గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ పలు మార్పులతో కూడిన జాబితాల్ని సిద్దం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్‌కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
“Message to YSRCP Cadre”
— YSR Congress Party (@YSRCParty) January 12, 2024
పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని "5 రీజియన్ లలో క్యాడర్ మీటింగ్"లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు.
4-6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి,…
Comments
Please login to add a commentAdd a comment