
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బురద చల్లుడు రాజకీయాలు మానుకోవాలని డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక దోపిడీలో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచిన వ్యక్తి వేగుళ్ల జోగేశ్వరరావు అని..అటువంటి వ్యక్తి ఇవాళ ఇసుక కోసం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనను ఇసుక దోపిడీ సంఘానికి అధ్యక్షుడిగా పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. జిల్లాలోని టేకి గ్రామంలో ఒక వ్యక్తి తన వ్యక్తిగత కారణాల వల్ల మరణిస్తే...ఇసుక లభించక మృతిచెందాడని వేగుళ్ల బుద్ధిహీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బురద చల్లాలనే తాపత్రయం తప్ప..వాస్తవ పరిస్థితులు చెప్పడంలేదని ధ్వజమెత్తారు. ‘ఇద్దరం కలిసి టేకి గ్రామం వెళదామని..ఇసుక కోసమే అక్కడ వ్యక్తి మరణిస్తే బహిరంగ క్షమాపణలు బెబుతామని..లేకపోతే జ్ఞానోదయం వచ్చిందని ప్రకటించాలని వేగుళ్ల జోగేశ్వరరావుకు సుభాష్ చంద్రబోస్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment