
సాక్షి, తాడేపల్లి: విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరని.. సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఎవరూ చెరిపేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలో మండపేట(డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా) నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్యనేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎమ్మెల్సీ తోట మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వానికి.. ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు గుర్తుకు వచ్చేవి. తప్పుడు ప్రచారాలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది. దీనికి మళ్లీ గెలిపించుకుంటాం. మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారు. ఆయన మాకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే శాయశక్తులా కృషి చేస్తాం.
కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. సీఎం జగన్ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 2024లో మళ్లీ వైఎస్సార్‌సీపీదే విజయమని కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.
ఇదీ చదవండి: ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్