సాక్షి, గుంటూరు: శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ సూచనలు చేశారని ఎమ్మెల్సీ వరదు కల్యాణి అన్నారు. ఖచ్చితంగా ప్రజలు కోసం పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహించారు. వైఎస్ జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ వరదు కల్యాణి మీడియాతో మాట్లాడారు.
‘శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఖచ్చితంగా ప్రజలు కోసం పోరాటం చేస్తాం. మొన్నటి ఫలితాలు కొంత ఇబ్బంది కలిగించినా మాట వాస్తవమే. ఎక్కడ పొరపాట్లు జరిగాయో పోస్టుమార్టం చేస్తున్నాం. ప్రస్తుతం చంద్రబాబు అండతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఈ అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకోవాలి.ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి. వైఎస్ జగన్ సైనికులుగా మేము పని చేస్తాం. ప్రజా సమస్యలపై మండలిలో పోరాటం చేస్తాం’అని అన్నారు.
మండలిలో ప్రజా సమస్యలపై పోరాడతాం: తోట త్రిమూర్తులు
శాసన మండలిలో వైఎస్సార్‌సీపీకే మెజార్టీ ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రజలకు మేలు కలిగే అంశాలను సమర్ధిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment