blackmail gang
-
మొదట డేటింగ్..ఆపై ఇంటికి రప్పించుకుని.. నగ్నంగా మార్చి..
న్యూఢిల్లీ: ఆన్లైన్లో డేటింగ్ పేరిట పురుషులను ట్రాప్ చేసి, ఆపై వారిని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న కిలాడీలను కటకటాల వెనక్కి నెట్టారు ఢిల్లీ పోలీసులు. ఈ డేటింగ్ బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో చోటుచేసుకుంది. తాజాగా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మహిళను ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిందితులు మొదట ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా బాధితులతో స్నేహం చేసి, తర్వాత వారిని తమ ఇంటికి రప్పించుకుంటారు. అలా వచ్చని వారికి మత్తుమందు కలిపిన నీరు లేదా కూల్‌డ్రింక్స్ ఇస్తారు. అది తాగి స్పృహ కోల్పోయిన తరువాత వారిని మహిళతో చనువుగా ఉన్నట్లు ఫోటోలు తీయడంతో పాటు అభ్యంతకరమైన ఫోటోలు తీసి బెదిరింపుల పర్వాన్ని మొదలుపెడతారు. ఈ తరహాలోనే ఇటీవల ఓ వ్యాపారికి ప్లై బోర్డు కావాలని ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది. దీంతో అతను అక్టోబర్ 21న జనక్‌పురి ప్రాంతంలోని నిందితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తాగడానికి ఒక గ్లాసు మంచినీరు ఇవ్వగా దాన్ని తాగిన వెంటనే అతను స్పృహతప్పి పడిపోయాడు. వ్యాపారి స్పృహలోకి వచ్చినప్పుడు నగ్నంగా మంచం మీద ఉన్నాడు. కళ్లు తెరచి చూడగా చూట్టూ ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు అతనిపై దాడి చేసి, తన వద్ద ఉన్న సుమారు 16 వేల రూపాయల నగదు, చేతి గడియారం, బంగారు ఉంగరం లాక్కున్నారు. అంతే కాకుండా మరో రూ.7 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి తాము కొన్ని ఫైళ్లు, డబ్బు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. గత రెండేళ్లలో ఈ ముఠా దాదాపు 40 మంది పురుషుల నుంచి విలువైన వస్తువులను తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. చదవండి: భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం -
‘హాయ్ బేబీ’ అంటూ వలపు వల.. టెంప్ట్ అయ్యారా కొంప కొల్లేరే..!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య పెరగడంతో సైబర్ కేటుగాళ్ల దీన్నే అదునుగా మార్చుకుని నెట్టింట ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బు వస్తాయంటూ ఆశ చూపి మోసం చేస్తుండగా, మరికొందరు ఆన్లైన్లో పరిచయం పెంచుకుని కాస్త సన్నిహిత్యంగా మెలిగిన తర్వాత మన ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర చిత్రాలు పంపి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. బాధితుడికి ఫేస్బుక్ అకౌంట్‌కి ఓ యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇక ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించగానే కాస్త క్లోజ్‌గా మెలుగుతూ అతని వాట్సాప్ నెంబర్‌ను పంపాలని కోరడంతో బాధితుడు పంపాడు. కొన్ని రోజుల తర్వాత సదరు వ్యక్తి నుంచి అభ్యంతరకర కంటెంట్‌తో ఉన్న వీడియో అతనికి వచ్చింది. ఏంటని చూడగా.. అందులో అడల్ట్ కంటెంట్ వీడియోని మార్ఫ్డ్ చేసి బాధితుడి ముఖాన్ని పెట్టారు. దీనీ చూసిన అతను షాక్‌కి గురయ్యాడు. ఆ వీడియో పంపిన తర్వాత నిందితుడు డబ్బుల కోసం బెదిరింపులు మొదలుపెట్టాడు. భయంతో బాధితుడు రూ.1,96,000 వరకు సమర్పించుకున్నాడు. ఇంకా పంపాలని బెదించగా బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రాకెట్ గుట్టు రట్టు చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుకు కాల్ చేసేందుకు ఉపయోగించిన నెంబర్లు అస్సాంకు చెందినవిగా, వాటిని రాజస్ధాన్‌లోని భరత్పూర్ జిల్లా నుంచి వాడినట్టు గుర్తించారు. నిందితుడు అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. వీరు ఫేస్బుక్ సహా సోషల్ మీడియా వేదికల్లో యువతుల పేరుతో పరిచయం పెంచుకుని బాధితుల వద్ద డబ్బుల గుంజుకోవడమే పనిగా పెట్టుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది. చదవండి: ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్ అత్యాచారం -
అమ్మాయిలను ఎరగా వేసి..
