్ పదవులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు నేలను గెలవగలరేమో తప్ప ప్రజలను జయించలేరు.పేదపిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించడానికి ప్రయత్నించిన సీఎం జగన్‌ను ఆపేందుకు ప్రతిపక్షాలు ఎంతో ప్రయత్నించాయి.నేర్పితే తెలుగు చచ్చిపోతుందని రామోజీరావు అన్నాడు. సీఎం జగన్ ధైర్యం, సాహసం ముందు ప్రతిపక్షాలు నిలబడలేవు. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు తన కులాన్ని మాత్రమే ప్రోత్సహించాడు.ఆయన ప్రోత్సహించిన ఈనాడు ఎన్టీఆర్‌ను ఎత్తేసి మళ్లీ నేలపై పడేసింది. పేదవాడికి జగన్ అన్నం పెట్టారు... అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో పేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం మరొకటి లేదు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అప్పు 176 లక్షల కోట్లు. దమ్మున్న జగనన్నను చూసి పర్వతంలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా గజగజ వణికింది.పవన్ కళ్యాణ్.... ఈ రాష్ట్రం ప్రయోగశాల కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులు వారి వెనకాల వచ్చే బిసిలు మళ్ళీ జగనన్ననే నాయకుడిగా ఎన్నుకుంటారు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘రానున్న కాలంలో కాపు, బీసీ సామాజిక వర్గాలు కలిసి జగనన్న విజయానికి తోడ్పడాలి. 70 ఏళ్లుగా పార్లమెంటు ఆమోదించని మహిళా బిల్లును తనకున్న ఎంపీలతో ఒంటి చేత్తో గెలిపించిన వ్యక్తి సీఎం జగన్.రాష్ట్రంలో ఓ బీసీ రిజర్వేషన్ ఉండాలని కోరుకున్న వ్యక్తి సీఎం జగన్.ప్రజలతో మమేకమైన తోట త్రిమూర్తులను మండపేటలో కచ్చితంగా గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ.. ‘ ప్రజలందరూ సామాజికంగా ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం జగన్ ఆలోచన. పార్లమెంట్లో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు కానీ సీఎం జగన్ 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. -
నేడు మండపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని ఆత్మీయంగా పలకరించేందుకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన యాత్ర నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సాగనుంది. కర్నూలు జిల్లా: ఎమ్మినూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మండల పరిషత్ కార్యాలయంలో 3.30 గంటలకు ముఖ్య నేతలతో ముఖాముఖి అనంతరం.. 4.30కుఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్సార్ సర్కిల్‌కు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాష, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, మా జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ఎంపీ. సంజీవ్ కుమార్, తదితరులు హాజరుకానున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తాపేశ్వరంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కలువు పువ్వు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, తదితరులు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలకు కసరత్తు.. నేడు, రేపు ఈసీ సమీక్ష -
కుల మతాలకు అతీతంగా మండపేటలో కార్తీక వన భోజనాలు
-
అభివృద్ధి పథంలో మండపేట పరుగులు
-
మండపేటలో టీడీపీకి ఘోర అవమానం
-
సన్నాయి మేళంలో రాణిస్తున్న మండపేట మహిళలు
మండపేట: హిందూ సంప్రదాయంలో డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. శుభకార్యాలు, వేడుకలకు సన్నాయి మేళం తప్పనిసరి. నాదస్వరం పేరు చెప్పగానే పురుష కళాకారులే గుర్తుకు వస్తారు. అందుకు భిన్నంగా మగవారికి దీటుగా డోలు, సన్నాయిని వినసొంపుగా వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన మహిళా కళాకారులు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఈ గ్రామంలో ఏకంగా పది మందికి పైగా మహిళా కళాకారులుండగా.. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఏడిదలోని వెంటూరి సాహెబ్ కుటుంబం డోలు, సన్నాయి వాయిద్యానికి ప్రసిద్ధి. తమ ఇంట ఈ కళకు 80 ఏళ్ల క్రితం ఆయనే ఆజ్యం పోశారు. సాహెబ్ తదనంతరం ఆయన కుమారులు, మనవలు, మునిమనవలు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీతారలు, ప్రముఖుల ఇళ్లలో జరిగే వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చి గ్రామానికి గుర్తింపు తెచ్చారు. ఎంతోమంది కళాభిమానులు వీరి నైపుణ్యానికి మెచ్చి గండపెండేరాలు, సింహతలాటాలు, బంగారు కడియాలతో సత్కరించారు. గత ఐదు తరాల్లో 25 మందికి పైగా సాహెబ్ కుటుంబీకులు నాదస్వర కళను నేర్చుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత తరంలో మేము సైతం అంటూ ఆ ఇంట మహిళలు వాయిద్య కళలో రాణిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణ సన్నాయి మేళంలో వాయిద్య పరికరాలు డోలు, సన్నాయి, చిన్న హార్మోనియం (శ్రుతి బాక్స్), తాళం ఉంటాయి. ఆరుగురి నుంచి ఎనిమిది మంది వరకూ సభ్యులుంటారు. సాధారణంగా పురుష కళాకారులే ఆయా వాయిద్యాలను వాయిస్తూంటారు. అయితే ఏడిద సన్నాయి మేళంలో మహిళా వాయిద్య కళాకారులు ప్రత్యేక ఆకర్షణ. గ్రామంలోని సాహెబ్ కుటుంబానికి చెందిన మూడు సన్నాయి మేళం బృందాలుండగా.. వీటిలో పది మందికి పైగా మహిళా కళాకారులే ఉండటం గమనార్హం. సాహెబ్, తర్వాత ఆయన తనయులు, మనవలు ఎంతో మందికి డోలు, సన్నాయి వాయించడంలో శిక్షణ ఇస్తున్నారు. వారితో పాటు తమ ఇంట్లోని ఆడపిల్లలకు కూడా నేర్పిస్తూంటారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సన్నాయి మేళంలో మహిళలు కూడా భాగస్వాములయ్యారు. మగవారితో సమానంగా డోలు, సన్నాయి అలవోకగా వాయిస్తూ వివిధ వేడుకలకు మరింత శోభను తీసుకువస్తున్నారు. కుటుంబ పోషణలో చేదోడువాదోడవుతున్నారు. అంతా ఒకటే కుటుంబం ఎక్కడ ప్రదర్శన ఉంటే అక్కడకు బృందంలోని తమ కుటుంబ సభ్యులతో కలిసి వీరు వెళ్తూంటారు. గత పదేళ్లలో ఉభయ రాష్ట్రాలతో పాటు రాజాస్తాన్‌లో వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన వివాహాది శుభకార్యాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మండపేట, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వేడుక జరిగినా మహిళలతో డోలు, సన్నాయి మేళం ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. దీంతో మహిళా వాయిద్య కళాకారుల ప్రాధాన్యం పెరిగింది. చదువుతో పాటు తమ ఇంట ఆడపిల్లలకు వాయిద్య కళలో శిక్షణ ఇస్తూంటామని కళాకారుడు వెంటూరి మీరా సాహెబ్ (చిన్న) తెలిపారు. సరదాగా చేసిన సాధనే ఉపాధి అయ్యింది నా చిన్నతనంలో ఏడిదలో మా తండ్రి సత్యనారాయణ చాలా మంది పిల్లలకు శిక్షణ ఇచ్చేవారు. వారితో పాటు నేనూ సరదాగా సన్నాయి వాయిద్యం నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ విద్యే మాకు మంచి గుర్తింపు తెచ్చింది. కుటుంబ పోషణకు ఆసరా అవుతోంది. – డి.సీతారత్నం, వాయిద్య కళాకారిణి, మండపేట ఎంతో గౌరవంగా చూస్తారు తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జరిగిన బ్రహ్మోత్సవాలు, శుభకార్యాల్లోను, సినిమా హీరోలు, రాజకీయ నాయకులకు సంబంధించిన వివిధ వేడుకల్లోను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం. ఆయా చోట్ల నిర్వాహకులు మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తుంటారు. – వెంటూరి రమాదేవి, వాయిద్య కళాకారిణి, ఏడిద గ్రామానికి గుర్తింపు తెచ్చారు డోలు, సన్నాయి కళలో వెంటూరి సాహెబ్ కుటుంబం రాష్ట్ర స్థాయిలో మా గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చారు. ప్రత్యేకంగా పురుషులతో సమానంగా మహిళలు ఈ కళను నేర్చుకుని కుటుంబ పోషణలో భాగస్వాములు కావడం అభినందనీయం. – బూరిగ ఆశీర్వాదం,సర్పంచ్, ఏడిద -
మండపేట గేదా.. మజాకా! నాలుగేళ్ల వయసు, రోజుకు 26.59 లీటర్ల పాలు
మండపేట (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ): ఆ గేదె వయసు నాలుగేళ్లు. పాలదిగుబడిలో తన తల్లిని మించిపోయింది. రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తూ రికార్డు సృష్టించింది. ఆ గేదె తల్లి రోజుకు 26.58 లీటర్లు పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే... నాలుగేళ్ల వయసు కలిగిన పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లిని మించి రికార్డు స్థాయిలో రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు ఆదివారం నిర్ధారించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ (అబ్బు) మేలుజాతి పశు పోషణ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశారు. ఆ గేదె గతంలో విజయవాడ, మండపేటల్లో జరిగిన రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. ఈ గేదె సాధించిన అత్యధిక దిగుబడి 26.58 లీటర్లు. ఇప్పటివరకూ ఆ గేదె తమ వద్ద ఆరు ఈతలు ఈనగా, నాలుగు దున్నపోతులు, రెండు పెయ్యదూడలు పుట్టాయని అబ్బు చెప్పారు. దున్నపోతుల్లో రెండింటిని సెమన్ సేకరణ కేంద్రాల వారు తీసుకువెళ్లగా, మరో రెండు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాలదిగుబడిని ఇస్తున్న పెయ్య ఆరో ఈతలో పుట్టిందని వివరించారు. వీటికి దాణాగా రోజుకు రూ.500 ఖర్చుతో పశుగ్రాసాలు, మొక్కజొన్న, ఉలవలు, తవుడు అందిస్తున్నామని ఆయన చెప్పారు. అధికారికంగా పాలదిగుబడి లెక్కింపు ప్రస్తుతం కేంద్రీయ పశు నమోదు పథకం కింద మండపేట, పరిసర ప్రాంతాల్లో అత్యధిక పాల దిగుబడి ఇచ్చే పాడి పశువుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు పశువుల వద్దకు వెళ్లి మేలుజాతి పాడి గేదెల పాల దిగుబడిని లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా అబ్బుకు చెందిన గేదె ఒక రోజు 26.59 లీటర్ల పాల దిగుబడిని ఇచ్చిందని రాజేశ్వరరావు తెలిపారు. రెండో ఈతలోనే ఈస్థాయిలో దిగుబడి వస్తే మున్ముందు మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. అత్యధిక దిగుబడినిచ్చే పాడి పశువుల వివరాలను సెమన్ సేకరణ కేంద్రాలకు పంపుతామని, వీటి ద్వారా మేలుజాతి పాడి పశువుల పునరుత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజేశ్వరరావు తెలిపారు. -
కోడిగుడ్డు.. కొత్త రికార్డు
మండపేట: గుడ్డు ధర అంతకంతకూ పెరుగుతోంది. పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గుడ్డు రైతు దగ్గర ధర రూ.5.54కు చేరింది. నాలుగేళ్లలో ఇదే అత్యధిక ధర. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ. 7కు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తక్కువగా ఉండటంతో గుడ్ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఎగుమతులు పుంజుకొని రైతులకు అత్యధిక ధర లభిస్తుంది. 2017వ సంవత్సరం సీజన్లో రైతు దగ్గర ధర అత్యధికంగా రూ.5.45 లభించింది. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో నాలుగేళ్లుగా పౌల్ట్రీ రంగం గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సీజన్లో రైతు ధర రూ.5 దాటడం గగనమైంది. ఈ సీజన్లో శీతలం ఎక్కువగా ఉండటంతో జిల్లాలోని గుడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగి, ధర పెరిగింది. ఈ ధర అశాజనకమే అయినప్పటికీ, మేత ధర ఇబ్బడిముబ్బడిగా పెరడంతో ప్రయోజనం అంతంత మాత్రమేనని కోళ్ల రైతులు అంటున్నారు. కోళ్లకు వేసే వ్యాక్సిన్లు, మందుల ధరలు, కార్మికుల జీతాలు పెరిగిపోవడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని పెంచేసిందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది సగటు ధర రైతు దగ్గర రూ.5 ఉంటేనే కానీ గిట్టుబాటు కాదని, గత ఏడాది సగటు ధర రూ. 4.39 మాత్రమే ఉండటంతో నష్టాలు వచ్చాయని చెబుతున్నారు. కోడి మేతకు వినియోగించే మొక్కజొన్న, సోయా, నూకలు తదితర వాటిని పౌల్ట్రీలకు రాయితీపై సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధరలు తగ్గితేనే ఊరట గతంతో పోలిస్తే ఈ సీజన్లో గుడ్డు అత్యధిక రైతు ధరను నమోదు చేసుకుంది. ప్రస్తుత ధర ఆశాజనకంగా ఉన్నా కోడి మేత ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మేత రేట్లు అందుబాటులోకి వస్తేనే పరిశ్రమకు ఊరట. కోడి మేతను సబ్సిడీపై పౌల్ట్రీలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ -
ఫొటోగ్రాఫర్ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన మండపేటలో ఫొటోగ్రాఫర్‌ను పీక నులిమి చంపేశారు. నూతన సంవత్సర వేడుకల వేళ మండపేట బైపాస్ రోడ్డులోని ఒక లే అవుట్లో ఆ ఫొటోగ్రాఫర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తీరా తీగ లాగితే డొంక కదిలింది. అనుమానితులను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. ఈ హత్య వెనుక పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో కీలక నిందితునిగా ఉన్న అతడి అనుచరుడు పరారీలో ఉండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. అసలు ఈ హత్యకు, ఆ మాజీ ప్రజాప్రతినిధికి మధ్య సంబంధం ఏమిటి, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతోంది. మండపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ కొనిజాల సురేష్ (28) డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి వెళ్లి శవమై తేలాడు. తొలుత పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా నాలుగు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మండపేట బైపాస్ రోడ్డులోని ఓ లే అవుట్లో ఆ రోజు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో పట్టణ టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కారు డ్రైవర్‌తో కలిసి సురేష్ పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్‌తో పాటు మరికొందరిని తమదైన శైలిలో విచారించి, సురేష్ హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితుల పేర్లను సేకరించారు. వారిలో సదరు మాజీ ప్రజాప్రతినిధి ప్రధాన అనురుడు కూడా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అతడితో పాటు మరికొందరు పరారీలో ఉండటంతో వారి కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఆ మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేసేవారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరికొందరు అనుమానితుల పేర్లు విచారణలో పోలీసులకు చెప్పినట్టుగా హతుని సోదరుడు ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం సంచలనమైంది. విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు, అనుమానితుల కాల్‌డేటా వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మండపేట వచ్చి అనుమానితులను విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ సు«దీర్కుమార్రెడ్డి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సురేష్ మెడ భాగంలో ఎముకలు విరిగి ఉన్నట్టు నిర్ధారణ అయింది. చదవండి: కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో 4 ఏళ్ల ప్రేమ.. బర్త్‌డే పేరుతో! దీంతో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. పరారీలో ఉన్న అనుమానితులు దొరికితే మాజీ ప్రజాప్రతినిధి పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా విచారణ చేస్తున్నామని మండపేట టౌన్ సీఐ పి. శివగణేష్ చెప్పారు. కేసులోని ప్రధాన నిందితులను ఆధారాలతో సహా పట్టుకుంటామని అన్నారు. -
Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు
సాక్షి, తూర్పుగోదావరి(మండపేట): కోడి గుడ్డు ధర కొండెక్కింది. రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.ఏడుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకున్నాయి. మరోపక్క కార్తిక మాసం ముగియడంతో స్థానిక వినియోగం పెరగడంతో గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. కాగా సీజన్లో రైతు ధర నిలకడగా ఉంటేనే నష్టాలు కొంత భర్తీ అవుతాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలో చేపల లభ్యత తక్కువగా ఉండటం వల్ల గుడ్ల వినియోగం పెరిగి ఎగుమతులకు డిమాండ్ ఉంటుంది. శీతల ప్రభావం అధికంగా ఉండే అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి సీజన్‌గా భావిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైతు ధర పౌల్ట్రీకి ఆశాజనకంగా ఉంటుంది. పౌల్ట్రీ వర్గాల ఆందోళన మంగళవారం నాటికి రైతు ధర రూ. 5.44కు చేరింది. కాగా రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 పలుకుతుండటంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అమ్మకాలు చేయడం పరిపాటి. అందుకు భిన్నంగా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న మండపేట, అనపర్తి, పెద్దాపురం, రాజానగరం పరిసర ప్రాంతాల్లో రూ 6.50కు అమ్మకాలు చేస్తుండగా రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర చోట్ల ఏడు రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.7.50కు అమ్మకాలు జరుగుతున్నట్టు వ్యాపారులు అంటున్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) రెండు వారాల క్రితం రూ.5 ఉన్న గుడ్డు ధరను ఏడు రూపాయలు వరకు పెంచేశారని వినియోగదారులు అంటున్నారు. డ్యామేజీ అయిన గుడ్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ధర పెంచకతప్పడం లేదని వ్యాపారులు అంటున్నారు. కాగా రిటైల్ మార్కెట్లో ధర బాగా పెరిగిపోవడం పౌల్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక ధరతో వినియోగం తగ్గితే ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుందంటున్నారు. పెరిగిన మేతలు, మందుల ధరలు, నిర్వహణ భారంతో గుడ్డు ఏడాది సగటు రైతు ధర ఐదు రూపాయలు ఉంటేనే గిట్టుబాటు కాదని కోళ్ల రైతులు అంటున్నారు. ఈ ఏడాది సగటు ధర నాలుగు రూపాయలు మాత్రమే ఉండటంతో ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. సీజన్లో రైతు ధర రూ. 5.50 దాటి నిలకడగా ఉంటేనే పాత నష్టాలను భర్తీ చేసుకునేందుకు వీలుంటుందన్నారు. రైతు ధర నిలకడగా ఉండాలి మేత ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. ఏడాది సగటు రైతు ధర రూ. ఐదు ఉంటేనే కాని గిట్టుబాటు కాదు. ప్రస్తుత రైతు ధర సీజన్లో నిలకడగా ఉంటే పాత నష్టాలు కొంతమేర భర్తీ అవుతాయి. ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వపరంగా సాయం కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
మండపేట నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
ఏపీ: పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది
సాక్షి, తాడేపల్లి: విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరని.. సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఎవరూ చెరిపేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలో మండపేట(డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా) నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్యనేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎమ్మెల్సీ తోట మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వానికి.. ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు గుర్తుకు వచ్చేవి. తప్పుడు ప్రచారాలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది. దీనికి మళ్లీ గెలిపించుకుంటాం. మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారు. ఆయన మాకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే శాయశక్తులా కృషి చేస్తాం. కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. సీఎం జగన్ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయమని కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇదీ చదవండి: ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్ -
కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధ్యానత ఇచ్చారు : ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
-
92 శాతం ప్రజలకు పథకాలు అందుతున్నాయ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మనకు ఓటు వేయకపోయినా.. అర్హులకు మంచి చేశాం. అలాంటప్పుడు వాళ్లు మనల్ని ఎందుకు ఆదరించారు?. కచ్చితంగా ఆదరించి తీరతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండపేట కార్యకర్తలతో తాడేపల్లిలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట ప్రజలకు 946 కోట్ల రూపాయలను డీబిటీ(డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్జాక్షన్) ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పనిచేశాం. గ్రామాల్లో వచ్చిన మార్పును మనం జనంలోకి తీసుకెళ్లాలి. ఒక మిషన్ ద్వారా దీన్ని జనంలోకి తీసుకెళ్లాలి. మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లకు గాను 92 శాతం ఇళ్లకు పథకాలు చేరాయి. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే 92 శాతం మంచి పనులు చేయగలిగాము. ఆ మంచిని వివరిస్తూ గడపగడపకు వెళ్లేలా ప్లాన్ చేశాం. అలా వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు మనకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికలలో 175కు 175 సీట్లు ఎందుకు రావు?. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. అర్హత ఉంటే చాలు.. అందరికీ మేలు చేశాం. మనకు ఓటు వేయకపోయినా మంచి చేస్తే వారి మనసు కరుగుతుందని మేలు చేశాం. కలిసికట్టుగా అందరూ పనిచేసి ఎన్నికలలో పార్టీని గెలిపించాలి’ అని సీఎం జగన్ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. మిమ్నల్ని కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి కలిసి చాలారోజులైంది. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే... రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవచ్చు. దానికి సంబందించి ఇప్పుడే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాలా ? అని అనుకోవచ్చు. 18 నెలలు ఉన్నప్పటికీ ఆ దిశగా మనం అడుగులు ఎందుకు వేయాలన్నది చెప్పడానికే మిమ్నల్ని రమ్మన్నాం. ► ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయి. కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్ద ప్రతి 2వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబం కూడా అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్ విధానంలో అడుగులు వేశాం. ► ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం బటన్ నొక్కి ప్రతి ఇంటికి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వైయస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాలు డీబీటీ ద్వారా ఆధార్ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇంత మార్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ప్రజలదగ్గరకు తీసుకుని వెళ్లి...వారికి ఇవన్నీ గుర్తు చేసి.. ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని అడుగులు ఇంకా ఎఫెక్టివ్‌గా వేసేదానికి మిమ్నల్ని భాగస్వామ్యులను చేస్తున్నాం. ► మొట్టమొదటిసారిగా గడప గడప అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే.. మన ఎమ్మెల్యే కానీ, మన ఎమ్మెల్యే అభ్యర్ధి కానీ... గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్ధ, మండల స్ధాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ మరోవైపు పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే... అటువంటి వారు కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలుఅంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు ఉండాలి. ఒక్కోరోజు కనీసం 6 గంటలు ఆ సచివాలయంలో ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. ► మీ నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరాయి అని ఏకంగా ఆథార్ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలికే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం. ► గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92 శాతం ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప, గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా పథకాలు అందాయి అని చల్లని ఆశీస్సులు ఆ అక్కచెల్లెమ్మలు మనమీద చూపించినప్పుడు ఆగ్రామంలో మనం గెలుస్తాం. ► గ్రామం గెల్చినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు ?. ఒక్క మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాల్టీతో సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లెక్క తీసుకుంటే.. మున్సిపాల్టీలో 30 కి 23 వైయస్సార్సీపీ, జడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్‌స్వీప్ చేశాం. ప్రజల దీవెనలు మనవైపు కనిపిస్తున్నాయి. కారణం పాలన పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లంచాలు అవసరం లేదు. వివక్ష చూపించడం లేదు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే కచ్చితంగా వచ్చేటట్టు చేస్తాం. మనం చేసిన మంచిని చూసి మార్పు వస్తుంది. ► సోషల్ ఆడిట్లో జాబితాలు ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ జరుగుతుండగానే మారుతున్న గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామంలోకి అడుగుపెడుతూనే సచివాలయం కనిపిస్తుంది. వాలంటీర్ వ్యవస్ధ కనిపిస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, విలేజ్ క్లీనిక్కులు కనిపస్తాయి. శరవేగంగా డిజిటల్ లైబ్రరీలు కట్టే కార్యక్రమం కూడా మొదలుపెడుతున్నాం. ఇవన్నీ గతంలో లేనివి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాయి. గతంలో పిల్లలు చదువుకునే వయస్సుకు వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి పోయి ఇంగ్లిషు మీడియం బడులు మన గ్రామాల్లో వస్తున్నాయి. వైద్యం అన్నది విలేజ్ క్లీనిక్కుల ద్వారా మన గ్రామంలోనే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంతా ఒకేచోట ఉంటూ.. 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేసేటట్టుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఊర్లోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇంత మార్పు గతంలో జరగలేదు. ► డీసెంట్రలైజేషన్ ఈ స్ధాయిలోకి వెళ్లి మంచి చేయాలన్న ఆరాటం గతంలో లేదు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న నేపధ్యంలో కచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా మార్పు రావాలి. వై నాట్ 175. కచ్చితంగా జరుగుతుంది. మీరు నేను ఒక్కటైనప్పుడు ఇది జరుగుతుంది. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి. నేను బటన్ సరిగ్గా నొక్కాలి. అక్కడ పొరపాట్లు జరగకూడదు. నా ధర్మం నేను చేయాలి. మీరు అంతా కలిసి ప్రతి గ్రామంలో మనం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకునిపోవడమే కాకుండా, వారికి అర్ధమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ల చల్లని ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఆశీస్సులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇద్దరం కలిస్తే సాధ్యం కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇది చేయడం కోసం మీ అందరి మద్దతు కూడా ఈ దిశగా కూడగట్టేందుకు ఈ రోజు మిమ్నల్ని ఇక్కడికి ఆహ్వానించాం అని సీఎం జగన్ ప్రసంగించారు. టార్గెట్ 175లో భాగంగా.. కొన్ని నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో బుధవారం సీఎం జగన్ సమావేశం అయ్యారు. సీఎం వైఎస్ జగన్‌తో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. -
సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా..
మండపేట(కోనసీమ జిల్లా): ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోటకు చేరారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మైమరచిపోయారు. విద్య నేర్పిన గురువులను సత్కరించడంతో పాటు ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సినీనటుడు ఆలీ తళుక్కున మెరిసి సందడి చేశారు. మండపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 1991–92 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక సూర్య ఫంక్షన్ హాలులో జరిగింది. చదవండి: సీక్రెట్ స్మోకింగ్‌పై స్పందించిన బిందుమాధవి తాము 10వ తరగతి పూర్తిచేసుకుని 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయించుకున్నారు. అప్పట్లోనే తమ బ్యాచ్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయడం ద్వారా ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరిని ఒక తాటిమీదకు తెచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ క్షేమ సమాచారాలను పంచుకున్నారు. అదే బ్యాచ్‌కు చెందిన ఆలీ సతీమణి జుబేదా వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్న సమయంలో అనుకోని అతిథిలా ఆలీ వేడుకకు విచ్చేసి అందరినీ ఆనందంలో ముంచెత్తారు. అప్పట్లో తమకు విద్య నేర్పిన గురువులు ప్రమీలా జూలియట్, సుబ్బయ్యశాస్త్రి, తలుపులమ్మ, షబాబా, వీరన్న, సత్యవతి, ఈశ్వరిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా జ్ఞాపికలు అందజేశారు. సహపంక్తి భోజనాలు అనంతరం పూర్వ విద్యార్థులందరూ తమతమ కుటుంబ సభ్యులతో కలిసి తాము చదువుకున్న పాఠశాలను సందర్శించి సందడి చేశారు. కార్యక్రమం నిర్వహణకు కృషిచేసిన మెహర్జ్యోతి, విజయవాణిలను సహచర విద్యార్థులు సత్కరించారు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనే తన సతీమణికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా ఉదయం ఫ్లైట్‌కు బయలుదేరి వచ్చినట్టు ఆలీ తెలిపారు. పూర్వపు విద్యార్థులంతా ఇలా కలుసుకుని విద్యాబుద్ధులు నేరి్పన గురువులను సత్కరించుకోవడం అభినందనీయమన్నారు. ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ ఉండాలన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆలీతో సెల్ఫీలు తీసుకునేందుకు చిన్నారులు, వేడుకకు హాజరైన వారు ఉత్సాహం చూపించారు. కొద్దిసేపటి తర్వాత ఆలీ వేడుక నుంచి వెనుతిరిగారు. -
సురుచిలో శేఖర్ మాస్టర్ దంపతుల సందడి
సాక్షి, మండపేట (కోనసీమ): ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, టీవీ డాన్స్‌షోల జడ్జి శేఖర్ మాస్టర్ సోమవారం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌లో సందడి చేశారు. తన సతీమణి సుజాతతో కలిసి జిల్లాలోని ఆలయాల సందర్శనకు వచ్చిన ఆయన మార్గమధ్యంలో సురుచిలో ఆగారు. శేఖర్ మాస్టర్ దంపతులకు బాహుబలి కాజాను కానుకగా అందించి సత్కరించారు. చదవండి: (శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం) -
చుక్కల్లో ధరలు.. కిలో స్కిన్లెస్ చికెన్ రేటెంతో తెలుసా?
సాక్షి, కాకినాడ(మండపేట): రెండు నెలలుగా చికెన్ ధర దిగి రానంటోంది. స్కిన్లెస్ కిలో రూ.300 నుంచి రూ.320తో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ నెల మొదలు కావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి. వేసవి ప్రభావం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 వరకూ కోళ్లఫారాలు ఉన్నాయి. వీటిల్లో 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకూ పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోళ్ల మేత ధరలు గణనీయంగా పెరగడం వీటి పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. చదవండి: (అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే..) మొక్కజొన్న కిలో రూ.14 నుంచి రూ.25కు పెరగగా, సోయా రూ.40 నుంచి రూ.90కి పెరిగిపోయింది. అన్ని మేతలూ మిక్స్ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50 వరకూ పెరిగిపోయిందని కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ.35కు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ.110 వరకూ వ్యయమవుతోందని రైతులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధిక శాతం మంది బ్రాయిలర్ కోళ్ల రైతులు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్‌పై కేవలం కోడి పిల్లలను పెంచి, పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫారాలు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా అదే ధర స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.200 వరకూ ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300కు, లైవ్ కిలో రూ.100లనుంచి రూ.150కి చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350 వరకూ కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లింలు చికెన్ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తూంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాల అంచనా. నిర్వహణ పెరిగిపోయింది ఎప్పుడూ లేనంతగా కోళ్ల మేత ధరలు, కోడి పిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడంతో ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
తూ.గో. ఎస్పీకి హెచ్ఆర్సీ నోటీసులు
కర్నూలు(సెంట్రల్): తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కాళీకృష్ణ భగవాన్(20) అనే యువకుడి ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఆదేశించింది. అడిషనల్ జిల్లా ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ తూర్పు గోదావరి ఎస్పీ, రామచంద్రాపురం డీఎస్పీ, మండపేట సీఐ (ప్రస్తుతం వీఆర్), మండపేట స్టేషన్ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏప్రిల్ 11వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రేమ వ్యవహారంలో ప్రియురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట టౌన్ సీఐ దుర్గప్రసాద్ కాళీకృష్ణ భగవాన్ను స్టేషన్‌కు పిలిచి మర్మావయం దగ్గర గాయపడేలా కొట్టారని, అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనేది ప్రధాన ఆరోపణ. పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు నోటీసులు జారీ చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ బి.తారక నరసింహకుమార్ తెలిపారు. -
Tea Powder: అరే ఏంట్రా ఇది.. టీ పౌడర్ని కూడా వదలరా..?
నిర్మా పౌడర్.. జీడి తొక్కల పొట్టు.. సుద్ద మట్టి.. రంపపు పొట్టు.. కాదేదీ టీ పొడి తయారీకి అనర్హం అన్నట్టుగా ఉంది టీ పొడి తయారీ కేంద్రాల్లో పరిస్థితి. తేయాకుతో తయారు చేయాల్సిన టీ పొడిని.. ప్రజల ఆరోగ్యానికి తూట్లు ‘పొడి’చేలా తయారు చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. లూజ్ టీ పొడి పేరుతో గలీజు వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశంతో టీస్టాల్ నిర్వాహకులు, పేదలు వీటిని వినియోగిస్తూ తమ గొంతుల్లో గరళాన్ని నింపుకొంటున్నారు. సాక్షి, మండపేట: ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్.., ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్.., ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్.. అంటూ ఓ సినీ కవి ఛాయ్(టీ) గొప్పదనాన్ని ఎంతో బాగా వివరించారు. నిజమే.. ఎందుకంటే చాలా మందికి వేడివేడి టీ తాగనిదే పొద్దు గడవదు.. నిత్యజీవితంలో భాగమైన ఈ టీ అమ్మకాల ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. మరోవైపు టీకి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని లూజ్ టీపొడి మాటున కల్తీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు కొందరు. కల్తీ టీ పొడి తయారీకి వినియోగిస్తున్న సుద్దమట్టి జిల్లాలో లైసెన్సుడ్ టీపొడి తయారీ కేంద్రాలు రాజమహేంద్రవరం, మండపేట తదితర చోట్ల కేవలం 11 మాత్రమే ఉన్నాయి. వీరు కేరళ, అస్సాం, కోల్‌కతా నుంచి లూజ్ టీ పొడి తీసుకువచ్చి వాటిని 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు తదితర కేటగిరీలుగా ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తుంటారు. అయితే ఏ విధమైన అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అనధికార కేంద్రాలు కూడా జిల్లాలోని రాజమహేంద్రవరం, మండపేట, అనపర్తి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నకిలీ ముఠాలు స్థానిక అధికార యంత్రాంగానికి ముడుపులు ముట్టచెప్పుతుండడంతో వారు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి. చదవండి: (మార్కాపురం కోర్టుకు హీరో సుమంత్, సుప్రియ) కల్తీకి అడ్డదారులెన్నో.. రాజమహేంద్రవరంలో రూ.40 నుంచి రూ.50లకు లభ్యమయ్యే నాసిరకం లూజ్ టీపొడి తీసుకువచ్చి వాటిలో రంగు, రుచి, వాసన కోసం డిటర్జెంట్ పౌడర్, జీడిపిక్కల పొట్టు, చింతపిక్కల పొడి, రంపం పొట్టు, సుద్ద మట్టి, కెమికల్స్‌ను కలుపుతూ కల్తీ టీ పొడి తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ టీ పొడి కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉండగా ఈ లూజ్ టీ పొడి కేవలం రూ.150కు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో టీ స్టాళ్లు, పేదవర్గాల వారు దీనినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పట్టణాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై కల్తీ టీపొడి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కల్తీ టీ పొడి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు జిల్లా నుంచి వ్యాపారులు లూజ్ టీ పొడి తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీని నాణ్యతపై అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా ఉంది. ఇటీవల బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేటలో ఫుడ్ సేఫ్టీ, పోలీసు అధికారులు నిర్వహించిన దాడుల్లో విస్మయం కలిగించే విషయాలు వెలుగుచూశాయి. ప్రజారోగ్యానికి చేటు చేసే కెమికల్స్, డిటర్జెంట్స్‌తో నాలుగేళ్లుగా కల్తీ టీపొడి తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు. పలు లైసెన్సుడ్ కేంద్రాల్లోనూ టీ పొడిలో రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నారు. చదవండి: (బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనే ఎక్కువ!) ఆరోగ్యానికి చేటు ప్రమాదకర కెమికల్స్‌ను కలపడం వలన కల్తీ టీపొడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్సర్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందంటున్నారు. కల్తీ టీ పొడికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కల్తీని ఇలా గుర్తించవచ్చు టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. కేసుల నమోదు ఆహార పదార్థాల్లో కల్తీలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. కల్తీ టీ పొడి తయారీపై ఏడాది కాలంలో జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేశాం. ఎక్కడైనా ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నాం. కల్తీ ఉన్నట్టు నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – బి. శ్రీనివాస్, సహాయ నియంత్రణ అధికారి, కాకినాడ కల్తీని ఇలా గుర్తించవచ్చు టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. -
సినీనటుడు సంపత్‌కు బాహుబలి కాజాతో సత్కారం
సాక్షి, మండపేట: ప్రముఖ సినీ విలన్ సంపత్‌ను శుక్రవారం తాపేశ్వరంలోని మడతకాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ బాహుబలి కాజాతో సత్కరించింది. కురసాల కల్యాణకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ సీతానగరం మండలం వంగలపూడిలో జరుగుతోంది. షూటింగ్లో పాల్గొన్న సంపత్‌ను సురుచి పీఆర్ఓ వర్మ కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు. -
గిన్నిస్‌లో చూడ‘చెక్క’ని స్పూన్!
మండపేట: చెక్కతో అతిసూక్ష్మ స్పూన్ తయారు చేసి తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు గిన్నిస్ రికార్డులోకెక్కారు. స్వర్ణకార పనిచేసే ఈయన చిన్న పరిమాణంలో కళాకృతులు తయారీ ద్వారా గతంలో అనేక రికార్డులను సొంతం చేసుకున్నారు. పంచదార పలుకు కంటే చిన్న పరిమాణంలో చెక్క స్పూన్ తయారీ ద్వారా గిన్నిస్ రికార్డును సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 10న మండపేట పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో ప్రభుత్వాధికారులు, గిన్నిస్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో అతిసూక్ష్మ చెక్క స్పూన్‌ను తయారు చేశారు. 2 గంటల 13 నిమిషాల వ్యవధిలో 3.09 మిల్లీ మీటర్ల పరిమాణంలో దీన్ని తయారు చేశారు. గిన్నీస్ రికార్డు సంస్థ నుంచి వచ్చిన సర్టిఫికెట్, మెడల్‌ను మంగళవారం మండపేటలో వెటర్నరీ రిటైర్డ్ జేడీ డాక్టర్ విజయకుమారశర్మ, ఒంగోలుకు చెందిన çసృష్టి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ తిమ్మిరి రవీంద్ర, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్, ఎస్ఆర్ అసోసియేషన్ అధినేత రాకుర్తి సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు. -
మండపేటలో టీడీపీ పాతికేళ్ల ఆధిపత్యానికి గండి
మండపేట: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కంచుకోటగా పేరుపొందిన మండపేటలో ఆ పార్టీ ఆధిపత్యానికి గండి పడింది. మున్సిపల్ ఎన్నికల్లో మండపేట పురపాలక సంఘం వైఎస్సార్సీపీ పరమైంది. మొత్తం 30 వార్డులకుగాను 22 చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఏడు వార్డులకు పరిమితమైంది. దాదాపు 25 ఏళ్లుగా మండపేట మున్సిపాలిటీలో టీడీపీదే ఆధిపత్యం. టీడీపీ ఆవిర్భావం అనంతరం 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్ పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జునచౌదరి సతీమణి విజయ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2000, 2005, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ వరుస విజయాలు సాధించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పదివేల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించగా అందులో సగంపైగా మండపేట పట్టణం నుంచే వచ్చింది. అయితే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం.. సీఎం వైఎస్ జగన్ సాగిస్తున్న సంక్షేమ పాలనతో టీడీపీ కంచుకోట అని భావించిన మండపేటలో ఆ పార్టీ కూసాలు కదిలిపోయాయి. వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు తన రాజకీయ వ్యూహాలతో పార్టీకి ఘనవిజయం అందించారు. కార్పొరేషన్లలో సైకిల్ అడ్రస్ గల్లంతు 11 కార్పొరేషన్లలో ఒక్కచోట కూడా టీడీపీ ప్రభావం చూపించలేకపోయింది. తమకు పట్టున్నట్లు చెప్పుకుంటూ కచ్చితంగా గెలుస్తామని బీరాలు పలికిన విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో సైతం చిత్తుగా ఓడిపోయింది. రాజధాని ప్రాంతమైన గుంటూరు కార్పొరేషన్లో ఆ పార్టీకి వచ్చిన డివిజన్లు 8 మాత్రమే కావడం గమనార్హం. చంద్రబాబు సొంత జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో ఆ పార్టీ ప్రభావమే కనిపించలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని వైఎస్సార్సీపీకి అంటగట్టి గెలవాలని చంద్రబాబు చూసినా నగర ప్రజలు ఛీకొట్టారు. విశాఖలో గత ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున గెలిచినా కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం కనపడలేదు. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల నియోజకవర్గాల్లోనూ టీడీపీ చతికిలపడింది. ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉన్నా మున్సిపాల్టీలో గెలవలేకపోయింది. -
అమ్మకానికి ఇందిరమ్మ స్థలాలు..
మండపేట పట్టణానికి చెందిన మహిళకు పదేళ్ల క్రితం రాజీవ్ గృహకల్పలో ప్లాటు, గొల్లపుంత కాలనీలో ఇందిరమ్మ స్థలం మంజూరయ్యాయి. ఏదో ఒక పథకానికి మాత్రమే అర్హులన్న నిబంధనతో ఆమె స్థలాన్ని వదులుకుంది. ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని దళారులు అన్యాక్రాంతం చేసేశారు. తాజాగా కొనుగోలు చేసుకున్న వారు ఇంటి నిర్మాణానికి సన్నద్ధమవుతుండగా స్థానికుల ఫిర్యాదుతో హౌసింగ్ అధికారులు అడ్డుకుని నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. గొల్లపుంత కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న అక్రమాల్లో వెలుగు చూసిన ఉదంతమిది. బయటకు రాకుండా అన్యాక్రాంతమైన ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, ఇళ్లు 400 పైనే ఉంటాయని అంచనా. మండపేట: పట్టణంలోని ఇందిరమ్మ స్థలాల్లో రియల్ వ్యాపారం చాపకింద నీరులా సాగిపోతోంది. ఖాళీ స్థలం నుంచి నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను రూ.మూడు లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మేస్తున్నారు. వ్యాపారులు, దళారులతో పాటు ఉద్యోగులు సైతం బినామీ పేర్లపై ఇక్కడ స్థలాలు కొనుగోళ్లు చేసి నిర్మాణాలు చేస్తున్నట్టు సమాచారం. పేదల స్థలాల్లో సాగుతున్న రియల్ వ్యాపారం ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. వైఎస్ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో.. దివంగత వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ పథకం మండపేటలో వేలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసింది. వైఎస్ ప్రోత్సాహంతో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి పట్టణంలోని గొల్లపుంతలో రెండు విడతలుగా 122.72 ఎకరాలను సేకరించారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద స్థలసేకరణ. తొలి విడతలోని 55.77 ఎకరాల లేఅవుట్‌ను సెంటున్నర చొప్పున రెవెన్యూ అధికారులు 2,125 ప్లాట్లుగా విడదీశారు. 1,890 మంది లబి్ధదారులకు పంపిణీ చేయగా మిగిలిన 235 ప్లాట్లను ఖాళీగా ఉంచారు. 2010 నవంబరు నుంచి నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఎస్ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 1500 ఇళ్లు మాత్రమే పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అమ్మకానికి స్థలాలు, ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ సిబ్బంది అవకతవకలకు పాల్పడడంతో అక్రమాలకు తెరలేచింది. పలువురు సొంతిళ్లు ఉన్న వారికి, రాజీవ్ గృహకల్పలో ప్లాట్లు మంజూరైన వారికి స్థలాలు మంజూరు చేశారు. ఇళ్లు ఉన్న వారు స్థలాల అమ్మకాలు మొదలుపెట్టడంతో పేదల స్థలాల్లో రియల్ వ్యాపారం మొదలైంది. నిబంధనలకు విరుద్దంగా దళారులు స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు చేయిస్తున్నారు. లబి్ధదారుల స్థలాలతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు చేసేస్తున్నారు. పేదలకు పంపిణీ చేయగా ఖాళీగా ఉంచిన 235 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. స్థలం రూ.మూడు లక్షల నుంచి ఉండగా, నిర్మాణంలో ఉన్నవి, పూర్తి చేసిన ఇంటిని రూ.ఐదు లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం. అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు అంచనా. కొందరు ఇళ్లను నిర్మించి అద్దెకు ఇస్తుండడం గమనార్హం. పట్టణంతో పోలిస్తే కాలనీలో అద్దె తక్కువగా ఉండడంతో ఇక్కడకు అద్దెకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కాలనీలో అద్దెకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు 300 కు పైగా ఉంటాయని అంచనా. బయట అద్దెలు చెల్లించలేక, అర్హత ఉన్నా స్థలం రాని పలువురు పేదవర్గాల వారు స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అటువంటి వారికి అన్యాయం జరుగకుండా చూడడంతోపాటు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దర్జాగా కబ్జాలు కాలనీలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపాలీ్టకి ఆదాయం సమకూర్చే దిశగా పట్టణంలో మాదిరి కాలనీలోను మెయిన్ రోడ్డు వెంబడి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పట్లో అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గొడ్డు కాలువ వంతెన వద్ద నుంచి అందరికీ ఇళ్లు, ప్లాట్ల వరకూ రోడ్డు నుంచి దాదాపు 20 మీటర్ల మేర స్థలం వదిలి మిగిలిన దానిలో ప్లాట్లను విభజించారు. కాగా విలువైన ఈ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. కాలనీలో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ స్థలాల్లో జరుగుతున్న రియల్ వ్యాపారాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మండపేట తహసీల్దార్ రాజేశ్వరరావును వివరణ కోరగా తాను ఇటీవల బదిలీపై వచ్చానని, అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదులేమీ రాలేని అన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
‘ఆ ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : మండపేట టౌన్లో రాత్రిపూట పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు తెలిపారు. బుధవారం డీఐజీ మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసంపై కేసు నమోదు చేసి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో 20 మంది వరకు అనుమాతులు ఉన్నారని, సీసీ టీవీ ఫుటేజ్‌లో కొంతమందిని గుర్తించినట్లు తెలిపారు. మండపేట ప్రజలు సమన్వయంతో ఉండాలని సూచించారు. (‘చలో అంతర్వేది’కి అనుమతుల్లేవ్) ‘అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రతి దేవాలయాల దగ్గర కమిటీలు ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ ఏర్పరుచుకోవాలి. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పరుచుకుని గుడి బాధ్యతలు కమిటీ తీసుకోవాలి. చిన్న టెంపుల్స్‌లో సైతం కమిటీలు బాధ్యత తీసుకోవాలి. కమిటీలు ఏర్పాటు చేయని ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించాలి’. అని ఏలూరు రేంజ్ డీఐజీ పేర్కొన్నారు. (అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత') -
కూతురు ఫోన్ రికార్డుతో బయటపడ్డ మర్డర్ స్కెచ్
సాక్షి, తూర్పు గోదావరి : భార్య ఉండగానే వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. మహిళతో అక్రమ సంబంధానికి ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయాలని పథకం రచించాడు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండపేట సంఘం కాలనీకి చెందిన మహిళతో సతీష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా ఆమె భర్తకు తెలియడంతో పలుమార్లు ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న ఆమె భర్తను తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. దీని కోసం అతని స్నేహితుడు ప్రతాప్ సాయం కోరాడు. అతని సలహా మేరకు ఆహారంలో స్లో పాయిజన్ ఇచ్చేందుకు పథకానికి ప్రణాళిక రచించాడు. దీనికి మహిళ కూడా ఓకే చెప్పడంతో హత్య చేయాలని భావించాడు. అయితే తల్లి వ్యవహారంపై అప్పటికే అనుమానం వచ్చిన చిన్న కూతురు ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే హత్య పథకం బయటపడింది. తండ్రిని హత్య చేసేందుకు సతీష్‌తో కలిసి భార్య కుట్ర పన్నిందన్న విషయం తెలిసి భర్త షాకయ్యాడు. అనంతరం మహిళ భర్త మండపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. సతీష్‌పై ఐపీసీ 307, 328 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ పథకంలో ప్రధాన పాత్రదారులైన సతీష్, ప్రతాప్‌లను నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
మార్కెటింగ్ కేంద్రాలుగా ఆర్బీకేలు..
సాక్షి, తూర్పు గోదావరి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ.. వారికి వెన్నుదన్నుగా ఉండాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దేశంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. జిల్లాలోని మండపేట మండలం ఆర్తమూరులో సోమవారం రైతులతో నిర్వహించిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 10600 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహకారం అందుతోందని.. రానున్న కాలంలో వీటిని మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చబోతున్నామని తెలిపారు. అదే విధంగా 200 కోట్ల రూపాయిలతో ఇంటిగ్రేటెడ్ ల్యాబులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘త్వరగా పాడయ్యే పంటలకు సైతం గిట్టుబాటు ధర కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అదే విధంగా రైతులకు ఏదైనా ప్రమాదం లేదా మరణం సంభవిస్తే ఏడు లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోంది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో 15 లక్షల రూపాయిలు విలువ చేసే వ్యవసాయ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతుకు అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యం’’అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. -
జనసేన నేత దాడి.. ఆత్మహత్యాయత్నం
సాక్షి, మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట జనసేన నియోజకవర్గ ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ తనపై చేయిచేసుకున్నాడన్న మనస్తాపంతో వైఎస్సార్సీపీ కార్యకర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన రాచకొండ భీమరాజు మున్సిపల్ మార్కెట్ ఆశీలు పాటదారుని వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపారుల నుంచి అధికంగా ఆశీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ శుక్రవారం మార్కెట్ వద్ద భీమరాజుపై లీలాకృష్ణ చేయిచేసుకున్నాడు. (టీడీపీ నేతలకు చుక్కెదురు) దీంతో మనస్తాపం చెందిన భీమరాజు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబసభ్యులు అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైఎస్సార్సీపీకి చెందిన కాపు నేతలు జిన్నూరి సాయిబాబా, పిల్లా వీరబాబు బాధితుడిని పరామర్శించారు. లీలాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (అసత్య ఆరోపణలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేత) -
దుర్మార్గులు దొరికారు
సాక్షి, మండపేట: పట్టణంలో సంచలనం సృష్టించిన దళిత విద్యార్థినిపై లైంగికదాడి ఘటనలో నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని బైపాస్‌రోడ్డులో నిందితులు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్టు చేసినట్టు రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. సంఘటన వివరాలను శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. మండపేటలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థిని ఈనెల 3వ తేదీన కళాశాలకు వెళ్లి సాయంత్రం స్నేహితుడి మోటారు సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో బైపాస్ రోడ్డులోని సంఘం కాలనీ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు బండిని ఆపి పోలీసులమంటూ రికార్డులు చూపాలని అడిగారు. అందులో ఒక వ్యక్తి యువతి స్నేహితుడిని పక్కకు తీసుకువెళ్లగా మరో వ్యక్తి మరో ఇద్దరికి ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురు కలిసి విద్యార్థినిని పక్కనే పంట పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహికంగా లైంగికదాడికి పాల్పడినట్డు డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. స్పృహ కోల్పోయిన ఆమె కొద్దిసేపటి తర్వాత తేరుకుని స్నేహితుల సాయంతో ఇంటికి చేరుకుంది. భయపడి జరిగిన సంఘటనను ఇంట్లో చెప్పలేకపోయింది. మరుసటి రోజు జరిగిన అన్యాయం గురించి తన సోదరుడితో చెప్పి అతడి సాయంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చదవండి: సామూహిక అత్యాచారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ ఎ.నాగమురళి నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా రాజగోపాలరెడ్డి దర్యాప్తు చేపట్టారు. లైంగికదాడికి పాల్పడిన నలుగురు నిందితులు బైపాస్ రోడ్డులో ఉన్నట్టు గురువారం సాయంత్రం సమాచారం అందడంతో సీఐ నాగమురళీ, ఎస్సై రాజేష్‌కుమార్ దాడిచేసి మధ్యవర్తుల సమక్షంలో వారిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున నిందితులను మీడియా ముందుకు తీసుకురాలేమని, అలాగే వారి పేర్లను ఇంకా వెల్లడించలేమని డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థలం ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం పట్టణానికి చెందిన వల్లూరి మురళీకృష్ణ, సుంకర వెంకన్న, మొలకల వీరబాబు, చామంతి మధులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. తొలుత ప్రధాన నిందితుడు వల్లూరి మురళీకృష్ణ విద్యార్థినిపై ఘాతుకానికి ఒడిగట్టగా, ఆ తర్వాత సుంకర వెంకన్న లైంగికదాడికి పాల్పడ్డాడు. ములకల వీరబాబు సంఘటన స్థలంలోనే ఉండి యువతి కాళ్లను గట్టిగా పట్టుకుని వారికి సహకరించాడు. వదిలిపెట్టమని విద్యార్థిని ఎంత ప్రాధేయపడినా పట్టించుకోకుండా అత్యంత పాశవికంగా వారు లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. రాత్రి ఎనిమిది గంటల సమయం కావడం, రోడ్డు నుంచి పొలాల్లోకి దూరంగా తీసుకువెళ్లిపోవడంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. విడిపించుకునే ప్రయత్నం చేసినా ఆమెపై దాడిచేయడంతో పాటు పరుష పదజాలంతో దూషిస్తూ కాళ్లు కదలకుండా తొక్కిపెట్టి అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డారు. స్పృహలేకుండా పడి ఉన్న ఆమెను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ఫోన్ రింగవుతున్నా తీయలేని నిస్సత్తువలో పాక్కుంటూ ఫోన్ తీసుకుని స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఇంటికి చేర్చే సరికి రాత్రి 9 గంటలైంది. జరిగిన దారుణం గురించి ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చెప్ప లేక, సోదరుడికి చెప్పే ధైర్యం చేయలేక తీవ్ర క్షోభను అనుభవించింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ధైర్యం తెచ్చుకుని మరుసటి రోజు సోదరుడికి చెప్పి అతడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి పూర్తి న్యాయం చేస్తాం డిప్యూటీ సీఎం బోస్ కాకినాడ సిటీ: సభ్యసమాజం తలదించుకునేలా మండపేటలో దళిత యువతిపై జరిగిన లైంగికదాడి ఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తానని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శుక్రవారం రాత్రి పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబు తదితరులతో కలసి ఆయన పరామర్శించారు. ∙బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమెకు భరోసానిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని చూశానని, నిర్భయ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. విశాఖపట్నంలో ఉన్న తన దృష్టికి రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి సంఘటన వివరాలను తీసుకురాగా నిందితులు ఎంతటి వారైనా, ఎటువంటి ఒత్తిళ్లు వచ్చిన తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. బాధితురాలికి నష్టపరిహారం అందించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం బోస్ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి జయశ్రీ, కొవ్వాడ అప్పన్నబాబు, అడ్డూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
సామూహిక అత్యాచారం
మండపేట: స్నేహితులైన కాలేజీ విద్యార్థిని, విద్యార్థి ఒక చోట ఉండటాన్ని గమనించిన ముగ్గురు దుండగులు యువకుడిపై దాడిచేసి అనంతరం యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. బాధిత యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదీ జరిగింది.. మండపేట సమీప గ్రామానికి చెందిన దళిత యువతి పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మంగళవారం కళాశాలకు చివరి రోజు కావడంతో స్నేహితులతో వీడ్కోలు వేడుకలు జరిగాయి. తర్వాత స్నేహితుడితో కలిసి బైపాస్ రోడ్డు సమీపంలోని పశువుల మకాం వద్ద మాట్లాడుతోంది. మకాం యజమాని వీరిపై కన్నేశాడు. తన స్నేహితుడైన కోడిపెంట వ్యాపారిని అక్కడికి పిలిచాడు. అతడి పాలేరుగా పనిచేసే మరో స్నేహితునికీ విషయం చెప్పాడు. ఇద్దరూ మరో యువకుడితో కలిసి మోటారు సైకిల్‌పై అక్కడికి వచ్చారు. నలుగురూ కలిసి యువతి స్నేహితుడిపై దాడిచేశారు. సెల్‌ఫోన్ లాక్కున్నారు. అనంతరం ఆమె స్నేహితున్ని ఓ యువకుడు మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని సినిమా రోడ్డులోని పాన్‌షాప్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ తన ఫోన్‌కు రీచార్జ్ చేయించుకుని వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురు నిందితులూ యువతిపై అత్యాచారానికి పాల్పడి వెళ్లిపోయారు. మకాం యజమాని ఐదు పదుల వయస్సు దాటిన వ్యక్తి కాగా, మిగిలిన ఇద్దరూ 40 ఏళ్ల వారు. నిందితులు పట్టుబడ్డారిలా.. పాన్ షాపు వద్ద ఉన్న బాధిత విద్యార్థి స్నేహితులకు సమాచారమిచ్చాడు. స్నేహితులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఇంటికి చేర్చారు. పాన్‌షాప్ వద్ద రీచార్జ్ చేయించిన నంబర్ ఆధారంగా నిందితుల్లో ఒకడైన యువకుడిని గుర్తించారు. యువతి స్నేహితులు, బంధువులు గొల్లపుంతలోని అతని ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. మిగిలిన ముగ్గురి పేర్లు అతను బయటపెట్టగా సంఘం కాలనీలోని ఇద్దరు నిందితుల ఇంటికి చేరుకుని వారినీ చితకబాదారు. ఈలోగా స్థానికులు 100 ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చారు. ఈలోగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. -
మీ వల్లే నేను ఓడిపోయా: పవన్
సాక్షి, మండపేట: ‘మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను. మీతో నాకు ఇబ్బందిగా ఉంది’ అంటూ జనసేన పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో నిన్న (ఆదివారం) ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాలులో రైతులతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కేరింతలతో ఈలలు వేశారు. దీంతో పవన్ స్పందిస్తూ...కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండి ఉంటే జనసేన పార్టీ గెలిచేదని మండిపడ్డారు. సభలో ఎవరూ అవరొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాల మొదటి మూడు రోజుల్లోగా ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించకుంటే కాకినాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. -
ఇసుక దోపిడీలో ఆయన జిల్లాలోనే ‘నంబర్ వన్’
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బురద చల్లుడు రాజకీయాలు మానుకోవాలని డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక దోపిడీలో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచిన వ్యక్తి వేగుళ్ల జోగేశ్వరరావు అని..అటువంటి వ్యక్తి ఇవాళ ఇసుక కోసం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనను ఇసుక దోపిడీ సంఘానికి అధ్యక్షుడిగా పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. జిల్లాలోని టేకి గ్రామంలో ఒక వ్యక్తి తన వ్యక్తిగత కారణాల వల్ల మరణిస్తే...ఇసుక లభించక మృతిచెందాడని వేగుళ్ల బుద్ధిహీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బురద చల్లాలనే తాపత్రయం తప్ప..వాస్తవ పరిస్థితులు చెప్పడంలేదని ధ్వజమెత్తారు. ‘ఇద్దరం కలిసి టేకి గ్రామం వెళదామని..ఇసుక కోసమే అక్కడ వ్యక్తి మరణిస్తే బహిరంగ క్షమాపణలు బెబుతామని..లేకపోతే జ్ఞానోదయం వచ్చిందని ప్రకటించాలని వేగుళ్ల జోగేశ్వరరావుకు సుభాష్ చంద్రబోస్ సవాల్ విసిరారు. -
మేమున్నామని.. నీకేం కాదని
సాక్షి, మండపేట: వారందరూ ఆరు నుంచి 10వ తరగతి లోపు విద్యార్థులు. ఆడుతూ పాడుతూ తిరిగే వయస్సులో తమ స్కూల్ విద్యార్థినికి వచ్చిన ఆపదను చూసి చలించిపోయారు. ఆమె వైద్యం కోసం సాయమందించేందుకు నడుం కట్టారు. తమ పాకెట్ మనీతో పాటు ఉదయం, సాయంత్ర వేళల్లో సమీపంలోని ఇళ్లకు, దుకాణాల వద్దకు వెళ్లి దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ విధంగా సమకూరిన రూ.1,45,000 మొత్తాన్ని గురువారం చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. చిన్న వయస్సులోనే మానవత్వ పరిమళాలను వెదజల్లారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తమ సహచరి వైద్యం కోసం స్కూల్ విద్యార్థులు చేసిన ప్రయత్నం అందరినీ అబ్బురపర్చింది. కపిలేశ్వరపురం మండలం నేలటూరుకు చెందిన పైడిమళ్ల శాంతి పట్టణంలోని గౌతమి మున్సిపల్ హైసూ్కల్లో 8వ తరగతి చదువుతోంది. తండ్రి ఇజ్రాయేల్ రాజు ఆటో డ్రైవర్ కాగా తల్లి ఎస్తేరు రాణి వ్యవసాయ కూలీ. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. కాలేయం పూర్తిగా పాడైపోయిన శాంతి మృత్యువుతో పోరాడుతోంది. కాలేయ మార్పిడి చేయకుంటే ఆమె బతకడం కష్టమని వైద్యులు తేల్చేశారు. చెన్నైలో ఆస్పత్రిలో చూపించగా శస్త్ర చికిత్స కోసం రూ. 25 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. బాధితులు డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఆశ్రయించగా ప్రభుత్వం నుంచి కొంతమేర సాయమందించేందుకు ఆయన హామీ ఇచ్చినట్టు తండ్రి ఇజ్రాయేలు రాజు తెలిపారు. వైద్యం కోసం ఇప్పటికే రూ. రెండు లక్షలకు పైగా అప్పుల పాలైన ఆయన కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది. చదువుకునే వయస్సులో శాంతి మృత్యువుతో పోరాడుతుండడం చూసి చలించిన సహచర విద్యార్థులు తమ పాకెట్ మనీతో పాటు దాతల సాయాన్ని కోరారు. స్కూల్ ప్రారంభానికి, స్కూల్ ముగిసిన తర్వాత బృందాలుగా తమతమ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులు, వ్యాపారుల నుంచి రూ. 1,45000 విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, ఎంఈఓ ఎన్. రామచంద్రరావు, ఉపాధ్యాయుల చేతల మీదుగా శాంతి, ఆమె తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు. హెచ్ఎం శోభావళి, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జసిత్ కిడ్నాప్ కేసులో చిక్కిన అపరిచిత వ్యక్తి
సాక్షి, తూర్పుగోదావరి(మండపేట) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నాప్ ఘటనను అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఎత్తుగడ వేసిన అపరిచిత వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన వివరాలను సీఐ అడపా నాగమురళి గురువారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని విజయలక్ష్మి నగర్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు జసిత్ కిడ్నాప్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే. మండపేటలో బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తున్న నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల కుమారుడు జసిత్ గత నెల 22న కిడ్నాప్‌కు గురై 25వ తేదీ ఉదయం క్షేమంగా తల్లిదండ్రులను చేరాడు. 60 గంటల పాటు సాగిన కిడ్నాప్ కథ సుఖాంతమైనా కిడ్నాప్‌కు గల కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సంఘటనతో భయాందోళనకు గురైన జసిత్ తల్లిదండ్రులు తమ స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయించుకుని అక్కడికి వెళ్లిపోయారు. అతడి మేనమామ రామరాజు కాకినాడలో నివాసముంటున్నారు. తాము అడిగిన సొమ్ములు ఇవ్వకపోతే ఈ సారి జసిత్‌ను విడిచిపెట్టబోమంటూ మంగళవారం బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు వచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా అపరిచిత వ్యక్తి ఆచూకీ కనిపెట్టి పథకం ప్రకారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సులువుగా సొమ్ములు సంపాదించాలని.. జసిత్ కిడ్నాప్ వ్యవహారంపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో సులువుగా డబ్బులు సంపాదించాలని భావించిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాళ్లముదునూరిపాడు గ్రామానికి చెందిన చిక్కాల నరేష్ జసిత్ తండ్రికి ఫోన్ చేశాడు. ‘నేనే మీ అబ్బాయిని కిడ్నాప్ చేసి క్షేమంగా కుతుకులూరులో వదిలిపెట్టి వెళ్లానని, వెంటనే రూ.50 వేలు ఇవ్వాలని బెదిరించాడు. జసిత్ తండ్రి వెంకటరమణ తన బావమరిది రామరాజుకు ఫోన్‌చేసి మండపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై తోట సునీత దర్యాప్తు చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట రావాలని ఫోన్ చేసి జసిత్ తండ్రి వెంకటరమణతో నరేష్‌కు చెప్పించారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట వచ్చిన నరేష్‌ను సినిమా రోడ్డులో సీఐ నాగమురళీ, ఎస్సై సునీత సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. నరేష్ గతంలో తెలంగాణలోని కాళేశ్వరం ఇసుక ర్యాంపులో పనిచేసేవాడని, నిందితుడికి భార్య, కుమారుడు ఉన్నట్టు సీఐ నాగమురళీ తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్ వల్లే జసిత్ కిడ్నాప్!
సాక్షి, తూర్పుగోదావరి(కాకినాడ) : మండపేటలో బ్యాంకు ఉద్యోగుల కుమారుడు జసిత్ కిడ్నాప్ క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోనే సాగిందని ఎస్పీ అద్నాన్ నయిమ్ అస్మీ తెలిపారు. ఆయన ఆదివారం తమ కార్యాలయంలో ఆ వివరాలను విలేకరులకు తెలియజేశారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరుల ప్రశ్నకు పైమేరకు సమాధానమిచ్చారు. 17 మంది బుకీలు ఈ కిడ్నాప్ సంఘటనలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో బాలుడి బంధువులు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. బాలుడిని మూడు రోజుల పాటు దాచేందుకు ఉపయోగించిన స్థలాలను నిర్థారించామన్నారు. చదవండి: జసిత్‌ను కిడ్నాప్ చేసింది ఎవరు? -
పుకార్లు నమ్మొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది!
సాక్షి, తూర్పుగోదావరి: దేవీపట్నం వరద బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించామని.. ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆయన ఆదివారం జిల్లాలోని మండపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు వరదలపై ఎటువంటి భయాందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. ఎటువంటి పుకార్లు నమ్మవద్దని.. వరద ప్రభావిత ప్రాంతాలకు సరుకులు, బియ్యం, పప్పులు, కిరోసన్, మెడిసిన్ అందజేస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు.. రెవెన్యూ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా పోలవరం డ్యాం దగ్గర ఇరవై ఆరు మీటర్ల వరకు వరద నీరు ఉందని వెల్లడించారు. దీంతో రేపటివరకు వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. దీంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
జసిత్‌ను కిడ్నాప్ చేసింది ఎవరు?
సాక్షి, మండపేట(తూర్పు గోదావరి) : రాష్ట్రంలో సంచలనం కలిగించిన మండపేటలో బాలుడి కిడ్నాప్ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. బాలుడు జసిత్ క్షేమంగా ఇంటికి చేరడంతో కథ సుఖాంతమైనా కిడ్నాప్‌కు గల కారణాలు ఇంకా అంతుచిక్కడం లేదు. బాబును ఎత్తుకు వెళ్లింది ఎవరు? వారి లక్ష్యం ఏమిటో? అర్థం కాని పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. తొలుత 17 బృందాలు ఏర్పాటు చేయగా అదనంగా మరో మూడు బృందాలను ఏర్పాటుచేశారు. జషిత్‌ను కిడ్నాపర్లు విడిచిపెట్టిన సరిహద్దు గ్రామాల్లో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. మండపేటలో బ్యాంకు ఉద్యోగులు నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల నాలుగేళ్ల కుమారుడు జసిత్ ఈనెల 22న కిడ్నాప్ గురై 25వ తేదీ ఉదయం క్షేమంగా తల్లిదండ్రులను చేరిన విషయం విదితమే. 60 గంటల పాటు సాగిన ఉత్కంఠతకు తెరపడినా కిడ్నాప్‌కు గల కారణాలు తెలియరాలేదు. దాదాపు మూడు రోజుల పాటు జషిత్‌ను కిడ్నాపర్లు తమ వద్ద బందీగా ఉంచుకున్నా వారి డిమాండ్లు ఏమిటనేది చెప్పలేదు. వారి వద్ద నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని పోలీసులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలన కలిగించిన ఈ కేసు విషయమై స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ఎస్పీ నయీం అస్మీతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మూడు రోజుల పాటు స్వయంగా ఎస్పీ మండపేటలోనే మకాం వేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం, అనుమానితుల సీసీ ఫుటేజీ లభ్యమవడం, మీడియా ద్వారా కిడ్నాప్ వ్యవహారం వైరల్ కావడంతో కిడ్నాపర్లు జడిసి బాబును విడిచిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ రెండు గ్రామాలపై నిఘా.. కిడ్నాపర్లు జసిత్‌ను విడిచిపెట్టిన చింతలరోడ్డు పరిధిలోని రాయవరం మండలం లొల్ల, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ రెండు గ్రామాల పరిధిలోనే జసిత్‌ను దాచి ఉంటారని భావిస్తున్నారు. మండపేట, కుతుకులూరు ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆ కోణంలోను పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గతంలో పట్టుబడిన బుకీలను విచారిస్తున్నట్టు తెలిసింది. అలాగే జసిత్ తండ్రి పనిచేస్తున్న బ్యాంకులో అతడి ప్రవర్తనపై శుక్రవారం విచారణ జరిపినట్టు సమాచారం. కిడ్నాపర్లలో ఒకరి పేరు రాజు అని జసిత్ చెప్పడంతో రాజు అనే పేరుతో ఆయా గ్రామాల్లో ఉన్న ఇళ్లను పరిశీలిస్తున్నారు. అతి త్వరలో కిడ్నాప్ కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి అడిషనల్ ఎస్పీ ఎస్వీ శ్రీధరరావు మండపేట చేరుకుని సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తదుపరి కార్యచరణపై చర్చించారు. ఎవరు చేశారు?.. ఎందుకు చేశారు? అయితే కిడ్నాప్ ఎవరు చేశారు?, ఎందుకు చేశారనే విషయమై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సవాల్‌గా మారిన కేసు మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎస్బీ, క్రైం, ఐటీ కోర్ విభాగాలకు చెందిన ఐదుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 16 మంది ఎస్సైల నేతృత్వంలో 17 బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ‘క్రికెట్ బెట్టింగ్ ఏమైనా ఉందా? ప్రొఫెషనల్స్ చేశారా?, ఉద్దేశపూర్వకంగా చేశారా? వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. కిడ్నాపర్ ‘రాజు’ కోసం ఆరా.. రాయవరం (మండపేట): కిడ్నాప్‌కు గురైన బాలుడు జసిత్ క్షేమంగా ఇంటికి చేరినా..పోలీసులు కిడ్నాపర్లను వేటాడే పనిలో పడ్డారు. కిడ్నాప్ చెర నుంచి బయట పడ్డ బాలుడు జసిత్ చెప్పిన మాటల ప్రకారం ‘రాజు’ అనే వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ మిస్టరీని ఛేదించే క్రమంలో భాగంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. జసిత్‌ను వదిలిన ప్రాంతం రాయవరం మండలం లొల్ల గ్రామ పరిధిలో ఉండడంతో మండలంలోని లొల్ల, సోమేశ్వరం గ్రామాల్లో బాలుడ్ని దాచి ఉంటారనే అనుమానం పోలీసులను వెన్నాడుతోంది. బాలుడు చెబుతున్న మాటల ప్రకారం రాజు అనే వ్యక్తి తనను వదిలి వెళ్లాడని, కిడ్నాప్ అనంతరం తనను ఉంచిన ఇంట్లో ఒక ఆంటీ, ఒక బాబు కూడా ఉన్నట్టుగా జసిత్ తెలుపుతున్నాడు. దీని ప్రకారం రాజు అనే పేరు ఉన్న వ్యక్తి కోసం, జసిత్‌ను దాచి ఉంచిన ఇంటిని గుర్తించే పనిలో పోలీసులున్నారు. ముఖ్యంగా రాయవరం మండలం లొల్ల, సోమేశ్వరం గ్రామాల్లో ఓటర్ల జాబితా ఆధారంగా రాజు అనే పేరు ఉన్న వ్యక్తుల ఇళ్లను గుర్తించి, జసిత్ చెబుతున్న మాటల ప్రకారం ఇళ్లను గుర్తించే పనిని చేపట్టనున్నట్టు సమాచారం. త్వరలో నిందితులను పట్టుకుంటాం నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. 20 బృందాలతో దర్యాప్తు సాగిస్తున్నాం. వ్యక్తిగత కక్షలేమీ బయటపడలేదు. క్రికెట్ బెట్టింగ్ విషయమై కూడా విచారణ జరుగుతోంది. కాల్‌డేటా, అనుమానిత ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. అతి త్వరలోనే నిందితులను పట్టుకుని కోర్టుకు అప్పగిస్తాం. – ఎస్వీ శ్రీధరరావు, అడిషనల్ ఎస్పీ -
అమ్మ ఒడి చేరిన సిక్కోలు సిసింద్రీ
ముద్దులొలికే చిన్నారి.. మురిపాల పొన్నారి.. కిడ్నాపర్ల బారిన పడి ఎలా ఉన్నాడోనని ఆంధ్ర దేశమంతా తల్లిడిల్లింది.. ప్రాణాలతో తిరిగి రావాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంది.. మూడు రోజుల తర్వాత గురువారం ఉదయం క్షేమంగా ఇంటికి చేరడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. బయటివారికే అంత ఆనందం కలిగితే మరి కన్న తల్లిదండ్రుల సంతోషానికి హద్దేముంది. ఆనందబాష్పాలు రాలుతున్న ఆ మాతృమూర్తి ముఖంలో కోటి కాంతులు విరబూశాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బ్యాంకు అధికారులుగా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లావాసులు నాగావళి, వెంకటరమణల ముద్దుల బిడ్డ జసిత్ అదృశ్యం కావడంతో రాష్ట్రమంతా కలకలం రేగింది. చివరకు క్షేమంగా తిరిగిరావడంతో అందరూ ఆనందించారు. చెల్లి కావాలా? తమ్ముడు కావాలా? అని తనయుడిని అడుగుతూ మురిసిపోవాల్సిన తరుణంలో.. మూడు రోజులుగా ఆ అమ్మ పడిన వేదన అందరి హృదయాలనూ కలచివేసింది. ఎవరో అగంతకులు తన ముద్దుల బాబును ఎత్తుకుపోయారు. తన బాబు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో.. ఏమైనా తిన్నాడో లేదో.. అంటూ నిండు గర్భిణిగా ఉండి కూడా నిద్రాహారాలు లేకుండా ఎదురుచూసింది. నా బిడ్డను క్షేమంగా విచిపెట్టండంటూ ఆమె చేతుల జోడించి వేడుకున్న తీరు చూపరులను సైతం కంట తడిపెట్టించింది. కిడ్నాపర్ల చెరలో ఉన్న పాల బుగ్గల చిన్నారిని చూసి క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకోని హృదయం లేదు. దేవుడికి మొక్కని చేతులు లేవు. 60 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. అందరిని ఆనందంలో ముంచెత్తుతూ కిడ్నాపర్ల చెర నుంచి పోలీస్ అధికారుల చేతుల మీదుగా తల్లి చెంతకు చేరాడు జసిత్. సాక్షి, మండపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జసిత్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్లు బాలుడిని బుధవారం అర్ధరాత్రి సమయంలో చింతలరోడ్డులోని ఇటుకల బట్టీ వద్ద విడిచిపెట్టగా కార్మికులు చేరదీసి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఎస్పీ నయీం అస్మి స్వయంగా జసిత్‌ను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా కిడ్నాప్‌నకు కారణాలు మిస్టరీగానే మిగిలాయి. కేసును ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే కిడ్నాప్‌కు కారణమై ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండపేటలో బ్యాంకు ఉద్యోగులు నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల కుమారుడు ఈ నెల 22వ తేదీ రాత్రి నానమ్మతో కలిసి అపార్ట్మెంటులోని ప్లాటులోకి వెళుతున్న సమయంలో మెట్ల వద్ద అపరిచిత వ్యక్తి దాడి చేసి జసిత్‌ను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా పెద్ద ఎత్తున పోలీసులు అన్ని కోణాల్లోను దర్యాప్తు నిర్వహించినా కిడ్నాపర్లు, బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. జసిత్ రోజూ ఆడుకునే ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజీ లభ్యం కావడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు జసిత్‌ను తీసుకువచ్చి కుతుకులూరు–లొల్ల మధ్య గల చింతల రోడ్డులోని బట్టీ వద్ద విడిచిపెట్టడంతో అదే సమయంలో కాలకృత్యాల కోసం బయటకు వచ్చిన బట్టి కార్మికుడు ఏసు అక్కడ ఉన్న బాలుడిని తీసుకువెళ్లి బట్టీ యజమాని కర్రి రామకృష్ణారెడ్డికి సమాచారం అందించాడు. నాలుగు గంటల సమయంలో రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బట్టీ వద్దకు చేరుకుని బాలుడిని మండపేట తీసుకువచ్చారు. ఎస్పీ నయీం అస్మి జసిత్‌ను ఎత్తుకుని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. జసిత్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అతని ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉన్న కుటుంబ సభ్యులు జసిత్‌ను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. అతనిని ముద్దాడుతూ మురిసిపోయారు. చుట్టుపక్కల వారు, పెద్ద ఎత్తున స్థానికులు ఇంటి వద్దకు చేరుకోవడంతో కోలాహలం నెలకొంది. మూడు రోజుల పాటు కిడ్నాపర్ల చెరలో ఉన్న జసిత్కు పోలీసులు వైద్య పరీక్షలు చేయించగా, బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని ప్రభుత్వ ఆస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ చైతన్య తెలిపారు. జసిత్ రాకతో గత మూడు రోజులుగా కంటి మీద కునుకులేకుండా శ్రమిస్తున్న పోలీసులు వేడుక చేసుకున్నారు. ఎస్పీ వారందరికీ స్వీట్లు అందించి అభినందించారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయడం, సీసీ ఫుటేజీ లభ్యం కావడం, మీడియా ద్వారా కిడ్నాప్ వ్యవహారం వైరల్ కావడంతో కిడ్నాపర్లు జడిసి బాబును విడిచిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్ల ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. కిడ్నాపర్లు జసిత్‌ను విడిచిపెట్టిన ఇటుకల బట్టీ వద్దకు ఎస్పీ వెళ్లి బట్టీ యజమాని, కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి 12.50 గంటల సమయంలో రెండు మోటారు సైకిళ్లపై నలుగురు వ్యక్తులు వచ్చి జసిత్‌ను ఇటుకల బట్టీ వద్ద దింపివెళ్లినట్టు సమాచారం. 1.30 గంట ప్రాంతంలో వారు తిరిగి వెళ్లడం సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. క్రికెట్ బెట్టింగ్‌పై అనుమానాలు సంఘటన తీరును బట్టి క్రికెట్ బెట్టింగ్ కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి వెంకటరమణ బెట్టింగ్‌లో నష్టపోయి సొమ్ములు చెల్లించకపోవడంతో బుకీలు కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. మండపేట, కుతుకులూరు ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలను తండ్రి వెంకటరమణ ఖండించారు. తాను ఎప్పుడూ బెట్టింగ్ ఆడలేదని, క్రికెట్ మాత్రమే ఆడతానని తెలిపారు. కిడ్నాప్ మిస్టరీ వీడేనా? బాలుడు క్షేమంగా ఇంటికి చేరినా కిడ్నాప్‌కు గల కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. ఎవరు చేశారో? ఎందుకు చేశారో.. వారి ఉద్దేశమేంటో.. కారణమేంటనే విషయమై కొలిక్కిరాలేదు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపైనే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. రాయవరం మండలం లొల్ల, లేదా అనపర్తి మండలం కుతుకులూరులోని ఒక చిన్న ఇంటిలో జసిత్‌ను ఉంచినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కాగా రెండు రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ అస్మి మీడియాకు తెలిపారు. ఎవరా రాజు? కిడ్నాపర్లలో ఒకరి పేరు రాజు అని జసిత్ చెబుతున్నాడు. అతనే తనను తీసుకువచ్చి విడిచిపెట్టాడంటున్నాడు. ఇరువురు వ్యక్తులు తనను ఎత్తుకెళ్లినట్టు చెబుతున్న జసిత్ వారిలో ఒకరి పేరు రాజు అని స్పష్టం చేస్తున్నాడు. ఈ రాజు ఎవరనేది మిస్టరీగా మారింది. తనను ఒక చిన్న ఇంటిలో ఉంచారని, అక్కడ ఆంటీతోపాటు ఒక బాబు కూడా ఉన్నట్టు చెబుతున్నాడు. రోజూ తనకు ఇడ్లీ పెట్టేవారని, ఒక సారి పెరుగు అన్నం పెట్టారని, తనను కొట్టలేదని చెప్పాడు జసిత్. మమ్మీ డాడీ కావాలని నేను ఏడుస్తుంటే రాజు తనను రాత్రి సమయంలో ఇటుకల బట్టీ వద్దకు తీసుకువచ్చి కాలకృత్యానికి వచ్చిన వ్యక్తి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడని చెప్పాడు. డిప్యూటీ సీఎం బోస్ సమీక్ష అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కేసు దర్యాప్తుపై ఎప్పటికప్పుడు పోలీసులతో సమీక్షించారు. తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరితగతిన కేసును ఛేదించాలని పోలీసులను ఆదేశిస్తూ ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందించారు. చిచ్చర పిడుగు జసిత్ నాలుగేళ్లు.. సరిగా మాటలు కూడా చెప్పలేని వయస్సు. ఎవరినైనా చూస్తే భయపడిపోవడమో.. బిడియపడిపోవడమో చేయడం సర్వసాధారణం. కాని జసిత్ అలా కాదు. చిచ్చరపిడుగు. అందగాడే కాదు.. మంచి మాటకారి కూడా. కళ్లెదుటే నానమ్మపై దాడిచేసి తనను బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. తల్లిదండ్రులకు దూరంగా అపరిచిత వ్యక్తుల మధ్య మూడు రోజులు గడిపాడు. అర్ధరాత్రి సమయంలో చిమ్మ చీకటిలో కిడ్నాపర్లు తీసుకువచ్చి ఇటుకల బట్టీ కార్మికుడి సమీపంలో విడిచిపెడితే అతని వద్దకు పరుగు తీశాడు. రాత్రంతా వారి మధ్యనే గడిపాడు. తనను చేరిదీసిన బట్టి కార్మికులను ఆకలేస్తోందంటూ అడిగి మరీ ఇడ్లీ తిన్నాడు. గురువారం ఉదయం జసిత్‌ను ఎస్పీ నయీం అస్మి ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. తల్లిదండ్రులను ముద్దులతో ముంచెత్తిన జసిత్ మీడియా అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెబుతున్న తీరు అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. లిటిల్ హీరో అంటూ పోలీసులు, మీడియా ప్రతినిధులు, స్థానికులు జసిత్‌ను ఎత్తుకుని సెల్ఫీలు దిగి మురిసిపోయారు. కనుగులవలస, శ్రీహరిపురం గ్రామాల్లో బంధువుల ఆనందం ఆమదాలవలస: మండపేటలో కిడ్నాప్‌కు గురైన జసిత్ గురువారం క్షేమంగా ఇంటికి చేరడంతో ఆమదాలవలస మండలం కనుగులవలస, శ్రీహరిపురం గ్రామాల్లో బంధువులు ఆనందంలో మునిగిపోయారు. మూడు రోజులుగా కంటి నిండా నిద్ర లేకుండా గడుపుతున్న బాలుడి మేనమామలు చింతాడ యర్రయ్య, శ్రీనివాసరావు, తాత, అత్తలు ఊపిరిపీల్చుకున్నారు. జసిత్ తల్లిదండ్రుల స్వగ్రామాల్లో మూడు రోజులుగా మండపేట పోలీసులు, క్రైమ్ బృందాలు దర్యాప్తు చేయడంతో ఇక్కడ అలజడి మొదలైంది. చివరకు క్షేమంగా ఇంటికి రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మండపేట పోలీసులు మాత్రం ఇంకా తమ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. కిడ్నాప్ ఛేదించేందుకు కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. తండ్రికి సమాచారం ఇచ్చాం మా బట్టీలో పనిచేసే ఏసు ఫోన్ చేసి చెప్పడంతో తెల్లవారుజాము 4 గంటల సమయంలో బట్టీ వద్దకు వెళ్లి బాలుడిని చూశాను. కిడ్నాప్ అయిన కుర్రాడేనని గుర్తించాను. వాట్సప్ వాడకం తెలీక మా తోడల్లుడి కుమారునికి చెబితే అతను వచ్చి జసిత్ ఫొటో తీసి అతని తండ్రికి పంపి ఫోన్‌చేసి చెప్పారు. వీడియోకాల్ చేయాలని కోరితే వీడియో కాల్ చేసి అతని తండ్రికి చూపించాము. ఆకలి వేస్తోందని చెబితే ఇడ్లీ తెప్పించి పెట్టాను. కర్రి కృష్ణారెడ్డి, ఇటుకల బట్టీ యజమాని, కుతుకులూరు. చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది. నా బాబు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో మూడు రోజులుగా పడుతున్న నరకయాతనను మరిచిపోయాను. కిడ్నాప్ జరిగిన రోజున నాలో నేను లేను. ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో? ఏమైనా తిన్నాడో లేదోనని కంటిమీద కునుకులేకుండా గడిపాను. బాబు దొరికాడని తెల్లవారుజామున తెలియగానే ప్రాణం లేచి వచ్చింది. క్షేమంగా ఇంటికి చేరిన వాడిని చూడగానే మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. ఇక ముందు వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కిడ్నాప్ ఎందుకు చేశారో తెలీదు. పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సహకరించి అండగా నిలిచిన పోలీస్, మీడియా, సహచర సిబ్బంది, ఇటుకల బట్టీ యజమాని, కార్మికులు అందరికీ కృతజ్ఞతలు. నాగావళి, జసిత్ తల్లి. నా వద్దకు పరుగెడుతూ వచ్చాడు రాత్రి 1 గంట సమయంలో కాలకృత్యం కోసం నేను బయటకు వచ్చాను. ఈ కుర్రాడు నా వద్దకు పరుగెట్టుకుని వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. కొద్ది దూరంలో ఇరువురు వ్యక్తులు చీకట్లో మోటారుసైకిల్‌పై ఉండటాన్ని గమనించాను. ఒకరు హెల్మెట్ ధరించి ధరించి, మరొకరు మాస్క్ ధరించి ఉన్నారు. కుర్రాడు నా వద్దకు వచ్చిన తర్వాత వారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఎన్.ఏసు, ఇటుకలబట్టీ కార్మికుడు, లొల్ల, రాయవరం మండలం. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు మా బాబు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంలో సహకరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. స్వయంగా ఆయనే ఎస్పీ నయీం అస్మికి ఫోన్‌చేసి కిడ్నాప్‌పై ఆరా తీసి త్వరితగతిన కేసును ఛేదించాలని ఆదేశించినట్టు తెలిసింది. థాంక్స్ టూ సీఎం సర్. ఎవరు కిడ్నాప్ చేశారో? ఎందుకు చేశారో తెలీడం లేదు. పోలీసులు పెద్ద ఎత్తున విచారణ చేస్తుండటం, మీడియా ప్రచారంతో కిడ్నాపర్లు జడిసి బాబును విడిచిపెట్ట ఉంటారని భావిస్తున్నాం. వెంకటరమణ, జసిత్ తండ్రి -
జసిత్ క్షేమం
సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బాలుడు జసిత్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాపర్లు బాలుడిని బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో (తెల్లవారితే గురువారం) లొల్ల–కుతుకులూరు చింతలరోడ్డులో ఇటుకల బట్టీ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో 60 గంటలపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. మండపేట పట్టణంలో ఈ నెల 22 రాత్రి ఏడు గంటల సమయంలో నాయనమ్మతో కలసి అపార్టుమెంట్ లోకి వెళుతున్న నాలుగేళ్ల బాలుడు జసిత్‌ను అపరిచితులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు అహోరాత్రులు శ్రమించినా కిడ్నాపర్ల ఆచూకీ లభించలేదు. ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐల నేతృత్వంలో దాదాపు 500 మంది పోలీసులతో 17 బృందాలను ఏర్పాటు చేసి ముమ్మ రంగా వెతుకలాట మొదలుపెట్టారు. స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీమ్ అస్మితో గడచిన రెండు రోజులుగా మాట్లాడటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రాయవరం మండలం లొల్ల–కుతుకులూరు చింతలరోడ్డులోని ఇటుకల బట్టి వద్ద బాలుడిని కిడ్నాపర్లు విడిచిపెట్టారు. అదే సమయంలో ఇటుకల బట్టీలో పనిచేసే ఏసు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లేందుకు బయటికిరాగా.. బాలుడు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు బాలుడిని విడిచి వెళ్లిపోవడంతో అతను దిక్కుతోచని స్థితిలో తన యజమాని కృష్ణారెడ్డికి ఫోన్ చేసి వివరాలు అందించాడు. యజమాని తెల్లవారుజామున 4 గంటల సమయంలో బట్టీ దగ్గరికి వెళ్లి చూసి.. కిడ్నాప్‌కు గురైన బాలుడిగా గుర్తించారు. పిల్లాడు ఆకలిగా ఉందని చెప్పడంతో ఇడ్లీ తినిపించారు. తర్వాత అందుబాటులో ఉన్న నంబర్లతో జసిత్ తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఎస్పీ నయీం అస్మికి సమాచారం అందడంతో ఆయన చింతలరోడ్డుకు వెళ్లి బాలుడిని తీసుకుని 7 గంటల సమయంలో మండపేటలోని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. బాలుడు సురక్షితంగా ఇంటికి చేరడంతో మూడు రోజులుగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వీడని కిడ్నాప్ మిస్టరీ.. బాలుడు క్షేమంగా ఇంటికి చేరినా కిడ్నాప్‌నకు దారితీసిన కారణాలపై ఇంతవరకూ పోలీసులు నిర్ధారణకు రాలేకపోయారు. ఎవరు చేశారో? ఎందుకు చేశారో, వారి లక్ష్యమేమిటో, ఒక వేళ కిడ్నాపర్లకు డబ్బులే కావాలనుకుంటే మండపేటలో ఎంతో మంది కోటీశ్వరుల పిల్లలుంటే బ్యాంకు ఉద్యోగుల కుమారుడు జసిత్నే ఎందుకు ఎంచుకున్నారనే అంశాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. జసిత్ రోజూ ఆడుకునే ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజీ లభ్యం కావడంతో ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు. కిడ్నాప్‌నకు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఏదైనా కారణమై ఉంటుందా అనే అనుమానాన్ని కూడా పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘నానిని కొట్టి నన్ను ఎత్తుకెళ్లిపోయారు’ ‘నాని నేను ఆడుకుని ఇంటికి వెళుతుంటే ఇద్దరు వ్యక్తులు నానిని కొట్టి నన్ను స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని ఎత్తుకెళ్లిపోయారు. ఒక అబ్బాయి పేరు తెలుసు. ఆ అబ్బాయి పేరు రాజు. నన్ను తీసుకువెళ్లి ఒక ఇంటిలో పెట్టారు. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. నాకు రోజూ ఇంట్లో ఇడ్లీ పెట్టేవారు. నన్ను ఏమీ అనలేదు. నన్ను ఎవరూ కొట్టలేదు. మమ్మీ డాడీ కావాలని ఏడుస్తుంటే బట్టీ కార్మికుడిని చూపించి ఆ ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పి నన్ను అక్కడ వదిలేశారు. నేను ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లిపోతే నన్ను ఇంటిలోకి తీసుకువెళ్లిపోయాడు. మీ అందరికీ థాంక్స్..’ అని మీడియాతో జసిత్ చెప్పాడు. ఎస్పీని అభినందించిన సీఎం జగన్ బాలుడిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేసిన జిల్లా ఎస్సీ నయీం అస్మిని, ఇతర సిబ్బందిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో అభినందించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు మా బాబు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంలో చొరవ తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. ఆయనకు రుణ పడి ఉంటాం. థాంక్స్ టూ సీఎం సర్. ఎవరు కిడ్నాప్ చేశారో? ఎందుకు చేశారో తెలియడం లేదు. – వెంకటరమణ, జసిత్ తండ్రి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం కిడ్నాప్‌నకు గల కారణాలను అన్వేషిస్తున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. ఒక చిన్న ఇంటిలో బాబును ఉంచారు. ఆ ఇంటిలో ఒక మహిళ, చిన్న పాప ఉన్నట్టు తెలిసింది. – నయీమ్ అస్మి, ఎస్పీ -
జసిత్ క్షేమం; తండ్రిపై ఆరోపణలు..!
సాక్షి, మండపేట: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి జసిత్ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. అనపర్తి మండలం కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద బాలున్ని కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున వదిలి వెళ్లారు. అయితే, జసిత్ తండ్రి వెంకటరమణ కిడ్నాపర్ల రహస్య డిమాండ్లకు తలొగ్గడం వల్లనే పిల్లాడ్ని విడిచిపెట్టారని, ఆయన బెట్టింగ్ కార్యకలాపాల్లో మునిగి తేలేవారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను వెంకటరమణ తోసిపుచ్చారు. ‘నేనొక సాధారణ క్రికెట్ ప్లేయర్‌ని మాత్రమే. నాకు బెట్టింగ్‌లతో ఎటువంటి సంబంధం లేదు. కిడ్నాపర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జసిత్‌ను ఎవరు కిడ్నాప్ చేశారో.. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు. పోలీసుల విచారణలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయి. ఆస్తిని బదలాయిస్తేనే కిడ్నాపర్లు నా కుమారుడిని విడుదల చేశారనడం నిజం కాదు. జసిత్ క్షేమంగా ఇల్లు చేరేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ధన్యవాదాలు. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. పోలీసులకు కృతఙ్ఞతలు’ అన్నారు. రెండు బైకులు మీద వచ్చి వదిలేశారు! జసిత్‌ను కిడ్నాపర్లు వదిలి వెళ్ళిన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి పరిశీలించారు. ఇటుక బట్టి వద్ద ఉదయం అనుమానంగా తిరుగుతున్న కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి 12:38 గంటల ప్రాంతంలో రెండు బైకులు మీద వచ్చిన నలుగురు వ్యక్తులు జసిత్‌ను వదలివెళ్లినట్టు కుతుకులూరు వద్ద సీసీ కెమెరాల్లో రికార్డైంది. మళ్లీ వారు 1.19 గంటల ప్రాంతంలో తిరిగివెళ్లినట్టు సీసీ కెమెరాల్లో కనిపించింది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి ఒకరు ధ్రువీకరించారు. జసిత్‌ను అర్థరాత్రి దాటిన తర్వాతే వదిలి వెళ్లారని తెలిపాడు. (చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!) -
జసిత్ క్షేమం; ఎస్పీకి ఫోన్ చేసిన సీఎం జగన్
సాక్షి, మండపేట: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి జసిత్ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. నాలుగు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద బాలున్ని కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున వదిలి వెళ్లారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జసిత్ క్షేమంగా ఇల్లు చేరడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. కేసు వివరాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎంకు వివరించడంతో ఆయన ఎస్పీకి ఫోన్ చేశారు. (చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!) జసిత్‌ను రక్షించడంలో జిల్లా ఎస్పీ నయీం అస్మీ, ఇతర సిబ్బంది కృషిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. జసిత్‌ను రక్షించడంతో పోలీసుల పని యాభై శాతమే పూర్తయిందని, కిడ్నాపర్లను పట్టుకుంటే మిగిలిన యాభై శాతం పూర్తవుతుందని సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం. కిడ్నాప్‌నకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. జసిత్ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. -
జసిత్‌ను చూసిన ఆ క్షణం.. తల్లి ఉద్వేగం..!
సాక్షి, మండపేట : కన్నకొడుకు కానరాక ఆ తల్లి పడిన వేదన వర్ణనాతీతం. నాలుగేళ్ల జసిత్ బుడిబుడి అడుగులు లేక ఆ ఇల్లు చిన్నబోయింది. మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉన్న చిట్టి తండ్రి ఎలా కంటబడతాడో అని క్షణమొక యుగంగా గడిచింది. అయితే, ఆ తల్లి మొర ఏ దేవుడో ఆలకించాడు. ఓవైపు పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు, మరోవైపు సామాజిక మాధ్యమాలు, టీవీల్లో జసిత్ కిడ్నాప్ ఉదంతంపై విసృత ప్రచారం నేపథ్యంలో కిడ్నాపర్లు దిగొచ్చారు. పిల్లాడు తమవద్దే ఉంటే ఇక దొరికిపోవడం ఖాయమనుకున్నారు. గురువారం ఉదయం అనపర్తి మండలం కుతుకులూరు అమ్మవారి గుడివద్ద వదిలివెళ్లారు. (చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!) ఇటుకబట్టీల్లో పనిచేసే కార్మికులు పిల్లాన్ని చేరదీసి ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. జసిత్‌ను ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ క్షేమంగా తల్లి ఒడి చేర్చారు. బిడ్డను చూసిన నాగావళి ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యారు. తనయుడ్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. జసిత్ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. -
జసిత్ కిడ్నాప్.. ఈ ప్రశ్నలకు సమాధానమేది?
సాక్షి, మండపేట : మూడు రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి జసిత్ క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరిన సంగతి తెలిసిందే. దీంతో జసిత్ ఇంటివద్ద పండగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేకుండానే మిగిలిపోయాయి. కిడ్నాపర్లు జసిత్‌ను ఎందుకు అపహరించాల్సి వచ్చిందనేది తెలియాల్సి ఉంది. జసిత్‌ను ముఖానికి మాస్క్‌లు ధరించి పక్కగా కిడ్నాప్ చేసిన దుండగులు.. ఎలాంటి డిమాండ్ ఎందుకు చేయలేదనిది అంతు చిక్కడం లేదు. అసలు కిడ్నాపర్లు ఎవరూ.. ఈ మూడు రోజుల పాటు జసిత్‌ను ఎక్కడ దాచారనే దానిపై పోలీసుల ఆధారాలు సేకరించలేకపోయారు. కిడ్నాపర్లు జసిత్‌ను విడిచి వెళ్లిన అనపర్తి మండలం కుతుకులూరు, మండపేటకు 10 కి.మీ. దూరంలోనే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనపర్తి మండలం క్రికెట్ బెట్టింగ్‌లకు అడ్డగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రశ్నలు తలెత్తున్నాయి. బాలుడ్ని ఆ పరిసరాల్లోనే కిడ్నాపర్లు బంధించారా లేక ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అలా అయితే స్థానికులు ఎవరైనా కిడ్నాపర్లకు సహకారం అందించారా, లేక స్థానికంగా ఉన్నవారే ఈ పనికి ఒడిగట్టారా అనే ప్రశ్నలకు జవాబు తెలియాల్సి ఉంది. మరోవైపు జషిత్ మాత్రం తనను కిడ్నాపర్లు బాగానే చూసుకున్నారని.. ఇడ్లీ కూడా పెట్టారని చెప్పాడు. కిడ్నాప్ తరువాత జసిత్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం అనుమానాలకు తావిచ్చేలా ఉంది. పోలీసుల ముమ్మర గాలింపు, మీడియాలో వరుస కథనాలకు భయపడే కిడ్నాపర్లు జషిత్‌ను వదిలేశారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీసులతో సంబంధం లేకుండా కిడ్నాపర్లకు జసిత్ కుటుంబ సభ్యులు కొంత మొత్తంలో చెల్లించడంతోనే వారు బాలుడిని విడిచిపెట్టినట్టుగా కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. అవి ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం.. కుటుంబ సభ్యులు ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో కిడ్నాపర్లు ఎవరనేది మిస్టరీగా మారింది. చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..! కిడ్నాపర్లు రోజూ ఇడ్లీనే పెట్టారు : జసిత్ -
కిడ్నాపర్లు రోజూ ఇడ్లీనే పెట్టారు : జసిత్
సాక్షి, మండపేట : కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డ జసిత్ పలు కీలక విషయాలు వెల్లడించాడు. నానమ్మతో కలిసి ఆడుకుంటుండగా ఎవరో వచ్చి తనను తీసుకెళ్లారని.. వేరే ఊరికి తీసివెళ్లి దాచిపెట్టారని తెలిపాడు. కిడ్నాపర్లలో ఒకరు తనకు తెలిసిన వ్యక్తే అని బాలుడు చెప్పినట్టు సమాచారం. ‘రాజు అనే వ్యక్తి తనను బైక్‌పై దించేసి వెళ్లాడు. తినడానికి రోజూ ఇడ్లీ పెట్టారు. కిడ్నాపర్లు నన్ను ఏమీ అనలేదు. కొట్టలేదు. అందరికీ థాంక్స్’ అంటూ జసిత్ ‘సాక్షి’తో చెప్పాడు. కాగా, మూడు రోజుల క్రితం జసిత్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు గురువారం ఉదయం అనపర్తి మండలం కుతుకులూరు అమ్మవారి గుడివద్ద వదిలివెళ్లిన సంగతి తెలిసిందే. (చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!) పోలీసులపై ప్రశంసలు.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. జసిత్ ఆచూకీ కోసం 500 మంది పోలీసులు 17 ప్రత్యేక బృందాలుగా రెండు రోజుల నుంచి జల్లెడ పట్టిన సంగతి తెలిసిందూ. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలతో బెదిరిపోయిన దుండగులు ఎట్టకేలకు జసిత్‌ను విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. జసిత్ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. జసిత్‌ను ఎవరు కిడ్నాప్ చేశారో.. ఎందుకు కిడ్నాప్ చేశారో ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం. -
జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!
సాక్షి, మండపేట: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి జసిత్ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద బాలున్ని కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున వదిలి వెళ్లారు. మండపేటలో గత సోమవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన జసిత్ ఆచూకీ కోసం 500 మంది పోలీసులు 17 ప్రత్యేక బృందాలుగా రెండు రోజుల నుంచి జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలతో బెదిరిపోయిన దుండగులు ఎట్టకేలకు జసిత్‌ను విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. జసిత్ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. జసిత్‌ను ఎవరు కిడ్నాప్ చేశారో.. ఎందుకు కిడ్నాప్ చేశారో ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం. ఒంటిగంట ప్రాంతంలో లభ్యం.. చింతాలమ్మ గుడివద్ద ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే ఏసు అనే వ్యక్తి రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన క్రమంలో రోడ్డుపక్కన ఓ పిల్లాడు కనిపించాడు. జసిత్ అతన్ని అతన్ని చూసి పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. జసిత్ కిడ్నాప్ తదితర వివరాలు తెలియకపోవడంతో ఏసు ఏం చేయలేకపోయాడు. తెల్లవారు జామున బట్టీ దగ్గరికి వచ్చిన యజమానికి బాలుడు దొరికిన విషయాన్ని చెప్పాడు. అప్పటికే సోషల్ మీడియాలో జసిత్ కిడ్నాప్ వార్తలు చూసిన సదరు వ్యక్తి.. బాలుడి తండ్రి వెంకటరమణకు ఫోన్ చేసి చెప్పాడు. వెంకటరమణ పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడికివెళ్లి చిన్నారిని ఇంటికి తీసుకొచ్చారు. ఎస్పీ నయీంఅస్మీ జసిత్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. (చదవండి : జసిత్ కోసం ముమ్మర గాలింపు) (చదవండి : మండపేటలో కిడ్నాప్ కలకలం) -
జసిత్ కిడ్నాప్; వాట్సాప్ కాల్ కలకలం
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి జసిత్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీసీ కెమెరాలో అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు పలు బృందాలను రంగంలోకి దింపారు. చుట్టుపక్కల 15 గ్రామాలను జల్లెడ పడుతున్నారు. తమ కొడుకు ఆచూకీ కోసం జసిత్ తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. తమ బాబు క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. మరోవైపు జసిత్‌ను ఢిల్లీలో చూశానని జసిత్ తండ్రి వెంకటరమణకు అజ్ఞాత వ్యక్తి ఒకరు వాట్సాప్ కాల్ చేశాడు. ఫేస్బుక్లో జసిత్ ఫొటో చూసి గుర్తుపట్టినట్టు వెల్లడించాడు. తన బ్యాంకు ఖాతాలో 5 వేల రూపాయలు వేస్తే సమాచారం చెబుతానని తెలిపాడు. వీడియో కాల్ చేసి జసిత్‌ను చూపించమని వెంకటరమణ అడిగితే, తన ఫోన్‌కు ఆ సదుపాయం లేదన్నాడు. కనీసం బాబుతో మాట్లాడించమని కోరినా పట్టించుకోలేదు. అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. నిజంగా జసిత్ ఢిల్లీలో ఉన్నాడా, డబ్బులు గుంజడానికే ఎవరైనా నకిలీ కాల్ చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. జసిత్ కిడ్నాప్ కేసు ఛేదించేందుకు 16 పోలీసు బృందాలు పని చేస్తున్నాయని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి తెలిపారు. ఆరుగురు డిఎస్పీలు.. పది మంది సిఐలతో చిన్నారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. పరిశోధనలో అనుభవం ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారులు కూడా ఈ కేసు దర్యాప్తులో ఉన్నారని వెల్లడించారు. ఈనెల 3న తేదిన జసిత్ ఆడుకునే అపార్ట్‌మెంట్‌కు అద్దె కోసం వచ్చిన వారే, ఈనెల 5న అదే ప్రాంతంలో తిరిగారని.. వారు ఎవరు అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వారి సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసేపనిలో ఉన్నామని వివరించారు. జసిత్ తల్లిదండ్రులకు కుటుంబ పరంగా ఎవరితోనా విభేధాలున్నాయా, బ్యాంక్ వ్యవహరాల్లో ఖాతాదారులతో ఏమైన గొడవలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్టు తెలిపారు. కచ్చితంగా జసిత్‌ను క్షేమంగా తీసుకువస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: కన్నా.. ఎక్కడున్నావ్?) -
కన్నా.. ఎక్కడున్నావ్?
సాక్షి, మండపేట (తూర్పు గోదావరి): ‘నేను పెడితేనే కాని బాబు అన్నం తినడు.. ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో? ఏమైనా తిన్నాడో లేదో? ఎందుకు ఎత్తుకెళ్లారో తెలీడం లేదు. ఏం కోరినా ఇస్తాం.. మా బాబును క్షేమంగా అప్పగిస్తే చాలు’ అంటూ కిడ్నాప్‌నకు గురైన బాలుడు జసిత్ తల్లి, నిండు గర్భిణి నాగావల్లి కన్నీరు మున్నీరవుతోంది. కన్న బిడ్డకోసం సోమవారం రాత్రి నుంచి ఆమె కంటి మీద కునుకు లేకుండా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఎవరకు దగ్గరకు వెళ్లినా బాబు ఆచూకీ తెలిసిందా అంటూ ఆమె పడుతున్న ఆత్రుత చూపరుల హృదయాలను కలచివేస్తోంది. ‘ఏ కేసూ పెట్టం. మా బిడ్డను క్షేమంగా అప్పగించండి’ అంటూ ఆమె కిడ్నాపర్లను వేడుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన నూకా వెంకటరమణ, నాగావల్లి దంపతులు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బ్యాంకు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరి నాలుగేళ్ల కుమారుడు జసిత్ ఇంటికి సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. సోమవారం రాత్రి 7.30 గంటలకు అపార్ట్మెంట్ పిల్లలతో ఆడుకుని, నాన్నమ్మతో కలిసి తిరిగి మేడ మెట్లు ఎక్కుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ముఖంపై కొట్టి, బాలుడిని ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డు వైపు తీసుకు వెళ్లిపోయారు. ఇది జరిగి ఒకరోజు గడిచినా ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు. 8 ప్రత్యేక బృందాలతో ఈ కిడ్నాప్ ఓ మిస్టరీగా మారింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పోలీసులు అన్ని కోణాల్లోను ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్కే ఖాన్ మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాలుడి తల్లిదండ్రులు, నానమ్మ పార్వతిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ జేవీ సంతోష్, సీఐ కె.మంగాదేవి తదితరులతో చర్చించారు. ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి మండపేట చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాలుడి జాడ తెలుసుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీ పుటేజ్‌ల పరిశీలించారు. వెంకటరమణ, నాగవల్లి సహచర బ్యాంకు ఉద్యోగుల నుంచి వివరాలు, అనుమానితుల కాల్ డేటా వివరాలను సేకరిస్తున్నారు. గతంలో తాను పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పని చేసినప్పుడు బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టిన వ్యక్తిని పోలీసులకు పట్టించినట్టు వెంకటరమణ తెలపడంతో ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు సమాచారం. వెంకటరమణకు ఎవరితోనైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? ఆయన స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలోనూ ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. డిప్యూటీ సీఎం బోస్ పరామర్శ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బాలుడి తండ్రి వెంకటరమణతో ఫోన్లో మాట్లాడారు. అధైర్య పడవద్దని, కిడ్నాపర్లను పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన పోలీసులు అధికారులతో దీనిపై సమీక్షించారు. త్వరితగతిన బాలుడిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు బాధితులను పరామర్శించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కిడ్నాప్ కేసును అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని, త్వరితగతిన నిందితుల్ని అదుపులోకి తీసుకుని బాలుడిని సురక్షితంగా తీసుకువస్తామన్నారు. చిన్నారి కోసం ఎదురుచూపులు జసిత్ కోసం తల్లిదండ్రులు, నానమ్మ పార్వతి నిద్రాహారాలు లేకుండా ఎదురు చూపులు చూస్తున్నారు. నా చేతుల్లోంచే బిడ్డను లాక్కుపోయారంటూ నానమ్మ పార్వతి బోరున విలపిస్తోంది. నా కుమారుడిని క్షేమంగా అప్పగించండి మీరు కోరింది ఇస్తామంటూ మీడియా ద్వారా తండ్రి వెంకటరమణ కిడ్నాపర్లను వేడుకుంటున్నాడు. జసిత్ కిడ్నాప్ ఘటన స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, ఆచూకి తెలపాలంటూ వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు స్థానికులు, బ్యాంకు ఉద్యోగులు, విజయలక్ష్మి నగర్‌లోని వారి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.సాయికుమార్ వెంకటరమణను పరామర్శించారు. బాలుడిని సురక్షితంగా తీసుకురావాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
జసిత్ కిడ్నాప్ కేసును ఛేదిస్తాం: ఎస్పీ
సాక్షి, కాకినాడ: కిడ్నాప్‌కు గురైన జసిత్ ఆచూకీ కోసం ఏడు పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం హస్మీ మంగళవారం బాలుడు కిడ్నాప్ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జసిత్ తండ్రి వెంకటరమణను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. అన్ని చెక్ పోస్టులు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అప్రమత్తం చేశామని, ఆర్థిక లావాదేవీలు కూడా కిడ్నాప్‌కు కారణమా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, కచ్చితంగా చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదిస్తామన్న నమ్మకం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్స్ రాలేదని, కిడ్నాప్‌కు ముందే రెక్కి నిర్వహించి ఉంటారని అమామానిస్తున్నట్లు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చదవండి: కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్ -
‘ప్రత్యేక’ పాలనలోకి..
సాక్షి, మండపేట(పశ్చిమ గోదావరి) : జిల్లా, మండల పరిషత్తులు ఇక నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి రానున్నాయి. ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం, 4వ తేదీతో జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనున్నాయి. జిల్లాలో 1,102 మంది ఎంపీటీసీ సభ్యులు, 63 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. జిల్లాలోని ఎటపాక, చింతూరు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడంతో అవి మినహా మిగిలిన మండలాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం 3న ముగియనుంది. పరిషత్తులకు ఎన్నికలు జరిగి, కొత్త పాలక వర్గాలు ఏర్పడేంత వరకూ జిల్లా, మండల పరిషత్తులు ప్రత్యేక పాలనలో ఉండనున్నాయి. గతంలో మాదిరిగా జిల్లా పరిషత్తుకు కలెక్టర్‌ను, మండల పరిషత్తులకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికారులు అంటున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ నుంచి సీఎం కార్యాలయానికి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు రెండు రోజుల్లో జిల్లా, మండల పరిషత్తుల పదవీ కాలం ముగియనుండగా ‘పరిషత్ పోరు’కు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) వారీగా జూలై 3వ తేదీలోగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను ఎంపీడీఓ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలను జెడ్పీ సీఈఓ సిద్ధం చేయాలని సూచించింది. ఇప్పటికే పంచాయతీల్లో ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా ఓటర్ల ఫొటోలు, డోర్ నంబర్లతో అధికారులు జాబితాలను సిద్ధం చేశారు. వీటి ద్వారా ఎంపీటీసీ పరిధి మేరకు అధికారులు జాబితాలను రూపొందిస్తున్నారు. అలాగే జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జూలై 3వ తేదీన వీటిని అందుబాటులో ఉంచనున్నారు. -
అనాథలు కావద్దని పిల్లలతో సహా ఆత్మహత్య
కుటుంబ కలహాలు ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేశాయి. మూడేళ్ల పాపను చంకనెత్తుకొని, ఐదేళ్ల బాలుడి చిటికెన వేలు పట్టుకొని అడుగులేస్తుంటే ... అమ్మ ఎక్కడికో తీసుకువెళ్తోందని సంబరపడ్డారు. కోనసీమలోని గోదారి కాలువ గట్టు వెంబడి వెళ్తుంటే పచ్చని పంటపొలాలు, కొబ్బరి తోటలు, ఆ పక్కనే గలగలపారే జలప్రవాహాన్ని చూస్తూ ఆ చిన్నారుల మదిలో సందడి. వారి కళ్లలో సంతోషాన్ని చూసిన ఆ కన్న తల్లి మనసులో మాత్రం అలజడి. కన్నపేగులను గట్టిగా కావలించుకొని ఆ తల్లి ఒక్కసారిగా దూకేసింది. పరుగులు తీసే ప్రవాహంలోనే ఆ ముగ్గురి ప్రాణాలూ కలిసి పోయాయి. సాక్షి, ఆత్రేయపురం (తూర్పు గోదావరి): ఆమెకు ఏకష్టమొచ్చిందో ఏమో తెలియదు. ముక్కు పచ్చలారని పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది. భర్తపైన కోపంతో విగతజీవిగా మారిన ఆమె తన తండ్రిని మాత్రం క్షమించమని వేడుకుంది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. అందిన సమాచారం ప్రకారం.. ఆత్రేయపురం మండలం వసంతవాడకు చెందిన మిద్దె బాబూరావు, దుర్గల కుమార్తె నవీనకు బావ వరసయ్యే కారింకి శ్రీనుతో వివాహమైంది. వారికి ఐదేళ్ల రాజేష్, మూడేళ్ల నిత్యనందిని పిల్లలు. వీరు కొంతకాలం వసంతవాడలో కాపురం ఉన్నారు. ఆ తర్వాత మండపేటలో నివాసం ఉంటున్నారు. శ్రీను జూదాలకు, వ్యసనాలకు బానిసవడంతో కుటుంబపోషణ కష్టంగా మారింది. పిల్లలను కూడా పట్టించుకోవడం లేదంటూ ఆమె చాలా సార్లు భర్తతో గొడవపడింది. కుమార్తె కుటుంబంలో కల్లోలం తలెత్తడంతో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ముందు బాబూరావు మండపేటలోని కొండపల్లివారి వీధిలోకి మకాం మర్చారు. ఏం చేసినా ఫలితం లేదని భావించిన నవీన పిల్లలను వదిలేస్తే వారు అనాథలవుతారని భావించి వారితో కలసి లొల్ల లాకుల సమీపంలో అమలాపురం బ్యాంక్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాలువలోకి దూకే ముందు ఆమె పలకమీద ‘నువ్వు చేసిన తప్పుకు నా బిడ్డలు బాధ పడాలి బావా’ అని ‘నాన్నా నన్ను క్షమించండి’ అని వ్రాసి పలకను గట్టుమీద వదిలివేసింది. ఈ ఆత్మహత్యకు కుటుంబ తగాదాలే కారణం కావచ్చని పలకమీద రాతలను బట్టి తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను వెలికి తీయాలని పోలీసులను ఆదేశించారు. దీనిపై అమలాపురం డీఎస్పీ ఆర్ రమణ ఆధ్వర్యంలో రావులపాలెం సీఐ వి.కృష్ణ, ఎస్సై నరేష్ కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత బాలిక, అనంతరం బాలుడు, చివరగా నవీన మృతదేహలు సంఘటనా స్థలం సమీపం నుంచే వెలికి తీశారు. మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వ అసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేష్ తెలిపారు. రోజూ తమతో ఆడుకునే స్నేహితులు విగతజీవులుగా పడి ఉండటం చూసి అర్థం కాక తోటి స్నేహితులు వారిని ఆడుకోడానికి రమ్మని పిలవడం చూపరులను ఆవేదనకు గురిచేసింది. ఆ తండ్రిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపడితే అసలు విషయాలు వెలుగుచూస్తాయి. -
కూలిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శ్లాబు
మండపేట: తూర్పు గోదావరి జిల్లా మండపేటలో బుధవారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శిథిల భవనం శ్లాబు కూలిన ఘటనలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైఎస్సార్సీపీ శ్రేణులు హుటాహుటిన ఆస్పత్రులకు తరలించాయి. బహిరంగ సభ అనంతరం ఆస్పత్రిలో క్షతగాత్రులను జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. బాధితులకు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని పార్టీ నేతలకు సూచించారు. వైఎస్ జగన్ బహిరంగ సభను బుధవారం స్థానిక కేపీ రోడ్డులో ఏర్పాటుచేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అంచనాకు మించి వేలాదిగా జనం తరలివచ్చారు. తమ అభిమాన నేతను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంతో ప్రచార రథం సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శిథిల భవనంపైకి ఎక్కారు. శిథిల భవనం కావడంతో ఒక్కసారిగా శ్లాబ్ కూలి కింద ఉన్న వారిపై పడిపోయారు. పోలీసులు, పార్టీ శ్రేణులు శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారిని మండపేటలోని పదో వార్డుకు చెందిన పిల్లే రామాయమ్మ (62), మండలంలోని పాలతోడుకు చెందిన సరాకుల సూరమ్మ (75)లుగా గుర్తించారు. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, వైఎస్సార్ సీపీ అంటే పార్టీ మాత్రమే కాదని, రాజన్న కుటుంబమని బోస్ తెలిపారు. -
మండపేట బహిరంగ సభలో వైఎస్ జగన్
-
ప్లాట్లపై ఉన్న రుణం మాఫీ: వైఎస్ జగన్
మండపేట(తూర్పుగోదావరి జిల్లా) : పేదవాడికి ఫ్లాట్ ఇస్తామంటూ దోచేస్తున్నారు.. ప్లాటుకు నెలనెలూ రూ.3 వేలు కడుతూ పోవాలట.. చంద్రబాబు ప్లాట్లు ఇస్తే తీసుకోండి.. అధికారంలోకి రాగానే ఆ ప్లాట్లపై ఉన్న రుణం మొత్తాన్ని మాఫీ చేస్తాం’ అని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ప్రసగించారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని అధికారంలోకి రాగానే అందరిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ‘పంటలకు గిట్టుబాటు ధరలు లేవని రైతులు నాతో చెప్పారు. ధాన్యం దళారీల పాలవుతున్న విషయాన్ని రైతులు నాతో చెప్పారు. అధికారంలోకి రాగానే రైతులకు సరైన మద్ధతు ధర ఇచ్చే బాధ్యత నాదే. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. ఫీజులు కట్టేందుకు అప్పులు చేస్తున్న తల్లిదండ్రులను చూశా.. పిల్లలు, తల్లిదండ్రులకు చెబుతున్నా..నేనున్నాననే హామీ ఇస్తున్నా.. ఆరోగ్య శ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. ఆరోగ్యం అందని పేదవాడిని చూశా.. వాళ్ల బాధలు కూడా విన్నా.. ప్రతి పేదవాడికి చెబుతున్నా.. నేనున్నాననే హామీ ఇస్తున్నా’ అని వ్యాక్యానించారు. నిరుద్యోగులకు హామీ ఇస్తున్నా.. ‘ఉద్యోగాలు రాక అవస్థలు పడుతోన్న యువతను చూశా.. నిరుద్యోగులకు హామీ ఇస్తున్నా..నేనున్నాననే భరోసా ఇస్తున్నా. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అబద్ధాలు, మోసాలే.. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతోనే కాదు..ఎల్లో మీడియాతో కూడా. ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబు ప్రతి గ్రామానికి డబ్బుల మూటలు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. మీరు అందరూ గ్రామాలకు వెళ్లండి.. ప్రతి ఒక్కరికీ చెప్పండి.. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్ద’ని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. రైతుకు మే నెలలో రూ.12,500 ‘కొన్ని రోజులు ఓపిక పడితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పండి. అలాగే రైతన్నలకు ప్రతి మే నెలలో ఒకే సారి రూ.12,500 ఇస్తామని చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు ఇస్తామని చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణం ఉన్నా నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాం. బ్యాంకులకు సగర్వంగా వెళ్లే రోజులు మళ్లీ వస్తాయి. ప్రతి మహిళ లక్షాధికారి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. అవ్వా తాతలకు రూ. 3 వేల వరకు పింఛన్ ఇస్తామ’ని వైఎస్ జగన్ అన్నారు. పిట్టగోడ కూలి అభిమానులకు గాయాలు మండపేట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. పిట్టగోడ కూలి పలువురు అభిమానులకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో గాయపడ్డ వారిని కార్యకర్తలు స్థానికంగా ఉన్న కృష్ణా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీ నేత, మండపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరమార్శించారు. -
మండపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పిల్లి సుభాష్‌చంద్రబోస్ నామినేషన్
-
‘బోస్ గెలిస్తే మండపేటకు మంత్రి పదవి’
సాక్షి, మండపేట: వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను అఖండ విజయంతో గెలిపించి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇద్దామని, తద్వారా మండపేటకు మంత్రి పదవిని తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు నేతలు సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని బోస్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం స్థానిక అరవింద రైస్‌మిల్లు ఆవరణలో జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ అభ్యర్థి బోస్, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి చింతా అనురాధ, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన, మున్సిపల్ ప్రతిపక్షనేత రెడ్డి రాధాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతా అనూరాధ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా తాను, తన నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించుకుని అధినేతకు కానుకగా అందజేస్తానన్నారు. మాజీ ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మాట్లాడుతూ వైఎస్ స్వర్ణయుగం పాలన తనయుడు జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. మున్సిపల్ ప్రతిపక్షనేత రాజుబాబు మాట్లాడుతూ మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బోస్ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ లేకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ బోస్ విజయంతో మండపేట నియోజకవర్గానికి మంత్రి పదవి రానుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి వెంకన్నబాబు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా బోస్ విజయానికి కృషి చేయాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణపుల్లేష్, సొసైటీ అధ్యక్షులు నల్లమిల్లి చినకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నల్లమిల్లి వీర్రెడ్డి, పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఆకుమర్తి చిన్న, పోతంశెట్టి ప్రసాద్, సత్యకృష్ణ, గంగుమళ్ల రాంబాబు, పిల్లా వీరబాబు, సాధనాల శివ, దంతులూరి శ్రీరామవర్మ, వల్లూరి రామకృష్ణ, బోణి కుమారి, నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బోస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా : పట్టాభి సమావేశంలో మాట్లాడుతున్న పట్టాభి నియోజకవర్గంలో బోస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని పార్టీ నేత పట్టాభిరామయ్య చౌదరి తెలిపారు. ఎల్లప్పుడు బోస్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పట్టాభి సూచించారు. బోస్ విజయాన్ని జగన్‌కు కానుకగా అందజేస్తామన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి చింతా అనురాధకు నియోజకవర్గంలో భారీ ఆధిక్యత వచ్చేందుకు పాటుపడతానని పట్టాభిరామయ్య చౌదరి పేర్కొన్నారు. -
పల్లె.. తల్లడిల్లె..!
సాక్షి, మండపేట: పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించింది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసింది. ప్రజలతో ఎన్నికైన పాలకవర్గాన్ని కాదని, తెలుగు తమ్ముళ్లతో ఏర్పాటు చేసిన కమిటీలకు పెత్తనం అప్పగించింది. మరోపక్క పంచాయతీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ప్రజలను ఇబ్బందులు పాల్జేసింది. నిధులున్నా తరచూ ట్రెజరీ ఆంక్షలతో వినియోగించుకోలేని దుస్థితిలోకి పంచాయతీలను నెట్టేసింది. అభివృద్ధి పనులు ముందుకు సాగక, ఉద్యోగులకు జీతాలు చెల్లించక గ్రామ పాలన పడకేసింది. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం డివిజన్ల పరిధిలో మొత్తం 779 క్లస్టర పరిధిలో 1,069 పంచాయతీలకు గాను గ్రేడ్ –1 పరిధిలో 300 పంచాయతీలు ఉండగా, గ్రేడ్–2 పంచాయతీలు 231, గ్రేడ్ –3 పంచాయతీలు 308, గ్రేడ్–4 పంచాయతీలు 230 ఉన్నాయి. రిజిస్ట్రార్ విలువ ఆధారంగా పన్నుల భారాన్ని భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు ఆ స్థాయిలో సదుపాయాల కల్పనను విస్మరించింది. జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పోస్టు ఖాళీ అయ్యి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇన్చార్జి పాలనలో ఉండడం గమనార్హం. కాకినాడ డీఎల్పీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామ పాలనలో ప్రధాన భూమిక నిర్వర్తించే కార్యదర్శులకు కొరత సమస్య పట్టిపీడిస్తోంది. ధృవపత్రాల మంజూరు, ఫించన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ సభల నిర్వహణ, ఉపాధిహామీ సేవలు, స్మార్ట్ గ్రామాలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూలు, ఇతర పాలనాపరమైన విధులను వీరు నిర్వర్తిస్తున్నారు. 779 క్లస్టర్లకుగాను 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులు ఉండడంతో 230 క్లస్టర్ల పరిధిలోని పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. అధికశాతం పంచాయతీల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఆయా ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఏలికలు లేకుండానే పల్లెపాలన పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారు. నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలపై కోర్టు వివాదాలు నేపథ్యంలో 2013లో జిల్లాలోని 42 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలతో 27 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోగా, కాకినాడ డివిజన్లోని కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది పంచాయతీలు, పెద్దాపురం డివిజన్లోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల సమీపంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రంగంపేట మండలం జి.దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. 2014 ఆగస్టు నాలుగో తేదీతో అనపర్తి పంచాయతీ పదవీకాలం ముగియగా, నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక పాలనలో ఉంది. పలువురు సర్పంచుల రాజీనామాలు, మరణాల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా 15 పంచాయతీల్లో సర్పంచ్ పదువులకు ఎన్నికలు జరపాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టేశారు. సకాలంలో వీటికి ఎన్నికలు జరపకపోవడంతో ప్రత్యేక పాలనలోనే మగ్గాయి. ఎన్నో ఇబ్బందుల్లో ప్రజలు పాలకులు లేకపోవడంతో వెలగని వీధిలైట్లు, డ్రైన్లో పారని మురుగునీరు, పనిచేయని కుళాయిలు, వీధి మలుపులో తొలగని చెత్త, క్షీణించిన పారిశుద్ధ్యంతో వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు, అడుగుపడని అభివృద్ధి, పాలకవర్గాలు లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో ఎనిమిదేళ్లుగా విలీన ప్రతిపాదిత గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు. నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయం. పట్టించుకునే వారు లేక గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. . పాలకులపై పెత్తనం పంచాయతీల్లో ప్రజలతో ఎన్నుకోబడిన పాలకవర్గం పాలన సాగిస్తోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి పనుల నిర్వహణలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. రాజ్యాంగ బద్ధంగా సాగే ఈ ప్రక్రియను తుంగలోకి తొక్కి జన్మభూమి కమిటీల పేరిట అధికారపార్టీ నేతలకు పెత్తనం అప్పగించారు సీఎం చంద్రబాబు. అర్హులందరికీ అందాల్సిన సంక్షేమ ఫలాలను జన్మభూమి కమిటీల ద్వారా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టుకున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, గృహనిర్మాణం, కార్పొరేషన్ రుణాలు తదితర ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా కమిటీ సభ్యులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి. పథకాల మంజూరులో తెలుగు తమ్ముళ్ల చేతివాటం దాఖలాలు జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. సిబ్బందికి జీతాలు అందక.. ట్రెజరీ నిధులపై ప్రభుత్వ ఆంక్షల నేపధ్యంలో పంచాయతీ సిబ్బంది జీతాలు అందకపోవడంతో పాటు, అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో 5,600 మంది, రెగ్యులర్‌గా 318 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. తరచూ ట్రెజరీ ఆంక్షలతో సకాలంలో జీతాలు అందక సిబ్బంది ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అభివృద్ధి పనులకు ఆంక్షలు ఆటంకంగా మారాయి. కోట్లాది రూపాయల మేర బిల్లు బకాయిలు పేరుకుపోతుండడంతో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. బిల్లులు విడుదల కాక ఏం చేయాలో పాలుపోనిస్థితిలో కాంట్రాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికన అధికారపార్టీ నేతలతో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో ప్రజలతో ఎన్నుకోబడిన పాలకవర్గం కేవలం ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. -చింతా ఈశ్వరరావు, మండల సర్పంచుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పెదకొత్తూరు, కరప మండలం అధికారులు లేక ఇక్కట్లు పంచాయతీల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. ఒక్కో కార్యదర్శి రెండు నుంచి ఐదు పంచాయతీల వరకు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. కార్యదర్శుల కొరతతో ఏ పనీ సకాలంలో జరగక ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. -కసిరెడ్డి ఆంజనేయులు, మాజీ సర్పంచ్, లూతుకుర్రు, మామిడికుదురు మండలం జీతాలు చెల్లించలేని దుస్థితి ట్రెజరీ ఆంక్షలతో సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితికి పంచాయతీలను ప్రభుత్వం తీసుకువచ్చింది. సకాలంలో బిల్లులు విడుదలవ్వక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. సమస్యలు పరిష్కారమవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. -పండా రామకృష్ణదొర, పందిరిమామిడి, ఏజెన్సీ డివిజన్ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు మండలం -
మహాలక్ష్మి.. మహా మోసం..
‘‘పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ. 30,000 బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వయస్సు వచ్చే నాటికి రూ.రెండు లక్షలను అందజేస్తాం.’’ – 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలోని 16వ పేజీలో పొందుపర్చిన హామీ ఇది. సాక్షి, మండపేట: బాలిక సంక్షేమానికి మహాలక్ష్మి పథకాన్ని తెస్తామన్న టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తక పోగా దివంగత వైఎస్ ఆశయానికి తూట్లు పొడిచింది. బాలిక సంరక్షణ కోసం వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన బంగారు తల్లి పథకానికి మంగళం పాడుతూ ఏకంగా ఆన్లైన్ నుంచి తొలగించేసింది. మా ఇంటి మహాలక్ష్మి పథకం పేరిట దరఖాస్తులు స్వీకరణకే పరిమితమైందన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని డీఆర్డీఏ, మెప్మా సిబ్బంది వాపోతున్నారు. బాలిక శిశు మరణాలు, బాల్య వివాహాలను అరికట్టి బాలికల ఉన్నత చదువులకు బాటలు వేసేందుకు 2005లో అప్పటి సీఎం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం (జీసీఐపీఎస్) ప్రవేశపెట్టారు. ఒక ఆడ పిల్లతో శస్త్రచికిత్స చేయించుకున్న పేదలకు రూ.లక్ష, ఇరువురు ఆడపిల్లలతో శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున రెండు బాండ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొన్ని మార్పులు, చేర్పులతో 2013 మే ఒకటో తేదీ నుంచి గత ప్రభుత్వం బంగారుతల్లి బాలికాభ్యుదయ సాధికార చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఒకే తల్లికి జన్మించిన మొదటి ఇద్దరి ఆడ పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. పుట్టిన పాప జనన ధ్రువీకరణ పత్రం, తల్లి ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలతో దరఖాస్తు చేసుకుంటే డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో అర్హులైన వారిని ఎంపిక చేసేవారు. పుట్టిన వెంటనే తొలి విడతగా రూ. 2,500, మొదటి రెండేళ్లు ఇమ్యూనైజేషన్, వైద్య సేవలు కోసం ఏడాదికి రూ.2,000 చొప్పున, 3, 4, 5 సంవత్సరాల్లో పౌష్టికాహారం నిమిత్తం ఏడాదికి రూ.1,500 చొప్పున, విద్యాభ్యాసం నిమిత్తం 1 నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ. 2,000 చొప్పున, 6, 7, 8 తరగతుల్లో ఏడాదికి రూ.2,500 చొప్పున బ్యాంకు ఖాతాకు జమచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 9, 10 తరగతుల్లో ఏడాదికి రూ. 3,000 చొప్పున, ఇంటర్మీడియట్లో ఏడాదికి రూ.3,500లు చొప్పున, డిగ్రీలో ఏడాదికి రూ. 4,000లు చొప్పున చెల్లించడంతో పాటు డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇంటర్మీడియట్లోనే చదువు నిలుపుచేస్తే రూ.50,000లు జమచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొందరికి సాయం అందించింది. ఆన్లైన్ నుంచి బంగారు తల్లి పథకం తొలగింపు 2016 ఏప్రిల్ నుంచి బంగారు తల్లి పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. అప్పటికి జిల్లాలోని అర్బన్ ఏరియాల్లో 3,879 దరఖాస్తులు ఆన్లైన్ కాగా వీటిలో కేవలం 813 మందికి తొలి విడత సాయం అందింది. అలాగే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 24,909 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదుచేయగా కొద్దిమంది మాత్రమే సాయం అందించారు. ఆన్లైన్ నిలిపివేయడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండానే ఈ పథకాన్ని మొత్తం ఆన్లైన్ నుంచి ప్రభుత్వం తొలగించడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మా ఇంటి మహాలక్ష్మి పేరిట గతంలో దరఖాస్తులు స్వీకరించినా తర్వాత వాటి విషయమై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లబ్ధిదారులకు స్పష్టత ఇచ్చే అధికారులే కరువయ్యారు. ఆన్లైన్ లేకపోవడంతో దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియడం లేదని సంబంధిత శాఖలకు చెందిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న మహాలక్ష్మి పథకం అమలుకు సంబంధించిన ఉత్తర్వులు ఏమీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు నా భర్త తాపీమేస్త్రీగా పనిచేస్తుంటారు. ఇద్దరు ఆడపిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడుతున్నాం. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. అధికారులను అడుగుతుంటే ఆ పథకం అమలులో లేదని చెబుతున్నారు. – బొత్స నాగదేవి, ద్వారపూడి ఆ పథకం లేదంటున్నారు ముందు ఆడపిల్ల కాగా 2014లో మరలా అమ్మాయి పుట్టింది. బంగారు తల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాం. బాండు కోసం ఎన్నో మార్లు అధికారులను అడిగితే త్వరలో వస్తుందని చెప్పారు తప్ప ఇప్పటికి రాలేదు. ఇప్పుడేమో ఆ పథకం లేదని చెబుతున్నారు. – కె. రాజ్యలక్ష్మి, ద్రాక్షారామ -
సొంతిల్లు సాకారం పెద్దాయన చలవే..
సాక్షి, మండపేట: ప్రతి పేదవాడూ కలలు కనేది సొంతింటి కోసమే. తన సొంత ఇంటిలో ప్రశాంతంగా జీవించాలని సంబరపడుతుంటారు. అధికారంలోకి వచ్చిందే తడవు పేదల కలను సాకారం చేసి చూపించారు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. పేదవర్గాల వారి అద్దె ఇంటి వెతలు తీర్చేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేశారు. మూడు విడతలుగా అమలుచేసే ఈ పథకానికి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో జిల్లాకు 2,14,205 ఇళ్లను మంజూరు చేసిన వైఎస్ దాదాపు రూ.743.96 కోట్లు విడుదల చేశారు. వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఇందిరమ్మ పథకాన్ని 2006 ఏప్రిల్ 1వ తేదీన కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే ప్రారంభించారు. అప్పటి వరకు అర్బన్ ప్రాంతాల్లో రూ.30 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.22,500 ఉన్న గృహనిర్మాణ సాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా అర్బన్‌లో రూ.55 వేలు, రూరల్‌లో రూ.45 వేలకు పెంచారు. అలాగే ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని అర్బన్‌లో రూ.75 వేలు, రూరల్‌లో రూ.65 వేలకు పెంచారు. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సొంత స్థలాలు లేని పేదవర్గాల కోసం కోట్లాది రూపాయల వ్యయంతో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు సేకరించారు. ఇందిరమ్మ మూడు దశల్లో భాగంగా స్థలాలు మెరక పనులు చేసి లబ్ధిదారులకు అప్పగించడంతో పాటు గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేశారు. మూడు విడతల్లోను మొత్తం జిల్లాకు 2,14,205 ఇళ్లను మంజూరు చేశారు. అందుకోసం సుమారు రూ.743.96 కోట్లు విడుదల చేశారు. పేదవర్గాల వారి సొంతింటి కలను సాకారం చేస్తూ వీటిలో సుమారు 1.95 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మండపేటలో దాదాపు 4,500 మంది పేదవర్గాల వారికి పంపిణీ చేసేందుకు స్థానిక గొల్లపుంత ప్రాంతంలో రెండు విడతలుగా రూ.18.14 కోట్లతో 122.72 ఎకరాలు సేకరించారు. పేదల సొంతింటి కోసం రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్ద స్థల సేకరణ కావడం గమనార్హం. తొలి విడతలో సేకరించిన 55.77 ఎకరాల్లో మెరక పనులు పూర్తి కాగా ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున 2009 ఫిబ్రవరి 27న పట్టాల పంపిణీని వైఎస్ ప్రారంభించారు. 1979 ప్లాట్లుగా విభజించి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలో 1834 మందికి గృహనిర్మాణ రుణాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 1200కు పైగా ఇళ్లు పూర్తయ్యాయి. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ద్వారా వారి గుండె గూటిలో గూడు కట్టుకున్నారు వైఎస్. పేదల సొంతింటి కలను సాకారం చేసిన దివంగత వైఎస్ దివికేగి ఏళ్లు గడుస్తున్నా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పక్కా ఇళ్లకు ‘చంద్ర’గ్రహణం పేదల పక్కా ఇళ్లకు నేడు చంద్రగ్రహణం పట్టింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఎన్టీఆర్ గృహనిర్మాణం పేరిట పక్కా ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు జిల్లాకు కేవలం 64,647 ఇళ్లు మంజూరు చేయడం పేదల పక్కా ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. రూ.1.5 లక్షల ఆర్థిక సాయమంటూ మూడేళ్లలో ఆయా ఇళ్లకు కేటాయించింది రూ.594.75 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. నిర్మాణంలో ఉన్నవి, నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు రూ. వంద కోట్లకు పైగా బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉన్నట్టు అంచనా. మూడేళ్లలో... మంజూరైన ఇళ్లు నిధులు నిర్మాణం పూర్తయినవి నిర్మాణంలో ఉన్నవి వైఎస్ హయాంలో.. 2,14,205 రూ. 743.96 కోట్లు 1,99,890 14,315 చంద్రబాబు హయాంలో.. 64,647 రూ. 594.75 కోట్లు 46,614 11,998 -
వైఎస్సార్ జయంతి: మండపేటలో రక్తదాన శిబిరం
-
మండపేటలో వైఎస్ఆర్సీపీ ఆందోళన
-
నా సినిమాలు నేను చూడనంటోన్న నటుడు
రాయవరం (మండపేట) : సినీ రంగంలో విలన్‌గా జీవితాన్ని ప్రారంభించి.. అనంతరం కమెడియన్‌గా, క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా సత్తా నిరూపించుకున్న ఘనత ప్రముఖ నటుడు జీవాకే దక్కుతుంది. సుదీర్ఘ కాలంగా నటుడిగా కొనసాగుతున్న ఆయన ఊపిరి ఉన్నంత వరకూ నటుడిగానే కొనసాగుతానని అంటున్నారు. తన దృష్టిలో దర్శక, నిర్మాతలే అసలైన హీరోలంటున్న జీవా మంగళవారం రాయవరం సాయితేజా విద్యానికేతన్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నాటక రంగం నుంచే సినిమాల్లోకి వచ్చాను. పేపరులో వచ్చిన ప్రకటన చూసి, నా స్నేహితులు ఫొటోలు పంపించారు. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఎంపిక చేసి, ‘తొలికోడి కూసింది’ సినిమాలో తొలి అవకాశం కల్పించారు. ఆ సినిమా షూటింగ్ జిల్లాలోని దోసకాయలపల్లిలో జరిగింది. అలా జిల్లాతో అనుబంధం ఏర్పడింది. నన్ను గుర్తించి, ప్రోత్సహించిన దర్శకుడు బాలచందర్‌పై ఉన్న గౌరవంతో ఆయన పేరును నా రెండో కుమారుడికి పెట్టుకున్నాను. అతడు కూడా దర్శకత్వ శాఖలోనే పని చేస్తూ సినిమా తీసే సన్నాహాల్లో ఉన్నాడు. అప్పటివరకూ విలన్‌గా నటిస్తున్న నన్ను కమెడియన్‌గా మార్చింది ప్రముఖ దర్శకుడు వంశీనే. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో తొలిసారిగా కమెడియన్ పాత్ర చేశాను. అది హిట్టవడంతో అక్కడి నుంచి కమెడియన్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాను. క్యారెక్టర్ ఆర్డిస్టుగా కూడా రాణిస్తున్నాను. ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు వెయ్యి వరకూ చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నాను. సినిమాల్లో కొన్ని పాత్రలు నాకు పేరు తెచ్చి పెట్టాయి. ‘భరత్ అనే నేను’ సినిమాలో విద్యాశాఖ మంత్రి పాత్రకు మంచి పేరు వచ్చింది.∙ఎవ్వరైనా, ఏ వృత్తిలోనైనా పరిపూర్ణత సాధించడానికి జీవితకాలం చాలదు. నటుడికి తృప్తి ఉండదు. అవకాశం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటాను. చిన్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు సినిమాలు అధికంగా చూసేవాడిని. నేను నటించిన సినిమాలు మాత్రం చూడను. ‘గులాబి’ సినిమా మాత్రమే నా భార్యతో కలిసి చూశాను. అదే తొలి, చివరి సినిమా. నటించడమే తెలుసు కానీ, నటించిన సినిమాలు మాత్రం చూసే అలవాటు లేదు. -
మండపేటలో ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్
మండపేట: నిత్యం పని ఒత్తిళ్లలో ఉండే అధికారులు, ఉద్యోగులకు ఆటవిడుపుగా ఇంటల్ డిపార్ట్మెంటల్ గేమ్స్, స్పోర్ట్స్‌మీట్ ఏర్పాటుచేయడం అభినందనీయమని జేసీ మల్లికార్జున అన్నారు. మండపేట నియోజకవర్గంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్‌మీట్‌ను శనివారం జేసీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్పోర్ట్స్‌మీట్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు వి.సాయికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ స్పోర్ట్స్‌మీట్ నిర్వహణ అభినందనీయమన్నారు. తొలుత ఉద్యోగుల నుంచి జేసీ, ఎమ్మెల్యే క్రీడావందనం స్వీకరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, సంయుక్త కార్యదర్శి స్పర్జన్‌రాజు, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు రెడ్డి రాధాకృష్ణ, అంతర్జాతీయ పోల్‌వాల్ట్ క్రీడాకారుడు రామభద్రరాజువర్మలను నిర్వాహకులు సత్కరించారు. ఎమ్మెల్యే టీం, జేసీ టీం పేరిట నిర్వహించిన ఎగ్జిబిషన్ పోటీల్లో జేసీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, పరుగు, షాట్‌పుట్ వంటి పోటీలతో పాటు ఉద్యోగినులకు టెన్నికాయిట్, చెస్, స్పీడ్ వాక్, షాట్‌పుట్ తదితర పోటీలు జరిగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ఆర్.గోవిందరావు, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పోలీసులకు చిక్కిన నిందితుడు
చోరీ సొత్తు స్వాధీనం మండపేట : మండపేటలో జరిగిన చోరీ కేసులో నిందితుడు పోలీసులకు చిక్కాడు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్ కేసు వివరాలను వివరించారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి నివాసంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వియ్యంకుడు చినబాబు నివసిస్తున్న గదిలో చోరీ జరిగిందన్నారు. అర్ధరాత్రి సమయంలో చినబాబు సతీమణి సుజాతమ్మ బాత్రూమ్కు వెళ్లిన సమయంలో పట్టణంలోని మఠం వీధికి చెందిన పెదగాడి వీరవెంకట వీరేంద్ర (20) ఇంట్లోకి ప్రవేశించి రూ.57 లక్షల విలువైన ఆభరణాలు, రూ.52,700 నగదు చోరీ చేశాడన్నారు. దీనికి అదే ఇంటిలో పనిచేస్తున్న దేవుడు అనే వ్యక్తి సహకరించినట్టు అనుమానాలున్నాయన్నారు. వీరేంద్ర హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడకు వచ్చి ఈ నేరానికి పాల్పడ్డారన్నారు. గతంలోను ఇతడికి నేరచరిత్ర ఉందని, తల్లి గొలుసు, మేనమామకు చెందిన బంగారాన్ని చోరీ చేసినట్టు ఏఎస్పీ దామోదర్ వివరించారు. నిందితుడు వ్యసనాలకు బానిసై పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డాడన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు కూడా చేసేవాడని తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఈ చోరీ చేసిన ఆభరణాల్లో రెండు గాజులను స్థానికంగా ఉన్న బంగారు షాపు వద్దకు అమ్మడానికి తీసుకురాగా అనుమానం వచ్చి షాపు యజమానులు ఇచ్చిన సమాచారం మేరకు చాకచక్యంగా డీఎస్పీ మురళీకృష్ణ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్కడి నుంచి అతడి ఇంటికి వెళ్లి అతను ఇంటిలో దాచిన బ్యాగును గుర్తించగా అందులో బంగారు ఆభరణాలు, నగదు లభ్యమయ్యాయన్నారు. డీఎస్పీ మురళీకృష్ణ చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారని ఏఎస్పీ దామోదర్ ప్రశంసించారు. ఐదుగురు పోలీస్ అధికారులతో ఐదు బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో వ్యూహాత్మకంగా ఒక బృందాన్ని రంగంలోకి దించారని వివరించారు. ఎప్పటికప్పుడు స్వయంగా కేసును పర్యవేక్షించడం వల్ల నిందితున్ని త్వరగా పట్టుకోగలిగామన్నారు. ఈ కేసులో సీఐలు గీతా రామకృష్ణ, వి. పుల్లారావు, హ్యాపీ కృపావందనం, ఎస్ఐలు ఎండీ నసీరుల్లా, పెద్దిరాజు, రామకృష్ణ తదితరులకు ఎస్పీ రివార్డు ప్రకటించారని వివరించారు. నిందితున్ని ఆలమూరు కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఏఎస్పీ దామోధర్ తెలిపారు. -
మండపేట చోరీ కేసును ఛేదించిన పోలీసులు
చోరీ సొత్తు మొత్తం స్వాధీనం మండపేట : పట్టణంలో సంచలనం కలిగించిన భారీ చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక మఠం వీధికి చెందిన యువకుడు 20 ఏళ్ల యువకుడు వీవీ వీరేంద్ర ఈ చోరీకి పాల్పడ్డాడు. మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి నివాసంలో సోమవారం అర్ధరాత్రి దుండగుడు చొరబడి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వియ్యంకుడు చినబాబు గదిలోని బీరువాలో ఉంచిన సుమారు రూ.57.55 లక్షల విలువైన సొత్తును చోరీ చేసిన విషయం విదితమే. వారి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదుపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐదు బృందాలుగా దర్యాఫ్తు ప్రారంభించారు. చోరీకి గురైన వస్తువుల జాబితాతో ముద్రించిన కరపత్రాలను మండపేట, రావులపాలెం, రామచంద్రపురం, భీమవరం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం తదితర ప్రాంతాల్లోని బంగారు వర్తకుల షాపులకు అందజేశారు. గతంలో పనిచేసిన అనుభవంతోనే.. చోరీ జరిగిన ఇంటిలో ఈ యువకుడు గతంలో వడ్రంగి పనిచేసినట్టు తెలిసింది. వీరేంద్ర చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. 10వ తరగతి పాసైన తర్వాత పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ చేశాడు. తాతతో కలిసి వడ్రంగి పనిలోకి వెళుతూ, ఎలక్ట్రికల్ పనులు కూడా చేస్తుండేవాడు. గతంలో చౌదరి నివాసంలో తాతతో కలిసి పనులు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఒక కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ ఈ ఏడాది జనవరిలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే విజయవాడలోనే ఉండేవాడని తెలిసింది. సోమవారం రాత్రి మండపేట చేరుకున్న నిందితుడు ఇంటికి వెళ్లే మార్గంలోని చౌదరి ఇంటిలోకి చొరబడ్డాడు. సుజాతమ్మ టాయిలెట్‌కు వెళ్లిన సమయాన్ని గమనించి లోపలికి చొరబడి ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. పట్టుబడిందిలా... కేపీ రోడ్డులోని ఒక బంగారం షాపులో రెండు గాజులు విక్రయించేందుకు నిందితుడు బుధవారం తీసుకువచ్చాడు. పోలీసులు అప్పటికే కరపత్రాలు ఇవ్వడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ మురళీకృష్ణ అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడినుంచి అతని ఇంటికి వెళ్లి అతను ఇంటిలో దాచిన బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్నాయి. పోలీసుల ఇంటరాగేషన్‌లో చోరీ చేసినట్టుగా నిందితుడు అంగీకరించినట్టు తెలిసింది. మొత్తం చోరీ సొత్తు రికవరీ కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చోరీ విషయంలో ఇంకెవరికైనా ప్రమేయం ఉందనే విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
నమ్మి ఓట్లేస్తే.. నట్టేట ముంచారు
సీఎం చంద్రబాబుపై ఏపీ ఎమ్మార్పీఎస్ నేతల ధ్వజం మండపేట : ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానంటూ ఎన్నికల సమయంలో ఇచ్చి హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు మాదిగలను మోసగించారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్ని రమణయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాదిగ ధ్వజమెత్తారు. నమ్మి ఓట్లేసిందుకు నట్టేట ముంచిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ప్రారంభమైన మాదిగల సంకల్ప చైతన్య రథయాత్ర శనివారం జిల్లాకు చేరుకుంది. జిల్లా అధ్యక్షుడు బుంగ సంజయ్ ఆధ్వర్యంలో మండపేట మీదుగా రాజమండ్రి వరకు ఈ యాత్ర సాగింది. మండపేట ఎస్సీ కాలనీలో సంజయ్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ వర్గీకరణతోనే మాదిగలు, ఉపకులాల అభ్యున్నతి సాధ్యమన్నారు. వర్గీకరణ సాధనకు మాదిగలు, ఉపకులాల వారిని చైతన్యవంతులను చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సంకల్ప చైతన్య రథయాత్ర చేస్తున్నామన్నారు. అనంతరం భారీ ర్యాలీగా రాజమండ్రి వైపు రథయాత్ర సాగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి ఇజ్రాయేల్, మల్లవరపు వెంకట్రావు, ఉప్పలపాటి నెపోలియన్, పిప్పర సంపతరావు, బొత్స ఏసురెల్లి, చిర్రా శ్రీను, మోరంపూడి మధు, ముమ్మిడివరపు సుబ్బు, కొమ్ము సత్తిబాబు, చుక్కా ఏసు తదితరులు పాల్గొన్నారు. -
మండపేటలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ
-
రౌడీ బజార్
రైతుల పేరుతో ‘తమ్ముళ్ల’కు దుకాణాల కేటాయింపు అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యం తమకు సంబంధం లేదంటూ ఎస్టేట్ అధికారి, తహశీల్దారుల పలాయనమంత్రం జరిగిన దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకూ అడ్డంకులు రైతులకు న్యాయం జరిగే వరకూ పోరు ఆగదన్న వైఎస్సార్ సీపీ నేత లీలాకృష్ణ మండపేట : మండపేట రైతుబజారు సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. అక్రమాలపై విచారణకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీశ్రేణులపై దాడికి యత్నించారు. వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ రైతుబజారు సిబ్బందిని బయటకు పంపేశారు. కార్యాలయం లోపలి నుంచి బయటకు వస్తున్న వారిపై కవ్వింపు చర్యలతో గలాటా సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారి మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిని లోపలికి పోనీకుండా గేటుబయట బైఠాయించి అధికారపార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక రైతుబజారులో రైతులకు కాకుండా అధికారపార్టీ నేతలకు షాపులను కట్టబెట్టడంపై విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఎస్టేట్ అధికారి భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం వస్తానన్న ఈఓ హామీ మేరకు వైఎస్సార్ సీపీ నేతలు అక్కడకు వెళ్లగా టీడీపీ నాయకులు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం విచారణకు వస్తున్నట్టు ఈఓ భాస్కర్ ఇచ్చిన సమాచారం మేరకు లీలాకృష్ణ, పార్టీ నేతలతో కలిసి రైతుబజారు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అధికారపార్టీ నేతలు అక్కడకు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, పార్టీ నాయకులు పడాల సతీష్ తదితరులు తమ వాదనలు వినేందుకు మార్కెట్‌గేటు వద్దకు రావాలని కోరారు. అందుకు నిరాకరించిన ఈఓ కేవలం ఆరుగురు మాత్రమే కార్యాలయంలోకి రావాలని సూచించారు. లీలాకృష్ణ, వెంకన్నబాబులతో పాటు మరోనలుగురు కార్యాలయంలోకి వచ్చి తమ పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు గూర్చి ఈఓ భాస్కర్‌కు వివరించారు. అలాగే కూరగాయలు పండిస్తున్నట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించారని, ఏదో ఒక రైతుకు చెందిన కూరగాయల పంటను చూపించాలని లీలాకృష్ణ ఈఓను కోరారు. తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లుకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదు, మార్కెటింగ్ అధికారులదే బాధ్యతని చెబుతున్నారని ఈఓకు లీలాకృష్ణ వివరించారు. ఎవరికి వారే తప్పించుకునే యత్నం.. వీఆర్ఓ, తహశీల్దార్, ఉద్యానవనశాఖ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రాల మేరకే తాము రైతులుగా గుర్తించి దుకాణాలు కేటాయిస్తామని, విచారణ చేసే అధికారం తనకు లేదని ఈఓ భాస్కర్ తెలిపారు. ఇదే విషయాన్ని లీలాకృష్ణ ఫోన్లో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఈఓ భాస్కర్లతో పరస్పరం మాట్లాడించారు. రైతుల గుర్తింపు తమకు సంబంధం లేదని ఈఓ అనగా, మాకూ సంబంధం లేదని తహసీల్దార్ తప్పించుకునే యత్నం చేశారు. తమ్ముళ్ల వీరంగం అప్పటికే బయట ఉన్న అధికారపార్టీ నేతలు కొందరు లోపలికి చొరబడి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని రైతుబజారు సిబ్బందిని బయటకు పంపేశారు. లోపలి నుంచి బయటకు వస్తున్న లీలాకృష్ణ, పార్టీ నేతలపై వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట, వాగ్వాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం బందోబస్తు నేపథ్యం లో ఒక హెచ్‌సీ, ఒక పీసీ మాత్రమే రైతుబజారుకు వచ్చి లీలాకృష్ణతో చర్చించి రైతుబజారు నుంచి బయటకు పంపేశారు. దీంతో వారు అర్హులైన రైతులకు దుకాణాలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కరాచీ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అధికారపార్టీ నేతల తీరుపై ఫిర్యాదు చేసేం దుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అప్పటికే అక్కడకు చేరుకున్న అధికారపార్టీ నేతలు స్టేషన్ వద్ద లీలాకృష్ణ తదితరులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. హెచ్‌సీ సత్యనారాయణ వారి తో చర్చించి అందరిని స్టేషన్లోకి పంపా రు. రామచంద్రపురం అర్బన్ ఎస్ఐ శ్రీనివాసరావు స్టేషన్‌కు చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. కొద్దిసేపటికి సీఐ హ్యాపీకృపావందనం స్టేషన్‌కు వచ్చి ఇరువర్గాలతో చర్చించి పరిస్థితిని అదుపుచేశారు. తమపై దాడికి పాల్ప డ్డారంటూ ఇరువర్గాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు దౌర్జన్యం రైతుబజారు షాపుల కేటాయింపులో అక్రమాలను కప్పిపుచ్చేందుకు అధికారపార్టీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని లీలాకృష్ణ విమర్శించారు. తన వారికి మేలు చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే రైతులకు అన్యాయం చేశారన్నారు. అసలైన రైతులకు మేలు జరిగే వరకు పోరు ఆపబోమన్నారు. బయటి రైతుబజార్లతో పోలిస్తే మండపేట రైతుబజారులో కేజీకి రూ.నాలుగు వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అసలైన రైతులు ఉంటే ఈ పరిస్థితి ఉండేదికాదని లీలాకృష్ణ పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యుడు అన్నందేవుల చంద్రరావు, పార్టీ నాయకులు పడాల కమాలారెడ్డి, పడాల సతీష్, ఎస్.కోటేశ్వరరావు, సరాకుల అబ్బులు, పొలమాల సత్తిబాబు, మేడపాటి సురేష్‌రెడ్డి, తిరుశూల శ్రీను పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసుల బనాయింపు రైతుబజారులో అక్రమాలపై విచారణ కోరిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని రైతుబజారులో సోమవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆకస్మిక తనీఖీ నిర్వహించిన విషయం విదితమే. ఈ సందర్భంగా అధికారపార్టీ నేతలకు షాపులు కట్టబెట్టగా కొందరు బినామీల పేరుతో నిర్వహిస్తుండగా, మరికొందరు అద్దెకు ఇచ్చుకున్నట్టు తనిఖీల్లో వెలుగు చూసింది. ఈ విషయమై విచారణ నిర్వహించి అసలు రైతులకు మేలు చేయాలని అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు లీలాకృష్ణ ఫిర్యాదుచేశారు. విధుల్లో ఉన్న ఈఓ బి.సతీష్‌ను వివరణ కోరగా తనకు తెలీదని బదులిచ్చాడు. కాగా లీలాకృష్ణ, మరికొందరు వచ్చి తన విధులకు ఆటంకం కలిగించినట్టు ఈఓ బి.సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ కేసు నమోదైంది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు రమణమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసినట్టు పట్టణ హెచ్‌సీ సత్యనారాయణ తెలిపారు. -
మాండవ్యపుర రాజ్యంలో ‘ఢీ’
లక్కింశెట్టి శ్రీనివాసరావు ఒకప్పుడు రెడ్డి కాని రెడ్డి పాలించిన రాజ్యం అది. ఇప్పుడదొక ’కమ్మ’ని రాజ్యం. అలాగని కమ్మగా ఉంటుం దనుకునేరు చాలా హాట్‌గానే ఉంటుంది. దశాబ్థ కాలం ఆ మాండవ్యపురాన్ని ’వంక’ వంశీకులు పాలించారు. ఆ తరువాత ’వంక’ రాజ్య వంశీయులు స్వయంవరంలో పాల్గొన్నట్టే పాల్గొని వెనుతిరిగారు. ఆ మాండవ్యపుర రాజ్యంలో ఎవరైనా దశాబ్థ కాలం మాత్రమే పాలించడం ఆనవాయితీ. ’వంక’ వంశీయుల వెంట తిరిగి, తిరిగి వారి రాజనీతితోనే వారినే కూలదోసి ఆ రాజ్యంలో పాగా వేశారు మాండవ్య మహారాజు. ప్రస్తుతం మాంచి ’జోష్’ మీదున్న ఆయన పాలన మొదలై దశాబ్దం పూర్తికావస్తోంది. గత సంప్రదాయం భవిష్యత్తులో పునరావృతం అవుతుందంటే ఆ మహారాజులో ఆందోళన మొదలవదా మరి. ఇప్పుడు ఆ మాండవ్య రాజ్యంలో అదే జరుగుతోంది. ఆ భయంతోనే ఆ మహారాజు సామంత రాజులపై ఒక కన్నేసి ఉంచాడు. నలుగురు సామంతుల్లో తనకు పోటీ పడే స్థాయిలో అమ్ముల పొదిలో అన్ని అస్రా్తలు కలిగి కూతవేటు దూరంలో ఉన్న సామంత రాజును తన పాలనా అనుభవంతో అణగదొక్కేసే ఎత్తులు వేస్తున్నారు. ఎక్కడ తన రాజ్యానికి ఎసరు పెడతారేమోననే ముందుచూపుతో మాండవ్యపుర రాజు చేస్తున్న పనులను చెక్ పెట్టేందుకూ సామంతరాజు పావులు కదపడం ప్రారంభించడంతో మాండవ్యపురాన్ని ఏలుతున్న ఆ మహారాజుకు ఏడాదిగా సామంత రాజు భయం పట్టుకుంది.ఎందుకంటే ఆ రాజ వంశంలో మహారాజుతో సమానంగా అర్థ, అంగబలంతో యుద్ధ రంగంలో ఢీ అంటే ఢీ అనే తెగువ ఆ సామంత రాజుకు ఉండటమే. సంప్రదాయం పునరావృతమై తన పీఠాన్ని ఎక్కడ లాగేసుకుంటారో అని ఆ రాజుకు బెంగపట్టుకుంది. సామంతు రాజకీయం... గతంలో రాజుల కాలంలో కూడా లేని సంప్రదాయాన్ని మాండవ్యపుర మహరాజు తీసుకువచ్చి సామంత రాజు నెత్తినెక్కి కూర్చోవడం అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. ముందు కాలంలో తన పీఠాన్ని ఆ సామంతరాజు ఎక్కడ వశపరుచుకుంటాడోనని బెంగ. మరే రాజ్యంలో లేని విధంగా సామంతరాజు పాలనా మందిరంపైనే మందిరాన్ని పెట్టుకుని రాజ్య పాలన సాగిస్తున్నారు. చివరకు సామంతరాజు వద్ద పనిచేసే మంత్రులు, సేవకులు, భటులు అందరినీ తన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకుని ఆ రాజు సాగిస్తున్న పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజు నియంతృత్వ పోకడలు భరించలేకపోతున్న పలు పరగణాల్లోని చిన్నాచితకా సామంతులంతా మాండవ్యపుర సామంత రాజు శరణు కోరుతున్నారు. మా రాజ్యాలన్నీ మీ వెనకే ఉంటాయని చీకటి సందేశాలు కూడా పంపిస్తున్నారు. సామంత రాజు భవిష్యత్తులో తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని ఇటీవలనే వేగులు ఆ మాండవ్య రాజు చెవిలో వేయడంతో రాజుగారిలో ఆందోళన రెట్టింపైంది. ఆ మాండవ్య రాజుతో మాంచి సాన్నిహిత్యం ఉన్న ’చంద్ర’గిరి చక్రవర్తి ప్రజాధనాన్ని ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా చేసుకుపోతున్నాడు. ఆ ప్రజా ధనమేదో తన వంశీకుల నుంచి వారసత్వంగా వచ్చినట్టు భావించి రాజ్యంలో ప్రజలకు రహదారులు, గుడిసెలు స్థానే పక్కా ఇళ్లు, మాండవ్యపుర నగరంలో అంగళ్లు అన్నీ నచ్చిన వారి కి నచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతున్నాడు. వీటిలో సామంత రాజు ప్రమేయం లేకుండా అన్నీ మాండవ్యపుర మహారాజే తన అనుంగులు ద్వారా చక్కబెట్టేసుకుంటున్నారు. మాండవ్యపుర నగరంలో ఒకప్పుడు నిరుపేదలకు స్వర్ణయుగం అందించాలనే తపనతో రాజన్న రాజ్యంలో 5000 మందికి 123 ఎకరాలు సేకరించారు. అందులో 2000 మంది పేదలకు ఇవ్వగా 63 ఎకరాలు మిగిలింది. వాటిని ఇప్పుడు మాండవ్యరాజు 4,064 మందికి ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. వాటన్నింటినీ స్థానిక పరగణాల సామంతుల ప్రాధాన్యం లేకుండా అన్నీ ఆ మహరాజు వంది,మాగదుల ద్వారానే జరిపించేసుకున్నారు. ఇలా మాండవ్యపుర మహరాజు సుమారు 900 రోజులుగా సాగిస్తున్న ఏకపక్ష పాలన చక్రవర్తి దృష్టికి వెళ్లినా ఫలితం లేదు. ఏతావాతా ఏదో ఒక రోజు మాండవ్యమహరాజు భయపడ్డట్టే సామంత రాజులు తిరుగుబాటు తప్పేటట్టు లేదని మాండవ్య రాజ్య ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. -
పరామర్శకు వెళుతూ.. ప్రమాదంలోకి..
ఆటో, మోటార్ బైక్ ఢీ ఆటో డ్రైవర్ మృతి l ఆరుగురికి గాయాలు మండపేట : మండపేట పెద కాలువ వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా ఆటో, మోటార్ బైక్ ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం రూరల్ వెల్లకు చెందిన మేర్నిడి వెంకటేశ్వరరావు, మేర్నిడి సూర్యనారాయణ, కొడికళ్లపూడి రామకృష్ణ, కొడికళ్లపూడి రాఘవ, సుంకరదేవి కలిసి రాజానగరం మండలం యర్రంపాలెంలో తమ బంధువులను పరామర్శించేందుకు శనివారం మధ్యాహ్నం బయలుదేరారు. గ్రామానికి చెందిన మాధవరపు వెంకటేష్ (26) ఆటోలో వీరంతా ఎక్కారు. రామచంద్రపురానికి చెందిన నిమ్మకాయల వెంకటేష్, శివకృష్ణ రాజమహేంద్రవరం నుంచి మోటార్ బైక్‌పై రామచంద్రపురం వెళుతున్నారు. మండపేట బైపాస్ రోడ్డులోని వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో అదుపుతప్పి ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఆటో చెట్టును ఢీకొనడంతో ఆటోడ్రైవర్ వెంకటేష్ తలకు తీవ్రగాయమై, అక్కడికక్కడే చనిపోయాడు. ఆటోలో మిగిలిన వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్‌పై ఉన్న నిమ్మకాయల వెంకటేష్ తీవ్రంగా గాయపడగా, శివకృష్ణ సురక్షితంగా ఉన్నాడు. క్షతగాత్రులను స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో సుంకరదేవి, రామకృష్ణను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఆటోడ్రైవర్ వెంకటేష్‌కు మూడేళ్ల క్రితమే వివాహమైంది. అతడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. అతడి మరణ వార్త తెలుసుకుని, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. వెంకటేష్ సోదరుడు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. పట్టణ ఎస్ఐ నజీరుల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్కంఠగా పాల పోటీలు
నేడు తేలనున్న విజేతలు సాయంత్రం బహుమతుల పంపిణీ మండపేట : రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలపోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మూడురోజులకు గాను శనివారం ఉదయం తీసిన పాలతో విజేతలను నిర్ణయిస్తారు. అనంతరం పశుప్రదర్శన పోటీలు జరుగనున్నాయి. సాయంత్రం ఆయా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు. పోటీల ప్రారంభం సందర్భంగా గురువారం సాయంత్రం తీసిన పాలను ప్రామాణికంగా తీసుకున్న నిర్వాహకులు శుక్రవారం ఉదయం నుంచి లెక్కింపు చేపట్టారు. పాలపోటీలకు సంబంధించి గేదెలకు సంబంధించి ముర్రా విభాగంలో 17, జాఫర్‌బాదిలో నాలుగు, ఆవులకు సంబంధించి ఒంగోలు విభాగంలో 17, గిర్‌లో ఆరు, పుంగనూరులో ఒక ఆవు పోటీలో నిలిచాయి. ఆయా పాడిపశువుల నుంచి శుక్రవారం ఉదయం తీసిన పాలను ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్లపై ఉంచి లెక్కింపు ప్రారంభించారు. సాయంత్రం తీసిన పాల తూకాన్ని వాటికి జత చేశారు. ముర్రాలో 25 నుంచి 26 కేజీల వరకు దిగుబడి వస్తుండగా, జాఫర్‌బాదిలో సుమారు 19 కేజీలు, గిర్ ఆవుల్లో 16 కేజీలు దిగుబడి వస్తోంది. శనివారం ఉదయం ఆయా పాడిపశువుల నుంచి తీసిన పాల తూకాన్ని కలిపి సరాసరి అధికపాల దిగుబడి ఇచ్చిన పాడిపశువులను విజేతలుగా నిర్ణయించనున్నారు. రెండు విభాగాల్లోను మొదటి మూడు స్థానాలతో పాటు ప్రోత్సాహక విజేతలను ఎంపిక చేయనున్నారు. పశు ప్రదర్శన పోటీలకు సంబంధించి పోతుల విభాగంలో ముర్రా దున్నలు నాలుగు, ఒంగోలు గిత్తలు 22, గిర్ ఐదు, పుంగనూరు తొమ్మిది, పెయ్యిల విభాగంలో ముర్రా గేదెలు 25, ఒంగోలు ఆవులు 63, గిర్ 11, పుంగనూరు 25 ఆవులు పాల్గొంటున్నాయి. పాలపళ్లు, రెండు నుంచి నాలుగు పళ్లు వరకు, ఆరు పళ్లు, ఆపైన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఆయా పశువుల్లో జాతి లక్షణాలు ఏ మేరకు ఉన్నాయి, వాటి ప్రత్యేకతల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. బహుమతులు ఇలా.. పాలపోటీలకు సంబంధించి ఒంగోలు ఆవులు, ముర్రా, జాఫర్ జాతుల గేదెల విభాగాల్లో ప్రథమ బహుమతి రూ.50,000 చొప్పున కాగా, ద్వితీయ రూ.40,000, తృతీయ బహుమతిగా రూ.30,000లు చొప్పున అందించనున్నారు. గిర్, పుంగనూరు జాతుల ఆవుల విభాగాల్లో ప్రథమ రూ.40,000, ద్వితీయ రూ.30,000, తృతీయ రూ.20,000 చొప్పున పాడిరైతులకు బహుమతులుగా అందజేయనున్నారు. పశుప్రదర్శనకు సంబంధించి మూడు విభాగాల్లో మొదటి బహుమతిగా రూ.10,000, ద్వితీయ రూ.7,500, తృతీయ రూ.5,000 చొప్పున అందజేయనున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమానికి హాజరుకానున్నట్టు అధికారులు తెలిపారు. తరలివస్తున్న సందర్శకులు పోటీలను తిలకించేందుకు మండపేట పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి ఔత్సాహిక పాడిరైతులు పోటీలు జరుగుతున్న పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి తరలివస్తున్నారు. పోటీలకు తీసుకువచ్చిన పశువులను తిలకించి వాటి ప్రత్యేకతలను సంబంధిత పాడిరైతులను అడిగి తెలుసుకుంటున్నారు. -
క్షీర సమరం ప్రారంభం
మండపేటలో మొదలైన రాష్ట్ర స్థాయి పాల, ప్రదర్శన పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ల వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పాడిపశువులు మండపేట : మండపేటలో క్షీర సమరం మొదలైంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పాడి పశువులతో మారేడుబాక రోడ్డులో పోటీల ఆవరణలో సందడి నెలకొంది. మూడురోజుల పాటు జరుగనున్న రాష్ట్రస్థాయి పాల, ప్రదర్శన పోటీలను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఐదు విభాగాల్లో జరిగే ఆయా పోటీల్లో పాల్గోనేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పాడిరైతులు తమ పశువులను తీసుకువచ్చారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పాలపోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఒంగోలు, పుంగనూరు తదితర జాతుల సంరక్షణకు, పాడిరైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగా రూ.లక్షల వ్యయంతో పాలపోటీలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మ¯ŒS యాళ్ల దొరబాబు మాట్లాడుతూ మేలుజాతి పశుపోషణలో మండపేట ప్రాంత రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. పోటీల్లో 211 పశువులు పాల దిగుబడి, పశు ప్రదర్శనకు సంబంధించి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొంనేందుకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల నుంచి 211 పశువులు పోటీల్లో పాల్గొంటున్నాయి. పాలపోటీలకు సంబంధించి గేదెలకు సంబంధించి ముర్రా విభాగంలో 17, జాఫర్‌బాదిలో నాలుగు, ఆవులకు సంబంధించి ఒంగోలు విభాగంలో 17, గిర్‌లో ఆరు, పుంగనూరులో ఒక ఆవు పోటీలో నిలిచాయి. పశు ప్రదర్శన పోటీలకు సంబంధించి పోతుల విభాగంలో ముర్రా దున్నలు నాలుగు, ఒంగోలు గిత్తలు 22, గిర్ ఐదు, పుంగనూరు తొమ్మిది, పెయ్యిల విభాగంలో ముర్రా గేదెలు 25, ఒంగోలు ఆవులు 63, గిర్ 11, పుంగనూరు 25 ఆవులు పాల్గొంటున్నాయి. వీటిని తిలకించేందుకు మండపేట, పరిసర గ్రామాల నుంచి పాడిరైతులు, పశుపోషకులు, ఔత్సాహికులు తరలివస్తున్నారు. ఆయా పశువుల ప్రత్యేకతల గురించి సంబంధిత రైతులను అడిగి తెలుసుకుంటున్నారు. తమ ఉత్పత్తుల గురించి రైతులకు వివరించేందుకు మందుల తయారీ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. పోటీల పర్యవేక్షణ కోసం 12 మంది ఏడీఏ స్థాయి అధికారులు, 50 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, దాదాపు 80 మంది గోపాల మిత్రలను నియమించినట్టు అధికారులు తెలిపారు. విజేత నిర్ణయం ఇలా.. l పాల పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం తీసిన పాలను నమూనాగా భావిస్తారు. శుక్రవారం రెండు పూటలు, శనివారం ఉదయం తీసిన పాలను లెక్కించి విజేతలను నిర్ణయిస్తారు. అదే రోజు సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తారు. l శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ పాలకమండలి సభ్యులు పడాల సుబ్బారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కా ర్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), డీసీఎంఎస్ మాజీ చైర్మ¯ŒS రెడ్డి వీరవెంకటసత్యప్రసాద్, మండపేట పీఏసీఎస్ అధ్యక్షుడు మల్లిపూడి గణేశ్వరరావు, ఆలమూరు తాలుకా రైస్‌మిల్లర్స్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు సీహెచ్‌వీవీ సత్యనారాయణమూర్తి, జేడీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ రమేష్‌బాబు, ఏడీఏలు విజయకుమారశర్మ, ఎం.రామకోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, మురళీ, ఉమామహేశ్వరరెడ్డి, కేంద్రీయ పశునమోదు పథకం జిల్లా స్టాక్మె¯ŒS పూర్ణచంద్రరావు, రైతులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణలు పోటీల సందర్భంగా కృష్ణాజిల్లాలోని వీరవల్ల నుంచి తీసుకువచ్చిన ఏడేళ్ల ముర్రా దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండేళ్ల క్రితం రూ.12 లక్షలు వెచ్చించి హర్యానాలో ఈ దున్నను కొనుగోలు చేసినట్టు రైతు చిలకపాటి రాజీవ్ తెలిపారు. తన వద్ద ఈ తరహా దున్నలు 15 వరకు ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా నాదేండ్లకు చెందిన నల్లమోతు వేణుగోపాలరావుకు చెందిన ఒంగోలు గిత్తలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన పాడిరైతు రిమ్మలపూడి గంగరాజు గిర్ ఆవులు, పలువురు పాడిరైతులకు చెందిన ముర్రా గేదెలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. -
ముకుందరెడ్డి మరింత ఉన్నతి సాధించాలి
మంత్రులు పత్తిపాటి, దేవినేని ఆకాంక్ష పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం మండపేట : జాతీయస్థాయిలో బిగ్గెస్ట్ లేయర్ కోళ్లరైతు అవార్డు గ్రహీత కర్రి వెంకట ముకుందరెడ్డి మరింత ఉన్నతిని సాధించాలని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు ఆకాంక్షించారు. విజయవాడలో ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముకుందరెడ్డిని ఘనంగా సత్కరించి, మంత్రుల చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. బిక్కవోలు మండలం బలభధ్రపురంలో కేపీఆర్ గ్రూప్ సంస్థల్లో భాగంగా శ్రీలక్ష్మి పౌల్ట్రీస్ పేరిట రెండు దశాబ్దాల క్రితం రెండు లక్షల లేయర్ కోళ్లతో ఫారమ్‌ను ఏర్పాటు చేసిన ముకుందరెడ్డి అంచెలంచెలుగా శ్రీ లక్ష్మి ఎగ్ఫార్మ్ ప్రైవేటు లిమిటేడ్ పేరిట ఏపీ, కర్ణాటకల్లో 28 లక్షల లేయర్ కోళ్లతో ఫారాలు నెలకొల్పారు. ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ సంస్థ(నెక్) అక్టోబర్ 14న ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి చేతుల మీదుగా సత్కరించి అవార్డును అందజేసింది. విజయవాడ సత్కారంలో ముకుందరెడ్డి మాట్లాడుతూ పౌల్ట్రీపరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రులను కోరారు. ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు, జిల్లాకు చెందిన పలువురు కోళ్ల రైతులు పాల్గొన్నారు. -
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
వైఎస్సార్ విగ్రహం తొలగింపుపై వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసన మండపేట : విగ్రహాలను తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లోంచి మహానేత వైఎస్సార్‌ను చెరపలేరని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు నినదించాయి. విజయవాడలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం మండపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద నుంచి రాజారత్న సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా నిర్వహించి సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి లీలాకృష్ణ, పాపారాయుడు తదితరులు క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. లీలాకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలు చేసిన వైఎస్సార్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు. కుట్రపూరితంగా ఆయన విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లోంచి ఆయనను చెరపలేరన్నారు. పాపారాయుడు మాట్లాడుతూ ట్రాఫిక్‌కు అడ్డుగా లేకపోయినప్పటికీ కావాలనే వైఎస్ విగ్రహాన్ని తొలగించారని దుయ్యబట్టారు. తొలగించిన చోటే వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిషి్ఠంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీటీసీ సభ్యులు మేడపాటి లక్ష్మిప్రసాదరెడ్డి, తుపాకుల ప్రసన్నకుమార్, పార్టీ నాయకులు పడాల సతీష్, మేడపాటి బసివిరెడ్డి, మేడపాటి సురేష్‌రెడ్డి, కాకర్ల శ్రీమన్నారాయణ, పలివెల శ్రీను, బత్తుల జాన్, తిరుశూల శ్రీను, పెయ్యల యాకోబు, జి. రాంబాబు, పొలమాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మూణ్ణాళ్ల ముచ్చటే!
ఎమ్మార్పీకి మద్యం విక్రయం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగలనుంది. రాజమండ్రిలో మద్యం మామూళ్ల పంపకాల్లో అధికార, మిత్రపక్షం నేతల మధ్య సయోధ్య కుదరక పోవడంతో అధికారపార్టీ కీలకనేత ఒకరు సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో మద్యం విక్రయాల్లో ఎమ్మార్పీ తెరపైకి తీసుకువచ్చారు. త్వరలో జిల్లా పర్యటనకు వచ్చే దీనిపై చర్చించి షరా ‘మాములు’గానే అమ్మకాలను పునరుద్ధరిస్తారని సిండికేట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మండపేట : జిల్లాలో దాదాపు 504 వరకు మద్యం దుకాణాలు, 34 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారు రూ. 1.85 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా లిప్టింగ్ (మునుపటి ఏడాది నెల ప్రామాణికంగా 10 శాతం అదనపు కొనుగోళ్లు చేయడం) విధానాన్ని తెరపైకి తెచ్చిన సర్కారు ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటు పరం చేసింది. అమ్మకాలను పెంచేందుకు ఎమ్మార్పీ, బెల్టుషాపుల ఏర్పాటు విషయాల్లో వ్యాపారులకు అధికారులు స్వేచ్ఛ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక్కో మద్యం బాటిల్‌పై రూ. 15 వరకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బెల్టుషాపులు ఎత్తివేస్తామంటూ సీఎం చేసిన రెండవ సంతకాన్ని నీరు గారుస్తూ జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నందుకు, బెల్టుషాపుల ఏర్పాటుకు అటు ఎక్సైజ్, పోలీసులకు సిండికేట్ వర్గాలు నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటున్నాయి. అది కాకుండా వారు తాజాగా అధికారపార్టీ ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయలు ముడుపులు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడ ఘటనతో.. ఐదు నెలల క్రితం విజయవాడలో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు అప్పట్లో ప్రభుత్వం ఎమ్మార్పీని అమలులోకి తెచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత షరా మామూలుగానే ఎమ్మార్పీకి మించి అమ్మకాలు మొదలైపోయాయి. అయితే మద్యం మామూళ్ల విషయంలో రాజమండ్రిలో అధికార, మిత్ర పక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఈ విషయం అధికారపార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు ఇటీవల సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దాంతో ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలివ్వడంతో ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీకి విక్రయాలు మళ్లీ అమలులోకి వచ్చాయి. ఇప్పటికే జిల్లాలోని మద్యం సిండికేట్లు ఆ ముఖ్యనేతతో ఈ విషయమై సంప్రదించగా కొన్ని రోజుల పాటు ఎమ్మార్పీ కొనసాగించాలని సూచించినట్టు తెలుస్తోంది. త్వరలోనే జిల్లా పర్యటనకు వస్తున్న సీఎంతో ఈ విషయం మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో కొద్ది రోజుల్లో షరా మాములుగానే అమ్మకాలు జరుగుతాయన్న ఆశతో సిండికేట్ వర్గాలుఉన్నాయి. -
సర్కారీ ఇంటికి సరికొత్త కొర్రీ
స్థలం ఉన్నవారికే అవకాశం 50 శాతం మందికి దక్కని ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం మెరక పనులకు నోచుకోని ఇందిరమ్మ స్థలాలు పత్తాలేని ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం మండపేట : స్థలం లేని పేదల సొంతింటి కల ఇప్పట్లో సాకారమయ్యే అవకాశం కనిపించడం లేదు. పేదల గృహనిర్మాణానికి ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపినా కొందరికే ప్రయోజనం చేకూరనుంది. సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే రుణం మంజూరు కానుంది. మరోపక్క ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం లబ్ధిదారుల ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోగా ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విడుదల ఊసెత్తడం లేదు. పట్టణ ప్రాంతాలకు నిర్ధేశించిన అమృత పథకం అధికార పార్టీ నేతల పైరవీలతో పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు టీడీపీ ప్రభుత్వం గృహనిర్మాణ రుణాల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం పేరిట నియోజకవర్గానికి 1,250 చొప్పున, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్‌కు 500 చొప్పున మొత్తం జిల్లాకు 19,750 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.2.9 లక్షలు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇళ్ల నిర్మాణం కోసం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ భూమిపూజలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిబంధనల మేరకు ఎంతమందికి లబ్ధి చేకూరుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. జిల్లాకు మంజూరైన ఇళ్లలో 50 శాతం సొంత స్థలాలు ఉన్న వారికి మంజూరు చేస్తారు. మిగిలిన 50 శాతం ఇళ్లను గత ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలాల్లో మంజూరుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే జిల్లా వ్యాప్తంగా గతంలో సేకరించిన వందలాది ఎకరాల ఇందిరమ్మ స్థలాల్లో చాలాచోట్ల ఇప్పటికి మెరక పనులు చేయలేదు. వీటిని మెరక చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి గృహ నిర్మాణ రుణాల మంజూరు చేయడం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలేవి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రామాల్లో సొంత స్థలాలు లేని పేదవర్గాల వారి సొంతింటి కల ఇప్పట్లో సాకారం సాకారమయ్యే దాఖలాలు కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు 19,750 ఇళ్లు మంజూరుకు గాను ప్రస్తుత మార్గదర్శకాల మేరకు సుమారు సగం మందికి మాత్రమే లబ్ధి చేకూరతుతుందని పలువురు అంటున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతిలిచ్చిన సర్కారు పెండింగ్ బిల్లులను విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినకాడికి అప్పులు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని, బిల్లులు రాకపోవడంతో రుణగ్రస్తులుగా మారిపోయామని కొందరు వాపోతుండగా, బిల్లులు రాక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్ బిల్లులు సుమారు రూ.40 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉన్నట్టు అంచనా. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరోపక్క 1993 - 2004 మధ్య కాలంలో నిర్మించిన గ్రామాల్లోని పేదల ఇళ్లను ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం కింద ఆధునీకరించుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అర్బన్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 17 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మంజూరు చేసింది. ఒక్కో ఇంటి మరమ్మతుల నిమిత్తం రూ.10 వేలు చొప్పున రూ.17 కోట్లను కేటాయించింది. ఆ కాలంలో జిల్లాలో 2,01,780 ఇళ్లను నిర్మించగా ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం కింద 17 వేల ఇళ్లను మాత్రమే ఎంపిక చేశారు. మార్చి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం. అధికారపార్టీ కనుసన్నల్లోనే అమృత అమృత పథకం కింద జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు మంజూరైన 24,332 ప్లాట్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ప్లాటు రూ. 5.5 లక్షలు చొప్పున జీఫ్లస్ 1 తరహాలో ఇళ్ల నిర్మాణం చేయనున్నారు. జిల్లాలోని తుని మున్సిపాల్టీకి 5,090 ప్లాట్లు మంజూరవ్వగా, కాకినాడ కార్పొరేషన్‌కు 4,608 ప్లాట్లు, రాజమండ్రికి 4,200, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురంనకు 1,088, మండపేటకు 4,064, పిఠాపురంనకు 874, అమలాపురంనకు 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి. అర్హులతో నిమిత్తం లేకుండా పలు మున్సిపాల్టీల్లో అధికార పార్టీ నేతలు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేద వర్గాల వారు కోరుతున్నారు. -
ఖాతా ఉంటేనే వేతనం
మండపేట :ఉపాధి హామీ పథకం కూలీలకు కష్టార్జితం చేతికందాలంటే ఇకమీదట బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. ఇక నుంచి ‘ఉపాధి’ కూలీల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని తొలివిడతగా జిల్లాలోని 142 గ్రామాల్లో ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. అనంతరం జిల్లావ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతోపాటు, అవకతవకలను అరికట్టే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి నూతన విధానం అమలుకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా ఉపాధి కూలీలకు చెందిన ప్రధానమంత్రి జన్‌ధన్ లేదా వారి వ్యక్తిగత పొదుపు ఖాతాల వివరాలను సిద్ధం చేయాలని రెండు నెలల క్రితమే జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు అందాయి. వాస్తవానికి మార్చి నెల నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని జిల్లా యంత్రాంగం భావించింది. జిల్లాలోని 62 మండలాల పరిధిలోని 1,075 పంచాయతీల్లో 7,60,313 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిద్వారా శ్రమశక్తి సంఘాల్లో 8,45,712 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో సుమారు 4.82 లక్షల మంది రోజువారీ ఉపాధి కూలీలుగా పని చేస్తున్నారు. కొత్త విధానానికి అనుగుణంగా వారి బ్యాంకు ఖాతాల వివరాలను ఉపాధి హామీ పథకం సిబ్బంది సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 3,47,842 మంది ఖాతాల వివరాలు సేకరించారు. గత సమస్యలు అధిగమించే లక్ష్యంతో.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2007 మే నెల నుంచి అమలులోకి వచ్చింది. మొదట్లో కార్మికులతో పుస్తకాల్లో సంతకాలు చేయించుకుని చెల్లింపులు చేసేవారు. ఈ విధానంలో పలుచోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటిని నివారించే పేరుతో బయోమెట్రిక్ పద్ధతిని అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అత్యధిక శాతం కూలీలకు తపాలా శాఖ ద్వారా బయోమెట్రిక్ తరహాలో 12 నుంచి 14 రోజులకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. ఆధార్ సంఖ్య, వేలిముద్రలు సరిపోలకపోవడం, సాంకేతిక సమస్యలతో వేతనాలు పొందేందుకు ఉపాధి కూలీలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఆయా సమస్యలను అధిగమించే లక్ష్యంతో నూతన విధానం అమలుకు కేంద్రం ఆదేశాలిచ్చింది. బ్యాంకుల్లో ముందుకు సాగని ప్రక్రియ నూతన విధానం అమలు కోసం తొలివిడతగా జిల్లాలోని 48 మండలాల పరిధిలో 142 గ్రామాలను ఎంపిక చేశారు. దీనిని అమలు చేసేంతవరకూ మిగిలిన పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న బయోమెట్రిక్ పద్ధతిలోనే వేతనాలు చెల్లిస్తారు. కొత్త విధానం ప్రకారం ఉపాధి కూలీల వేతనాల చెల్లింపునకు వారి వ్యక్తిగత ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి, వారికి ఏటీఎం కార్డులు అందజేయాల్సి ఉంది. ఈ మేరకు డ్వామా అధికారులు కూలీల ఖాతాల వివరాలను అందజేసినా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. తొలివిడతగా ఎంపిక చేసిన పంచాయతీల్లో ఇప్పటివరకూ 56 శాతం ఖాతాల అనుసంధానం మాత్రమే పూర్తయ్యింది. ఆయా గ్రామాల పరిధిలో 1,20,234 మంది కూలీలకు గానూ ఇప్పటివరకూ 67,808 మంది ఖాతాలను మాత్రమే అనుసంధానం చేశారు. మిగిలిన ఖాతాల అనుసంధానం త్వరితగతిన పూర్తికాకుంటే కూలి చెల్లింపుల్లో ఇబ్బందులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
చిన్ని మా గూళ్లు.. బాగయ్యేదెన్నడో?
‘ఎన్టీఆర్ గృహనవీకరణ’కు రూ.17 కోట్లు మూడు నెలలవుతున్నా పథకంలో కానరాని పురోగతి జన్మభూమి కమిటీల తాత్సారంతో పేదల్లో నిరాశ ఎన్నడో సర్కారు నిర్మించి ఇచ్చిన తమ చిన్నిగూళ్లలో.. కాలక్రమంలో తలెత్తిన చిన్నాపెద్దా లోపాలను సరిదిద్దుకోవడానికి తిరిగి సర్కారే చేయూతనిస్తోందని సంతోషించారు పేదలు. 1993-2004 మధ్య ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు జిల్లాకు రూ.17 కోట్లు మంజూరు కాగా..నియోజకవర్గానికి 1,000 ఇళ్లను ఎంపిక చేయూల్సి ఉంది. అయితే జన్మభూమి కమిటీల జాప్యం పేదలను నిరాశకు గురి చేస్తోంది. మండపేట : పేదల ఇళ్లకు మరమ్మతులు చేసేందుకు నిర్దేశించిన ‘ఎన్టీఆర్ గృహనవీకరణ’ పథకం జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందాన ఉంది. ఈ పథకం కింద మరమ్మతులకు రూ.17 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలు కావస్తున్నా క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. జన్మభూమి కమిటీలు పట్టనట్టు వ్యవహరిస్తుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 1993 -2004 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించిన పేదల ఇళ్లకు ఎన్టీఆర్ గృహ నవీకరణ పథకం కింద మరమ్మతులు చేరుుంచేందుకు మూడు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లాలోని అర్బన్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 17 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లకు నిధులను కేటాయించింది. ఒక్కో ఇంటి మరమ్మతుల నిమిత్తం రూ.10 వేల చొప్పున రూ.17 కోట్లను మంజూరు చేసింది. ఆ రూ.10 వేలతో దెబ్బ తిన్న ఇంటి పైకప్పు మరమ్మతులు, ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, గోడలు, శానిటరీ లీకేజీలు, విద్యుత్ వ్యవస్థ తదితరాలకు మరమ్మతులు చేరుుంచుకుని, పాడైన ఇళ్లను నివాసయోగ్యంగా మార్చుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను సర్కారు జన్మభూమి కమిటీలకు అప్పగించింది. జనవరి ఒకటి నుంచి ప్రారంభించి మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని సూచించింది. కాగా జిల్లాలో ఎక్కడ ఈ పథకం అమలుకాకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 17 వేల ఇళ్లకు అవకాశం 1993 - 2004 మధ్య కాలంలో జిల్లావ్యాప్తంగా 2,01,780 ఇళ్లను నిర్మించగా ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం కింద 17 వేల ఇళ్లను మాత్రమే నవీకరించుకునే వీలుంది. ఇంటి పట్టా, ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, సెల్‌నంబర్ తదితర వివరాలతో కూడిన దరఖాస్తులను జన్మభూమి కమిటీలు ఆమోదించి గృహనిర్మాణ శాఖ పరిశీలన నిమిత్తం పంపాలి. ఆ దిశగా జన్మభూమి కమిటీలు చొరవ చూపకపోవడంతో ఈ పథకం ఎక్కడా ముందుకు సాగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపిక చేసిన ఇళ్లను గృహ నిర్మాణసంస్థ సిబ్బంది జియో ట్యాగింగ్ పరిధిలోకి తీసుకురావాలి. వీడియో కాన్ఫరెన్స్‌లలో తరచూ అధికారులు పథకం అమలు తీరుపై సమీక్షించడం మినహా క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఈనెల 15 నాటికి లబ్ధిదారుల వివరాలు అందజేయాలని ఇప్పటికే ఉన్నతస్థాయి నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందినట్టు సమాచారం. కాగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల వివరాలను జన్మభూమి కమిటీలు ఇవ్వకపోతే ఏం చేయగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిధులు మంజూరై, మరమ్మతులు చేరుుంచుకుంటే మరికొంత కాలం తమ ఇళ్లు పదిలంగా ఉంటాయని గంపెడాశతో ఉన్న పేదలు పథకాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు. లబ్ధిదారుల వివరాలు రావాలి.. ఈ పథకం లబ్ధిదారుల వివరాలను ఈనెల 15 నాటికి పంపాల్సి ఉందని గృహ నిర్మాణ సంస్థ పీడీ సెల్వరాజ్ చెప్పారు. ఆ దిశగా జన్మభూమి కమిటీలు వివరాలు సేకరించాలని మండల పరిషత్ అధికారులకు సూచించామన్నారు. త్వరితగతిన లబ్ధిదారుల వివరాలు సేకరించి మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. -
ఫోటోలు తీసి బెదిరిస్తున్న ముఠా అరెస్ట్
రాజమండ్రి: మహిళలను అభ్యంతరకరంగా ఫోటోలు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న 14 మంది ముఠాను తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పోలీసుల అరెస్ట్ చేశారు. మహిళలను అభ్యంతరకరంగా చిత్రీకరించి డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫంక్షన్ హాల్స్, దుకాణాల్లో రహస్య కెమెరాలు అమర్చి మహిళలను ఫోటోలు తీసినట్టు చెప్పారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లికి హాజరైన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఫోటోలు తీసి బెదిరించారు. సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నిందితులు పలువురు మహిళలను ఈవిధంగా బెదిరించినట్టు పోలీసులు గుర్తించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
ఫోటోలు తీసి బెదిరిస్తున్న ముఠా అరెస్ట్
-
నకిలీ పోలీసు అరెస్టు
మండపేట : వాహనచోదకులను అడ్డగించి, దోచుకుంటున్న నకిలీ పోలీసును మండపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.22 వేల నగదు, మోటార్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను మండపేట సీఐ హ్యాపీ కృపావందనం వివరించారు. మండపేట మండలం జెడ్.మేడపాడుకు చెందిన పసుపులేటి నాగేశ్వరరావు గతంలో ద్వారపూడిలోని వస్త్రమార్కెట్లో పనిచేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పని మానేసిన అతడు డబ్బు కోసం పోలీస్‌గా చెలామణి అయ్యాడు. బైక్‌లను అడ్డగించి, వాహనదారుల వద్ద నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. గత నెల 28న బైక్‌పై వెళుతున్న మండపేటలోని రావులపేటకు చెందిన కంది సూర్యారావును స్థానిక పెదకాలువ వంతెన సమీపంలో అడ్డగించాడు. పోలీసునని చెప్పి రికార్డులు చూపమని బెదిరించాడు. ఇంటి వద్ద ఉన్నాయని సూర్యారావు చెప్పగా, ఫైన్ కట్టాలంటూ అతడి జేబులో ఉన్న రూ.31 వేలు లాక్కుని నాగేశ్వరరావు పరారయ్యాడు. అలాగే ఆలమూరు మండలం పినపళ్లకు చెందిన కాకి శ్రీను ఈ నెల రెండున బైక్‌పై వెళుతుండగా.. అయ్యప్పస్వామి ఆలయం వద్ద నాగేశ్వరరావు అడ్డగించాడు. రికార్డు కోసం బెదిరించి.. అతడి జేబులో ఉన్న రూ.12 వేల నగదు లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పెద్దకాలువ వంతెన సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారణ చేయగా, ఆయా నేరాలను అంగీకరించాడు. అతడి వద్ద నుంచి రూ.22 వేల నగదుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిని ఆలమూరు కోర్టుకు తరలిస్తామన్నారు. నిందితుడిని పట్టుకున్న పట్టణ పోలీసులను రామచంద్రపురం డీఎస్పీ బి.రవీంద్రనాథ్ అభినందించారు. -
మళ్లీ గడ్డు కాలం
మండపేట : వేసవి నష్టాల నుంచి గట్టెక్కుతున్నామన్న కోళ్ల రైతుల ఆనందాన్ని శ్రావణమాసం ఆవిరి చేస్తోంది. వినియోగం తగ్గి గుడ్డు ధర పతనమవుతోంది. ప్రస్తుత ధరను బట్టి రోజూ పరిశ్రమకు సుమారు రూ.40 లక్షల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. త్వరలో చవితి రానుండటంతో మున్ముందు మరింత గడ్డు కాలమేనని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని పౌల్ట్రీల్లో 1.30 కోట్ల కోళ్లుండగా రోజుకు సుమారు 1.04 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎండల తీవ్రతతో ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం మేర పడిపోయిన గుడ్ల ఉత్పత్తి తొలకరి జల్లులతో సాధారణ స్థితికి చేరింది. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం పెరిగింది. వేసవి ప్రభావంతో ఏప్రిల్‌లో రూ. 2.30కు పతనమైన గుడ్డు రైతు ధర జూన్‌లో ఎగుమతులు పుంజుకుని పెరుగుతూ వచ్చింది. జూన్ 19 నాటికి రూ.3.94 అత్యధిక ధరను నమోదు చేసుకుంది. ఇంతలో శ్రావణ మాసం రాకతో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేక ధర పతనమవుతోంది. ఎగుమతులకు డిమాండ్ లేక గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతూ శనివారం నాటికి రైతు ధర రూ 2.86కు పతనమైంది. నిర్వహణ భారం దృష్ట్యా రైతు ధర రూ.3.25 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి అన్నారు. ఆ మేరకు జిల్లాలో పరిశ్రమకు రోజుకు సుమారు రూ.40 లక్షల నష్టం వాటిల్లుతోందని అంచనా. దిగిరాని చిల్లర ధర తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. గుడ్డు రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా వ్యాపారులు చిల్లరగా అమ్ముతుంటారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. రైతు ధర రూ.2.86 ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.4 వరకు అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించిన అనపర్తి, మండపేట పరిసర ప్రాంతాలతో పాటు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో రూ.4.50 నుంచి రూ.5 వరకు కూడా అమ్ముతుండటంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు జంకుతున్నారు. కాగా ఈ ధరాభారంతో స్థానిక వినియోగం తగ్గితే రైతు ధర మరింత పతనమవుతుందని పౌల్ట్రీ వర్గాలు కలవరపడుతున్నారుు. వినియోగదారులకు ఊరటనిస్తున్న చికెన్ రేటు కాగా రిటైల్ మార్కెట్లో చికెన్ ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఎండల తీవ్రతతో గత రెండు నెలల్లో చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. బ్రాయిలర్ లైవ్ కిలో రూ.90 ఉండగా మాంసం కిలో రూ.=200కు, స్కిన్లెస్ రూ. 220కు చేరి వినియోగదారుల్ని బెంబేలెత్తించాయి. కొత్త బ్యాచ్‌లు రావడం, శ్రావణమాసంతో వినియోగం తగ్గి ధర తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం బ్రాయిలర్ లైవ్ కిలో రూ.58 ఉండగా, మాంసం రూ.120, స్కిన్లెస్ రూ. 140కు తగ్గిందని చెబుతున్నారు. గత నెలలో రూ.59గా ఉన్న లైవ్ కిలో లేయర్ కోడి ధర ప్రస్తుతం రూ.40కు తగ్గిపోయింది. తాము ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందని కోళ్ల రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. -
‘కదిలొచ్చే ఆస్పత్రి’ ఖాయిలా
రోగి చెంతకే తరలి వచ్చే ఆసుపత్రుల్లాంటి 104 వాహనాలకు సుస్తీ చేసింది. గతంలో 104 ద్వారా 52 రకాలకు పైగా మందులు అందిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 42కు తగ్గింది. అవి కూడా పూర్తిస్థాయిలో అందని దుస్థితి. నెలవారీ మరమ్మతులకు నోచుకోక, సక్రమంగా డీజిల్ అందక ఆ వాహనాలు మూలకు చేరుతున్నాయి. మండపేట : పేదల చెంతకే వైద్యాన్ని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 మార్చిలో 104 వాహనాలను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారికి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయాలన్నది ఈ పథకం లక్ష్యం. తొలినాళ్లలో మారుమూల ప్రాంతాల వారికి సైతం మెరుగైన వైద్యసేవలందించిన 104 వాహనాలకు వైఎస్ మరణానంతరం ఒడిదుడుకులు మొదలయ్యాయి. మందుల కొరత, అరకొర నిధుల కేటాయింపులతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలందించలేక మూలకు చేరుతున్నాయి. నిర్ణీత షెడ్యూల్లో గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి బీపీ, చక్కెర, ఉబ్బసం, ఫిట్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు జ్వరం, విరేచనాలు తదితర సాధారణ వ్యాధులకు రోగులకు వైద్యసేవలు అందించి నెలకు సరిపడగా మందులను ఉచితంగా పంపిణీ చేసేవారు. ఆ వ్యాధులకు సంబంధించి గతంలో సుమారు 52 రకాల మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 42 రకాలు మాత్రమే వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. అవి కూడా పూర్తిస్థాయిలో సరఫరా జరగడం లేదని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీకి సంబంధించి మెట్ఫార్మిన్, గ్లమింగ్ క్లమైడ్ రకాలకు ప్రస్తుతం మెట్ఫార్మిన్ మాత్రమే అందిస్తూ మిగిలిన రకాన్ని బయట కొనుగోలు చేసుకోమంటున్నారు. డీజిల్ లేదు.. మరమ్మతులు లేవు.. జిల్లావ్యాప్తంగా 26 వాహనాలకు డీజిల్ కొరత, మరమ్మతుల కారణంగా ఏడు వాహనాలు సుమారు నెల రోజులుగా మూలకు చేరాయి. మండపేట, సామర్లకోట, అనపర్తి, పెద్దాపురంలలోని 104 వాహనాలు డీజిల్ లేక నిలిచిపోగా మరమ్మతులకు నోచుకోక జగ్గంపేట, పిఠాపురం, చింతూరు వాహనాలు నిలిచిపోయాయి. గతంలో నెల రోజులకు ఒకసారి సాధారణ మరమ్మతులు నిర్వహిస్తే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ వాహనాల ద్వారా సేవలు పొందే రోగులు పేదవర్గాలకు చెందిన వారే కావడం వలన మందులను బయట మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తిస్థాయిలో 104 సేవలందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వాన కురుస్తోంది.. చేను పిలుస్తోంది
ఆకలితో నకనకలాడే బిడ్డకు అమ్మ గోరుముద్దలు పెట్టినట్టు.. మండుటెండల్లో కాగివేగిన మన్నును మబ్బులు వర్షధారలతో తడుపుతున్నారుు. మొన్నటి వరకూ నెర్రెలు తీసి, చినుకు కోసం తహతహలాడిన చేలు.. ఇప్పుడు మెత్తబడి విత్తనాల కోసం నిరీక్షిస్తున్నారుు. అదనుకు వచ్చిన నైరుతి రుతుపవనాలు, కాలువలకు నీటి విడుదల తొలకరి సాగుకు శుభారంభాన్ని అందించాయి. మండపేట : జిల్లావ్యాప్తంగా 2.26 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 13 శాతం మేర నారుమడులు వేయడం పూర్తికాగా మిగిలిన మేరకు విత్తనాలు జల్లే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అధికశాతం విస్తీర్ణంలో వెదజల్లు విధానం అనుసరించేలా రైతులను ప్రోత్సహించి, అక్టోబరు నెలాఖరుకు ఖరీఫ్ కారును పూర్తిచేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. జిల్లాలోని తూర్పుడెల్టాలో 95,593 హెక్టార్లలో, మధ్య డెల్టాలో 41,880 హెక్టార్లలో, మెట్టలోని ఏలేరు, పీబీసీ, ఇతర ఆయకట్టుల పరిధిలో 96,148 హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరగనుంది. వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీటి విడుదలలో జాప్యం ఖరీఫ్ ఆరంభాన్ని ఆలస్యం చేస్తుండేవి. అందుకు భిన్నంగా ప్రస్తుత సీజన్లో నిర్ణీత సమయానికి కాలువలకు నీరు విడుదల కావడం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడం తొలకరి పనులను వేగవంతం చేశాయి. తూర్పు డెల్టా పరిధిలోని మండపేట, రామచంద్రపురం, అనపర్తి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఇంజన్లపై 1,400 హెక్టార్లలో రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. మెట్టలోని జగ్గంపేట, తుని ప్రాంతాల్లో అక్కడక్కడా నారుమడులు వేయగా, సెంట్రల్ డెల్టాలోని అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో రైతులు ఇప్పుడిప్పుడే నారుమడులు వేయడంలో నిమగ్నమవుతున్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 270 హెక్టార్లలో వెదజల్లు విధానంలో సాగుకు శ్రీకారం చుట్టగా, 1.26 లక్షల ఎకరాల్లో తరహా సేద్యం జరిగేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఖరీఫ్ సాగుకు మొత్తం 1.72 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా జూన్ నెలాఖరు వరకు కొరత లేకుండా 45 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. వ్యవధీ, వ్యయం తగ్గించే ‘వెదజల్లు’ కొన్నేళ్లుగా ఖరీఫ్, రబీ సాగుల్లో జరుగుతున్న జాప్యం మూడవ పంటగా అపరాల సాగుపై ప్రభావం చూపుతోంది. ఐదేళ్ల క్రితం మూడవ పంటగా 55 వేల హెక్టార్లలో అపరాలు వేస్తే ఈ ఏడాది కేవలం సుమారు 5,400 హెక్టార్లలో మాత్రమే సాగయ్యూరుు. వచ్చే అక్టోబరు నెలాఖరు నాటికి ఖరీఫ్‌ను పూర్తిచేయడం ద్వారా రబీని ముందుకు తీసుకువచ్చి మూడవ పంటకు వీలు కల్పించేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. దీని వలన ఏటా నవంబరులో వస్తున్న వర్షాలతో తొలకరి పంటకు వాటిల్లుతున్న నష్టాన్ని నివారించడంతో పాటు రబీలో నీటి ఎద్దడి సమస్య తగ్గుతుందని భావిస్తోంది. జూన్ నెలాఖరుకు నారుమడులు పూర్తిచేసేలా, అప్పటిలోగా నారుమడులు వేసుకోలేని రైతులు వెదజల్లు విధానాన్ని అవలంబించేలా రైతులకు అవగాహన కల్పిస్తోంది. నారుమడులతో పోలిస్తే వెదజల్లు ద్వారా పది రోజుల పంటకాలం తగ్గడంతో పాటు కూలీల కొరత, పెట్టుబడులు తగ్గుతాయని వ్యవసాయాధికారులు అంటున్నారు. గత ఖరీఫ్‌లో ఎకరాకు సగటున 25 బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో ప్రస్తుత ఖరీఫ్‌లో వంతులవారీ విధానం అమలు చేయడం ద్వారా దిగుబడి పెంచవచ్చన్న ఆలోచనలో వ్యవసాయశాఖ ఉంది. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రెండు నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల మాటెలా ఉన్నా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ సాగుకు శుభారంభమే. -
కబళించిన మృత్యువు
మండపేటలో రోడ్డు ప్రమాదం మోటారు సైకిల్‌ను ఢీకొట్టిన కారు ఇద్దరు తాపీమేస్త్రులు మృతి మండపేట/ మండపేట రూరల్ :మండపేటలోని రామచంద్రపురం కెనాల్ రోడ్డులో వీరభద్రపురం వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోని మృతులు మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వాకాడ శ్రీను (23), చుక్కా శ్రీను (32)గా స్థానికులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి మోటారు సైకిల్‌పై వెళుతున్న వారిని భీమవరం నుంచి కాకినాడ వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాకాడ శ్రీను తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా చుక్కా శ్రీను తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారం రోజుల తర్వాత పనికి.. మండపేట మండలం వెలగతోడు బీసీ కాలనీకి చెందిన వాకాడ శ్రీను, చుక్కా శ్రీనులు తాపీపని చేస్తుంటారు. వరుసకు ఇద్దరూ అన్నదమ్ములు. గత వారం రోజులుగా తమ సోదరి వివాహ వేడుకతో సందడిగా గడిపారు. పనికి కూడా వెళ్లకుండా పెళ్లి పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టారు. వారం రోజుల తర్వాత తిరిగి ఇద్దరూ కలిసి ఆదివారం అనపర్తి మండలం పొలమూరులో తాపీపని చేసేందుకు వెళ్లారు. ఆదివారం రాత్రి కూలీలకు డబ్బులు చెల్లించి స్వగ్రామానికి బయలుదేరడంతో జాప్యం జరిగినపట్టు స్థానికులు తెలిపారు. పల్సర్ వాహనంపై ఇద్దరూ వెలగతోడు వెళుతుండగా మండపేటలోని వీరభద్రపురం వద్దకు వచ్చేసరికి భీమవరం నుంచి అనపర్తి వైపు వెళుతున్న సతీష్ దంపతుల కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటారు సైకిల్‌ను నడుపుతున్న వాకాడ శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. చుక్కా శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పక్కనే ఉన్న పంటబోదెలోకి దూసుకుపోయి బోల్తాకొట్టింది. రోడ్డున వెళుతున్న వారు కారులో ఇరుక్కుపోయిన సతీష్ దంపతులను బయటకు తీయడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన చుక్కా శ్రీనును చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెలగతోడులో విషాదఛాయలు చుక్కా శ్రీనుకు భార్య రమణతో పాటు మూడేళ్ల వయసున్న శ్రావణి, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరికి కూలిపనే ఆధారం. శ్రీను పనికి వెళితేనే కుటుంబ పోషణ జరిగేది. భర్త మరణంతో భార్య రమణ బోరున విలపిస్తోంది. మరో మృతుడు వాకాడ శ్రీను ఇంటికి ఆధారం. కూలిపనితోనే తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కుమారుడి మృతితో అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. త్వరలో వివాహం చేద్దామనుకుంటుంటే ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందంటూ వారు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడిపెట్టిస్తోంది. వెలగతోడు బీసీ కాలనీలో విషాదం అలముకుంది. మండపేట అర్బన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జనం కోసం..రణపథం
