
అంబేద్కర్ కోనసీమ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2018లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.
అయితే, ప్రసుత్తం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ పోస్ట్‌లో కొనసాగుతున్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఏబీ మంతనాలు జరిపారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక దశలో ఉండగా.. నిందితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులతో ఏబీ వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం చర్చాంశనీయంగా మారింది. శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీనే హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంతో టీడీపీతో నిందితుడు శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలు బట్టబయలైంది. కొద్దిరోజుల నుంచి జగన్‌పై విషం కక్కుతూ ఏబీవీ ట్వీట్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎక్స్‌లో జగన్‌పై ఏబీవీ తన అక్కసును వెళ్లగక్కారు.
