మహిళలను అభ్యంతరకరంగా ఫోటోలు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న 14 ముఠాను తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పోలీసుల అరెస్ట్ చేశారు. మహిళలను అభ్యంతరకరంగా చిత్రీకరించి డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫంక్షన్ హాల్స్, దుకాణాల్లో రహస్య కెమెరాలు అమర్చి మహిళలను ఫోటోలు తీసినట్టు చెప్పారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లికి హాజరైన హైదరాబాద్ మహిళ ఫోటోలు తీసి బెదిరించారు. సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నిందితులు పలువురు మహిళలను ఈవిధంగా బెదిరించినట్టు పోలీసులు గుర్తించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Published Sun, Sep 20 2015 2:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement