టీడీపీ నేతల దాడిలో గాయపడిన బాధితుడు
తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతీ రోజూ టీడీపీ నేతల బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పోతవరంలో టీడీపీ నేతలు బరి తెగించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన సానుభూతిపరుల భూమిని దోచుకునేందుకు కుట్ర చేశారు. గందదిపాము రాజ్‌కుమార్‌కు చెందిన భూమిని చిడిపి గోపీ అతని అనుచరులతో కలిసి దోచకునేందుకు ప్రణాళిక రచించారు. దీనిలో ాగంగా తనపై విచక్షణారహితంగా దాడికి దిగాడని గందిపాము రాజ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు.
తనపై దాడికి దిగిన వారిలో చిడిపి గోపీతో పాటుగా అతని అనుచరులైన మాజీ ఎంపీటీసీ కళావతి, ఏసునాదం, నేకూరి అబ్బులు, కళావతి అల్లుడు ఉన్నారన్నాడు. ఇదే విషయంపై గోపీ అతని అనుచరులు తరచు వేధిస్తున్నారని బాధితుడువాపోతున్నాడు. తన పొలం ఇవ్వకపోతే దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు విలపిస్తున్నాడు.
చిడిపి గోపీ అతని అనుచరులు దాడిలో తీవ్ర గాయాలైన తాము తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధిత కుటుంబ స్పష్టం చేసింది. ఈ దాడిపై ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలతో పాటు ఎమ్మెల్సీ రిపోర్ట్ పంపించినా పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్నారన్నారు. తనకు తన కుటుంబానికి చిడిపి గోపీ నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు బాధితుడు.
వైఎస్సార్‌సీపీ నేత పొలాన్ని తవ్వేసిన పచ్చమూకలు
నిన్న(ఆదివారం)పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దుర్గి మండలం కోలగొట్లలో వైఎస్సార్‌సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలాన్ని జేసీబీలతో మట్టిని తవ్వేసి తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులతో కన్నెబోయిన నాసరయ్య ఊరు వదిలి బయటకు వచ్చి నివసిస్తున్నారు. టీడీపీ నాయకుల దందాను వీఆర్వో దృష్టికి తీసుకువెళ్తే.. టీడీపీ నేతలను సంప్రదించమంటూ సలహా ఇస్తున్నారని నాసరయ్య మండిపడుతున్నారు.
ప్రోక్లైన్లతో నాసరయ్య పొలంలో పెద్ద పెద్ద గోతులు పెడుతూ టీడీపీ నేతలు మట్టి తీసుకెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి పొలంలో తవ్వకాలు మొదలుపెట్టిన టీడీపీ రౌడీలు.. భారీగా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం మాదంటూ.. పోలీసులు, కలెక్టర్ గాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో అధికారులు చేతులెత్తేశారు.
Comments
Please login to add a commentAdd a comment