బియ్యపుగింజ కంటే చిన్న పరిమాణంలో ఉన్న గిన్నీస్ రికార్డు ఉడెన్ స్ఫూన్. (లెన్స్ కెమెరాతో తీసిన ఫొటో)
మండపేట: చెక్కతో అతిసూక్ష్మ స్పూన్ తయారు చేసి తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు గిన్నిస్ రికార్డులోకెక్కారు. స్వర్ణకార పనిచేసే ఈయన చిన్న పరిమాణంలో కళాకృతులు తయారీ ద్వారా గతంలో అనేక రికార్డులను సొంతం చేసుకున్నారు. పంచదార పలుకు కంటే చిన్న పరిమాణంలో చెక్క స్పూన్ తయారీ ద్వారా గిన్నిస్ రికార్డును సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
ఈ ఏడాది జనవరి 10న మండపేట పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో ప్రభుత్వాధికారులు, గిన్నిస్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో అతిసూక్ష్మ చెక్క స్పూన్‌ను తయారు చేశారు. 2 గంటల 13 నిమిషాల వ్యవధిలో 3.09 మిల్లీ మీటర్ల పరిమాణంలో దీన్ని తయారు చేశారు. గిన్నీస్ రికార్డు సంస్థ నుంచి వచ్చిన సర్టిఫికెట్, మెడల్‌ను మంగళవారం మండపేటలో వెటర్నరీ రిటైర్డ్ జేడీ డాక్టర్ విజయకుమారశర్మ, ఒంగోలుకు చెందిన çసృష్టి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ తిమ్మిరి రవీంద్ర, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్, ఎస్‌ఆర్ అసోసియేషన్ అధినేత రాకుర్తి సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment