![Mandapeta Janasena Leader Attacked on YSRCP Worker - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/16/YSRCP_Mandapeta.jpg.webp?itok=HVpShPPR)
బాధితుడిని కాకినాడ తరలిస్తున్న దృశ్యం
సాక్షి, మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ తనపై చేయిచేసుకున్నాడన్న మనస్తాపంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన రాచకొండ భీమరాజు మున్సిపల్ మార్కెట్ ఆశీలు పాటదారుని వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపారుల నుంచి అధికంగా ఆశీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ శుక్రవారం మార్కెట్ వద్ద భీమరాజుపై లీలాకృష్ణ చేయిచేసుకున్నాడు. (టీడీపీ నేతలకు చుక్కెదురు)
దీంతో మనస్తాపం చెందిన భీమరాజు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబసభ్యులు అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైఎస్సార్‌సీపీకి చెందిన కాపు నేతలు జిన్నూరి సాయిబాబా, పిల్లా వీరబాబు బాధితుడిని పరామర్శించారు. లీలాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (అసత్య ఆరోపణలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేత)
Comments
Please login to add a commentAdd a comment