ఎత్తిపోతలు, ఇసుక అక్రమ రవాణాలపై పోరుకు వైఎస్సార్ సీపీ సన్నద్ధం మార్చి ఒకటిన స్వదేశానికి రానున్న జ్యోతుల విమానాశ్రయంలోనే ఆయనను కలవనున్న పార్టీ శ్రేణులు అక్కడే పోరుబాట ఖరారు చేయాలని నిర్ణయం మండపేట :పట్టిసీమ ఎత్తిపోతల పథకం జిల్లా రైతాంగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అధికారపక్ష నేతల దన్నుతో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాతో కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ రెండు సమస్యలపై పోరుబాటకు వైఎస్సార్ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జిల్లాలో కాలుమోపగానే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని గురువారం మండపేటలో నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల అమెరికా పర్యటన ముగించుకుని మార్చి ఒకటిన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకు రానున్నారు. కాగా అధికారపార్టీ ఆగడాలతో ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు గిరజాల వెంకటస్వామినాయుడు, పెండెం దొరబాబు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, చెల్లుబోయిన వేణు, కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), ఇతర ముఖ్యనేతలు మండపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. పోలవరం దిగువన రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వలన జిల్లాలోని డెల్టాకు సాగునీటి ఇక్కట్లు తప్పవు. మరోపక్క జిల్లాలోని ఇసుక రీచ్‌లను అధికారపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డాలుగా మార్చుకుని కోట్లాది రూపాయల ఇసుకను పక్కదారి పట్టిస్తుండటంతో ప్రభుత్వానికి రాబడి పోవడంతో పాటు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ రెండు సమస్యలపై ఉద్యమించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. అమెరికా పర్యటన ముగించుకుని జిల్లాకు వస్తున్న జ్యోతులతో చర్చించి తుదిరూపం ఖరారు చేయనున్నారు. సమస్యల తీవ్రత దృష్ట్యా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మార్చి ఒకటిన మధురపూడి విమానాశ్రయానికి వెళ్లి జ్యోతుల రాగానే ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీనివలన సమస్యల తీవ్రతను ప్రభుత్వం గుర్త్తిస్తుందన్న ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలిరావాలి : బోస్ జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపించేందుకు పార్టీశ్రేణులు పోరుబాటకు సిద్ధం కావాలని బోస్ పిలుపునిచ్చారు. విదేశీపర్యటన ముగించుకుని మార్చి ఒకటిన జిల్లాకు రానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతులను మధురపూడి విమానాశ్రయంలోనే కలిసి సమస్యలను వివరిస్తే వాటి ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా నలుమూలల నుంచి పార్టీశ్రేణులు విమానాశ్రయానికి తరలి రావాలని కోరారు. జిల్లా యువజన, ఎస్సీ సెల్, సేవాదళ్ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, పెట్టా శ్రీనివాసరావు, మార్గాని గంగాధర్, పార్టీ నేతలు వేగుళ్ల చైతన్యబాబు, భూపాలపట్ల ప్రసాద్, గొల్లపల్లి బుజ్జి, తోట రాజేశ్వరరావు, నక్కా మోహన్, తిరగటి కొండలరావు, ఆకిరి శ్రీనివాస్, పిల్లా వీరబాబు, శెట్టి నాగేశ్వరరావు, చింతలపూడి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నమ్మించి..నిండా ముంచారు
మండపేట :రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తానేనని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు నాయుడే.. వాటిని ముప్పుతిప్పల పాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలి సంఘాలను నిండా ముంచారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తామన్న వాగ్దానంతో వారి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక మాట మార్చారు. ఫలితంగా.. సంఘాలకు పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు రాని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.1,316 కోట్ల రుణాలు అందజేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.135 కోట్లు మాత్రమే. జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు సంబంధించి మెప్మా పరిధిలో 18 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా, డీఆర్డీఏ పరిధిలో గ్రామాల్లో 77,819 సంఘాలు ఉన్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా తిరిగి కొత్త రుణాలను తీసుకోవడం సంఘాలకు పరిపాటి. ఈ మేరకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రుణాలు నూరుశాతం లక్ష్యానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 5,581 గ్రూపులకు రూ.143 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా 5,284 గ్రూపులకు రూ.148.37 కోట్లు రుణాలుగా అందజేశారు. అలాగే గ్రామాల్లోని 28,247 గ్రూపులకు రూ.715.11 కోట్ల రుణ లక్ష్యానికి 25,178 గ్రూపులకు రూ.808.61 కోట్లను రుణాలుగా అందజేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. చిన్నబోయిన లక్ష్యాలు.. ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తాం, రుణాలు ఎవరూ చెల్లించనవసరంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం ఈ ఏడాది లక్ష్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు హామీని నమ్మిన డ్వాక్రా మహిళలు ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచే రుణాలు చెల్లించడం మానేశారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు.. ‘రుణాలన్నీ రద్దు కాదు.. ఒక్కో సంఘానికి రూ.లక్ష వరకు భారం మాత్రమే తగ్గిస్తా’మంటూ మాట మార్చారు. బాబు హామీని నమ్మి పాత రుణాలు చెల్లించనందున సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త రుణాలు అందని దుస్థితి దాపురించింది. పట్టణ ప్రాంతాల్లో 7,432 గ్రూపులకు రూ.150 కోట్లు రుణాలుగా అందజేయాలన్నది ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 1,519 గ్రూపులకు రూ.45.63 కోట్లు మాత్రమే రుణాలుగా అందజేశారు. గ్రామాల్లో 36,855 గ్రూపులకు రూ.1,166 కోట్లు రుణాలు అందజేయాల్సి ఉండగా కేవలం 2,882 గ్రూపులకు రూ.90.96 కోట్లు మాత్రమే ఇచ్చారు. నెలల తరబడి రుణాలు చెల్లించక వడ్డీలతో రుణాలు తడిసి మోపెడయ్యాయని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిండా మునిగి పోయామని, అలా కాక గతంలో లాగే ముందు నుంచీ క్రమం తప్పకుండా రుణాలు చెల్లించి ఉంటే కొత్త రుణాలు రావడంతో పాటు వడ్డీ భారం ఉండేది కాదని ఆక్రోశిస్తున్నారు. అంతవరకూ అభివృద్ధిపథంలో పయనిస్తున్న సంఘాల పరిస్థితి.. చంద్రబాబు నమ్మకద్రోహం వల్ల అగాధంలో పడినట్టయిందని నిట్టూరుస్తున్నారు. కొత్త రుణం దూరం.. నేను పడమర ఖండ్రిక విఘ్నేశ్వర మహిళా సంఘంలో సభ్యురాలిని. మా సంఘం తరఫున తీసుకున్న రూ.మూడు లక్షల రుణాన్ని తీర్చేసి, కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకూ మంజూరు చేయలేదు. గెలిపిస్తే ఆదుకుంటానన్న చంద్రబాబు గెలిచాన ఒరిగింది లేదు. - ఆలపాటి చక్రమ్మ, డ్రాక్రా సంఘం సభ్యురాలు, పడమర ఖండ్రిక సమయమొచ్చినపుడు సత్తా చూపుతాం చంద్రబాబు చేసిన రుణమాఫీ వాగ్దానాన్ని నమ్మి మోసపోయాం. ఇప్పుడు వడ్డీతో సహా రుణాలు చెల్లించాల్సి వస్తోంది. టీడీపీ అధినేత మాట నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. అయితే.. మేమూ సమయం వచ్చినప్పుడు, సత్తా చూపి తగిన రీతిలో బదులిస్తాం. - సీహెచ్ సౌభాగ్యవతి, రామచంద్రపురం -
బీసీ బాలురకు ‘అపకారం’
మండపేట :వెనుకబడిన కులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొంటున్న చంద్రబాబు సర్కారు క్రియలో బీసీ బాలురకు అపకారం తలపెట్టింది. బీసీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో కోత పెట్టే క్రమంలో ఉపకారవేతనాలను బాలికలకే పరిమితం చేసింది. వారికీ అరకొరగానే నిధులు విడుదల చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆదాయ పరిమితిని మరింత తగ్గిస్తూ మెలిక పెట్టింది. సర్కారు వంచనపై బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 9, 10 తరగతులు చదివే (ప్రీ మెట్రిక్) బీసీ విద్యార్థులకు నెలకు రూ.100 చొప్పున విద్యాసంవత్సరంలో రూ. 1000 ఉపకార వేతనాలుగా ప్రభుత్వం అందజేస్తుంది. 2013-14 విద్యాసంవత్సరానికి ప్రీ మెట్రిక్ బీసీ విద్యార్థులు జిల్లాలో 21,023 మంది ఉన్నారు. వీరిలో బాలురు 9,670 మంది ఉండగా బాలికలు 11,353 మంది ఉన్నారు. వీరికి ఉపకార వేతనాలుగా సుమారు రూ.2.10 కోట్లు విడుదల రావాల్సి ఉండగా కేవలం రూ.25 లక్షలు మాత్రమే ఇటీవల విడుదల చేసింది. ఈ నిధులను బాలికలకు మాత్రమే అందజేయాలని ఆదేశించినట్టు బీసీ సంక్షేమశాఖ వర్గాలు అంటున్నాయి. గత విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌కు చేరుకోగా ప్రస్తుతం 10వ తరగతిలోకి వచ్చిన విద్యార్థుల్లో బాలికలు 6,196 మంది ఉన్నారు. వీరికి కూడా పూర్తిస్థాయిలో ఉపకార వేతనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు కేవలం 2,500 మందికి మాత్రమే సరిపోతాయని అధికారులంటున్నారు. ప్రభుత్వం తీరుతో ఉపకార వేతనాలపై ఆశలుపెట్టుకుని చదువుకుంటున్న బీసీ బాలురు హతాశులవుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగిస్తున్న చదువులకు సర్కారు తీరుతో చరమగీతం పాడాల్సి వస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధృవీకరణ పత్రాల కోసం ప్రదక్షిణలు కాగా ఈ ఏడాది ఇచ్చే ఉపకార వేతనాల్లోనూ కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.44,600 లోపు వార్షికాదాయం ఉన్న వారే ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని మెలిక పెట్టింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.72 వేలు వార్షికాదాయం ఉన్న వారికి గత ప్రభుత్వం తెల్లకార్డులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆదాయ పరిమితి తగ్గించడంతో ఆ మేరకు ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఈ సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గతంలో చూపిన ఆదాయాన్ని తగ్గించి కొత్త ధృవీకరణ పత్రాల జారీకి కొందరు తహశీల్దార్లు విముఖత చూపుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్ణయం అనుచితం ఉపకార వేతనాలను బాలికలకు మాత్రమే పరిమితం చేస్తే ఎందరో పేద విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరమవుతుంది. చదువు మాని పనిబాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తుంది. బీసీ సంక్షేమంపై ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి సర్కారు కట్టుబడాలి. బీసీ బాలబాలికలందరికీ ఉపకార వేతనాలిచ్చేందుకు నిధులు విడుదల చేయాలి. - కోన సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, మండపేట ఆదాయ పరిమితి పెంచాలి ఉపకార వేతనాలకు ఆదాయ పరిమితిని తగ్గించడం చాలా దారుణం. కొత్తగా ఆదాయం తగ్గించుకుని ధృవీకరణ పత్రాలు పొందేందుకు విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. విద్యార్థులు అందరికీ ఉపకార వేతనాలు విడుదల చేయడంతో పాటు బీసీ విద్యార్థులకు ఆదాయ పరిమితిని రెండు లక్షల వరకు పెంచాలి. - బి.సిద్ధు, విద్యార్థి సంఘం నాయకుడు, రామచంద్రపురం -
పుర ఖజానాలకు సర్కారు నజరానా..
బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పునరుద్ధరణ త్వరలో విడుదల కానున్న ఉత్తర్వులు మున్సిపాలిటీలకు పెరగనున్న రాబడి మండపేట : పురపాలక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. గతంలో మాదిరి అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ (బీపీఎస్, ఎల్ఆర్ఎస్)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈమేరకు కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)ను ఆదేశించినట్టు సమాచారం. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పునరుద్ధరణకు త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అధిక సంఖ్యలో అక్రమ నిర్మాణాలు, అనధికార లే అవుట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు, పరిసరాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది. అనధికార లే అవుట్లలో ఇల్లు నిర్మించుకున్న వారు మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో పక్క అనధికార నిర్మాణాలు చేసిన వారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయా వర్గాల వారికి ఊరట కల్పించడంతో పాటు, పురపాలక సంస్థలకు ఆదాయం సమకూర్చే దిశగా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)ల ద్వారా భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చారు. తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం పలు దఫాలుగా దీనిని 2013 మే వరకు కొనసాగించి తర్వాత నిలిపివేసింది. వీటి ద్వారా జిల్లాలోని నగర, పురపాలక సంస్థలకు భారీగా ఆదాయం సమకూరగా రోడ్లు, డ్రైన్లు, తాగునీటి వసతి తదితర మౌలిక వసతుల కల్పనకు వినియోగించే వీలు కలిగింది. ప్రస్తుతం అదే తరహాలో అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏను సీఎం ఆదేశించినట్టు మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు త్వరలో బీసీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడవచ్చంటున్నాయి. కాగా గతంలో కోర్టు కేసుల్లో ఉన్న వాటిని మిన హాయించగా తాజా ఉత్తర్వులు ఎలా ఉంటాయన్న దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉందంటున్నారు. -
ఎగ్సిపడుతూ..
మండపేట : గుడ్డు ధర కోళ్ల రైతులను కలవరపరుస్తుండగా, రిటైల్ మార్కెట్లో వినియోగదారులనూ బెంబేలెత్తిస్తోంది. రూ.ఐదుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. జిల్లాలో సుమారు 1.4 కోట్ల కోళ్లు ఉండగా, రోజుకు సుమారు 1.19 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 65 శాతం గుడ్లు బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఫౌల్ట్రీ పరిశ్రమకు సీజన్‌గా భావిస్తారు. శీతల ప్రభావంతో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని గుడ్డు ధర పెరగడం పరిపాటి. ఇదేక్రమంలో నెల రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్ పెరిగి, గుడ్డు ధర పెరుగుతూ వచ్చింది. కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీ జిల్లా పరిశ్రమకు ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తోందని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 27న రూ.3.80కు చేరుకున్న ధర అక్కడే నిలిచిపోయింది. డిమాండ్ లేక నాలుగు రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ధర తగ్గే అవకాశం ఉందని ఫౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గుడ్లు తేలేస్తున్న వినియోగదారులు : సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం రైతు ధర రూ.3.80 ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.ఐదు వరకు అమ్మకాలు చేస్తుండడంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు గుడ్లు తేలేస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న అనపర్తి, మండపేట, పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో రూ. 5.50 వరకు కూడా విక్రయిస్తున్నట్టు సమాచారం. కాగా రిటైల్ మార్కెట్లో రూ. ఐదు పలుకుతుండడం ఫౌల్ట్రీ పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో ఇప్పటికే స్థానిక ఎగుమతులకు డిమాండ్ పడిపోగా ధరాభారంతో స్థానిక వినియోగం తగ్గే అవకాశముందంటున్నారు. -
భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య
మండపేట : పట్టణంలోని సంగంపుంతకాలనీకి చె ందిన పెంటపాటి లక్ష్మీరాధ(28) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పోలీసులు, కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... రావులపాలేనికి చెందిన లక్ష్మీరాధకు మండపేటకు చెందిన వెల్డర్ శ్రీనువాస్‌కు 2004లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అప్పుల పాలైన భర్త తరచూ పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురమ్మని లక్ష్మీరాధను వేధిస్తుండడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఇటీవల రూ.20వేలు కావాలని శ్రీనువాస్ అడగడంతో పుట్టింటికి వెళ్లింది. అక్కడ పుట్టింటి వారు ఆమెను ఇదే ఆఖరని, మరలా ఎప్పుడూ అడగవద్దని ఆమెకు సూచించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె బుధవారం ఇంటిలోని మేడగదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ విజయరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆ బంధం’ ఇక వద్దన్నదని..
మండపేట రూరల్ :వివాహేతర సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ మదాంధుడు ఓ మహిళను ఆమె బిడ్డల ముందే హతమార్చాడు. తర్వాత పురుగులమందు తాగి, అదే కత్తితో తానూ పొడుచుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా మండపేట రూరల్ మండలం జెడ్.మేడపాడులో జరిగిన ఈ ఘాతుకం వివరాలు స్థానికులు, పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. జెడ్.మేడపాడు చర్చి కాలనీలో నివసిస్తున్న నక్కా సత్యనారాయణ, సరస్వతి (34) దంపతులకు 8, 4 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమార్తెలు, 5వ తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నారు. గతంలో వారు అనపర్తిలోని కంటి ఆస్పత్రి వద్ద కాఫీహోటల్ నడిపేవారు. అక్కడ ఉండగా పరిచయమైన అనపర్తి మండలం పొలమూరుపాకలుకు చెందిన గెద్దాడ త్రిమూర్తులుతో సరస్వతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడేళ్ల క్రితం సత్యనారాయణ కుటుంబం జెడ్.మేడపాడు చర్చి కాలనీలో ఇల్లు నిర్మించుకుని వచ్చేశారు. సత్యనారాయణ ఇప్పనపాడులో కాఫీ హోటల్ నడుపుతున్నాడు. ఊరు మారినా త్రిమూర్తులు సరస్వతి కోసం వస్తూనే ఉండేవాడు. అయితే పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నందున తమ సంబంధాన్ని కొనసాగించేందుకు సరస్వతి నిరాకరించసాగింది. ఈ క్రమంలో త్రిమూర్తులు శనివారం ఉదయం చర్చి కాలనీలోని సరస్వతి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సత్యనారాయణ హోటల్ వద్ద ఉన్నాడు. తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని త్రిమూర్తులు పట్టుబట్టడమే కాక పిల్లల ముందే సరస్వతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దానికి ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పడంతో కోపోద్రిక్తుడైన త్రిమూర్తులు తన దగ్గరున్న కత్తితో ఆమె ముఖం, కంఠం, భుజం, ఇంకా మరికొన్ని చోట్ల పొడిచాడు. భీతిల్లిన పిల్లలు కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలుచుకు వచ్చారు. అప్పటికే మరణించిన సరస్వతి నెత్తుటి మడుగులో పడి కనిపించింది. ఈలోగా పురుగుమందు తాగి, కత్తితో పొడుచుకున్న త్రిమూర్తులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు మండపేట రూరల్ సీఐ పీవీ రమణ, ఎస్సై ఎల్.శ్రీను సిబ్బందితో అక్కడకు చేరుకుని త్రిమూర్తులును 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్ఓ మేకా శ్రీను, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నతల్లి కత్తిపోట్లకు గురై మరణించడాన్ని కళ్లారా చూసిన ముగ్గురు పిల్లలూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనతో చర్చి కాలనీలో కలవరం రేగింది. -
చీపుర్లు పట్టారు..
మండపేట :గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహాత్మునికి ఘన నివాళులర్పించారు. వివిధ ప్రాంతాల్లో చీపుర్లు పట్టి రోడ్లను, వీధులను శుభ్రపరిచారు. పరిశుభ్ర భారతావని కోసం పాటుపడతామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పరిశుభ్రత ప్రతిజ్ఞలు చేసి, ర్యాలీలు నిర్వహించారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేద్దామని, ‘స్వచ్ఛ భారత్’ను సాధించుకుందామని పిలుపునిచ్చారు. కాకినాడలోని డైరీ ఫారం సెంటర్ నుంచి ఏఎంజీ స్కూల్ వరకూ జరిగిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, చీపుర్లు పట్టారు.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, ఎమ్మెల్యేలు కొండబాబు, దాట్ల సుబ్బరాజు, కలెక్టర్ నీతూ ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ గోవిందస్వామి పాల్గొన్నారు. కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఎంపీ తోట నరసింహం ఉద్యోగులతో కలసి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో చినరాజప్ప, రవికిరణ్‌వర్మ, దాట్ల బుచ్చిరాజు రోడ్డును శుభ్రం చేశారు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో చినరాజప్ప, రవికిరణ్‌వర్మ, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. పెద్దాపురం రూరల్ వడ్లమూరులో జరిగిన స్వచ్ఛ భారత్ ర్యాలీలో చినరాజప్ప పాల్గొన్నారు. సామర్లకోట మండల పరిషత్ కార్యాలయంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొండంగి మండలం ఏవీ నగరంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు, కలెక్టర్ నీతూ ప్రసాద్‌లు.. విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. తుని రైల్వే స్టేషన్లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రైల్వే ఉద్యోగులతో కలిసి రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేశారు. జగ్గంపేటలో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు రైల్వే సిబ్బందితో కలిసి రాజమండ్రిలో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంను శుభ్రం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొన్నారు. రాజమండ్రి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ ఆవరణలోని గోదావరి భవన్ ప్రాంగణాన్ని సిబ్బందితో కలిసి సంస్థ సీఎండీ డీకే షరాఫ్ శుభ్రం చేశారు. కొత్తపేటలో జరిగిన స్వచ్ఛ భారత్ ర్యాలీలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ జరిగిన స్వచ్ఛ భారత్ ర్యాలీలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ పి.రత్నాబాయి పాల్గొన్నారు. మండపేటలో స్వచ్ఛ భారత్ ర్యాలీని ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ద్వారపూడి రైల్వేస్టేషన్‌ను ఉద్యోగులతో కలిసి శుభ్రపరిచారు. రామచంద్రపురంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ ర్యాలీలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన కె.గంగవరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి జేసీ ముత్యాలరాజు హాజరయ్యారు. గొల్లప్రోలు నుంచి పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వరకూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. -
నష్టాల జడివేళ ‘గొడుగు’ దక్కేనా!
మండపేట :ప్రజల క్షేమమే ధ్యేయమైన వాడు గనుక మహాకవి గురజాడ ‘వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టవోయ్’ అన్నాడు. తనకు సీఎం పదవే ధ్యేయమైన వాడు గనుక టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఓటిమాటల డప్పుకొట్టి ఓట్లు రాబట్టవలెనోయ్’ అంటూ నోటికొచ్చిన వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే నోటితో నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా మాట తప్పుతున్నారు. తన వాగ్దానాలను నమ్మి, ఆశలు పెంచుకున్న వారిని నిరాశానిస్పృహల్లో ముంచుతున్నారు. రుణ మాఫీపై రోజుకో మాట చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రుణాలు రీ షెడ్యూల్ చేస్తామంటున్నా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయలేదు. తొలకరి పనులు ముమ్మరమవుతున్న తరుణంలో సర్కారు తీరు రైతులను అయోమయంలోకి నెడుతోంది. పంటల బీమా ప్రీమియం చె ల్లింపు గడువు ఈ నెలాఖరు వరకే ఉండడంతో ఈలోగా రీ షె డ్యూల్ జరుగుతుందా, మట్టిలో గుమ్మరించే తమ చెమటకూ, సొమ్ముకూ బీమా ధీమా దక్కుతుందా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. జాతీయ బీమా సంస్థ ప్రస్తుత ఖరీఫ్‌లో ప్రీమియం చెల్లింపునకు జూలై 31ని గడువుగా విధించింది. ఆ లోగా ప్రీమియం చెల్లించిన వారికే బీమా వర్తిస్తుంది. సాధారణంగా తొలకరి పనుల ప్రారంభంలో సొసైటీలు, బ్యాంకుల నుంచి రైతులు పంట రుణాలు తీసుకుంటుంటారు. ఆ సంస్థలు ఇచ్చే రుణంలోనే ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటాయి. తమంత తామే పంటల బీమా చేయించే అలవాటు జిల్లా రైతాంగానికి అబ్బలేదు. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో సు మారు 3.5 లక్షల మంది రైతులు రూ.2,750 కోట్ల పంట రు ణాలు తీసుకోవడం ద్వారా బీమా సదుపాయం పొందితే స్వచ్ఛందంగా పంటల బీమా చేయించుకున్న రైతులు సుమారు 120 మంది మాత్రమే ఉన్నారు. సొంతంగా బీమా చేయించుకోవాలంటే ఏఓల చుట్టూ తిరగాల్సి రావడం, ప్రకృతి అనుకూలింక పోతుందా అన్న ధీమా ఇందుకు కారణమని చెప్పవచ్చు. గత అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో వరి పంటకు అపారనష్టం వాటిల్లగా బీమాలేని వారు నష్టం చవిచూడాల్సి వచ్చింది. ప్రీమియం చెల్లింపు గడువు పెంచాలి.. బీమా సంస్థ గడువు ప్రకారం ఈ ఖరీఫ్ పంటకు ప్రీమియం ఈనెల 31లోగా చెల్లించాలి. తాజా మార్గదర్శకాల మేరకు పంటల బీమా ప్రీమియంగా గరిష్ట రుణపరిమితిలో 18 శాతం చెల్లించాల్సి ఉంది. అందులో ఆరు శాతం రైతులు చెల్లిస్తే, మిగిలిన 12 శాతం ప్రభుత్వం భరిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంటకు నష్టం వాటిల్లినప్పుడు గ్రామం యూనిట్‌గా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేస్తారు. కాగా ప్రీమియం గడువు దగ్గర పడుతున్నా రుణాల రీషెడ్యూల్ పేరిట ప్రభుత్వం చేస్తున్న కాలయాపన రైతులను కలవరపరుస్తోంది. వారు బీమా రక్షణ పొందాలంటే గడువులోగా రీ షెడ్యూల్ ప్రక్రియ పూర్తయి, కొత్త రుణాలు పొందాలి. మరోవైపు పాత బకాయిలు చెల్లించిన వారికే కొత్త రుణాలిస్తామని బ్యాంకులు కరాఖండిగా చెపుతున్నాయి. అసలే తుపాన్లు, అల్పపీడనాల తాకిడి ఎక్కువగా ఉండే జిల్లా కావడంతో రైతులకు బీమా రక్షణ అత్యవసరం. ప్రస్తుతం వారి అవస్థ.. కారుమబ్బులు కమ్మి, కుంభవృష్టి కురవనున్న వేళ..తడవకుండా ఆదుకునే గొడుగు సమయానికి చేతికొస్తుందా, లేదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నట్టుంది. ప్రభుత్వం స్పందించి రుణ మాఫీ లేదా రీషెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వడంతో పాటు బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంచాలని వారు కోరుతున్నారు. -
బిల్లు దూరం ఇల్లు భారం
మండపేట :జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఇందిరమ్మ లబ్ధిదారులు తాము నిర్మించుకుంటున్న ఇళ్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో అందక ఆక్రోశిస్తున్నారు. గృహ నిర్మాణశాఖ నుంచి దశలవారీగా అందాల్సిన రుణసాయం నాలుగు నెలలుగా నిలిచిపోవడంతో నిస్సహాయ స్థితిలో అలమటిస్తున్నారు. అర్హులైన పేదలందరికీ మూడు సెంట్ల చొప్పున స్థలంతో పాటు రూ.1.5 లక్షలతో పక్కా ఇంటిని నిర్మిస్తామని ఎన్నికల్లో టీడీ పీ వాగ్దానం ేసింది. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా ఆ దిశగా కార్యాచరణ లేదు సరికదా.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అంతకు ముందు మూడునెలలుగా నిలిచిపోయిన బిల్లుల విడుదలకు కించిత్తు చొరవ చూపలేదు. గత నాలుగు నెలలుగా జిల్లాలో సుమారు 16,968 ఇళ్లకు సంబంధించి దాదాపు రూ.41.59 కోట్ల మేర గృహనిర్మాణ రుణాల విడుదల నిలిచిపోయింది. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, పూర్తయిన మేర బిల్లులు అందకపోవడం లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో ఓసీ, బీసీలకు రూ.80,000, ఎస్సీలకు రూ.1,00,000, రూరల్‌లో ఓసీ, బీసీలకు రూ.70,000, ఎస్సీలకు రూ.1,00,000లను గృహనిర్మాణ సాయంగా అందిస్తున్నారు. పరిపాలన , రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును నిర్మాణంలో అంచెలను బట్టి దశల వారీగా గృహ నిర్మాణ శాఖ బిల్లులు చెల్లిస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి గృహనిర్మాణ శాఖ ఆన్‌లైన్‌ను మూసివేసి బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. నేటికీ ఆన్‌లైన్‌ను తెరవలేదు. ఏ దశ పనులకైనా రాని బిల్లు.. ఇందిరమ్మ మూడు విడతల్లో జిల్లాకు సుమారు 2,46,560 ఇళ్లు మంజూరవగా ఇప్పటి వరకు కేవలం 92,743 పూర్తయ్యాయి. 24,936 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇందిరమ్మతో పాటు వివిధ జీఓలకు సంబంధించి గత ఏప్రిల్ నుంచి సుమారు 6,605 ఇళ్లకు పునాది దశ పనులు జరుగ్గా, 4,277 ఇళ్లకు రూఫ్ లెవెల్ పనులు పూర్తయ్యాయి. 6,086 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఆయా దశలకు అనుగుణంగా సుమారు రూ.41.59 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని అంచనా. నిర్మాణ దశల వివరాలను గృహ నిర్మాణశాఖ ఆన్లైన్లో అప్డేట్ చేశాక ఆ శాఖ నుంచి నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి బిల్లు మొత్తం జమవుతుంది. గత నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌ను మూసి వేయడంతో లబ్ధిదారులకు బిల్లులు అందక హెచ్చు వడ్డీలకు ప్రైవేట్ అప్పులు తీసుకుని.. తదుపరి దశల పనులను మొదలు పెడుతున్నారు. దీనికి తోడు గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇంటి భారం తడిసిమోపెడవుతుందని గగ్గోలు పెడుతున్నారు. గతంలో రూ.4,000 వరకు ఉన్న రెండు యూనిట్ల ఇసుక ప్రస్తుతం రూ.9,000 వరకు ఉంది. సిమెంట్ బస్తా రూ.320 వరకు పెరిగిపోయింది. ఐరన్, ఇటుక, కంకర వంటి వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. తాము మోయజాలని భారమైనా.. సొంత ఇల్లు సమకూర్చుకోవాలన్న ఆరాటంతో ప్రైవేట్ అప్పులు చేస్తున్నామని, వాటికి కట్టే పెచ్చు వడ్డీలు ఇల్లు సమకూరుతుందన్న ఆనందాన్ని ఇగిర్చివేస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ దుస్థితిని గుర్తించి, స్పందించాలని, వెంటనే బిల్లులు విడుదల చేయించాలని కోరుతున్నారు.బిల్లుల విడుదలలో జాప్యంపై గృహనిర్మాణ శాఖ పీడీ సెల్వరాజ్‌ను వివరణ కోరగా గత మార్చి చివరి నుంచి ఆన్లైన్ నిలిచిపోయిందన్నారు. తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. -
అధినేతను కలిసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
మండపేట : నగరం గ్యాస్ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదివారం పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలుసుకున్నారు. నగరం దుర్ఘటన బాధితులను పరామర్శించిన అనంతరం శనివారం రాత్రి జగన్మోహన్రెడ్డి పినపళ్లలో మాజీమంత్రి సంగిత వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మండపేటలో పార్టీ వాణిజ్యవిభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడుకు చెందిన కామత్ ఆర్కెడ్‌లో బసచేశారు. ఆయనను కలుసుకొనేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కామత్ ఆర్కెడ్ ఆదివారం కిక్కిరిసిపోయింది. పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, మండపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల కోఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామినాయుడు, గుత్తుల సాయి, పార్టీ కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, పార్టీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, పోతంశెట్టి ప్రసాద్, సిరిపురపు శ్రీనివాసరావు, వల్లూరి రామకృష్ణ, సత్తి వెంకటరెడ్డి, దూలం వెంకన్నబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, తుపాకుల ప్రసన్నకుమార్, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అధినేతను కలుసుకున్నారు. జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. స్థానిక పరిస్థితులపై పలువురు నేతలు ఆయనతో చర్చించారు. ఉదయం 9.30 గంటలకు మండపేట నుంచి జగన్మోహన్రెడ్డి రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన వెంట తరలి వెళ్లారు. ఘనంగా వీడ్కోలు మధురపూడి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి రాజమండ్రి విమానాశ్రయంలో పలువురు పార్టీ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. 10.35 గంటలకు జెట్ ఎయిర్వేస్ విమానంలో హైదరాబాద్ వెళ్లారు. జగన్మోహన్రెడ్డికి వీడ్కోలు పలికినవారిలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి, కర్రి పాపారాయుడు, అనంతఉదయభాస్కర్, సుంకర చిన్ని, శెట్టిబత్తుల రాజబాబు, కామన ప్రభాకరరావు, జక్కంపూడి రాజా, తాడి విజయభాస్కర్‌రెడ్డి, కానుబోయిన సాగర్, గుర్రం గౌతమ్, యడ్ల సత్యనారాయణ ఉన్నారు. -
వచ్చే నెల వెచ్చాలు వచ్చేనా?