సాక్షి, సామర్లకోట (పెద్దాపురం): అమ్మాయిని ఎరగా వేసి.. కొంతమందిని ప్రలోభ పెట్టి బ్లాక్ మెయల్ చేస్తూ సొమ్ములు గుంజుతున్న ఓ ముఠాను సామర్లకోట క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే ఇటువంటి ఊబిలో అనేక మంది చిక్కుకున్నా.. కొంతమంది బయటకు చెప్పుకోలేక ముడుపులు చెల్లించి చేతులుదులుపుకొంటున్నారు. ఈ సంఘటన వివరాలను శుక్రవారం సామర్లకోట పోలీసు స్టేషన్లో పెద్దాపురం సీఐ వి. శ్రీనివాసు విలేకర్లకు వెల్లడించారు. జి.మామిడాడలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న తాడి కేదారమణికంఠరెడ్డి, కాకినాడలో జై ఆంధ్రా ఛానల్ నడుపుతున్న తేతలి దుర్గారెడ్డి మధ్య స్థలం వివాదం ఏర్పడింది. దీంతో దుర్గారెడ్డి తన చానల్లో పని చేస్తున్న రాకేష్‌తో భార్యాభర్తలైన మహేష్, అశ్వినిల సహకారం తీసుకొని కేదారమణికంఠరెడ్డిని మడికి అశోక్ అనే వ్యక్తి ఇంటికి వచ్చేలా ఈనెల ఏడో తేదీన ఏర్పాటు చేశారు. అశ్విని ఫోన్లో మాయమాటలు చెప్పి కేదారమణికంఠరెడ్డి వచ్చేలా చేసింది. కేదారమణికంఠరెడ్డి, అశ్వినిలు గదిలోకి వెళ్లిన వెంటనే బ్లాక్మెయిల్ ముఠా సభ్యులు అసభ్య వీడియోలను చిత్రీకరించి బెదిరించారు. అప్పటికీ అతడు లొంగకపోవడంతో కుర్చీకి కట్టి చిత్ర హింసలకు గురిచేశారని సీఐ తెలిపారు. రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 50వేలకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ క్రమంలో కేదారమణికంఠరెడ్డి వద్ద ఉన్న రూ.63 వేల నగదు, అతడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, చోరీ చేసి ప్రామిశరీ నోట్లు, తెల్లకాగితాలపై సంతకాలు, వేలి ముద్రలు వేయించుకొని ముఠా పరారైందన్నారు. బాధితుడు తాడి కేదారమణికంఠరెడ్డి ఈనెల 8వ తేదీన చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 14న ఇంద్రపాలెంలో ఒక ఇంటిలో ఉన్న ఆరుగుళ్ల మహేష్, భూరి అశ్విని, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజేష్‌కుమార్, ఎలుడుట్టి లక్ష్మీనారాయణ, మడికి అశోక్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. ఏ1 దుర్గారెడ్డి, రాకేష్ పరారీలో ఉన్నారని తెలిపారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. సత్తి రాంబాబురెడ్డిని ఇదే విధంగా బ్లాక్ మెయిల్ చేసి సొమ్ములు వసూలు చేసేందుకు పథకం పన్నినట్టు అంగీకరించారని చెప్పారు. ఈ విలేకర్ల సమావేశంలో ఎస్సై సుమంత్, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫోటోలు తీసి బెదిరిస్తున్న ముఠా అరెస్ట్
రాజమండ్రి: మహిళలను అభ్యంతరకరంగా ఫోటోలు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న 14 మంది ముఠాను తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పోలీసుల అరెస్ట్ చేశారు. మహిళలను అభ్యంతరకరంగా చిత్రీకరించి డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫంక్షన్ హాల్స్, దుకాణాల్లో రహస్య కెమెరాలు అమర్చి మహిళలను ఫోటోలు తీసినట్టు చెప్పారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లికి హాజరైన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఫోటోలు తీసి బెదిరించారు. సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నిందితులు పలువురు మహిళలను ఈవిధంగా బెదిరించినట్టు పోలీసులు గుర్తించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
ఫోటోలు తీసి బెదిరిస్తున్న ముఠా అరెస్ట్