మండపేట : మూడో విడత రచ్చబండ రేషన్ కూపన్ల కాలపరిమితి ముగిసింది. కొత్త కూపన్ల జారీ లేదా శాశ్వత రేషన్ కార్డుల మంజూరుపై ప్ర భుత్వం ఇంకా నోరు మె దపడం లేదు. ఫలితంగా రానున్న నెలకు రేషన్ సరుకులు వస్తాయో, లేదోనని బడుగుజనం కలవరపడుతున్నారు. కొత్త కార్డులు ఇస్తారో లేక కూపన్లతోనే సరిపెడతారోనన్న శంకా వారిని పీడిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో రచ్చబండ ద్వారా రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. గత నవంబరులో నిర్వహించిన మూడో విడత రచ్చబండలో తెల్లకార్డులకు మరో 87,477 మందిని ఎంపిక చేశారు. అంతకు ముందు రచ్చబండ రెండు విడతల్లో టీఏపీ, ఆర్ఏపీ కోడ్ నంబర్లతో కార్డులు జారీ చేశారు. ఆ కోడ్ నంబర్లతో తొలుత కూపన్లు, తర్వాత శాశ్వత కార్డులు మంజూరు చేశారు. ఫలితంగా లబ్ధిదారులకు రేషన్ సరుకులతో పాటు ఇతర సౌకర్యాలు పొందే వీలు కలిగింది. మూడో విడతలో 87,477 మంది లబ్ధిదారులకు డిసెంబరు నుంచి నెలకు ఒకటి చొప్పున ఏడు కూపన్లు అందజేశారు. కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే ఈ కూపన్లు ఉపయోగపడ్డాయి. ప్రతి నెలా ఒక కూపన్ తీసుకువెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వారు. శాశ్వత కార్డులు మంజూరు చేయకపోవడంతో ఈ విడత లబ్ధిదారులకు మిగిలిన సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. మళ్లీ కూపన్లయినా ఇస్తారా? గత డిసెంబరు నుంచి ఏడు నెలలకు పంపిణీ చేసిన కూపన్ల గడువు జూన్‌తో ముగుస్తోంది. రానున్న నెల నుంచి సరుకులు తెచ్చుకోవాలంటే కొత్తగా కూపన్లు ఉండాలి. అందుకోసం ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు కూపన్లు లేదా శాశ్వత కార్డులు మంజూరు చేయాలి. ఇప్పటి వరకు కూపన్లా లేక శాశ్వత కార్డులా అన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయమై ఉన్నతస్థాయి నుంచి ఇంకా స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడో విడత రచ్చబండ లబ్ధిదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జూలై నుంచి సరుకులు అందుతాయే లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు యథావిధిగా సరుకులు అందించాలని, ఇతర పథకాలు పొందేందుకు వీలుగా శాశ్వత కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. -
అటు తిరకాసు..ఇటు నోటీసు
మండపేట :రుణ మాఫీపై చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీతో గత నాలుగు నెలలుగా రైతులు బ్యాంకులకు వాయిదాలు చెల్లించడం మానేశారు. ఇక రుణమాఫీనే అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు తన హామీ అమలుకు అంటూ కమిటీ వేయడం రైతుల్లో ఆందోళనను నింపగా బ్యాంకర్లను ‘వసూళ్ల’కు పురిగొల్పింది. నిన్నమొన్నటి వరకు మిన్నకున్న బ్యాంకర్లు రుణాలు చెల్లించమని నోటీసులివ్వడానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వరంగంలోని ఓ బ్యాంకు మండపేట శాఖ ఇప్పటికే బంగారు రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులిచ్చింది. అన్నదాతలు ఆశించినట్టు.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే చంద్రబాబు రుణాలను మాఫీ చేయడంపై కాక.. ఆ హామీ అమలుపై విధివిధానాలు రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ మాత్రమే సంతకం చేశారు. 45 రోజుల తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మార్గదర్శకాలు రూపొందిస్తామని మెలిక పెట్టారు. టీడీపీ ఎన్నికల హామీతో గత కొద్ది నెలలుగా రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించడం లేదు. కమిటీ నివేదిక వచ్చేందుకు మరో 40 రోజులు పడుతుంది. ఏ రుణాలు, ఎంత కాలం వరకు రద్దు చేస్తారో కూడా స్పష్టత లేదు. నివేదికపై మార్గదర్శకాలు రూపొందించి, వాటిని అమల్లోకి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. అప్పటి వరకు రైతులు రుణాలు చెల్లించకుంటే ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయన్న ఆందోళనతో బ్యాంకర్లు నిబంధనల మేరకు రైతుల నుంచి రుణాలు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మండపేటలోని ఆ బ్యాంకు శాఖ చెల్లింపు గడువు ముగిసిన సుమారు రూ.20 కోట్ల రుణాలకు సంబంధించి మండపేట, అర్తమూరు, పెడపర్తి తదితర గ్రామాల్లోని సుమారు 170 మంది రైతులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని బ్యాంకులూ నోటీసుల జారీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రుణమాఫీ కోసం గంపెడాశతో ఎదురుచూసిన రైతులు హతాశులవుతున్నారు. గతంలోనే చెల్లించి ఉంటే వడ్డీ భారమైనా తగ్గేదని, టీడీపీ హామీ తమ కొంప ముంచేలా ఉందని వాపోతున్నారు. తీరా చెల్లించాక రుణాలు రద్దు చేస్తే నష్టపోతామని, అలాగని చెల్లించకుండా ఉండి.. అప్పుడు రుణమాఫీ జరగకపోతే వడ్డీ తడిసి మోపెడవుతుందని, ఈలోగా కాలపరిమితి ముగిస్తే బంగారం వేలం వేస్తారని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. బ్యాంకుల నుంచి ఒత్తిడి లేకుండా, తాము నష్టపోకుండా ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రుణాలు రద్దు చేయకుంటే ఆందోళన : పాపారాయుడు రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకోమని వైఎస్సార్ కాంగ్రెస్ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు అన్నారు. బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులను కొందరు రైతులు ఆయనకు చూపి ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ బూటకపు వాగ్దానమనడానికి ఈ నోటీసులే నిదర్శనమన్నారు. షరతులు లేని రుణమాఫీని అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. పార్టీ నాయకులు పిల్లా వీరబాబు, సిరసపల్లి నాగేంద్ర, రైతులు ద్వారంపూడి శివభాస్కరరెడ్డి, చిర్ల వీర్రెడ్డి పాల్గొన్నారు. ఏం చేయాలో తోచడం లేదు.. తుపాన్లతో తీవ్రంగా నష్టపోయాం. రుణా లు మాఫీ చేస్తారన్న గంపెడాశతో ఎన్నికల్లో టీడీపీని గెలిపించాం. రుణం చెల్లించమంటూ ఇప్పుడు బ్యాంకు నుంచి నోటీసులు పంపారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. - కోనాల ధ నరెడ్డి, రైతు, అర్తమూరు, మండపేట మండలం హామీని నిలబెట్టుకోవాలి.. బంగారు రుణాలు చెల్లించమని నోటీసులు వచ్చాయి. ఇప్పటి వరకూ రుణం రద్దవుతుందన్న ఆశతో ఉన్నాం. రుణమాఫీపై ప్రభుత్వం త్వరగా స్పందించి, అన్ని రుణాలూ రద్దు చేస్తామన్న హామీని నిలుపుకోవాలి. - తాడి జయరామారెడ్డి, రైతు, అర్తమూరు మండపేట మండలం -
అదనులో దన్ను దక్కేనా?
మండపేట, న్యూస్‌లైన్ :జిల్లాలో వరి, కొబ్బరి తదితర పంటలు సాగు చేసే రైతులు సుమారు ఆరు లక్షల మంది ఉండగా, వీరిలో 60 శాతానికి పైగా అంటే సుమారు 3.60 లక్షల మందికి పైగా కౌలు రైతులని అంచనా. వీరిలో చాలా మంది స్వయంగా పొలంలో దిగి చెమటోడ్చి కష్టించే వారే. వీరికి సాధారణ రైతులకులా రుణాలు, రాయితీలు, వడ్డీ మాఫీ పథకాలు, పంట నష్టపరిహారం అందకుండా పోతున్నాయి. అప్పులు చేసి సాగు చేయడం, తుపానులకు, వరదలకు పంట నష్టపోతే తిరిగి అప్పులు చేయడం సర్వసాధారణమవుతోంది. రుణ బాధ తాళలేక కొందరు ప్రాణత్యాగం చేసుకుంటున్న విషాదాలూ పరిపాటి అవుతున్నాయి. దీనిని గుర్తించిన దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కౌలురైతులతో ఉమ్మడిగా పూచీ పడే బృందాలను (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి రుణ సౌకర్యం కల్పించారు. ఆయన మృతితో జేఎల్‌జీ కొండెక్కిపోయింది. కౌలు రైతుల కోసం 2011లో ప్రభుత్వం కౌలుదారుల చట్టం తెచ్చింది. దీని ప్రకారం కౌలు రైతులకుగుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. సాధారణ రైతుల్లా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించడంతో పాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇవ్వాలి. అయితే అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదు. అందరికీ అందని కార్డులు గుర్తింపు కార్డు దరఖాస్తులో కౌలుదారుని సమాచారంతో పాటు కౌలుకు చేస్తున్న భూమి వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంది. వీటితో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనలో వివరాలు తెలిపేందుకు భూమి సొంతదారులు వెనుకాడటంతో ఎక్కువ మంది కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అందడం లేదు. ఈ చట్టం ప్రారంభమైన మొదటి సంవత్సరంలో సుమారు 50 వేల మంది కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వగా, 2012-13లో 74,904 మందికి, 2013-14లో 82,298 మందికి కార్డులు వచ్చాయి. జిల్లాలో సుమారు 3.6 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వారిలో అరకొర మందికి మాత్రమే గుర్తింపుకార్డులు అందాయి. రుణసాయం నామమాత్రమే గుర్తింపుకార్డులు పొందిన వారిలో కొద్దిమందికి మాత్రమే రుణాలందుతున్నాయి. అప్పటికే అసలు రైతు రుణం తీసుకుని ఉండటం, తాము పూచీ చూపించలేక పోవడంతో బ్యాంకర్ల నిరాకరణ వంటి కారణాలతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా 2012-13లో 27,290 మంది కౌలు రైతులకు రూ.38.27 కోట్ల రుణాలు మంజూరు చేయగా, 2013-14లో 20,018 మందికి సుమారు రూ.30.82 కోట్ల రుణం మాత్రమే మంజూరైంది. మిగిలిన వారికి బ్యాంకర్ల నుంచి మొండిచెయ్యే ఎదురైంది. మరో వారం రోజుల్లో తొలకరి పనులు ప్రారంభం కానున్నా కౌలురైతుల పాత గుర్తింపు కార్డుల రెన్యువల్‌తో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేసే చర్యలు కానరావడం లేదు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలి. గత మూడు నెలలుగా ఎన్నికల హడావుడితో రెవెన్యూ శాఖ కౌలు రైతుల ఊసే మరిచింది. గుర్తింపుకార్డులు లేకపోతే రుణసాయం అందదు. దాంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కౌలు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులు స్పందించి తమ కోసం చేసిన చట్టం తమకు ఉపకరించేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. రుణాల మంజూరుకు అధికారులు చర్యలు తీసుకోవాలి కొంత మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణాలు మాత్రం ఇవ్వటం లేదు. కౌలు రైతులకు ఖరీఫ్‌కు రుణాలు ఇచ్చే విధంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. - కొండేపూడి శ్రీనివాసరావు, కౌలు రైతు, భట్లపాలిక, కె.గంగవరం మండలం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. గతంలో కొంత మందికి మాత్రమే ఇచ్చారు. గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణాలు మాత్రం ఇవ్వలేదు. కౌలు రైతులందరికీ కార్డులిచ్చేలా చూడాలి. - తోకల శ్రీను, కౌలురైతు, తామరపల్లి, కె.గంగవరం మండలం -
త్వరలో ‘మండలి’ పోరు!
మండపేట, న్యూస్‌లైన్ :త్వరలో మరో ఎన్నికల సమరానికి తెర లేవనుంది. శాసనమండలిలో స్థానిక సంస్థలకు సంబంధించి పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించినట్టు సమాచారం. ఇటీవల స్థానిక ఎన్నికలు ముగియడంతో జిల్లాలోని స్థానిక సంస్థల సభ్యుల ఓటింగ్ వివరాలు పంపాల్సిందిగా కమిషన్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.శాసనమండలి పునరుద్ధరణ అనంతరం 2006లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లాలో రెండు స్థానాలకు అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఒక స్థానానికి కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, మరో స్థానానికి టీడీపీ నుంచి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికయ్యారు. వారి పదవీకాలంపై నిర్వహించిన డ్రాలో రుద్రరాజుకు నాలుగు సంవత్సరాల పదవీకాలం దక్కగా, చినరాజప్పకు ఆరు సంవత్సరాల పదవీకాలం లభించింది. 2010లో రుద్రరాజు పదవీకాలం ముగియడంతో ఆ ఏడాది నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొడ్డు భాస్కరరామారావు విజయం సాధించారు. 2012లో చినరాజప్ప పదవీకాలం ముగియడంతో ఎన్నిక జరపాల్సి ఉంది. అయితే నగర, పురపాలక సంస్థల సభ్యుల పదవీకాలం 2010 సెప్టెంబరుతో ముగియగా, 2011 జూలైలో పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో స్థానిక సంస్థల సభ్యులు లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్సీకి ఎన్నిక జరిపే వీలులేకపోయింది. దాంతో దాదాపు రెండేళ్లుగా జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. జిల్లాలో 1,434 మంది ‘స్థానిక’ ఓటర్లు ఇటీవల నగర, పురపాలక సంస్థలతో పాటు, జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. దాంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, కంటోన్మెంట్ బోర్డులలోని సభ్యుల (వీరే స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు) వివరాలను పంపాల్సిందిగా ఇటీవల ఆదేశించింది. ఆయా సంస్థల అధికారులు తమ పరిధిలోని స్థానిక సంస్థల సభ్యుల సంఖ్యను, వారి వివరాలను జిల్లా యంత్రాంగానికి నివేదించారు. జిల్లాలో కంటోన్మెంట్ బోర్డు లేనందున దాన్ని మినహాయిస్తే మిగిలిన వాటిలో ఎన్నికలు జరిగిన రాజమండ్రి కార్పొరేషన్ నుంచి 50 మంది కార్పొరేటర్లు, ఏడు పురపాలక సంస్థల నుంచి 204 మంది కౌన్సిలర్లు, మూడు నగర పంచాయతీల నుంచి 60 మంది సభ్యులు, 57 మంది జెడ్పీటీసీ, 1,063 మంది ఎంపీటీసీ సభ్యులతో మొత్తం 1,434 మంది స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తుతో త్వరలో స్థానిక ఎమ్మెల్సీకి ఎన్నికల నగారా మోగా సూచనలు కనిపిస్తున్నాయి. -
సినిమా థియేటర్లలో రక్షణ ఎంత ?
మండపేట, న్యూస్‌లైన్ : పట్టణంలోని అంబికా థియేటర్ ఆధునికీకరణ పనులు జరుగుతుండగా సోమవారం సాయంత్రం 4.30-4.35 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. 4.45 గంటలకు మండపేట ఫైర్‌స్టేషన్‌కు సమాచారమందగా 4.52 గంటలకే అగ్నిమాపకవాహనంతో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. మరో వాహనం కోసం 5.05 గంటలకు రామచంద్రపురం ఫైర్‌స్టేషన్‌కు స్థానిక ఫైర్ అధికారులు సమాచారమందించారు. 5.34 గంటలకు రామచంద్రపురం సిబ్బంది వాహనంతో అక్కడకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి 7.20 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే థియేటర్ మొత్తం కాలి బూడిదైపోయింది. ఇది జరగడానికి పట్టింది కేవలం 30 నిముషాలు మాత్రమే. సుమారు రూ. 60 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాద సమయానికి ప్రదర్శన లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. ఒకవేళ థియేటర్లో ప్రేక్షకులే ఉంటే... తలచుకొంటేనే భయమేస్తుంది. క్షణాల్లో వ్యాపించిన మంటలతో దట్టంగా కమ్ముకున్న పొగలు, అగ్నికీలల నుంచి ప్రేక్షకులు బయటకు రావడం అసాధ్యమే అవుతుంది. అపార ప్రాణనష్టం సంభవించేది. 1997 ప్రాంతంలో ఢిల్లీలోని ఒక సినిమా థియేటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో అనేక మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయమై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కోర్టులో విచారణలో ఉంది. కాగా 1970లో వచ్చిన సినిమా రెగ్యులైజేషన్ యాక్ట్‌ప్రకారం సినిమా థియేటర్లలో యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిబంధనలను రూపొందిస్తోంది. గత ఏడాది జూలై 3న జీవో నంబర్ 177ను విడుదల చేసింది. మండల గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో ఉండే థియేటర్లు, వాటి ఎత్తు, థియేటర్ల సముదాయంలో ఉండే స్క్రీన్లు సంఖ్య తదితర వాటి ఆధారంగా థియేటర్లను ఆరు కేటగిరీలుగా విభజించి వాటిలో చేయ్యాల్సిన ఏర్పాట్లు, ఫైర్ సేఫ్టీ నిబంధనల గురించి అందులో పేర్కొంది. జిల్లాలో సుమారు 149 వరకు సినిమా థియేటర్లు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్నింటికి సరైన అనుమతులు ఉన్నాయి ? అగ్నిమాపక నిబంధనలు మేరకు ఎన్నింటికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయి ? అనే విషయమై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న దాఖలాలు నామమాత్రమే. ప్రమాదం సంభవించినప్పుడు మాత్రం హడావుడి చేసే అధికారులు అవి జరగకుండా నిబంధనలు అమలుచేయడంలో నిర్లక్ష్యధోరణే అవలంబిస్తున్నారు. అగ్నిమాపక అధికారుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) లేకుండా థియేటర్ నిర్వహించడానికి రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధన ఎక్కడా సరిగా అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. అగ్నిప్రమాదాల నివారణకు పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి, నిర్ణీత ఫీజు చెల్లించి అగ్నిమాపక అధికారుల నుంచి థియేటర్ యాజమాన్యాలు ఎన్ఓసీలు తీసుకోవాల్సి ఉంది. అందుకోసం ఒక్కో థియేటర్‌కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున మూడేళ్లకు రూ.30 వేలు ఎన్ఓసీ లెసైన్స్ ఫీజు కింద చెల్లించాలి. అయితే చాలా థియేటర్ల యజమానులు ఎన్ఓసీలు తీసుకోవడం లేదు. అయినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు కేటగిరీ-1 అగ్నిమాపక శకటం తిరిగేందుకు వీలుగా గేటు 4.5 మీటర్లు వెడల్పు, ఐదు మీటర్లు ఎత్తు ఉండాలి. థియేటర్ చుట్టూ వాహనం తిరిగేలా 4.5 మీటర్లు వెడల్పును వదిలి మిగిలిన స్థలంలో టికెట్టు కౌంటర్లు, క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవాలి. కరెంటు పోయినప్పుడు నాలుగు గంటలు బ్యాటరీపై పనిచేసేలా లైటు ఉండాలి. కరెంటు పోయినప్పుడు కూడా కనిపించే విధంగా ఎగ్జిట్ బోర్డ్సును రేడియం స్టిక్కరింగ్తో తయారుచేయించాలి. ప్రతీ ఆటకు లోపల శుభ్రం చేస్తూ ఉండాలి. అగ్నిప్రమాదాల నివారణలో సిబ్బందికి తగిన శిక్షణ ఇప్పించాలి. ఏదైనా ఆపద సంభవించినప్పుడు ముందుగా హెచ్చరించేందుకు మైక్ సిస్టమ్ ఏర్పాటుచేయాలి. అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు ఫైర్ ఎక్సింటగ్ విషర్స్, కొన్ని బకెట్లలో ఇసుక, మరి కొన్నింటిలో నీళ్లు ఉండాలి. మాన్యువల్ ఆపరేటర్ ఎలక్ట్రికల్ ఫైర్ అలారం వాడాలి. థియేటర్ పైకప్పుపై ఐదు వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంకు ఉండాలి. దానికి హోసరీస్ పైప్ అనుసంధానం చేసి ఉండాలి. 450 ఎల్పీఎం బూస్టర్ పంపు ఉండాలి. పునాది 200 చదరపు మీటర్లు దాటితే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక శకటానికి అడ్డు లేకుండా జనరేటర్ అందరికీ కనిపించే విధంగా ఉండాలి. కేటగిరీ-2 థియేటర్ పైకప్పుపై 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు ఉండాలి. కేటగిరీ-3 ప్రేక్షకులు కిందికి దిగేందుకు వీలుగా థియేటర్లలోని మొత్తం సిట్టింగ్‌ను 80తో విభజించగా వచ్చే సంఖ్యకు సమానంగా స్క్వేరు మీటర్లు వెడల్పు కలిగిన మెట్లు ఏర్పాటుచేయాలి. అలాగే బయట కూడా మెట్లు మార్గం ఏర్పాటుచేయాలి. కాంప్లెక్సులో ఎన్ని స్క్రీన్లు ఉంటే అన్ని ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకులను థియేటర్ పైకప్పుపై ఏర్పాటుచేయాలి. 900 ఎల్పీఎం సామర్థ్యం కలిగిన బూస్టర్ పంపును ఏర్పాటుచేయాలి. కేటగిరీ-4 నిరంతరం నీళ్లతో ఉండే వెటరైజర్ సిస్టమ్‌కు అండర్ గ్రౌండ్ ట్యాంకు కనెక్ట్ అయి ఉండాలి. ఆటోమెటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్, ఆటోమెటిక్ డిటెక్షన్ అలారం సిస్టమ్ ఏర్పాటుచేయాలి. 35 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు, ఎలక్ట్రిక్, డీజిల్‌తో నడిచే 2280 ఎల్పీఎం సామర్ధ్యం కలిగిన బూస్టర్ పంపు ఉండాలి. పైకప్పులో పది వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంకు ఉండాలి. 450 ఎల్పీఎం సామర్ధ్యం కలిగిన బూస్టర్ పంపు, 180 ఎల్పీఎం సామర్థ్ధ్యం కలిగిన జాకీ పంపు ఉండాలి. కేటగిరీ-5, కేటగిరి-6 154 జీవో ప్రకారం అధనపు రక్షణ నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. థియేటర్ల కేటగిరీలు 177 జీవో మేరకు థియేటర్లను ఆరు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ - 1 : 10 మీటర్లు కన్నా తక్కువ ఎత్తు ఉండే గ్రామాల్లో థియేటర్లు కేటగిరీ - 2 : పది మీటర్లు కన్నా తక్కువ ఎత్తు ఉండే అర్బన్ ఏరియాల్లోని థియేటర్లు కేటగిరీ - 3 : ఒక కన్నా ఎక్కువ తెరలు ఉండే థియేటర్లు కేటగిరీ - 4 : 10 నుంచి 15 మీటర్ల మధ్య ఎత్తు ఉండే థియేటర్లు కేటగిరీ - 5 : 15 నుంచి 24 మీటర్ల మధ్య ఎత్తు ఉండే థియేటర్లు కేటగిరీ - 6 : మల్టీఫ్లెక్సులు ప్రమాద హేతువులు మల్టీఫ్లెక్సులు, ఏసీ థియేటర్లు, త్రీడీ, ఆడియో ఎఫెక్ట్‌ల కోసం ఏర్పాటు చేస్తున్న సామగ్రి, వాటి వైర్లు అగ్ని వాహకాలుగా ఉంటున్నాయి. ఆడియో ఎఫెక్ట్ కోసం, ఏసీ ఎక్కువ సేపు ఉండేందుకు గోడలకు, పైకప్పునకు గడ్డి, ఫైబర్ మొదలైన వాటితో తయారుచేసిన మెటిరీయల్‌ను వినియోగిస్తున్నారు. కుర్చీలలో వినియోగించే స్పాంజి, ఫ్లోరింగ్‌కు మ్యాట్లు క్షణాల్లో మండిపోయేవిగా ఉంటున్నాయి. -
అంబిక థియేటర్లో అగ్ని ప్రమాదం
మండపేట, న్యూస్‌లైన్ : మండపేటలోని అంబిక థియేటర్లో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. థియేటర్లో మరమ్మతులు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో థియేటర్లోని ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. పైకప్పు పూర్తిగా ధ్వంసమైపోయింది. అదృష్టవశాత్తు సంఘటన సమయంలో థియేటర్లో ప్రదర్శన లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. కాగా పక్కనే ఉన్న సత్యశ్రీ థియేటర్ లోంచి ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో సుమారు రూ.60 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సత్యశ్రీ రోడ్డులో అంబిక, సత్యశ్రీ థియేటర్ల కాంప్లెక్స్ ఉంది. కొద్దిరోజులుగా అంబిక థియేటర్‌కు యాజమాన్యం మరమ్మతులు నిర్వహిస్తోంది. ఇటీవల ఏసీ థియేటర్‌గా అభివృద్ధి చేసి కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గ్యాస్ కట్టర్‌తో సీట్లకు మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్టు యాజమాన్యం తెలిపింది. థియేటర్ లోపలి భాగం అంతా చెక్క, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసింది కావడంతో కొద్ది క్షణాల్లోనే థియేటర్లో మంటలు వ్యాపించాయి. దీంతో లోపల పనిచేస్తున్న సుమారు పది మంది సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సుమారు అర్ధగంట వ్యవధిలో థియేటర్ లోపలిభాగం, ఫర్నిచర్ అంతా కాలిబూడిదైపోయాయి. థియేటర్ పైకప్పు, ప్రొజెక్టర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న మండపేట ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో రామచంద్రపురం నుంచి అగ్నిమాపక శకటాన్ని రప్పించారు. మంటలను అదుపు చేసేందుకు సుమారు రెండుగంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఈ సంఘటన దావానంలా వ్యాపించడంతో పెద్దఎత్తున స్థానికులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మండపేట సీఐ వి.విజయారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఈ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని థియేటర్ యజమాని చెన్న రాంబాబును ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. డీఎఫ్ఓ ఉదయ్‌కుమార్, జిల్లా సహాయ అగ్నిమాపకాధికారి ప్రశాంత్‌కుమార్, మండపేట ఫైర్ ఆఫీసర్ డి.చినబాబు నష్టం అంచనాలను రూపొందిస్తున్నారు. సంఘటన సమయానికి పక్కనే ఉన్న సత్యశ్రీ థియేటర్లో ప్రదర్శన జరుగుతుండగా ప్రమాదం విషయం తెలిసి ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడంతో సత్యశ్రీ థియేటర్‌కు ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాగా తెలుస్తోంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం అంచనా వేయనున్నట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
హ్యాట్రిక్ ‘లడ్డూ’
మండపేట, న్యూస్‌లైన్ : మహాలడ్డూల తయారీలో వరుసగా మూడుసార్లు గిన్నిస్ రికార్డులు సాధించి హ్యాట్రిక్ కొట్టింది తాపేశ్వరంలోని భక్తాంజనే స్వీట్స్ సంస్థ. వినాయక చవితి వేడుకల సందర్భంగా వేలాది కిలోల మహాలడ్డూలను వీరు తయారు చేస్తున్నారు. 1942లో సలాది సత్యనారాయణ నెలకొల్పిన ఈ సంస్థను ప్రస్తుతం ఆయన తనయుడు సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) నిర్వహిస్తున్నారు. తొలిసారిగా 2011లో విశాఖపట్నానికి చెందిన సువర్ణభూమి సంస్థ ఆర్డర్ మేరకు సంస్థ అధినేత శ్రీనుబాబు 5,570 కేజీల లడ్డూ తయారు చేయించారు. దీనిద్వారా తాపేశ్వరం పేరును తొలిసారిగా గిన్నిస్ పుటల్లోకి ఎక్కింది. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్సులోను చోటు దక్కించుకుంది. తర్వాత 2012 వినాయక చవితి వేడుకల కోసం రాజమండ్రిలోని రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆర్డరుపై తయారుచేసిన 6,599.29 కేజీల లడ్డూ పాత రికార్డును తిరగరాసి కొత్త రికార్డును నమోదు చేసింది. మళ్లీ రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ కోసం 2013లో తయారుచేసిన 7,132.87 కేజీల మహాలడ్డూ పాత రికార్డులన్నింటినీ తిరగరాసి గిన్నిస్ రికార్డును నమోదుచేసుకుంది. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ శనివారం సంస్థ అధినేత శ్రీనుబాబుకు అందింది. మూడు పర్యాయాలు లడ్డూ తయారీని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ ప్రతినిధులు దగ్గర ఉండి పర్యవేక్షించినట్టు శ్రీనుబాబు తెలిపారు. గణేష్ మహాలడ్డూల తయారీ ద్వారా గత మూడేళ్లలోను గిన్నిస్ రికార్డులతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, ఎవరెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్సు, వ రల్డ్ అమేజింగ్ బుక్ ఆఫ్ రికార్డ్సు, నిడదవోలుకు చెందిన పొట్టి శ్రీరాములు సేవా సమితి వారి ఏకవీర అవార్డు, సిరిమువ్వ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వజననీ అవార్డు తదితర మొత్తం 18 అవార్డులను శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ సాధించి రికార్డు సృష్టించింది. ఎంతో ఆనందంగా ఉంది వరుసగా మూడు సార్లు గిన్నిస్ రికార్డులను సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. మా సంస్థ సిబ్బంది సహకారంతోనే ఈ రికార్డులను సాధించగలిగాం. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాం. - సలాది శ్రీనుబాబు, భక్తాంజనేయ స్వీట్స్ సంస్థ అధినేత, తాపేశ్వరం -
సీతారాముల కళ్యాణానికి మండ పేట కొబ్బరి బోండాలు
-
గుడ్డు వార్నింగ్
మండపేట (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్ : చూడడానికి తెల్లగా ఉండి, తిన్నవారికి పుష్టినిచ్చే కోడిగుడ్లు.. పౌల్ట్రీల యజమానులు తెల్లముఖం వేసేలా, నష్టాలను రుచి చూసేలా చేస్తున్నాయి. గద్ద గోళ్లలో చిక్కుకుని గిలగిలలాడే కోడిపిల్లల్లా.. కోళ్ల ఫారాలు ఇప్పుడు సంక్షోభంలో పడి విలవిలలాడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో సీజన్లోనూ గుడ్లకు గడ్డుకాలం తప్ప డం లేదు. ఏడాదిగా వెంటాడుతున్న తెగుళ్ల బెడదతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు అధిక సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుం డ టం పౌల్ట్రీ రైతులను కలవరపరుస్తోంది. కోస్తాలో ప్రధానంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని పౌల్ట్రీల్లో ఏడాది క్రితం వరకు సుమారు 4.5 కోట్ల కోళ్లు ఉండగా రోజుకు సుమారు 3.82 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. స్థానిక అవసరాలు పోను 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఏడాదిగా తెగుళ్ల బెడదతో కోళ్ల మరణాలు పెరిగిపోయా యి. ప్రస్తుతం ఈ జిల్లాల్లో కోళ్ల సంఖ్య సుమారు 2.7 కోట్లకు తగ్గిపోగా,గుడ్ల ఉత్పత్తి 2.29 కోట్లకు పడిపోయిందని పౌల్ట్రీవర్గాల అంచనా. తూర్పుగోదావరిలో కోళ్ల సంఖ్య 1.30 కోట్ల నుంచి 87 లక్షలకు తగ్గిపోయింది. ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీ రంగానికి సీజన్‌గా పరిగణిస్తారు. చలిగాలులు ప్రారంభమయ్యే కొద్దీ ఉత్తరాది రాష్ట్రాల కు ఎగుమతులు పుంజుకుంటాయి. ఆ మేరకు రైతుకు చెల్లించే ధర కూడా పెరుగుతుంది. కాగా కొద్దికాలంగా కోస్తాలోని పౌల్ట్రీలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని పౌల్ట్రీల పోటీతో గట్టి దెబ్బ తగులుతోంది. ఆ రాష్ట్రాల వారు తక్కువ ధరకే అమ్మడం ఇక్కడి ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. నవంబరు, డిసెంబరు నెలల్లో మూడు జిల్లాల నుంచి సగటున రోజుకు సుమారు 115 లారీల గుడ్లు ఎగుమతి కాగా, జనవరిలో ఆ సంఖ్య 102కు తగ్గిపోయింది. జిల్లాలో డిసెంబరు 8న గుడ్డు రైతు ధర రూ.3.91పైసలు కాగా, ఎగుమతులకు డిమాండ్ లేకపోవడంతో గురువారం నాటికి రూ.3.20 పైసలకు పతనమైంది. ఖాళీ అవుతున్న పౌల్ట్రీ షెడ్లు లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో తెగుళ్ల నివారణ చర్యల కు నెలకు రూ.రెండున్నర లక్షలు ఖర్చవుతుంద ని అంచనా. కోళ్లమేతకు వాడే సోయాబీన్, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్ ధరలకు రెక్కలొచ్చా యి. రవాణా, కూలి రేట్లు, మందుల ధరలు పెరిగి గుడ్డు ఉత్పత్తి వ్యయం మరింత అధికమవుతోంది. గుడ్డు రైతు ధర రూ.3.50పైసలు ఉంటేనే గాని గిట్టుబాటు కాదంటున్నారు. వేసవిలో కోళ్ల మరణాలు మరింత పెరగనుండటం, నష్టాలతో పౌల్ట్రీలను నడపలేని పరిస్థితుల్లో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు రైతులు భయపడుతున్నారు. జిల్లాలో అనపర్తి, ద్వారపూడి, మండపేట, బలభద్రపురం, పీరా రామచంద్రపురం తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీల్లో షెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సర్కారే చేయూతనివ్వాలి కోళ్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రభుత్వం ఆదుకోకుంటే పరిశ్రమ మూతపడే ప్రమాదముంది. కోళ్ల రైతులకు ఇచ్చే రుణాలను రీ షెడ్యూల్ చేయాలి. మేత ధరలను అదుపు చేయాలి. ఎఫ్‌సీఐ గోదాముల్లోని పనికిరాని మొక్కజొన్న, బియ్యం తదితరాలను కోళ్ల మేతల కోసం పౌల్ట్రీలకు సబ్సిడీపై అందజేయాలి. - పడాల సుబ్బారెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, అర్తమూరు -
రైసు మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు
మండపేట, న్యూస్‌లైన్ : మండపేట, పరిసర గ్రామాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమ నిల్వలు బయటపడ్డాయి. రికార్డుల్లోని వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో సుమారు రూ. 4.81 కోట్ల విలువైన సరుకులను సీజ్ చేశారు. మిల్లుల నిర్వాహకులపై కేసులు నమోదుచేశారు. విజిలెన్స్ ఎస్పీ పి.రమేషయ్యా ఆధ్వర్యంలో డీఎస్పీ రామచంద్రరావు, సీఐలు, ఇతర సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి మండపేటలోని జానకిరామ, అరవింద్ ఆగ్రోస్, మోదుకూరు సమీపంలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు, ఏడిద సమీపంలోని సీతారామ ఫుడ్స్ రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ధాన్యం, బియ్యం, నూకలు కొనుగోలు, అమ్మకాలు, గోదాముల్లోని సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు బి రిజిష్టర్‌లో నమోదు చేయాల్సి ఉన్నా, నిర్వహణ సక్రమంగా జరగడం లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రిజిష్టర్‌లోని సరుకుల వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు పొంతన లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు. నిల్వల మధ్య వ్యత్యాసంతో అరవింద్ ఆగ్రోస్లోని రూ. 1.55 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ ఫ్లోర్ మిల్లులో వారం రోజులుగా బి రిజిష్టర్ నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. రూ. 78.5 లక్షల విలువ చేసే ధాన్యం, బియ్యం, నూకల అక్రమ నిల్వలు ఉన్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేశారు. సీతారామ ఫుడ్స్‌లో రికార్డుల్లోని వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు వ్యత్యాసం ఉండడంతో రూ. 78 లక్షల విలువ చేసే ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. జానకిరామ రైస్‌మిల్లులో రాత్రి వరకూ తనిఖీలు కొనసాగాయి. రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో సుమారు రూ. 1.70 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలను సీజ్ చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలి పారు. ఆయా మిల్లులకు చెందిన నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదుచేశామన్నారు. ఈ తనిఖీ లో సీఐలు గౌస్‌బేగ్, వరప్రసాద్, ఏజీ ఎం. శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఎస్కె వల్లీ, డీసీటీఓ రత్నకుమార్, కానిస్టేబుళ్లు పి.గణేష్, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.